Feb 24, 2011

బంద్ సంపూర్ణం

23pan18a.jpg
వరంగల్‌ జిల్లాలో మణుగూరు ప్యాసింజర్‌ రైలుకు ఆందోళనకారులు నిప్పంటించటంతో ఒక బోగి పూర్తిగా, రెండు పాక్షికంగా కాలిపోయాయి.

Integral Coach Factory -
Production began in a modest manner in 1955 with the manufacture of seven third class coach shells. Today the coach factory produces more than 1600 coaches of more than 170 varieties. In the year 2007-08, ICF created a milestone by producing 1291 railway passenger coaches, coaches per annum. It employs about 13,000 persons. Nearly 1336 coaches are manufactured every year, and 6 coaches are manufactured per day.

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పదమూడువేల మంది పనిచేస్తూ సంవత్సరానికి పదమూడొందల బోగీలను‌లను తయ్యారు చేస్తారు ఉజ్జాయింపుగా. ఎంత శ్రమ సమయం సదుపాయాలు వనరులు అవసరం అవుతాయీ బోగీలను తయ్యారు చేయాలంటే? అలాంటిది ఒక్క అగ్గిపుల్లతో భగ్గున బూడిద చేస్తే బంద్ సంపూర్ణమైనట్లా?
ఆపండయ్యా మీగోల. ఇప్పటికి కొన్ని వందల బస్సులు ధ్వంసం. రైళ్ళు ధ్వంసం, పట్టాలు ధ్వంసం, చదువులు ధ్వంసం, ప్రాణాలు ధ్వంసం.
రాష్ట్ర ముఖ్యమంత్రికీ ఇతర పార్టీలకు నా అభ్యర్థన. పొలిటికల్ ప్రాసెస్ తో తేల్చుకోవాల్సిన సమస్యలు ఇవి. తొందరగా తేల్చండి. ఎంతకాలం నానుస్తారు? మరెంత నష్టం మానెత్తిన రుద్దుతారూ? మరెన్ని విద్యా సంవత్సరాలు నాశనం చేస్తారూ? మరెందరి లేత జీవితాలను బలితీస్కుంటరూ?

1 comment:

  1. మనగోల వాళ్ళకి వినబడేదెప్పుడండీ, మన పిచ్చిగానీ! చేసే వాళ్ళకూ ప్రజాభిప్రాయం తెలుసు. తెలిసీ చేస్తున్నారు.

    ReplyDelete