Feb 22, 2011

ప్రత్యేక ఆంధ్రా కొత్త రాజధాని - మాచెర్ల

చదువరి గారి "గవర్నరు గారూ వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా http://chaduvari.blogspot.com/2011/02/blog-post_17.html" టపా వ్యాఖ్యల్లో శ్రీ తాడేపల్లిగారి ప్రపోజల్ నాన్నాలోచింపచేసింది. ప్తాడేపల్లిగారి స్టాండు విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి సర్క్యూట్ లో కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని. గుంటూరు విజయవాడ కృష్ణా డెల్టాల్లో పంటలు బాగా పండేది ఈ సర్క్యూట్ లోనే. కాబట్టి ఆ భూమిని కదల్చటం మంచిది కాదేమో. నా దృష్టిలోనైతే ఆంధ్రాకు రెండు రాజధానులుండాలి.
౧. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, శాసనసభ, ప్రభుత్వ యంత్రాంగం పాలన, కోర్టులు, న్యాయ కేంద్రం ఇత్యాదివి. ప్రభుత్వానికి పనిచేసేవారు ఇక్కడ నివసిస్తారు. వారికి ప్రభుత్వం క్వార్టర్సే కట్తితుందో ఏం చేస్తుందో అంతా ఈ రాజధానిలోనే.
౨. ఫైనాన్సియల్ రాజధాని. ఇక్కడ వ్యాపార సంబంధిత యంత్రాంగం.

దీనివల్ల చాలా లాభాలున్నాయని నా భావన.

ఇక ఏ సర్క్యూట్? ఆంధ్రా/రాయలసీమ లనుండి తెలంగాణను పీకేస్తే, రేపొద్దున, ఆంధ్రావాళ్ళు రాయలసీమలోకొచ్చి మెక్కుతున్నారని మరో మారు పోరాటమనో ఎదోకటి మొదలు కాదని నమ్మకం ఏంటీ?
కాబట్టి ఆ తలనొప్పెదో ఇప్పుడే చెసేస్తే మంచిదిని నా అభిప్రాయం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని నేను కోరుకుంటున్నా.
అదే కనక జరిగితే, మాచర్లని ప్రభుత్వ పరిపాలనా రాజధానిగా చేయాలని నా అభిప్రాయం. పక్కనే కృష్ణమ్మ. నాగార్జున సాగర్. కొండ ప్రాతం. ఏ సమస్యా ఉండదు. చక్కటి ప్లానుతో కట్టవచ్చు. రైల్వే లైను ఉంది. కనెక్టివిటీకి ఏ మాత్రం గోల లేదు.

జై హింద్

18 comments:

  1. అద్బుతమైన ఆలోచన. పూర్వ రాజధాని కర్నూల్ ని మార్చడం చారిత్రాత్మక తప్పిదం. కర్నూల్ కి, మాచెర్ల కి ఒక పోలిక వుంది. కూతవేటు దూరం లో తెలంగాణా, రాయలసీమ మరియు కృష్ణవేణి వుండటం. ఇది చాలా వరకు కలిసి వచ్చే అంశం. ఎప్పటికీ వివాదాలు రావు. కావలిసినంత భూమి వుంది. ఇష్టం వచ్చినట్లు అభివృద్ధి చేసుకోవచ్చు. తుఫాన్లు, వరదలు వంటి భయాలు అవసరం లేదు. కావలసినంత ఖనిజ సంపద వుంది. రేపు ఆంధ్ర ప్రదేశ్ ని విభజించే టప్పుడు దేవుడు పెద్ద వాళ్ళ మనస్సులో దూరి ఈ ఆలోచన రప్పించాలని కోరుకుంటున్నా.

    ReplyDelete
  2. భాస్కర్ గారు,
    అలనాటి పలనాటి రాజధాని ఇకపై ఆంధ్రాకు రాజధాని కావాలంటారా!!
    బాగుంది. నా ఓటు మీకే.
    ఇక్కడ "హుస్సేను సాగరు" ప్రక్కన సచివాలయము ఉన్నది కాబట్టి మనము అక్కడ "చంద్ర వంక" ప్రక్కన ఒక సచివాలయము కట్టుకోవచ్చు. :-(

    ReplyDelete
  3. అంబేద్కర్ పార్క్ సెంటర్ లో ఒక హైటెక్ సిటీ , లక్ష్మి దేవి మిద్దెలు దగ్గర ఒక Financial Hub పెట్టాలని కోరుతున్నాం !
    అదే చేత్తో చంద్ర వంకలో కనీస స్థాయి లో ఎప్పుడు నీళ్ళు వుండే లాగ , బొంబాయి కంపనీ నుండి ఒక శాశ్వత ఏర్పాటు కూడా !!

    ReplyDelete
  4. రాయలసీమ, కోస్తాల సరిహద్దు ప్రాంతమైతే భవిష్యత్తులో మడతపేచీలు పెట్టుకుని, మనోభావాలు చితికి, దోచిన్రు అంటూ కాకిలెక్కలు, కుంటిసాకులు చెప్పి దొంగలు దొంగలు వూళ్ళు పంచుకోకుండా, చచ్చినట్టు కలిసుంటారు. శ్రీశైలం దిగువన/దోర్నాల-మార్కాపురం/గిద్దలూరు అటవీ ప్రాంతంలో మంచిదేమో. నల్లమల చుట్టుపట్ల జన/పోలీసు సంచారం పెరిగితే మావోలు అక్కడినుండి దూరంగా పారిపోతారు, కూడా. పరిశ్రమలు మాత్రం ఒక లిమిటెడ్ స్టాప్స్ రైలుమార్గంతో కలుపుతూ సమీప సముద్ర తీరప్రాంతం ఒంగోలు చుట్టు పట్ల వుంటే మంచిది. ప్రకాశం జిల్లా బాగా లాభ పడుతుంది.

    డెల్టా/సారవంతమైన వ్యవసాయభూములను కాంక్రీట్ జంగిల్స్‌గా మార్చడానికి రాజకీయ/రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనవసరంగా అవకాశమివ్వకూడదదు.

    రాజధానైతే వసతులన్నీ అదనంగా చచ్చినట్టు వస్తాయి, అందుకు ఇప్పటికే వున్నవాటిని మార్చాల్సిన అవసరంలేదు. అందుకు బడ్జట్ ఇచ్చుడో, చచ్చుడో తిప్పలు కెలికిన తెలంగాణ/కేంద్రం పడతాయి. :) ఫండ్స్ త్వరగా ఇస్తే త్వరగా వదులుతాం, లేదా తీరిగ్గా ఓ కమిటీ వేసి, ఏకాభిప్రాయం వచ్చాక, ఆలోచిస్తాం. :P

    అంతవరకూ ...'కలిసుందాం రారా..' అంతే! బంతి తమ కోర్టులో వున్నది, ఇచ్చుడా? సచ్చుడా? :))

    ReplyDelete
  5. అదేం కాదు. రాజధాని మా విసాపట్నం కే రావాలి. విసాపట్నం, అనకాపల్లీ మధ్యలో గానీ, విసాపట్నం, విజీనారం మధ్యలో గానీ రావాలి - కాపోతే నీనొప్పుకోనంతే !!!

    ReplyDelete
  6. విజయవాడ-గుంటూరు రాష్ట్రానికి రెండవ రాజధానిగా ఉండాలని ఎన్.జి.రంగా గారు ఆనాడే కోరారు(ఇండియన్ ఎక్స్ ప్రెస్ 11.11.1953).

    ReplyDelete
  7. మరీ కొద్దిగా ముందే అడిగినట్లు లేదూ? రహంతుల్లా గారు. ఆనాడు ముక్కోడి మనోభావాలు, చిన్నమెదడూ రెండూ బాగానే వుండేవి మరి.

    ఆర్నెల్లకన్నా ముందుగా రైల్లో టికెట్టే రిజర్వు చేసుకోవడం కుదరదు, రాజధాని కావాలంటే ఎలాగండి? ఆచార్య రంగా ఐనా, వంగవీటి రంగా ఐనా పర్సనల్ గా వచ్చి అడిగితే బాగుంటుంది. :);)

    ReplyDelete
  8. సుజాతగారి మాటే నా మట...మా ఇజీనారం, ఇసాపట్నం మధ్యలో రావాలి అంతే.

    ReplyDelete
  9. ౧. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, శాసనసభ, ప్రభుత్వ యంత్రాంగం పాలన, కోర్టులు, న్యాయ కేంద్రం ఇత్యాదివి. ప్రభుత్వానికి పనిచేసేవారు ఇక్కడ నివసిస్తారు. వారికి ప్రభుత్వం క్వార్టర్సే కట్తితుందో ఏం చేస్తుందో అంతా ఈ రాజధానిలోనే.
    ౨. ఫైనాన్సియల్ రాజధాని. ఇక్కడ వ్యాపార సంబంధిత యంత్రాంగం.

    Guys!! Lets talk about this

    ReplyDelete
  10. I love this on great andhra.. Really great article.. For the first time speaking the truth..

    http://www.greatandhra.com/viewnews.php?id=27233&cat=15&scat=16

    T- Congress Leaders Becoming BIGGEST Jokers!!!
    www.greatandhra.com

    ReplyDelete
  11. ఇప్పుడు ఈ పనికిమాలిన చర్చ అవసరమా ?

    ReplyDelete
  12. Satyarthi
    POni panikoccE cerca tamru modaleTTaMTDi

    ReplyDelete
  13. ఏదో సరదాగా కాసేపు ....అవసరం లేదు అంటే అన్ని అలాగే వుంటాయి....!

    ReplyDelete
  14. మీరో విషయం మరచిపోయారు. మా వినుకొండ అయితే రోడ్డుమిదే ఉంది అటు కర్ణూల్నుంచి ఇటు విజయవాడదాకా రోడ్డు విజయవాడనుండి గుంతకల్లుదాకా రైల్వేలైన్ ఉంది . వరదలు తుఫాన్లు ఇబ్బంది ..ఆమాటకొస్తే వర్షాలగూర్చికూడా పెద్దగా ఉండదు. ఎవడన్నా దూకాలనుకుంటే పక్కనే గుండ్లకమ్మకూడా ఉంది. పైగా మావూరికి రాజధాని దగ్గరగాఉంటుంది .

    ReplyDelete
  15. Unnecessary discussion at this point in time.

    ReplyDelete
  16. దుర్గేశ్వర గారూ,
    మీ గుండ్ల కమ్మ వర్షాకాలమంతా రోడ్డు మీదే ఉంటుంది కదండీ, వచ్చి దూకే పనేముంది?

    ReplyDelete