ఈ దినం పొద్దుగాల్నే పొద్దుగాల్నే ఝలక్.
లేచాం, ఆపీస్కి తయ్యారయ్యాం. బండికాడికిపొయ్యాం. తాళంచెవి పెట్టాం, స్టార్టు చేసాం. అక్కడ ఓ లైటు ఎలుగుతున్నది. ఏందిరా అని కళ్ళజోడు మిటకరించి చూస్తే రిజర్వ్ లో పడింది బండి. దీనెన్కమ్మ అనుకుని పెట్రోలు బంకు దాంకా ఐనా వచ్చుద్దా నాయనా అనుకుంటా ఎళ్ళా. బంకుకాడికిబొయ్యా. ఆపినా, టాంకీ ఓపెన్జేసినా. మరి కార్డుముక్క గీకి పెట్రోలు కొట్టుకోవాలిగా, ఆడికి ఎళ్ళ, జోబిలో సేయిపెట్టి లాగా పర్సు. రాలా. ప్యాంటు ఊడదీసి దులిపా, పర్సు లేదు. గాడీలో పెట్రోలు లేదు, ఇంటికిబొయ్యి పర్సు తెచ్చి కొట్టొద్దాం అంటే. ఏట్రా బగమంతుడా అని బంకోడికాడికి బొయ్యా. బంకోడు పాకిస్తానీ.
హాయ్ అన్నాడు
నేను ఇరోచనాలప్పుడు బాత్రూం దొరక్కపోతే ఎలా మొహం పెడతామో అలాపెట్టి,
వెల్, హమ్!! నాకు నీ సహాయం కావాలి.
ఏంటి
నేను వాలెట్ మర్సిపొయ్యా, నాకు పుల్ ట్యంక్ కావాలి. అస్సలు లేదు గ్యాస్. కనీసం ఇంటికి వెళ్ళొద్దామనా లేదు. కాబట్టి పుల్ ట్యాంక్ కొట్టు, నా ఐపోన్ ఈడబెడతా. ఎళ్ళి పర్సు తెచ్చుకుంటా. డబ్బులిచ్చి నా మొబైల్ తీస్కుంట
నువ్వు యాడుంటావ్.
దగ్గరే.
ఇంటికాడికి పొయ్యిరాటానికి ఎంతకావాలి.
ఓ గ్యాలన్ కొట్టు.
గ్యాలన్ 2.59 (క్యాష్ కి)
హం!! (ఇంతలో బుడ్డి ఎలిగింది), బాసూ ఉండు నాకాడ కొంచెం క్యాష్ ఉండాలి అనీ ఆజోబీలొంచీ ఈజోబీలొంచీ పీకా 37 వొచ్చినై బైటికి.
తస్సదియ్యా కొట్టు 37కి.
వెళ్ళి కొట్టుకో పో అన్నాడు.
అలా 13.70 గ్యాలనులు కొట్టించి, మళ్ళీ ఇంటికి తిప్పి, పర్సు తీస్కుని ఆపీస్ దార్లో పడ్డా.
ప్యాంటు వేసుకుంటిమీ పర్సు మరసితిమీ.
Subscribe to:
Post Comments (Atom)
భలే వాళ్ళే ! మొబైల్ కూడ మర్చిపోతే ఏమి చేసేవారు?
ReplyDeleteLOL
ReplyDeleteఅవును మరి మొబైల్ లేకపోతే పరిస్థితి ఏమిటో.... నేను కూడా అంతే ....చాల సార్లు..అలా జరిగింది....ఏదో హైదరాబాద్ కాబట్టి సరిపోయింది.....! హి
ReplyDeleteభలే భలే.. నా కహాని చెప్తా.. మా సెల్ కి ఇంకో లైన్ యాడ్ చేసినప్పుడు ఓ రెండు గంటలు పట్టింది. వాడికి నా లైసెన్సె ఇచ్చాను. తీస్కోవడం మరిచా. మరుసటి రోజు అబ్బో అని ఊరంతా తిరిగాము. తర్వాత రోజు ఆపీస్ కి వెళ్ళాకా ఎందుకో లైసెన్సె అవసరమైతే లేదు... వార్నీ ఇది నన్నొదిలి ఎక్కడపోయిందబ్బా అని మోకాలు గోకుంటే గుర్తొచింది. చేసిన ఘనకార్యం.. ఇంటికి వెళ్ళేప్పుడు కొట్టువాడి దగ్గరకి వెళ్ళీ మాస్టారు నా లైసెన్సె అంటే.. యా యా ఇదిగో అని ఇచ్చాడు. అప్పటి నుండి కార్ లో ఓ కాపి పెట్టా ఎందుకైన మంచింది అని.
ReplyDeleteఓతూరి నే ఐదులీటర్లు పట్టి దుడ్డు అడిగితే బ్ర్‌బ్ర్‌బ్ర్ అన్నా. మా ఊరుకాబట్టి సరిపోయింది. ఐనా దీనికంటే బండితాళ్మ్ మరిసిపోయుంటే నయం ఐదునికిషాలపని.
ReplyDeleteసైతన్య - నువ్వు సామాన్యుడివి కాదు బాసు. :):)
ReplyDeleteశశాంక్ - :):) డ్రైవర్స్ అలా మర్చిపోటం మంచిది కాదు. తెలుసా. :)
వేణు - నిజ్జమే సుమా!!
భరధ్వాజ్ - :)
శ్రావ్యా - నిజమే సుమా. ఫోను సాధారణంగా మర్చిపోము..మనదికాని రోజున అన్నీ మర్చిపోతాం.
మరి ఇలాంటి వాటినే పీత కష్టాలు అంటారు.
ReplyDeleteఎహే నీ యెంకమ్మా నీకెప్పుడూ గొళ్ళెం మర్సిపోడమేనా?తస్సదియ్యా మొన్నెప్పుడో అదేంటో ఇయ్యేల ఇదేంటో రేపింకేంటో?(హ్హహ్హహ్హహ్హ)
ReplyDelete