Feb 21, 2011

జస్సికని ఎవరూ చంపలేదు!

నిన్న నో వన్ కిల్డ్ జస్సిక అనే సినిమా చూసాను.
కొన్ని కొన్ని సీన్స్ చాలా అత్భుతంగా తీసాడు దర్శకుడు.
జస్సిక అనే ఓ అమ్మాయిని రాజకీయ బలం నెత్తికెక్కిన ఓ కుఱ్ఱాడు, కేవలం మందు ఇవ్వలేదని ఆవేశంతో షూట్ చేస్తాడు. పోలీసు కేసు గట్రా....కోర్టులో కేసు హియరింగుకు వస్తుంది.
ముందు సాక్ష్యం చెప్తాం నిజాయితీగా అన్న సాక్షులు కోర్టులో అడ్డంతిరుగుతారు.
ముద్దాయివైపు వాదించే లాయరు (ఏవంటారూ ఈన్నీ? డిఫెన్స్ లాయరా?) మొదలెడతాడు
మొదటి సాక్షి - ముద్దాయిని పార్టీలో ఢీకొన్న వాడు
లాయరు : అబ్బాయి నువ్వు ముద్దాయిని ఆరోజు పార్టీలో చూసావా?
మొ. సా : చూసాను
లా : ఎలా?
మొ. సా : రెండుచేతుల్తో మద్యపు గ్లాసులు పట్టుకుని వెళ్తుంటే నన్ను ఢీకొట్టాడు
లా : ఓహో! అంటే రెండు చేతుల్తో మద్యపు గ్లాసుల్తో తిరుగుతన్నావన్నమాట. నిజ్జంగానే ఇతన్ని చూసావా? ఆర్ యూ స్యూర్?
మొ. సా : అవును. చూసాను.
లా : ఐతే ఆరోజు నువ్వు ఎన్ని గ్లాసులు తాగా౨వు మద్యం?
మొ. సా : హ్మ్! గుర్తు లేదు.
లా : నువ్వు ఎన్ని గ్లాసులు తాగా౨వో నీకే గుర్తులేదు కానీ ఓ మనిషి, నిన్ను ఢీకొన్న మనిషిని గుర్తుపడతావ్. తాగుబోతా.
అతని సాక్ష్యం చెల్లలేదు.
రెండో సాక్షి - ఈమె హత్య జరిగిన నిమిషంలోపే హత్యా స్థలంలోకి వెళ్తుంది. జస్సి చచ్చి పడుంది. ముద్దాయి చేతిలో రివాల్వర్లోంచి ఇంకా పొగ వస్తూనే ఉంది. అతన్ని ఆపుతుంది. ఏంచేసావ్ నువ్వూ అని.
లా: నువ్వు ఇతన్ని చూసావా అక్కడా
రెం. సా : చూసాను. కానీ ఐ యాం నాట్ స్యూర్
లా: నువ్వు చూసావా అతన్ని?
రెం. సా : చూసాను కానీ
లా: నువ్వు చూసావా
రెం. సా: ఐ యం నాట్ స్యూర్.
ఈమె సాక్ష్యం చెల్లలేదు
మూడో సాక్షి : ఈమె హత్య జరిగినప్పుడు అక్కడె ఉంది. జస్సికి స్నేహితురాలు కూడా. రెండో సాక్షి కూతురు.
లా: నువ్వు ఇతన్ని చూసావా అక్కడా?
మూ. సా : చూసాను. ఇతనే చంపింది.
లా: ఆర్ యూ స్యూర్
మూ. సా: స్యూర్
లా: అతను ఏం డ్రస్సు వేస్కున్నాడో చెప్పగలవా?
మూ. సా: జీన్సు మెరూన్ చొక్కా
లా: అబ్బో. మరి నువ్వేం వేస్కున్నావో చెప్పు
మూ. సా : మౌనం
లా: నువ్వేం వేస్కున్నావో చెప్పు
మూ. సా: మౌనం
లా : తాగుబోతులు. ఎంత తాగారు తెలియ్....
మూ. సా: అయ్యా నేను వెర్సాచే బ్లూవిస్కస్ గౌన్ వేస్కున్నా, లోపల దుస్తులు పలనా వేస్కున్నా. చెప్పమంటే అండర్ ప్యాంటు ఏంటో కూడా చెప్పగలను.

నాలుగో సాక్షి - మూడో సాక్షి తండ్రి. ఇతనూ చెప్తాడు ముద్దాయే చంపాడని.
మూడు, నాలుగు సాక్షాలను కోర్టు ఎంతవరకూ అంగీకరించిందో కథనంలో లేదు.
ఐదో సాక్షి - అడ్డం తిరిగాడు
ఆరో సాక్షి - అడ్డం తిరిగాడు.
ఏడో సాక్షి - అడ్డం తిరిగాడు
ఇలా సాగుతుంది కోర్టుహాలులో.
నాకర్థంకాని లాజిక్కు.
ఒక వ్యక్తి ఆల్కాహాల్ ఎన్ని పెగ్గులు కొట్టాడో గుర్తులేనంత మాత్రాన అతన్ని ఢీకొన్న వాణ్ణి గుర్తుంచుకోలేక పోవడానికి ఎంతశాతం ప్రాబబిలిటీ ఉందీ?

ప్రతివాది లాయరు ఇలా వాదిస్తాడు - అక్కడ ఓ పొడవాటి వ్యక్తి ఓ పొట్టి వ్యక్తి కాల్చారు. వాళ్ళు మా క్లైంటు మరియూ అతని మితృల్లా అనిపించారు. అందుకే సాక్షులు కన్ఫ్యూజ్ అయ్యారు.
కోర్టు వాయిదా వేస్తుంది.
అలా సంవత్సరాలు గడుస్తాయి. ఆరేళ్ళ తర్వాత కోర్టు సరైన సాక్షులు లేనందున కేసుని కొట్టేస్తుంది, ముద్దాయిలను వదిలేయాలని ఆర్డరు వేస్తుంది.

నాకు మిస్సింగా అనిపించిన పాయింట్లు
>>ప్రతివాది లాయరు ఇలా వాదిస్తాడు - అక్కడ ఓ పొడవాటి వ్యక్తి ఓ పొట్టి వ్యక్తి కాల్చారు.
అని ప్రతివాది లాయరు వాదించినప్పుడు, సాక్షులను ప్రశ్నించాలి కదా, అక్కడ వీరు కాకుండా మరెవరున్నారూ అని? ఉన్నది ఏడుగ్గురే. మరి కాల్చిన వారు ఆ ఏడుగ్గురిలో కాకపోతే ఎక్కడనుంచి వచ్చారో కనుక్కోవాలని కోర్టు ఆర్డరు వేయదా?
ఆరేళ్ళ పాటు పై విషయాన్ని స్పృశించలేదంటే ఆశ్చర్యం వేసింది నాకు. ఇది సింపుల్ పాయింట్ కదా.
అక్కడ ఏడుగ్గురే ఉన్నారు. ఏడుగ్గురిలో చంపిన వాళ్ళు లేరని సాక్షులు చెప్పారు. మరి చంపిందెవరూ? అని తేల్చటానికి ఆరేళ్ళు పట్టి చివరకు ఏం తేలలేదని కొట్టేసింది కోర్టు.
హ్మ్!!

ముద్దాయి నేరం చేసి పారిపోయి తర్వాత పోలీసులకు దొరికాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీస్కొచ్చి బొక్కలో పెట్టారు. ఇన్స్పెక్టరు ఆడియో రికార్డరుతో అతన్ని ప్రశ్నిస్తాడు.
టెక్నాలజీ యొక్క ఉపయోగాన్ని ఇరవైఒకటో శతాబ్దంలో కూడా వాడకపోతే ఎలా?
కథ జరిగింది 1999 లో. అప్పటికే ఢిల్లీలాంటి మెట్రోలలో క్లోజ్డ్ సర్క్యూట్ కెమేరాలు వచ్చాయి.

సరే ఓ సినిమా కాబట్టి వదిలేద్దాం.

నిజజీవితంలో, ఇప్పటికైనా మన పోలీసు యంత్రాంగం టెక్నాలజీని ఎడాప్ట్ చేసుకోవాలని నా సూచన. కనీసం ఇంటరాగేషన్ రూము. అందులో నాలుగు యాంగిల్స్ లో కెమేరాలు. ఇలా చేయటం వల్ల వీడియోని టాంపరించ్ చేయలేరు కట్టుదిట్టంగా నిర్వహిస్తే మరియూ సాక్షులో నేరస్తులూ మాటా మార్చలేరు.

8 comments:

  1. భాస్కర రామరాజు గారు,

    మొత్తం సినిమాలో అతి ముఖ్యమైన సన్నివేశాన్నీ, ముఖ్యమైన విషయాన్నీ చక్కగా రాశారు. నేను సినిమా చూడలేదు. ఈ కేసు గురించి తెలుసు. మీ టపా లో రాసిన విషయం అర్థమయ్యింది. మీరు చెప్పాలనుకున్న విషయం యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకున్నాను.

    ముందుగా, అవసరమైన చోట సాంకేతిక పరిఙానం వాడాలి అనేదాంట్లో మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. నాకు కొన్ని మౌలిక మైన సందేహాలు ఉన్నాయి. వాటిని తరువాతి వ్యాఖ్యలో తెలియ జేస్తాను. లేకపోతే ఈ వ్యాఖ్య మరీ పెద్దదైపోతుంది :)

    ReplyDelete
  2. భాస్కర రామరాజు గారు,

    మొత్తం ఇక్కడుంది ఏడుగురు సాక్షులు.

    మొదటి ఇద్దరు సాక్షుల సాక్ష్యాన్నీ తిరస్కరించడంలో న్యాయ మూర్తి యొక్క గొడ్డెద్దు చేలోబడిన వైనం తప్పం న్యాయ సూత్రాల అమలు ఎక్కడా కనబడలేదు. ఇలాంటివి కోర్టుల్లో జరగవని నేను చెప్పట్లేదు. కానీ, ఒక సమాజంగా న్యాయమూర్తుల్లో మెజారిటీ మందిని ఇటువంటి వారినే తయారు చేసుకుంటున్నం మనం.

    మూడవ, నాలుగవ సాక్షుల గురించి కథనంలో స్పష్టతలేదు.

    మిగిలిన ముగ్గురు సాక్షులూ అడ్డం తిరిగారు.

    ఒక సమాజంగా మనలోని ప్రతి ఏడుగురిలో కనీసం ముగ్గురు ఇలా వివిధ కారణాలతో అడ్డం తిరుగుతున్నారన్నమాట!

    ఒక సమాజంగా మనలో ఎక్కువమంది, ఈ కథనంలోని న్యాయమూర్తిలాగా, లాయర్లాగా, సాక్షుల్లాగా ఉన్నప్పుడు ఇంతకంటే న్యాయం జరుగుతుందా? ఎంత సాంకేతిక పరిఙానం ఉన్నా మనుషులుగా మనం కొంత పరిణతి చూపించక పోతే ఇలాగే ఉంటుంది.

    (ఇంకా ఉంది)...

    ReplyDelete
  3. భాస్కర రామరాజు గారు,

    >> కనీసం ఇంటరాగేషన్ రూము. అందులో నాలుగు యాంగిల్స్ లో కెమేరాలు. ఇలా చేయటం వల్ల వీడియోని టాంపరించ్ చేయలేరు కట్టుదిట్టంగా నిర్వహిస్తే మరియూ సాక్షులో నేరస్తులూ మాటా మార్చలేరు.

    కొన్ని అనుకోని పరిస్థితుల్లో దారి తప్పే వాళ్ళైతే, సాంకేతిక పరిఙానంతో సరి చేయవచ్చు.

    మీరు పైన చెప్పిన కధనంలోని మొదటి ఇద్దరు సాక్షుల విచారణలా జరిగితే, ఎన్ని కెమేరాలు పెట్టినా ఫలితంలో తేడా ఉండదు.

    ఇంకొక్క ఉదాహరణ ఉంది...

    ReplyDelete
  4. మిగిలిన ముగ్గురు సాక్షులూ అడ్డం తిరిగారు.

    ఒక సమాజంగా మనలోని ప్రతి ఏడుగురిలో కనీసం ముగ్గురు ఇలా వివిధ కారణాలతో అడ్డం తిరుగుతున్నారన్నమాట!
    ఒక సమాజంగా మనలో ఎక్కువమంది, ఈ కథనంలోని న్యాయమూర్తిలాగా, లాయర్లాగా, సాక్షుల్లాగా ఉన్నప్పుడు ఇంతకంటే న్యాయం జరుగుతుందా? ఎంత సాంకేతిక పరిఙానం ఉన్నా మనుషులుగా మనం కొంత పరిణతి చూపించక పోతే ఇలాగే ఉంటుంది.
    -------------------------
    ఫిబ్రవరి ఇరవి ఒకటి, అనగా నిన్న
    కసబ్ అనే ముద్దాయికి ముంబై కోర్టు ఉరిశిక్ష వేసింది.
    ౨౦౦౮ నవంబరు నుండి ఇప్పటికి రెండున్నరేళ్ళు.
    న్యావాదుల వాదనలు జరిగి పై శిక్ష దకా రాటానికే ఇంతపట్టింది. రేపొద్దున శిక్షని అమలు చేయటానికి మరెంత సమయం పడుతుందో?

    ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే -
    మనవారికి ఎమెండ్మెంట్స్ ఇన్ వ్యూ ఆఫ్ అమ్ద్ విత్ రెస్పెక్ట్ టు లెస్సన్స్ లెర్న్డ్ అనేది లేదు. బ్రిటీషువారి న్యాయ చట్ట పరికరాలనే ఉపకరణాలనే దృష్టినే ఇంకా ఫాలో అవుతున్నారు.

    అందులోని లోపం సుస్పష్టం. అప్పటి దేశకాలమాన పరీస్థితులకు అనుగుణంగా దాన్ని స్టిచ్ చేసారు. అది ఇవ్వాళ్ళ చెల్లదు.
    పై అన్నిటికన్నా మనవాళ్ళకు డైనమిజం లేదు.

    ReplyDelete
  5. భాస్కర రామరాజు గారు,

    పార్లమెంటులో అనేక విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంటుంది, న్యాయ సూత్రాలనే మార్చే చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టీ, పార్లమెంటులో సభ్యల ప్రవర్తన కోర్టులో ప్రశ్నించజాలదు అనే నియమం పెట్టుకున్న వ్యవస్థ మనది.

    ఆ నియమాన్నే, పార్లమెంటులో ఇతర పార్టీల వాళ్ళని డబ్బులిచ్చి కొనుక్కున్న కేసులో తనకి అనుకూలంగా PV నరసింహారావు లాంటి విశిష్టమైన వ్యక్తులు తమకి అనుకూలంగా వాడుకుంటే, మన న్యాయ వ్యవస్థా, పౌర సమాజం నిద్రపోయింది అనే విష్యం మీకు తెలుసనే అనుకుంటాను. అంత అత్యున్నత స్థాయి వ్యవహారాల్లోనే మనందరి విచక్షణ అలా ఉంటే, ఎంత సాంకేతిక పరిఙానం ఉంటే ఏం ప్రయోజనం? చట్టాలు ఎంత విపులంగా ఎన్నెన్ని పేజీలు రాస్తే ఏం ఉపయోగం?
    (I do not intend to criticize PV or Congress. Its just an example. Others might have done the same thing as well..:( )

    అందుకే సాంకేతిక పరిఙానం అవసరమే కానీ, ముందుగా మనుషులుగా మనసమాజంలో మెజారిటీ సభ్యుల ఆలోచనా విధానం సరైన దారిలో ఉండేలా ఉండడం అత్యవసరం.

    So the conclusion is, Usage of technology helps the sufficiency condition but it can not supply the requirements of neccessary conditions. Unfortunately as a society we are still struggling with the neccessary conditions.

    ReplyDelete
  6. >>మిగిలిన ముగ్గురు సాక్షులూ అడ్డం తిరిగారు.
    ఆ మిగిలిన ముగ్గురు సాక్షులే కేసుకి అతిముఖ్యమైన సాక్షులు, మరియూ ప్రత్యక్ష సాక్షులు కూడా.
    వారిలో ఒకడు నేను పైకి వెళ్ళాను అని చెప్తే రెండోవాడు నే చూళ్ళేదంటే
    మూడో వాడు వీళ్ళు కాదసలు కాల్సినోళ్ళలో ఒకడు పొడుగు మరొకడు పొట్టి అని చెప్తాడు.

    ముద్దాయి తండ్రి రాజకీయ వేత్త. చేతన్ కేసులో ముద్దాయి వ్యాపార వేత్త. ఒకడు రాజకీయ బలాన్ని విరివిగా ఖర్చు పెడితే మరొకడు డబ్బుతో కొన్నాడు.

    ఇవ్వాళ్ళా రేపట్లో ఇలాంటి అతి సామాన్య విషయాలే.
    ఎందరు రాజకీయ నాయకుల పిల్లలు ఘోరమైన నేఱాలు చేసి చట్టానికి దొరక్కుండా తిరగటం లేదూ?

    ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని, ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్కి, ఇన్వెస్టిగేషన్కి ఎక్కాడా ట్యాంపర్ అనేది లేకుండా చెయ్యాలంటే పూర్తి స్థాయిలో టెక్నాలజీని వాడుకోవాలి.

    ReplyDelete
  7. బాలక్రిష్ణలూ, కేశవరావు కొడుకులూ అంత అడ్డంగా దొరికిపోయాక కూడా, చక్కగా అందరికీ నీతులు చెబుతూ తిరుగుతుంటే వాళ్ళకోసం TV ల ముందర మనం ఎదురు చూసే వాళ్ళ మైనప్పుడు ఎంత టెక్నాలజీ వాడినా, ఎన్ని వేల పేజీలు పీనల్ కోడ్ లు రాసినా మార్పు ఉండదు. lemme reiterate again, I am not discounting the importance of technology usage. usage of technology and making of better human resources are both important but I believe the second one is of primary importance.

    ReplyDelete
  8. మీ పాయింట్లు కరెక్టే! ఎందుకంటే మెమరీ అన్ని చోట్లా ఒకేరకంగా ఉండదు.షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, సెన్సరీ మెమరీ అని! నిన్న మధ్యాహం లంచ్ లో నువ్వేం తిన్నావు? అంటే వెంటనే చెప్పలేం! రింగులు తిప్పుకుంటూ వెనక్కి వెళ్ళాల్సి రావొచ్చు! నీ చిన్నప్పుడు మీ క్లాసు టీచర్ సైకిల్ ఏం రంగు అంటే గుర్తుండొచ్చు!

    మీరన్నట్లు, సినిమా కాబట్టి మామూలు ప్రేక్షకుడి చేత"అబ్బ,, భలే అడిగాడు" అనిపించడానికే ఇలాంటి దృశ్యాలు క్రియేట్ చేస్తారనుకుంటాను.

    మీరు లేవనెత్తిన పాయింట్లే చాలా వరకూ ఈ సినిమా గురించి చాలాచోట్ల నడిచాయి

    పోలీసు డిపార్ట్ మెంట్ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన్ని గురించి ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నదండీ! ఇంతవరకూ అదొక సంప్రదాయిక డిపార్ట్ మెంట్ గా ఉండేది. ఇప్పుడు వాళ్ళ ఆఫీసు బిల్డింగ్స్ తో సహా ప్రతి అంశంలోనూ అప్ డేటెడ్ గా ఉండాలని యోచిస్తున్నారు. అంత త్వరగా ఆశించలేం గానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలోనే డిపార్ట్ మెంట్ ఉంది .
    కానీ,.. వీకెండ్ పొలిటీషియన్ గారి వ్యాఖ్య చూడండి, అడ్డంగా నేరం జరిగిన స్థలంలోనే దొరికిపోయిన వాళ్ళని ఎంత చక్కగా తప్పించారో! ఇక ఎంత పరిజ్ఞానం సంపాదించి ఏం లాభం?

    ReplyDelete