Jun 23, 2011

బజ్జులో కవితావేశం

muralidhar namala -
కచ్చగా రాసా నేనొక కవిత
అది కసి గా తీసుకొచ్చి చదువుతా
వినకపొతే మీ అందర్ని నరుకుతా
అది విని బతికితె మళ్ళీ చదువుతా..
మళ్ళీ చదువుతా..మళ్ళీ చదువుతా..
muralidhar namala - ఓ పిల్లా…….
సరదగా నీపై వేసాను వల…
నువ్వు తగిలావు ఒక చేపలా…
పట్టుకున్నావు నన్ను ఒక జలగ లా..
నిన్నిప్పుడు వదిలించుకొవడం ఎలా.. ఎలా..

Bhãskar Rãmarãju - సచ్చిన పావుని మల్లీమల్లీ సంపటం నేయవా?
అహా!! నాకు తెలవక అడుగుతా
నేయవేనా

Venu Srikanth Darla - అద్దీ అట్టా నిలదీయి భయ్యా..
muralidhar namala - ఏవండీ ఎవన్నా అంటే అన్నామంటారు. ఎవరు విద్యలు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. స్టేజీ మీద మాకూ ఒక అవకాశముంటది కదా.

Bhãskar Rãmarãju - కచ్చగా రాసావా ఓ కవిత
మల్లీమల్లీ సదూతావా ఆ కవిత
మేం ఏంపాపంసేసుకున్నామో చెపుత
అప్పుడైనా ఆపుతావా ఈ కవిత
ఓరి మార్తాండోయ్ ఆపరా నీ మోత
మోగట్నేదు నీ ఈడియో ఏ మోత
ఇట్టా జనాల మీనకు ఒదలమాక ఓ ఉడుకుమోత
మాకసలే ఉక్కపోత
ముర్లి, నువ్వు లగెత్తుకొచ్చెయ్ ఎందుకీ కవిత
సవిత
మోత
కత
కిత

muralidhar namala - ఇస్తా వేడిగా మరొకటిస్తా
చూస్తా మీ అందరి అంతూ చూస్తా
తీస్తా ఒక్కోరికి తిత్తి తీస్తా
కోస్తా బ్లేడుతో సమ్మగా కోస్తా
వేస్తా వేగిన నూనెలో వేస్తా
వస్తా మరో కవితతో మళ్ళొస్తా

Bhãskar Rãmarãju - నువ్వు మరోటి ఏస్తే నే తీస్తా
అంతు చూస్తానంటే బైటికి తీస్తా
తిత్తితీస్తానంటే జర్రున తీస్తా
జోబిలోంచి తాళం తీస్తా
సర్రున స్టార్టు చేస్తా
కారుని రోడ్డుపైకి తెస్తా
ఇక లగెత్తిస్తా

muralidhar namala - వేణుగారు నన్నాపకండి ఈ రోజు నాలో చెలరేగిన ఈ చైతన్య స్రవంతిని ఆపకండంతే. భాస్కరన్నాయ్ ఎంత దూరం పారిపోతాడో చూస్తా ఈ రోజు.

Venu Srikanth Darla - ఓకే మురళి గారు.. ఐతే మీరు తగ్గకండి.. కమాన్ కిల్ ఎవ్రిబడీ... నేను మాత్రం పారిపోతున్నా...

Bhãskar Rãmarãju - లగెత్తే నన్ను
పట్టుకోవలనుకుంటున్న నిన్ను
ఆపలేదు ఏ మన్ను మిన్ను
చూపకు వెన్ను
చూపను నా కన్ను [అంటే నేను ఎనక్కి తిరిగి చూడను అని]
ఉన్నాడు వేణు వెన్ను దన్ను
బయటకి మాత్రం తీయకు పెన్ను
పొడవకు నన్ను
ఒప్పుకుంట నిన్ను
ఒప్పేస్కుంటా ఇంకన్ను

Bhãskar Rãmarãju - రావాల రావాల
కవితలతో కొట్టాల
ఆలోచనల సెగ పుట్టాల
ఇంత సేపెందుకే బాల
అందుకో నా ఈ హేల
రావాల రావాల

Bhãskar Rãmarãju - ఏవిటయ్యా మురళీ
చేయవయ్యా ఏదోక రవళీ
ఆడించెయ్ కవితలతో కథాకళీ
విరగ్గొట్టేయ్ నీ పాళీ

Bhãskar Rãmarãju - అబ్బే
నీ డప్పే
డల్ల మొప్పే
మ్రోతేలే దబ్బే
మ్రోగించాలి మ్రోతబ్బే

muralidhar namala - బజ్జులో కాళుడ నేనే
భరతం పడతారోయ్
కవితా భూతం నేనే
నీఅంతం చుస్తారోయ్

బెజవాడ గుడివాడ
గుంటూరు ఏలూరు
వైజాగ్ ఈజీనరం
భూతాన్ని సాతాన్ని నేనే

జెర్మన్ను లండన్ను
న్యూజెర్సీ షికాగో
దుబాయి మలేషియా
కాష్మోరా కాద్రాని నేనే

Bhãskar Rãmarãju - ఇంత సేపు టయంతో
ఈ కవితా వ్రాసేది
కవితలతో భరతం
పడతావని అనుకుంటే
నలుగంటే నాలుగే
పన్నాలతో తుఱ్ఱున
నీళ్ళు పోసి
ఇదే కాద్రా ఇదే
ఇదే కాష్మోరా ఇదే
అంటావేంటి

Bhãskar Rãmarãju - విరామం
ఇప్పుడే వస్తా
బేగి వస్తా
పెన్నులో ఇంకు పోస్కు వస్తా
నీ భరతం పట్టేందుకు వస్తా
చూస్తూండు వస్తా

Bhãskar Rãmarãju - తెలుఁగు ప్రేక్షకులు
మరీ ప్రేక్షకులై
చడీ చప్పుడు చేకుండా
మన కవితావేశపు
వరదలో
ప్రేక్షకులై
స్థాణువులై
అణువులై
శిల్పాలై
ప్రతిమలై
ఇలా చూస్తున్నారేంటీ
ఒక్క జై లేదు
ఒక్క మాట లేదు
ఒక్క ఉలుకు లేదు
ఒక్క పలుకు లేదు
బాగుందని లేదు
బాలేదని లేదు
చప్పట్లు లేవు
అసలు చేతులే లేవు.................................
[నిరసిస్తూ]

muralidhar namala - రామునితోక
గరుక్మంతుని ఈకా......

శేబ్బాసు రెండోసారి బాబు అందరూ కోరస్ ఇవ్వాలి.

రామునితోక
గరుక్మంతుని ఈకా......

ద్రౌపదికోక అద్గదీ
ద్రౌపదికోక

నే జంధ్యాల వారి మేకా ఆఆఆఆ.....

Bhãskar Rãmarãju - రామునితో ఇక
గరుత్మంతుని ఈక
గూర్చి నే మాట్టాడనిక
ఏవైతే అదైతుంది ఆనక
నేనేం చెప్పనిక

muralidhar namala - నేనుకూడా నిరసిస్తూ నీరసిస్తూ

kumar n - హ హ హ హ హాహ్ AWESOME!!! :-)))))))))))))))))))))
మైండ్ కొందరికే దొబ్బిందనుకున్నాను నిన్నటి వరకీ, ఈ దెబ్బతో అందరికీ మోతెత్తి పోవాల,
రండి రండి అందరూ, ఈ గోలలోమ్ మోతలొ ఊగిపోదాం :-)

Venu Srikanth Darla - కుమార్న్ గారు తగునా మీకిది.. ఇలా ఉసిగొల్పడమ్ న్యాయమేనా మీకిది తగునా అని ప్రశ్నిస్తున్నానధ్యక్షా....

Bhãskar Rãmarãju - ఏవిటయ్యా ఇది ముర్లీ
ఎక్కుడన్నారు ప్రేక్షకులు దొర్లి
కవితా వానలో తడిసి ముద్దై
ఆ వానటిలో పొర్లి!!

Venu Srikanth Darla - Jokes apart.. you aguys are awesome :-)))))))))

muralidhar namala - కవి కోరుకునేది చిటికెడు పసుపు డబ్బాడు కుంకుమా కాదన్నయ్యా.. నాలుగు చప్పట్లు రెండంటే రెండే ఈలలు

Bhãskar Rãmarãju - హహహ
Venu Srikanth Darla - అవి కోరుకునేది కవి కదా మురళి గారు.. మీకెందుకు దిగులు :-P :-)))

Bhãskar Rãmarãju - ముర్లి!!
విన్నావా వేణూ మాట
అదే అన్నాను ఆ పూట
వినకు వేణు మాట
అన్నానా పూట
వినలేదు నువ్వు నా మాట
ఇప్పుడు చూడు వారి మాట
నీది కవిత మాట
కాదట నీ మాట
ఒట్టి మూట అట నీ మాట

muralidhar namala - ఎంత మాటన్నారు వేణుగారు హమ్మా

ఈలలు లేవు
గోలలు లేవు
ఈ బజ్జుగోళంలో

మేళాలు లేవు
తాళాలు లేవు
ఈ చర్చల్లో

కలాలు విరిగి
గళాలు కరిగి
తరాలుగా నినదిస్తున్నా

ఈలలు లేవు
గోలలు లేవు
ఈ బజ్జుగోళంలో

Venu Srikanth Darla - అసలే గేయపు గాయలతో గిల గిల లాడుతున్నాం మీరు మరీ చెరోవైపునుండి ఇలా బాదేస్తే ఇంకేమంటాం.. మీరు కత్తి..సుత్తి.. తురుం.. ఎట్సె... చెలరేగిపోండి అంతే అడ్డేలేదు :-)

Bhãskar Rãmarãju - ఈలలు లేవు
గోలలు లేవు
ఈ బజ్జు కీకారణ్యంలో
చప్పట్లు లేవు
అరుపులు లేవు
ఈ కవితార్ణవంలో
*రగ్గుల్లేవు
బొగ్గుల్లేవు* [కీ.శే శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారికి హృదయపూర్వక పాదాభివందనాలతో, వారి స్పూర్తితో]
ఈ నిశీధి నిద్రారణ్యంలో

muralidhar namala - నేను కవిని కాదంటే
అదరను బెదరను
నేను కవిని కాదంటే
అరవను కరవను

కవితలతో పొంగి
గేయాలుగా కురుస్తా
గుండెల్లోకి ఇంకి
గాయాలుగా నిలుస్తా.

Bhãskar Rãmarãju - అడ్డులేదంటూ
అడ్డులేడంటూ
అడ్డు తొలిగవా నేస్తం

నా కవితకు అడ్డే లేదంటూ
నా కవితకు అడ్డే లేడంటూ
నా కవితకు అడ్డు తొలిగావా నేస్తం

కానీ నా కవితకు అడ్డం
ఆ అడ్డు కాదు నేస్తం
నా కవితకు అడ్డం
పోత్సాహం లేకపోవడం నేస్తం

Bhãskar Rãmarãju - ఏంటి ముర్లీ
ఈ బజ్జేంటీ ఇలా ఉందీ?
ఏంటీ ఇంత నిశ్శబ్దంగా ఉందీ?
అమావాశ్య అర్థరాత్రిలా ఉందీ?
చిమ్మచీకట్లో గుమ్మనంగా పడుకున్నట్టుందీ?
రోహిణీకార్తె మిట్ట మధ్యాహ్నంలా ఉందీ?
దుప్పట్లో ముసుగుతన్ని నిద్రిస్తున్నట్టుందీ?
ఏంటి ముర్లీ?
ఈ బజ్జేంటీ ఇలా ఉందీ?

muralidhar namala - కవికి మనుజులెల్ల తోడురాకపోవు గాక
కవితకు జేజేలు లేకపోవుగాక
రావిగాంచని చోటు కవిగాంచు
చూచి ఊరకుండ శోధించు
శోధించి చేధించి కవితలుగా గర్జించు
ఎవ్వరాపగలరూ ఈ కవితా కంచు ఊఊఊ..

[కుమార్ గార్కి, మురళీధర్ నామాల గార్కి, వేణు శ్రీకాంత్ గార్కీ కృతజ్ఞతలతో]

18 comments:

  1. భాస్కరన్నాయ్ నువ్వు బ్లాగులో పెట్టేసాక వ్రాసింది ఇది:

    సెలవంటూ వెళ్ళిపోయావా బజ్జరు

    ఈ కవితల్లో మేము కాలుతూ ఉంటే
    ఈ భావాల్లో మేము నలుగుతూ ఉంటే

    ఈ కవితా రణంలో నీ రుణం తీర్చకుండా
    ఈ ప్రభంజనంలో జనాల్లో నిలవకుండా

    ఈ ఝంఝా మారుతం వదిలి మారుతిలా
    మరో బజ్జులోకి దూకి వెళ్ళిపోయావా బజ్జరు

    ఏవో గేయాల్తో మనసు చెదిరి
    గుండె జారి
    సందేశాలకి బెదిరి
    నిరసిస్తూ నీరసిస్తూ
    సెలవంటూ వెళ్ళిపోయావా బజ్జరు

    ReplyDelete
  2. ""muchas gracias"" agaian and also my Merci! Merci! too.

    ReplyDelete
  3. ఎవురు భయ్యా ఈ వేణూశ్రీకాంత్ గార్కీ.. ఉత్తర భారద్దేశ రాజ్కీయనాయకుడా !!
    ఏదేమైనా బాగుంది బాగుంది పోస్ట్... చూద్దారి ఇంకెందరికి కవితావేశం పొంగుకొస్తదో :-)

    ReplyDelete
  4. That is great poetry and I am sorry that I did not attach my name to the comment since there was no option of commenting with my own name.
    Krishnaveni

    ReplyDelete
  5. చప్పట్లు.. ఈలలు.. కేకలు..
    రాసిన వారికి, ప్రోత్సహించిన వారికి కూడా

    ReplyDelete
  6. కెవ్వులు.. కేకలు.. అరుపులు.. ఆర్తనాదాలు కూడా!
    అదే మిమ్మల్ని ప్రోత్సహించడానికి... ;) :D

    ReplyDelete
  7. కిలకిల నవ్వుతున్న నన్ను
    జలగలా పట్టుకున్నావు
    వలవల ఏడ్చినా
    గిలగిల కొట్టుకున్నా
    కలకలా(కళ్ళ) వదలకున్నావు

    ReplyDelete
  8. యిజీనారం టేలెంటు ఎక్కడికి పోద్ది ?

    నేను ఆఫీసు లో చదివాను.
    ఏటికేటు మరచి
    కిసుక్కులు పగలబడి నవ్వాను.
    ఖిచ కిచా నవ్వాను.

    కాబట్టి మీరందరూ నాకు
    ముందు క్షమాపణ చెప్తేనే
    కొడతాను చెప్పట్లు.
    కొడతాను చెప్పట్లు.

    ReplyDelete
  9. Sujata గారూ
    ఆ నేను చెప్పేసాను...ముందు నాకే కొట్టాలి చప్పట్లు :)))

    ReplyDelete
  10. నేనెందుకు చూడలేదీ కవితా గలగల
    చూస్తే నవ్వి ఉందును చిలకలా
    నాలోనూ పొంగేది ఓ కవితావేశం గంగలా
    అప్పుడు విలపించేవారు మీరంతా విలవిలా
    దానితో బ్లాగ్లోకంలో రేగేది ఓ కలకల
    అయ్యో ! చేజారిందో అవకాశం ఇలా ఇలా ....

    ReplyDelete
  11. Sir, ee post ki relevant kani request okati.Ee madhye music director Saluri Rajeswara rao gari abbayi, Saluri koti gari annayya ayina Saluri Vasu Rao garu music direction chesina - "Hamsa nadamo pilupo, Vamsa dharavo valapo" ane paata vinnaanu, paduta teeyaga lo.Entha bagundo.Movie peru : " ladies special " Director: Jandhyala. Year: 1993 or 1991. Please mee network lo evari daggaraina aa paata unte cheppandi Sir, mee melu ee janma ki marchiponu.

    :-)) Meeru kavulu kadante katti to podustaremo, andukani bheshugga unnai anni.Baga navvukunna.

    ReplyDelete
  12. డి గారూ
    చక్కగా తెలుగులోనే కుమ్మచ్చుగా వ్యాఖ్యని. ఇదిగో ఆ పాట -
    పల్లవి :
    హంసనాదమో... పిలుపో
    వంశధారలో వలపో

    సరిపా మపనీ పామా
    మదిలో విరిసింది ప్రేమా
    తొలకరి రాగాలేవో రేగే


    చరణం : 1
    ఏ స్వప్న లోకాల ఆలాపన
    సంసార సుఖవీణ తొలికీర్తన
    బృందా విహారాల ఆరాధన
    నా ప్రాణ హారాల విరులల్లనా
    మురళికే చలి చెలి ప్రియా
    మరునికే గుడి మహాశయా
    కిసలయా ధ్వనే శ్రుతి లయ
    మదన మోహనా మృదంగ
    తకధిమి తాళాలెన్నో రేగే


    చరణం : 2
    ఈ రీతి నీ బంటునై ఉండగా
    నీ సీతనై ఇంట కొలువుండగా
    బంటురీతి కొలువు
    ఇయ్యవయ్య రామా
    త్యాగయ్య పాడింది హరి కీర్తన
    నీ పాట నా ఇంటి సిరి నర్తన
    కనులకే ఇలా స్వయంవరం
    గృహిణితో కదా ఇహం పరం
    కలయికే సదా మనోహరం
    స్వర సమాహినీ తరంగ
    కథకళి లాస్యాలెన్నో రేగే


    చిత్రం : లేడీస్ స్పెషల్ (1993)
    రచన : వేటూరి
    సంగీతం : సాలూరి వాసూరావు
    గానం : ఎస్.పి.బాలు, చిత్ర

    ReplyDelete
  13. భాస్కర్ గారు,
    క్షమించండి.కొంచెం బద్ధకించాను తెలుగు లో టైపింగ్ కి.మీ కామెంట్ బాక్స్ లో, గూగుల్ transliterate పని చెయ్యట్లేదు ఎందుకనో.వేరే software లు వాడాలంటే కొంచెం బద్ధకం. అందుకని ...

    అబ్బ, ఎంత చక్కని సాహిత్యం, సంగీతం కదా ఈ పాటకి. అడగ్గానే సాహిత్యం ఇచ్చినందుకు శత కోటి థాంకులు. నాకు ఆడియో కావాలండి. ఈ పాట ఎప్పుడు విందామా మళ్ళీ అని చకోర పక్షి లా చూస్తున్నా. అంత నచ్చేసింది. మీ దగ్గిర కాని పాట ఉంటె, మీరు డౌన్లోడ్ లింక్ మీ బ్లాగ్ లో పెట్టి, అందరికి ఒక మంచి పాట ని పంచే పుణ్యం కట్టుకోరూ ?

    ReplyDelete
  14. భాస్కర్ గారు, మరో సారి గుర్తు చేస్తున్నందుకు ఏమి అనుకోకండి.మీ దగ్గిర కానీ, మీ స్నేహితులు దగ్గర కానీ, ఈ పాట ఉంటె, దయ చేసి మీ బ్లాగ్ లో అప్లోడ్ చేసి పుణ్యం కట్టుకోరు ? మీ మేలు ఎప్పటికి మరువను.

    ReplyDelete
  15. ఆ పాట నాకు బాగా నచ్చింది. నేను నెట్ లో పాట కోసం చాలా గాలించాను కాని దొరకలేదు. పాడుతతీయగా వీడియో మాత్రం ఉంది. పాట మీకు దొరికితే నాతొ కూడా షేర్ చెయ్యండి
    http://www.shows.manatelugumovies.net/2011/06/padutha-theeyaga-27th-jun-3.html

    ReplyDelete
  16. @డి -
    నాకీ పాట హెక్డా దొరకలేదయ్యా. :(
    @నేనేహరీశ్ -
    మాంచి లింకు కొట్టారు. ధన్యవాదః.

    ReplyDelete
  17. @నేనేహరీశ్ గారు -
    మాంచి లింకు కొట్టారు. ధన్యవాదః.Thanks a lot.Naku dorikite tappakunda meeto share chesukuntanu.

    భాస్కర్ గారు, try chesinanduku ధన్యవాదః.

    ReplyDelete