Jun 22, 2011

వీడియో గేమింగులో క్రొత్త ఒరవడి

ఈ మధ్య ఓ మితృడి ఇంటికి వెళ్ళినప్పుడు, వారి పిల్లాడు సూరిగాడు కల్సి ఓ ఆటఆడుతుంటే చూట్టానికి నేనూ వెళ్ళాను. నన్నాశ్చర్యపరచిందా ఆట. బౌలింగ్ ఆట అది. ఆశ్చర్యపరచటాకి కారణాలు ఇవి -
ఇంతక మునుపు నేను ఆడిన చూసిన ఆటలన్నీ ఓ కుర్చీలోనో సోఫాలోనో కదలకుండా కూర్చుని, ఆట్టానికి రిమోటు చేతిలో పెట్టుకుని రిమోటుని మాత్రమే వాడుతూ ఆటలోని కారెక్టర్లను కదలించటం జఱుగుతుండేది. కానీ ఇక్కడ, ఓ చిన్న సెన్సర్ ఉంది ఓ మూల, అది మన కదలికలను పట్టి, ఆ ఆటలోని ఓ కారెక్టరుకి ఆపాదిస్తుంది. వావ్!! భేషైన ఆలోచన అనుకున్నాను. ఆశ్చర్యపోయాను. ఆ సెన్సరుని ఎక్సుబాక్సు వాడు కినెక్ట్ అంటాడు. ఆవేళ వాళ్ళు ఆడింది ఎక్సుబాక్సులో కినెక్టు ద్వారా బ్రున్స్విక్ ప్రొ బౌలింగ్. చాలా బాగా నచ్చింది నాకు. సూరిగాడిక్కూడా బాగా నచ్చింది.

ఇంటికి వచ్చాక, మరి మనవద్ద పి.యస్ త్రీ కదా ఉంది, దానిక్కూడా ఇలాంటి ఇంటరాక్టివ్ గేమింగ్ టూల్స్ ఏవన్నా ఉన్నయా అని కొట్టాను గూగుల్లో.
ప్లేస్టేషన్ త్రీ కోఱకు , మరియూ మూవ్ మోషన్ కంట్రోలర్ అని ఒక సెట్టు కనిపించింది.
PlayStation_Eye.png
PSMove.png
 ఇదేదో బాగుందే అనుకుని వెతగ్గా వెతగ్గా ఓ బండిల్ దొరికింది అమెజాన్లో. పియస్ త్రీ మూవ్ + ఐ + స్పోర్ట్స్ ఛాంపియన్స్ బండిల్. సామ్స్ క్లబ్బులో ఏదోక డీల్ ఉంటే కొట్టేసా మొత్తానికి. ఇంటికెత్తుకెళ్ళంగనే టివీ మీద ఇ ని పెట్టా. స్పోర్ట్స్ ఛాంపియన్స్ గేమ్ డివిడి పీయస్ త్రీలో పెట్టా. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్కుంది. ఆట్టం మొదలెట్టా.
ఈ స్పోర్ట్స్ ఛాంపియన్సులో మొత్తం ఆర్ ఆటలు ఉన్నాయి.
255px-Sports_Champions.png
టేబుల్ టెన్నిస్ (పింగ్ పాంగ్)
బీచ్ వాలీబాల్
గ్లాడియేటర్
డిస్క్ గోల్ఫ్
బాచి
ఆర్చెరి

టెబుల్ టెన్నిస్ నన్ను భలే ఆకట్టుకుంది. ఎంత ఇంటరాక్టివ్ అంటే అంత. నిజ్జంగా టిటి ఆడిన ఫీలింగ్ వచ్చింది. మరోమాట, చెమటలు కక్కేలా ఆడుతున్నా. అదీ ముఖ్యమైన విషయం.
ఇక బీచ్ వాలీబాల్ కూడా చాలా బాగుంది. అనఘ నేనాడతా నేనాడతా అని దూకుతున్నది.
సూరిగాడికి ఫ్రిస్బి డిస్క్ గోల్ఫ్ బాగా నచ్చింది. తెగ ఆడ్డుతున్నాడు.
ఇక ఆర్చెరి భలే ఇంటరెస్టింగా ఉంది. ఐతే ఆర్చెరి ఆట్టానికి రెండు మోషన్ కంట్రోలర్స్ కావాలి. ఒకటి సంధించేది, రెండోది ఎక్కుపెట్టేది. సూరిగాడికి ఇదికూడా నచ్చింది. ఐతే ఇంకాస్త పెద్దైతేగానీ పూర్తిగా అర్థం అవ్వదు+కంట్రోల్ రాదు.
గ్లాడియేటర్ ఆట
Sports_Champions_Gameplay.jpg
గ్లాడియేటర్ అంటే కత్తి యుద్ధ వీరుడు అనగా కత్తుల కాంతారావ్ అన్నమాట. ఈ ఆటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఆడితే చక్కటి కార్డియో గేం అవుతుంది.

వీడియో గేమ్స్, పొట్టకదల్దు ఇత్యాదివి అనుకునేవారు ఈ ఆటని తప్పక ప్రయత్నించాలి.

5 comments:

  1. నిజ్జంగా టిటి ఆడిన ఫీలింగ్ వచ్చింది. మరోమాట, చెమటలు కక్కేలా ఆడుతున్నా. అదీ ముఖ్యమైన విషయం. :)) good good..

    ReplyDelete
  2. I guess you are almost 1 year late...

    ReplyDelete
  3. @సెనిమా - నా పోస్టు లేటు :):)
    అలా కాదుగానీ!! నేను పియస్ త్రి కొన్నదే లేటుగా. కొన్నప్పటినుండి సినిమాలు చూట్టమే గానీ గేమ్స్ ఆడదామన్న ధ్యాస లేకపాయే. ఇదిగో పై సంఘటన తర్వాత కొన్నాను. పిల్లలకు గేమింగ్ అనేది వ్యసనం అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గకుండా ఉన్నందువల్ల ఇది కొన్నా.
    @మురళి భాయ్ - నమస్తే! :):) మరే!! టెక్నాలజీతో పాటు మనమూ ప్రయాణించాలి కదా!! అందులో చెమట పడుతుంది అంటే ఇక తగ్గుతామా?

    ReplyDelete
  4. సరదా, వ్యాయామం! ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!! Good !!!

    ReplyDelete