Feb 16, 2011

ᠤᠯᠠᠭᠠᠨᠪᠠᠭᠠᠲᠤᠷ=ఉలన్ బాటర్

అర్థం అవ్వలేదా
ᠤᠯᠠᠭᠠᠨᠪᠠᠭᠠᠲᠤᠷ=ఉలన్ బాటర్
కథలోకొస్తే

నాన్నా రెక్టాంగ్యులర్ బిస్కెట్‌ని ఒకమూల, చిన్నగా కొరికితే
అంటే ఎలారా
ఎలుక కొరుకుతుందే అలా కొరికితే
ఆ కొరికితే
అదే కేన్సాస్ స్టేట్, ఆ కొరికిన పక్కనే టొపీక
ఓహో
నాన్నా క్యాపిటల్ అంటే ఏంటీ?
గవర్న్మెంట్ ఉండేది అక్కడేరా
గవర్న్మెంట్ అంటే?
నీకిప్పుడే అర్థం కాదులేరా నాన్న
మరి కేన్సాస్ పైన ఏముందీ?
నెబ్రాస్కా
అటుపక్కన
వయోమింగ్
ఇటు పక్కన
మిజోరి
ఇటుపక్కన
కొలరాడో
కిందో?
ఒక్లహామా
మరి ఏ ఆర్ రాసి కేన్సాస్ అని ఎందుకు రాసారూ
అర్కాన్సస్ రా
కాదు నాన్నా
అర్కాన్సా
అదేలేరా
నన్నా ఇదిగో చూడూ


పై బొమ్మ గీసి సూపెట్టాడు.
పై బొమ్మలో టైం మూడైతే క్లాక్ ఎలా చూపుతుందీ అంటే పైన కార్నర్లో వేసాడు.

అమెరికా మ్యాపు వేసే ప్రయత్నం చేసాడు.

ఏందిరా అంటే వాళ్ళకి కేన్సాస్ మ్యాప్ పాయింటింగ్ నేర్పించారు. అక్కడ నుండి మొదలైంది ఈ గోల. గూగుల్ మ్యాప్ చూపెట్టు అని గోల. పెడితే ఏఏ స్టేట్ ఎక్కడా? మొత్తం అడిగాడు. వాటి రాజధానులు ఓ రౌండు అయింది.
ఇక వాడి భోషాణం పెట్టె తీసి ఈ పాత మ్యాపు తెచ్చాడు. బణ్ణుంచి ఇంటికొచ్చాక అదే పని. నేను ఇంటికి రాంగనే దాన్ని పరుస్తాడు. నాన్నా ఉలన్ బాటర్ ఎక్కడో చూపించు అంటాడు. లిబియా ఎక్కడా? మేడగాస్కర్ ఎక్కడా? చైల్ ఎక్కడా? ఉరాగువే ఎక్కడా నా మొహం ఎక్కడా ఇదే గోల.



నాన్నా అలాస్కా ఆ కార్నర్లో ఉంది ఈ కార్నర్లో ఉంది ఎందుకూ? ఇవయ్యా ప్రశ్నలు.

సరేగానీ
సీ ఆఫ్ ఒఖోట్స్క్ హెక్డా ఉంటాయో చెప్తా?

4 comments:

  1. :) Good job!
    ఇది చూడండి.
    http://sheppardsoftware.com/Geography.htm

    ReplyDelete
  2. ఆర్కే - హహ!! వాడి ఇంట్రెస్ట్ రోజురోజుకీ పెరుగుతున్నదే కానీ తగ్గటంలేదు
    లలిత గారూ - మంచి సైటు అందించారు. ధన్యవాదాలు

    ReplyDelete
  3. మీరు సూరి చేత మాటలు రాకముందే అక్షరాలు చదివించావా? ఈ లింక్ చూడు: http://videos.teluguwebmedia.in/84352308

    ReplyDelete