Jun 10, 2011

రాందేవ్‌ ఆస్తి ఎంతా?

రాందేవ్‌ ఆస్తి రూ.1100 కోట్లు
వెల్లడించిన బాబా సహాయకుడు
క్షీణిస్తున్న యోగాగురువు ఆరోగ్యం
హరిద్వార్‌: బాబా రాందేవ్‌ నెలకొల్పిన నాలుగు ట్రస్టుల విలువ రూ.1100 కోట్లపైనే ఉంది. వీటిలో దివ్యయోగ మందిర్‌ ట్రస్టు రూ.249.63 కోట్లు, పతంజలి యోగపీఠ్‌ ట్రస్టు రూ.164.80 కోట్లు, భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు రూ.9.97 కోట్లు, ఆచార్యకుల్‌శిక్ష సంస్థాన్‌ రూ.1.79 కోట్ల మూలధనాన్ని కలిగి ఉన్నాయి. ఈ సంస్థలు ఏర్పాటైనప్పటి నుంచి అయిన వ్యయం రూ.751.02 కోట్లు. మొత్తమ్మీద ఈ నాలుగు ట్రస్టుల విలువ రూ.1100 కోట్ల పైనే. బాబా సహాయకుడు బాలకృష్ణ గురువారం ఈ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 'మేము పనిలోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ పారదర్శకతను పాటిస్తాం. ఆదాయం ఎంత? ఖర్చు ఎంత అయింది? ఎలా అయింది? వంటి వివరాలన్నీ కచ్చితంగా నమోదు చేస్తాం' అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము పన్ను కడతామని, తమ అనుబంధ సంస్థల వివరాలను కంపెనీల రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి తీసుకోవచ్చన్నారు. పన్ను వివరాలు, ట్రస్టుల బ్యాలెన్స్‌ షీట్లను తమ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేశామన్నారు. బాబారాందేవ్‌ ఆస్తులపై దర్యాప్తు జరిపించాలంటూ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడించారు.

నాదొక ప్రశ్న -
ఈ వార్తాశీర్షిక *రాందేవ్ ఆస్తి* అని వ్రాసారు. వార్తలోకి వెళ్తే, ఆయన ట్రస్టుల ఆస్తులు అంటున్నారు. ఏవిటీ ఇదీ? ఆయన ఆస్తి వేరే ఆయన ట్రస్టు ఆస్తి వేరే కాదా?

3 comments:

 1. do we need sakshi font to read this? i can see only blocks.

  ReplyDelete
 2. You nee to tell me which OS you are on?
  I see telugu font on this page with proper rendering.
  You may need gautami or vemana installed on ur OS

  ReplyDelete
 3. 1100 పైచిలుకు కోట్లు మొత్తం ట్రస్ట్ పేరుమీదనే ఉండడం !
  ఎంత తవ్వినా తనదగ్గర కేవలం ఐదు జతల గుడ్డలు మాత్రమే ఉండడం!
  ప్రభుత్వానికి అనుమానమొచ్చిందని 48 గంటలలో ఆస్తుల వివరాలు అంతర్జాలంలో పెట్టడం!
  బయట దొరికే మందుల్ల కన్నా 25%, 50 % కొన్నింటి పైనైతే 200 % తక్కువ రేటుతో మార్కెట్లో తయారుచేసి అమ్మడం!
  వచ్చిన లాభాలని పారదర్శకంగా వెబ్సైట్ లో పెట్టడం!
  మెదలు పెట్టిన రెండు సంవత్సరాలలోనే జండు, డాబర్, బైద్యనాధ్ వంటి ఎంతో అనుభవం ఉన్న ఆయిర్వేద ఔషదోత్పాదక కంపెనీలకు కొరకరాని కొయ్యగా మాడం!
  ఏ ఒక్క మతాన్నో ప్రచారం చేయకపోవడం!
  ఏ మాలలు, రుద్రాక్షలు , పుండ్రాలు, బొట్లు ధరించక పోవడం!
  కేవలం అక్క కట్టిన రాఖీనే సంవత్సరం మొత్తం ధరించడం!
  యోగ విజ్ఞానాన్ని ప్రామాణికంగా 210 దేశాలలో నిరూపించడం!
  పెద్దా చిన్నా అని లెకుండా అందరి విమర్శకుల నోళ్ళకి కూడా వినమ్రంగా స్పందించడం!
  లక్షల మందితో ఒకేసారి నిరాహార దీక్ష చేయించడ గలగడం!
  తిమ్మిది రోజులు ఉపవాసం చేసి ప్రాణాలమీది కి తెచ్చుకోవడం!
  మాటలతో కాకుండా ప్రవర్తనతో సమాధానం చెప్పడం!
  జనాల విప్లవ పరివర్తన తో సమాధానం చెప్పడం!
  గౌర్నమెంటు విద్యావిధానంలో కేవలం ఎనమిదొవ తరగతి దాకానే చదుకొని,
  ఇలాంటివి గొప్పగా చేస్తుంటే వాటిని ప్రత్యక్షంగా చూస్తుంటే నిజంగా బాబా ఏమైనా పిచ్చోడా అనిపిస్తుంది....

  ReplyDelete