Jul 3, 2009

తాళము వేసితిని, గొళ్ళెము....

అపీస్లో నాకాడ ఓ కాపీ మేకర్ (కాపీ పిల్ట్రీ) ఉంది. ఒకానొక కాలంలో పొద్దున, సాయంత్రం బయటకెళ్ళి కాపీలు తాగేవాణ్ణి. ఓ సమచ్చరం కాణ్ణుండి, నా డెస్కుకాణ్ణే కాపీ సేస్కుని తాగేత్తన్నా.

ఈ పిల్ట్రీ ఓ చిన్న యంత్రం. ఓ లోటా నీళ్ళు పోసి, ఓ కాయితకం ముక్కేసి అందులో కాపీ పగొడ్రీ ఏసేసి మూతపెట్టేసి స్పిచ్చి నొక్కితే కింద గాజు లోటాలోకి కాపీ వచ్చుద్ది. ఎంత వీజీ, ఏంకనిపెట్టావరా తెల్లనాకొ** అనుకుంటా అప్పుడప్పుడు.

మూడు స్టెప్పుల్లో ఎలిపెంటు అనగా ఏనుగుని ప్రిజ్జిలో ఎలా పెడతావ్ అని సిన్నప్పటి స్నేయితుల్తో ఆట్లాడేవాళ్లం.
ప్రిజ్జి డోర్ తీ
ఏనుగుని లోనకి నెట్టు
తలుపెయ్.

ఎంతవీజీ. కాపీ కూడా అంతే!! ఓ పెద్ద సెయ్యాల్సిన పన్లేదు.

మూత తీ,
నీళ్ళు పొయ్యి,
కాయితకం ముక్క ఇంతక ముంది ఉంటే తీసేయ్,
కొత్తతి పెట్టు,
కాప్పొడి కుమ్ము,
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి.

ఇంతవీజీ ఐతే జీవితంలో ఎకసెక్కాలేడనించొత్తాయ్ సోదరా!!
మనం ఓ రోజు ఇలాసేసాం.
మూత తీ,
....
కాయితకం ఎయ్యి,
కాపీపొడి ఎయ్యి,
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి.

ఓ ఐదు నిమిషాల్తర్వాత పొ(ప)గలు మంటలు (మరీ మంటలు రావులే). ఏట్రా నాగన్నా అని సూత్తే, హా!! పిల్ట్రీలో నీళ్ళు మరచితిరి, డింగ్! డాంగ్!! అంది పిల్ట్రీ.

ఓ రోజు ఇట్టా కూడా సేసాం

మూతతీ,
నీళ్ళు పొయ్యి,
కాయితకం వెయ్యి,
.....
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి.
ఏసేసా, నొక్కేసా, ఓ ఐదునిమిషాలకి గాజు లోటా తీసి సుత్తే ఏడి నీళ్ళు ఎక్కిరించినయి.

ఇంకోరోజు -
మూతతీ,
నీళ్ళుపొయ్యి,
కాయితకం వెయ్యి,
కాపీపొడి ఎయ్యి,
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి,
కింద గాజు లోటా మర్సిపో...
ఏందిరా కిందకి రాటల్లా అని సూత్తే కయితకం మొత్తం నిండిపొయ్యి ఉంది కాపీ.

కలికాలంలో కాపీకోసం ఎన్ని తిప్పలు బగమంతుడా

21 comments:

 1. ఈ కాయితం గోలెందండి?

  కలికాలంలో కాపీ కోసం ఎన్ని తిప్పలు బగమంతుడా >>>దీని బదులు మానేస్తే పోలా పాడు కాపీ :)

  ReplyDelete
 2. kaapee kappu kaagitam mukka paala chukkaa kaadedi kavitakanrham annamaata .

  ReplyDelete
 3. చాలా రోజులైంది మీ టపాలేమీ కనపడటంలేదు జుస్ట్ వండపోయ్యేముందు గోంగూర గిల్లుకుని అదే చేత్తో కరివేపేపాకు తెచ్చి రెండడుగుల్లో దోండకాయలు కోసి, ఆపక్కనే మొవ్వోంకాయలు, అప్పటికపుడు వండుకోని (ఇవన్నీ అర్గానిక్ సుమా) నేనే ఒక టపా రాసేద్దాం, చూసైనా ఉడుక్కుని ఏదోకటి రాస్తారని అనుకున్నాను. మొత్తానికి కాపీ తో బైటకు వచ్వ్హారన్నమాట. అరండల్పేట లైబ్రరీ లో మా పిల్లలకేమీ బుక్స్ లేవండి. ఎంత పాత పుస్తకాలంటే అర్కియాలజీ వాళ్ళకివ్వొచ్చు. ఇవ్వాళే తమ్మునితో వాడికున్న చిన్న ఫార్మ్ చూడటానికి వెళ్ళి అందినత ఎత్తులో చింత చిగురు కోసుకుని వచ్చి పెసర పప్పుతో వండాను.

  ReplyDelete
 4. మరదే అనుభవమ్మీద తెలిసేదనేదిందుకే మరి...

  @సునీత గారూ...సింత సిగురు పప్పొండుకుంటే వండుకున్నారు కానీ ఇలా చెప్పి మా నోట్లో లాలాజలాం ఊరించడమేమీ బాలేదండీ...

  ReplyDelete
 5. సునీత గారూ
  ఇదేమీ బాగోలేదు. ఎంత అందినకాడికి సింతసిగురు దూస్కున్నా, నోరు ఊరించటం బాలేదు. ఖండిస్తున్నా అద్దెచ్చా!!
  ఆదివారం సాయంత్రం అరుండేల్ పేట రెండు మూడు నాలుగు లైనులు ఒకటో అడ్డరోడ్డు, పాతపుస్తకాలు రోడ్డుమీద పెట్టి అమ్ముతుంటారు. మీకో సీక్రేటు రహస్యం, ఎతుక్కునే ఓపిక ఉండాలేకాని, సింతసిగురు వంటల కాణ్ణుంచి ఇమాణ రిపేరు దాకా అన్ని బొక్కులు దొరుకుతై.
  నా సలహా - రాదుగా ప్రచురణాలయం వారి పాత రష్యా కధలు గట్టి బౌండుతో ఉండేవి దొరుకుతాయ్. పట్టుకోండి. ఆనందించండి.
  అలానే, అంబేత్కర్ బొమ్మ దగ్గర అరుండేల్ పేట్ పదోలైనో పదకొండోలైనో మొదట్లో ఎగ్ మసాలా తింటం మాత్రం మర్చిపోవద్దు.

  శ్రావ్యా - మానేయొచ్చుగా! అవున్నిజమే!! అన్నీ మానేత్తే ఎలా అద్దెచ్చా? బుఱ్ఱ గిర్రున తిరుగుతుండిద్దా, కాపీ అన్నా తాగకపోతే ఎట్టా అద్దెచ్చా?
  సుజ్జి, రమ్య - ధన్యవాదాలు.
  మాష్టరూ - కాపీ తాగటం మన జనమ హక్కు. జీవితంలో ప్రతీ అడుగులో ఏదో ఓ హాస్యం ఇలా హాయినిస్తూనే ఉంటుంది...

  ReplyDelete
 6. కాఫీ కోసం ఆమాత్రం కష్టపడొచ్చులెండీ ...

  ReplyDelete
 7. కాపీ..ఇప్పుడు వింటేనే ఏడుపు ఎగదంతా ఉందన్నా. కాపీచుక్క గొంతులోపడి నెలలలవుతావుంటే ప్రాణం విలవిల. మనకేమో అచ్చతెలుగు వారుణవాహిని అలవాటు లెదాయె. హు. కాలేజీనుంచి వస్తా వీధిగుమ్మంలో ఆరిచేటోన్ని అమ్మా కాఫీఅని.

  ReplyDelete
 8. పప్పు యార్ - :):) ఔన్నిజమే
  గడ్డిపూలు సుజాత గారు - ధన్యవాదాలు
  పరిమళం - ఈట్నే సినిమా కష్టాలంటారు కొందరు పెద్దలు :)
  భరధ్వాజ్ భాయ్ - :)
  మాలా కుమార్ గారు - సరదాగాడాట్కోడాటిన్
  సై(చై)తన్య - ఏందీ అంటా సంగతీ? నెలలు ఔతా ఉండిందా కాపీ తాగీ? అయ్యోపాపం!! ఎట్టా సిక్కిపొయినవో సూడు కాపీకూడా తాక్కుండా (:)) ఎందుకూ అంటా? ఆన్సైట్ గానీ వచ్చినవా ఏందీ?
  కాపీ సేస్కోటం సానా వీజీ సుభ్రహ్మణ్య సైతన్యా - ఈడనొక్కు. http://www.amazon.com/gp/product/images/B0002L34KK/ref=dp_image_0?ie=UTF8&n=284507&s=kitchen
  ఇట్టాంటిది కొనుక్కో, కమ్మని కాపీ నోట్టో పోస్కో,సింపులు. ఈసారి ఇది సదుకో
  http://nalabhima.blogspot.com/2008/11/blog-post.html

  ReplyDelete
 9. :lol:

  నేను అపుడపుడు తాళమేసి గొళ్ళెం మరచిపోతాను. బియ్యం, నీళ్ళు కుక్కర్లో వేసి స్విచ్ నొక్కడం మరచిపోతుంటా. అరగంట తర్వాత వచ్చి చూస్తే ఉన్న ఆకలి కూడా పోతుంది :)

  ReplyDelete
 10. భాస్కర్ గారూ, శ్రీనివాస్ గారూ,
  అలా బాధ పెట్టకూడదనే ఊరుకున్నా కూడా చింత చిగురు ఉబలాటం ఊరుకోలేదు. అందునా భాస్కర్ గారు వంటల గురుంచి ఒక బ్లాగే రాస్తారు కదా!
  మీ సూచనలనీ ఈ ఆదివారమే ట్రై చేస్తానండి.

  ReplyDelete
 11. నిజమే పాపం. ఎన్ని కష్టాలో. You seems to be Richard Feynmann. Very innovative bro. Superb post. Gr8 style. Missed in the past

  ReplyDelete
 12. ఆన్సైటుపడ్డా సమ్మగా ఉండేది మహాప్రభో. ఈడనేను ఎలగబెట్టేది సాఫ్టువేరుగాదు గదా దాని పిల్లవేరుకూడా కాదు. NTPC అని ఉండాదిలె. నన్ను వారణాసికాడ దొబ్బిన్రు. ఎక్కడనొక్కినా నాపీకనొక్కినట్టే. ఈడకి ఏ నాకో** ఎవ్వరూ డెలివరీ చెయ్యడు.

  ReplyDelete
 13. పిల్ట్రీ బొమ్మేది?

  ReplyDelete
 14. అంబేద్కర్ బొమ్మ దగ్గర ఎగ్ మసాలా ఇరగ వుంటది గుంటూర్లో. ఇప్పుడు వుందో లేదో.

  ReplyDelete
 15. మొదలులేదురా రామా అంటే తోకపెంచరా హనుమంతు అన్నాట్ట. ఇక్కడ నాకు కాఫీలేదు అన్నదానికి నాకు అంత సుత్తి అవసరమా?మహానుభావా.

  ReplyDelete
 16. జీడిపప్పు :):), నేనూ "అప్పు"డప్పుడు నీలా సేత్తానే ఉంటా.:):)
  సునీత గారూ - నేనూ రాత్తన్నా "సింతసిగురు పప్పు" పోస్టు. సిద్దంగుండండి.
  గీతాచార్య - ధన్యవాదాలు
  సైతన్య - ఊర్కనే సరదాగా బాసూ. టేక్ ఇట్ ఈజీ
  మురళి - బొమ్మ పెట్టా సూడండిప్పుడు.
  అమర్ - అవును అమర్, ఉందో లేదో. వానికాడ మసాలా కేక.

  ReplyDelete