నిన్నటి బీకెండు అనగా వీకెండు -
శనివారం సాయంత్రం, సమయం ఆరు దాటి మదమూడు సెకెండ్లు.
జుట్టు బాగా పెరిగింది, క్షురకర్మ చేస్కుందామా అని చంటిదాన్ని అడిగా, కిచకిచా అని నవ్వింది. పిల్లాడు వెంటనే నే చేస్తా నే చేస్తా అన్నాడు. నువ్వు వద్దులే నాన్న అని వారించా. భా.మ పిల్లల్ని అటుకేసి రాకుండా పోలీసు పెట్రోల్ ఉద్యోగం అప్పటికప్పుడు వేయించేసి క్లిప్పర్స్ ని ఛార్జింగ్ కి పెట్టేసి కూర్చున్నా.
ఎప్పుడు మూడు నంబర్ పెట్టి కొడతా. సరే!! ముందు, సూపర్ కట్స్ కే వెళ్ళొచ్చుకదా అని ఎవ్వరికైనా ఓ పశ్న ఉదయించొచ్చు. ఏంపర్లేదు, తప్పేమీ లేదు అలా అడగటంలో. నేను అమ్రికాకి వచ్చాక వేళ్ళమీద లెక్కెట్టవచ్చు సూపర్ కట్స్ కి వెళ్ళిన సందర్భాలు. కారణం. నాకు జుట్టు ఎక్కువ పెంచుకోటం ఇష్టం ఉండదు, మొదట, రెండోది, గిట్టుబాటు కావట్ల. అనగా మనం వెళ్ళి అంటకత్తెర వేయించుకునే దానికి పదమూడు డాలర్లు బొక్క, పైన ఓ రెండు టిప్పు. ఇంతా చేసి మన రెండు సొట్టెంట్రుకలి అవసరమా అని.
సరే కధలోకొస్తే, మూడు సైజు పెట్టి కొట్టేస్తా. నిన్న, ఓ ప్రయోగం చేద్దాం అని తలపైన నాలుగు సైడుపక్కల మూడు పెట్టి కొట్టా.
ఏసిపడేసా. అయ్యింది. పైన ఉన్న నాలుగు సైడుపక్కల ఆరుతో సరిగ్గా జతపడట్ల. ఎనకమాల అక్కడక్కడా చేలో మొదళ్ళు కొట్టేసినట్టుగా కొన్ని దుప్పులు దుప్పులు మిగిలిపొయినై.
సోమవారం పొద్దున మేడం గారి చేయి పడ్డాక ఆటిని మొదలుకంటా నరికినాక, బాసూ, నాలుగు మూడు కొట్టుకుంటున్నై, మూడేసి పైన కూడా ఓ సారి లాగించేయ్ బెస్టు అని ఓ ఉచిత సలహా పడేసి వంటింట్లోకి తుర్రుమంది.
కాబట్టి బాబయా, ప్రయోగాల్చెయ్యమాక బాబయా. ఎప్పుడు సేసినట్టే సేస్కోటం బెస్టు బాబయా.
Jul 14, 2009
Subscribe to:
Post Comments (Atom)
Anna nuvvu super!
ReplyDeleteLOL
ReplyDeleteఆడబతకాలంటే అన్నిబాధలా బాబయ్యా. నాయాల్ది ఇక్కడబతుకే రాజయోగం అంటే
ReplyDeleteఈ తొక్కలో పెయోగాల్చేసేబదులు ఏకంగా జీరో ఎట్టి ఒక్క లాగులాగితే దీంతల్లి సూపర్‌గా కిట్టుబాటవుద్ది మరి సూస్కో ఈపాలి.నేనయితే గట్నే సేస్తా...
ReplyDeleteఊరుకున్నంత ఉత్తమం లేదు,బోడిగుండంత హాయి లేదు అని...
:-) :-)
ReplyDeleteకాలేజి లో ఉన్నప్పుడు బొచ్చు కట్టింగ్ కి దుడ్డు యాల దండగా అని మేమే సేస్కునేటోళ్ళం.. అట్ట నేను 18 తలకాయలదాకా నరికినా... మా తర్వత బ్యాచీ వాళ్ళకి కూడా మా విద్య నేర్పి ఫ్రీ గా ఇంకో రెండు మూడు మాట్లు కొట్టిచ్చుకున్నా. మీ స్వ-క్షవ్రం చూస్తే గప్పటి నా ప్రయోగం యాద్కొచ్చింది. అయినా అనకూడదు కాని ఆడ ఏముందని కట్టింగ్..
ReplyDelete:escape;
షాషాంక్ - నువ్వు సరిగ్గా గమనించావోలేదో (గురూగారు రావ్ గోపాల్ రావ్ గారి స్టైల్లో) నేజెప్పిందీ అదే.
ReplyDelete*ఇంతా చేసి మన రెండు సొట్టెంట్రుకలి అవసరమా అని*
భారారె, యోగయ్య :):)
సైతన్య - అదేమరి, ఇసుమంటి బాధలు కూడా పడకపోటే జీవితం ఏటుంది నాయాల్ది సెప్పు.
పప్పూ యార్ - అలాజేద్దాం అనుకున్నా, పాపం పిల్ల దడ్స్కుంటుందేమో అని ఒగ్గేసా.
శరత్ కాలం, మురళి - :):)
మీ ఫోటో చూస్తుంటె తృటిలో తప్పించుకున్నట్లు అనిపిస్తొందండీ...వెంట్రుకవాసిలో అనికూడా అనొచ్చేమో. :)
ReplyDeleteచంద్రునికో నూలుపోగులా.. నాకున్న ఆ నాల్గు పరకలూ.. అటుదిప్పి ఇటుదిప్పి.. తెగ ఇబ్బందిబడిపోతా.. ఉన్నోడికి తీయడానికి తలనొప్పైతే. లేనోడికి తిప్పుకుంటం తలనొప్పంట. ఎదవ జుట్టని ఎవద జుట్టు ఉంటే ఓబాధ లేకుంటే ఓ బాధ.. ఏటంటావు సెఖెట్రీ..
ReplyDeleteఉమాశంకర్ భాయ్ - వెంట్రుకవాసి!! హహహ..కేక
ReplyDeleteహలొ హలొ హలొ ఆత్రేయ గారు!!
సెగెట్రీ!! కొబ్బరిబోండాలట్రా ఆత్రేయగార్కి. అవును, మీరనట్టు ఎదవజుట్టు ఉంటే ఓ బాధ ఊడితే ఓ బాధ దాన్ సిగదరగా.
lol...
ReplyDeleteHaa!Haa!Haa!baagundi.
ReplyDelete