Jul 8, 2009

పనిలో ఉన్న కళాకారుడు

గమనించండి, ఎంత తీవ్రమైన ఏకాగ్రతతో పనిచేస్తున్నాడో ఈ కళాకారుడు. ఆ కుంచె చూడండి. ఆ చేతులు చూడండి. ఎంత నేర్పరి తనం ఉందో ఆ చేతుల్లో
From కళాకారుడు

ఇలా రంగుని పళ్ళెంలో కుమ్మరిచ్చుకుని,
From కళాకారుడు

అప్పుడు రంగు పుయ్యాలి, ఇలా
From కళాకారుడు

ఏదైనా ఒక్కసారి చూపిస్తే చాలు, అల్లుకుపోతాం, మిగతా ట్యూబులన్నీ ఇలా ఓపెన్ చేసి
From కళాకారుడు

ఇలా అందినకాడికి పులిమితే
From కళాకారుడు

ఆ మజేనే వేరు
From కళాకారుడు

నన్నేం చెయ్యకు అని చివరికి మిగిలిన ఈ హెలికాప్టర్ ఎలా జాలిగా చూస్తోందో చూడాండి
From కళాకారుడు

29 comments:

 1. ఎంత చక్కటి కవరేజ్ ఇచ్చారండి. అసలు కళాకారుడు మీరే సుమీ! ;) చిన్నపుడు కుంకుడురసంలో హార్లిక్స్ కలిపి పెన్నులు నానబెట్టాము, వాటి రంగు పోయి పారాదర్శకంగా అవుతాయని ఎవరో చెప్పగా విని. అది గుర్తుకొచ్చింది. మా పిల్ల ఇలా రంగులతో ఆడి ఆడి బ్లూ పులిహోర చేస్తావా లేదా అని మారాం చేసిందోసారి. కనుక రెండు తరాల జ్ఞాపకాలని తవ్వితీసింది మీ టపా.

  ReplyDelete
 2. బాచి బాబూ,
  సూరి గాడు ఓ పెద్ద సుకాసో(సూరిగాడి పేరు అలా మార్చాలే పికాసోలా)అవుతడేమోనెహె...

  ఉష గారూ...బ్లూ పులిహోర కేక...

  ReplyDelete
 3. బ్లూ పులిహోరా? సచ్చాం, ఇదెలా చెయ్యాలబ్బా?
  భాస్కర్, మీ హార్టిస్టు పని బావుంది. అదే మా ఇంట్లోనైతే ఆ హెలికాప్టర్ రెండు రెక్కలూ ఊడి, ఉత్తి మొండెంతోనే ఉండేదీ చివర ఫోటో తీసేపాటికి. కారు చక్రాలు ఏ సోఫా కిందనో బేలగా పడుకొని ఉండేవి. ఇవాళ కదులుతున్న మబ్బుల్ని చూపిస్తే, ‘అది సిమెంటు రంగమ్మా...’ అని క్లాసు తీసుకున్నాడు మా జోతిరాదిచ్చ.

  ReplyDelete
 4. అరుణ, శ్రీనివాస్ గార్లు, "కేక" కి కారణమైన బ్లూ పులిహోర చేసానండి. ఫుడ్ కలర్ తెచ్చి పసుపుకి బదులు అది కలిపాను. ఆ పై నీలం రంగు transparent plate లో పెట్టాను extra affect కోసమని. నేను తినే ధైర్యం చేయలేదు. మా పప కూడా చూసి తృప్తి పడిపోయింది. నిజానికి చాలా విషయాల్లో తన మారాములు నేను honor చేసానా లేదా అన్నదే చూస్తుంది. అందులోను దంతసిరి తక్కువ పిల్ల!

  ReplyDelete
 5. కామెంటేసిన అందరికీ ధన్యవాదాలు;
  బ్లూ పులిహోర, కేక..:):)

  ReplyDelete
 6. భాస్కర్, రంగులేసిన ఎలికాప్టర్ ఎక్కమని పికాసో మారం చెయ్యలేదా?

  ReplyDelete
 7. మేము చిన్నప్పుడు బంకమట్టితో బొమ్మలు చేసుకుని అలా రంగులు అద్దేవాళ్ళం...

  ReplyDelete
 8. మీ సూరీడుకి మాంచి కళాపోసన వుందన్నమాట.
  నలభీమలో ఒక టపా వేయకూడదూ ఇంటి రుచులు తిని చాన్నాల్లు అయింది.

  ReplyDelete
 9. మీ కొడుకేగా మరి ! ఆమాత్రం కళాపోషణఉంటుంది .

  ReplyDelete
 10. భారారె - చాలాకాలానికి!!!
  లేదు సోదరా, ఈ మధ్య కొంచెం ట్రెండ్ మారుస్తున్నాడు..
  తొందర్లో వాడి కొత్త ట్రెండ్ పై పోస్టులు వేస్తా
  పానీపూరి - :):)
  అమర్ - మా నాన్న క్రియేటివిటి వచ్చింది వాడికి.
  సునీత గారు - :)
  పరిమళం - :):) ధన్యవాద్

  ReplyDelete
 11. mi vamsoddharakuda andi??
  chala manchi kalakarudu
  :)

  ReplyDelete
 12. లక్ష్మీ స్రవంతి గారు - అవునండీ. సుపుత్రుడే. :):)
  ధన్యవాదాలు.

  ReplyDelete
 13. లక్ష్మీ స్రవంతి గారు -
  ప్రయత్నంతో నోటితో గాని, మనసుతోగానీ మంత్రము నడుపుటను జపమంటారు. ప్రయత్నరహితంగా చేయబడునది అజపా అను జపం. ఇది సహజ ఉచ్ఛ్వాస నిశ్వాసలచే జరుపబడు 'హంసస్సోహం' అను అప్రయత్న జపం. దీనినే అజపా గాయత్రి అంటారు. దీనినే హంసగాయత్రి అని కూడా అంటారు. కులమతాల కతీతంగా ప్రతి వ్యక్తి చేసే ఉచ్ఛ్వాశ నిశ్వాసల జపమే హంస గాయత్రి. హంస అను శబ్దం ప్రాణశక్తికి సంకేతం. గాయంతం (జపం చేయువానిని) త్రాయతే (రక్షించునది). కాబట్టి మానవునిలో సహజంగా, ప్రకృతి సిద్ధంగా జరిగే ఈ ప్రక్రియను హంసగాయత్రి అంటారని చదివానండి.

  ReplyDelete
 14. aalasyam ainamduku kshaminchali.
  chala baga vivarincharu.
  thank you sir.

  ReplyDelete
 15. నో ప్రోబ్లెమో!!
  అది నా వివరణ కాదు. సాయికిరణ్ గారి వివరణ.
  ఏమైనా తెలుగులో రాయటం ఎలా అని ఇక్కడ ఓ పోస్టు పెట్టా
  http://paatapaatalu.blogspot.com/2009/03/blog-post.html
  ఓ సారి చూడండి.
  చక్కగా తెలుగులో రాయండి.

  ReplyDelete
 16. అలుపెరగని బాటసారి... ఇంకాసిని ట్యూబులు కావాల

  ReplyDelete