Apr 21, 2011

యాపిల్ వివాదం

యాపిల్ని తెలుగులో ఏవంటారూ?
ఇదో పెద్ద ప్రశ్న ఏమాత్రమూ కాదు. యాపిల్ని తెలుగులో యాప్లీసు కాయా అంటారు అనుకోవచ్చు.
బ్రౌను నిఘంటువులో ఇలా ఉంది -
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=apple&table=brown
అనాస (p. 0051) [ anāsa ] anāsa. [Tel.] n. Ananas sativa or the Pine Apple, Or, Bromelia saliva.
ఉమ్మెత్త (p. 0167) [ ummetta ] or ఉమ్మెత ummetta. [Tel.] n. The thorn apple (Datura) a Indian night shade; దుత్తూరము.
కపిత్థము (p. 0244) [ kapitthamu ] kapiththamu. [Skt.] n. The wood apple. Fcronia elephantum (Roxb.) వెలగవండు.
An apple రేగుపండు.
చీకివెలగ (p. 0423) [ cīkivelaga ] chīki-velaga. [Tel.] n. The thorny wood apple tree. వెలగ.
జంబునేరేడు the roseapple
పాపర (p. 0745) [ pāpara ] pāpara. [Tel.] n. The bitter apple, or colocynth (coloquintida), విశాలా, ఇంద్ర వారుణి.
The pineapple, అనాసచెట్టు
రామఫలము or రామాఫలము rāma-phalamu. n. The great red custard apple called Bullock's Heart or Sweet sop, Anona reticulata
కర్పూరవంకాయ the plant called a love apple.
http://dsal.uchicago.edu/cgi-bin/philologic/search3advanced?dbname=gwynn&query=apple&matchtype=exact&display=utf8
gwynn వారి నిఘంటువు ప్రకారం -
వెలక్కాయ అంటే వుడ్ యాపిల్, సీతాఫలము అంటే కస్టర్డ్ యాపిల్ అని ఉంది
ఇక బూదరాజు వారి నిఘంటువు ప్రకారము -
వుడ్ యాపిల్ = వెలక్కాయ
కస్టర్డ్ యాపిల్ = సీతాఫలము
యాపిల్ అంటే మాత్రం దొరకల్యా
లిటిల్ మాష్టర్స్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరి (వెంకటాచార్యులు) వారి ప్రకారం -
apple :(n)  ఆపిల్ పండు అన్నారు, అంతటితో ఆక్కుండా,
ఫ్రూట్స్ అనే ఓ విభాగంలో
Apple: సీమరేగుపండు అన్నారు
నాకు తెలిసినంతలో సీమరేగ్గాయ అంటే పియర్. పియర్ అనేకానేక సార్లు తిన్నాను. దేశంలో సీమరేగ్గాయ అనేకానేక సార్లు తిన్నాను. రోజూ యాపిల్ తింటుంటాను. నా ఎరుకలో యాపిల్ సీమరేగ్గాయ ఒకటి కాదని నా వాదన.

యాపిల్ని కాశ్మీరు ఫలం అంటారని కొందరు సూచించారు.
పియర్ అంటే బేరీపండు అని డా। కౌటిల్య బల్లగుద్దిమరీ చెప్పారు.
నేనైతే బేరీపండు అనే పేరుని మొట్టమొదటిసారి వింటున్నాను.

సీమరేగ్గాయే యాపిలా? బేరీపండు పియరా? పియరే సీమరేగ్గాయా? నా తలకాయా? ఎలా తెలిసేదీ?
పియర్ -
pear-d%27anjou.jpg


యాపిల్ -
apple.jpg

9 comments:

  1. Ayyabaaboy...
    maa guntur, krishna lo peddha regupallani simareggay antarandi...
    berrypandu, nenu yeppudu vinaledhandi...kaani berries ante blueberry, raspberry,strawberry lantivi kadhandi..pear berry pandu kadhemo andi..

    ReplyDelete
  2. మా సీమలో మొసంబి పండు అచ్చం ఆపిల్ రుచితోనే ఉంటుంది. లోపలంతా అలానే ఉంటుంది.
    కానీ చూట్టానికి ఇలా ఎర్రగా , అందంగా కనిపించదు. అదొక్కటే తేడా.
    కాబట్టి యాపిల్ ని కాశ్మీర మొసంబి అనవచ్చు అని నేననుకుంటూ ఉంటాను.

    ReplyDelete
  3. మేమైతే ఎక్కిన సెట్టు దిగేదిలేదు, యాపిలనగా సీమరేగు అని నేలగుద్ది చెబుతున్నాం....

    మందాకిని గారు, సీమ సంగతి ఏమోగాని మొసంబి అంటే బత్తాయి పండు అండి, ఆపిల్ లాంటి పండుకాదు

    ReplyDelete
  4. నాగార్జున గారు,

    సీమ సంగతేమో గాని అంటే ఎలా ? నే చెప్పేది అక్కడి మాటే మరి.
    నాగార్జున గారి మాటేమో గాని....!!! :)

    ReplyDelete
  5. >>సీమ సంగతేమో గాని అంటే ఎలా ? నే చెప్పేది అక్కడి మాటే మరి.
    అలాగంటారా.....ఐతే సరే అంటాం :) :D

    ReplyDelete
  6. తెలంగాణా లో యాపిల్స్ ని సేపులంటారు

    ReplyDelete
  7. శేప్ పళ్ళనబోయి మొసంబి అని వాదించానా ఏమిటి? ఏమో ఆ పేర్లు మరిచి పోయానే...ఖర్మ, ఖర్మ!!

    ReplyDelete
  8. >>శేప్ పళ్ళనబోయి మొసంబి అని...

    అదీ అదీ సంగతి....
    ఇహహ్హహ్హ్హహ్హహ్హ.......ఇక్కడ కూడా గెలిచితిన్ భాస్కరన్నా, గెలిచితిన్ :D

    ReplyDelete
  9. intaki nenu cheppedemitante 'ber' ante hindi lo regipandu ani, 'mosambi' ante battakayalani, 'sev' ante apple pandu ani artham. delhi lo 10 years nundi vundadam valla meeru vrasina matalanni naku hindi matalani arthamavutunnai. Telugu lo apple ni apple pandu ane andamu. masna daggara apple chetlu molavavu kabatti mana bhasha lo daaniki purvikulu perlu petttaledu. Mana me edanna pedite pola.......sgs

    ReplyDelete