Jun 16, 2011

ఆమరణదీక్షలో అమరుడైన ఓ స్వామిజీ

ఆమరణదీక్షలో అమరుడై!
గంగను కాపాడే పోరాటంలో

114వ రోజు కన్నుమూసిన స్వామిజీ

డెహ్రాడూన్‌, న్యూఢిల్లీ
భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే గంగానదిని కలుషితం చేస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని, కుంభమేళా జరిగే ప్రాంతంలో నెలకొల్పిన కంకర మిల్లులను తరలించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరాంచల్‌లోని హరిద్వార్‌లో నాలుగు నెలల క్రితం ఆమరణదీక్షకు దిగిన స్వామి నిగమానంద్‌ డెహ్రాడూన్‌లోని హిమాలయన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం 114వ రోజు మరణించారు. నల్లధనంపై ఆమరణదీక్షతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాబా రామ్‌దేవ్‌ ఇదే ఆస్పత్రిలో దీక్ష విరమించారు. రామ్‌దేవ్‌ దీక్షకు అత్యంత ప్రాధాన్యమిచ్చి దేశం నలుమూలల నుంచి ప్రముఖులను పిలిపించి దీక్ష విరమింపజేసిన ఉత్తరాంచల్‌ ప్రభుత్వం నాలుగు నెలలుగా నిరాహారదీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో అదే ఆసుపత్రిలో చేరిన నిగమానంద్‌ను పట్టించుకోలేదన్న విమర్శకు గురైంది.







రాజకీయ సన్నాసుల్ని, రాజకీయ స్వామీజీలనూ పొడవలేని పక్షులు ఏంజేస్తయి? సన్నాసులు స్వామీజీలు అంటూ అందర్నీ ఒకేదాటన కట్టేసి, ముక్కుతో పొడుస్తయి. అసుమంటి పక్షులు/ ఆ పక్షి రెట్టలు ఏరుకుని నెత్తినేస్కునే కుంకలూ ఈ వార్తజూసి ఏడ్చుకోవచ్చు. దమ్ములుంటే, అంత నీతీ నిజాయితీ ఇంటే వాళ్ళూ అంతర్జాలంలో విషాన్ని చిమ్మటం ఆపి, దేశానికి మేలు చేసే దిశలో ఏదోక సాంఘీకాంశంపై నిరాహార దీక్షబూని మమ్మల్ని(సాధారణ జనాల్ను) దేశాన్ని ఉద్ధరించాలని సవాలు చేస్తున్నాను.

ప్రతీ త్యాగాన్ని, ప్రతీ పోరాటాన్నీ రాజకీయం చేసే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం, మనబ్రతుకులు ఇంతేనని గుర్తించేలేని జనాన్ని చూసి బాధగా ఉంది. ఉలుకు పలుకు లేనందుకు కోపంగా ఉంది. కీ.శే నిగమానంద్ ఇలాంటి ఓ సత్యాగ్రహాన్ని మొదలెట్టారని సదరు ఈనాడు వారూ ఎక్కడా వార్తే వేయలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకేసారో నాకైతే అర్థం కాలేదు. పచ్చి స్వార్థపరులు బాబాయ్, పచ్చి స్వార్థపరులు. ఛీఛీ

1 comment:

  1. అధికార పక్షాలు , విపక్షాలు, మీడియా
    అందరూ దొంగలే.... రాబందులే
    వీళ్ళకెప్పుడూ సంచలనాలే తప్ప సమస్యలు పట్టవు.
    స్వామీ నిగమానంద 114 రోజుల నుండి గంగాస్వచ్చత కోసం, నదికోసం,
    నదిలో అక్రమంగా జరుగురున్న ఇసుక దోపిడి,అక్రమ మైనింగ్ నివారించడానికి,
    114 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నా ఏనాడు ఏనాథుడూ పట్టించుకోలేదు. . . కనీసం చిన్న వార్తకూడా రాలేదు.
    95 రోజుల తరువాత కోమాలోకి వెళ్ళి ఈయన మరణించారు . . . .
    జనాలని జాగృతమ్ చేయడానికి జీవితాన్ని పణంగా పెట్టారు...

    నేషనల్ చానల్స్ కనీసం చనిపోయినప్పుడైనా స్పందించాయి కాని చనిపోయిన రెండురోజుల తరువాత మన మీడియావాళ్ళకి ఈ వార్త అందింది... దద్దమ్మలు!

    అదే అనుష్క నాగార్జున కొడుకుతో రహస్యంగా నిశ్చితార్థం జరిగిందన్న (పుకారుని) విషయాన్ని బ్రేకింక్ న్యూస్ లో ఒకటే ఊదరగొడుతున్నాయి... ఈ సిగ్గులేని చానల్లు...
    ఏమైనా అంటే సామాజిక సృహ అంటూ మళ్లీ పెద్ద పెద్ద నినాదాలు! ... అన్నీ రాజకీయ చానాల్లే!

    మన మీడీయాలో అన్నీ విషయాలే తప్ప వార్తలుండవు!

    ReplyDelete