గత కొన్ని నెలలుగా భారతదేశం ఎన్నో సమస్యల్ని ఎదుర్కుంది. వాటిల్లో ప్రధానమైనవి - ఆర్టికల్ 370/ సిఏఏ/ యన్.ఆర్.సి లపై హింసాయుత అల్లర్లు/ విముఖత.
ఒక సాధారణ పౌరుడికి ఇవి ఎంత వరకూ అర్థమయ్యాయో నాకు తెలియదు. ఒక సాధారణ పౌరుడికి వీటిని అర్థమయ్యే విధంగా ప్రభుత్వాలు ఏంచేశాయో తెలియదు. వీటిని విడమరచి చెప్పే ప్రయత్నం ఎవరైనా చేశారో లేదో కూడా తెలియదు.
ప్రతీ వార్తా ఛానెల్లో పొద్దుటి నుంచి అర్థరాత్రి దాకా జరిగిన అర్థంలేని వేడి వేడి చర్చల్లో కొట్టుకోవటం పరస్పర నింద, ప్రభుత్వాన్ని విమర్శించటం ఒక వర్గాన్ని రెచ్చగొట్టటం లాంటి - వ్యూవర్షిప్ ని పెంచుకునే కార్యక్రమాలే తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజాన్ని మాట్లాడిన చర్చాలేదు వార్తా ఛానలూ లేదు.
రాష్ట్ర పాలకులకే వీటిమీద సరైన అవగాహన లేదు. ఇంక సాధారణ పౌరులకి ఏం అవగహాన?
కోవిడ్ మొదలుతున్న రోజుల్లో ఇంట్లో ఏసి పని చేయటం మానేసంది. అమ్మా! ఎలాగూ ఇంకో 15 రోజుల్లో ప్రయాణం ఉందిగా అమెరికాకి. తిరిగి వెళ్ళినప్పుడు చూపిద్దువులే అన్నాను.
అలసత్వం మనిషికి మంచిది కాదని అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి, వాయిదా వేయటం మంచిది కాదని అనేక దృష్యాంతరాలున్నాయి మన పురాణ ఐతిహాసాల్లో.
మనం వినం కదా! మనుషులం కదా!
పాపం అమ్మ సరే అన్నది. ఇంతలో కోవిడ్ విజృంభణ, విమానాలు ఇంటికి వెళ్ళిపోవటం లాక్‌డౌన్ గట్రా అన్నీ కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిపోయాయి.
నిన్న ఒకతను మొత్తానికి ఏసీ బాగుచేయటానికి వచ్చాడు.
మాటల్లో - ముస్లిములందరినీ భారత్ దేశం నుంచి పంపించేసి హిందూదేశంగా భారతదేశాన్ని మార్చాలని మోడి ప్రయత్నిస్తున్నాట్ట అండీ అంటాడు.
అమ్మ నాతో ఈ విషయం ప్రస్థావించినప్పుడు నాకు ఒక్క నిమిషం పాటు ఏం చెప్పాలో పాలుపోలేదు.
మూలాల్ని కలుషితం చేసే దౌర్భాగ్యులు తయ్యారైయ్యారు దేశంలో.
ఏంచెయ్యాలీ? ఏంచెప్పాలీ? ఎవర్ని మార్చాలి. ఎవరు మార్చాలి? ఎలా మార్చాలీ?
ఆందోళనకు గురి అయ్యాను.
వదంతులు వ్యాప్తి చేయకండి. మీకు అర్థమైతే విడమర్చి చెప్పండి. లేక పోతే అరవకుండా కూర్చోండి. తెలిసీ తెలియకుండా దేశాన్ని కలుషితం చేయకండి.
వాట్స్ యాప్‌లలో ఫేసుబుక్‌లలో చెత్త ఫార్వర్డ్ చేయకండి.
చూసిందంతా నిజం కాదు.
విన్నదంతా నిజం కాదు.
చెత్తని మోయకండి.
మీ చెత్త అభిప్రాయాల్ని పక్కన వాళ్ళ మీద రుద్ది వాళ్ళ జీవితాల్ని కడతేర్చకండి.
ఈ వదంతులన్నీ ఫేస్బుక్ లో కొంతమంది తెలుగు కాశ్మీర్ మద్దతుదారులు మార్క్సిజం ముసుగు లో చేస్తున్నారు . వీళ్ళు చేసే పని ఇదే .
ReplyDeleteInteresting! Really?
ReplyDeletecheck some profiles Ramasundari and her followers. All her followers are spreading this information disguising minority support / backward support.
ReplyDelete