Jul 23, 2009

జ్ఞాపకాల దొంతర - కానా

కానా అంటే కంత, బొక్క అని.
నేను పుట్టింది దాచేపల్లిలో, మా తాతయ్యిగారి ఇంటో. దచ్చినం గదిలో దాన్నే టవర్ గది అనేవాళ్ళం, పొద్దున్నే పుట్టా కాబట్టి ఉదయ భాస్కర్ అని పేరు పెట్టారు నాకు.
ఆ ఇల్లు భలే గమ్మత్తుగా ఉండేది. ఇంత ఎత్తున పునాదులు లేపి నాపరాయితో కట్టిన ఇల్లు. రాళ్ళు పేర్చిన ప్రహరి. నే పుట్టిన టవర్ గది కిటికీ తీస్తే ఓ పెద్ద పున్నాగ పూల చెట్టు. టవర్ గదికి ఎనకమాల ఇంకోగది. తలుపు తీస్తే బైటికి. కిందకి మెట్లు. ఆడ ఓ పెద్ద తొట్టి. ఆణ్ణుంచి కొంచెం ముందున్న బావికి దారి. తొట్టి పక్కనే ఓ జామ చెట్టు. ఇంటెనకమాల వంటగది. గదిలో అటకలు.
పొగపట్టిన చూరు. పొట్టు పొయ్యిలు. రోకలిబండ డ్రమ్ములాంటి దాని మధ్యలో పెట్టి పొట్టు కూరి, రోకలి బండ తీసేసి, కింద కానాలోంచి చెయ్యి పెట్టి బొక్కపెట్టి, అప్పుడు ఎలిగిత్తారు పొయ్యిని. వరండాలో ఈ అయిపు గోడకి ఓ పెద్ద కానా.


దాచేపల్లి ఎళ్ళినప్పుడల్లా ఈ కానా లో కూర్చుని వచ్చేపొయ్యే రైళ్ళని జూస్తూ, గూడ్సు బళ్ళని జూస్తూ ఉండేవాళ్ళం. గూడ్సుబళ్ల పెట్టెల్ని లెక్కబెట్టం మహా సరదా. ఈ కానాలో ఇద్దరు పిల్లలు పక్క పక్కన పడుకునేంత స్థలం ఉండేది. అన్నయ్యా నేను, దాంట్లోకిజేరి ఆడుకునే వాళ్ళం. మా చిన్న మేనత్త దాంట్లో గిల్లాలు ఆడేది. నాకు పేయింట్ వేసేంత సీను లేదుగానీ, దాంట్లోంచి నే చూసిన ప్రపంచాన్ని వెయ్యాలి అని నా కోరిక.
రాత్రుళ్ళు అక్కడ కూచూటానికి భయం. కారణం, ఈ కానాలోంచి చూస్తే పక్కన ఉన్న ఖాళీ స్థలంతో బాటు దానిపక్కనున్న ఓ గుడిశె, దానిముందు రెండు సమాధులు కనిపిస్తాయ్. సమాధులు అంటె మరి భయం ఉండదా?

పగలు, దృష్టి సారిస్తే, ఆ గుడిశె దాటినాక కూసింత దూరంలో రైలుపట్టాలు. ఆటికటైపు ఓ షెడ్డు. అదేందంటే, సచ్చిపోయిన ఎద్దులు అట్టాంటివి ఆడికిదెచ్చి, తోలుతీసి దట్టాలు పడేసే షెడ్దు. ఆటిల్లోని కొన్ని ఎముకల్ని పందార ఫ్యాక్టరీకి పంపిత్తారు, పందారలో ఎముకల పొడికలుపుతారు అని చెప్పుకునేవాళ్ళు. ఇక ఆ షేడ్దు దాటితే దూరాన సిమెంటు క్వారి. ఎ.సి.సి వాళ్ళు ముందు దాచేపల్లిలో సిమెంటు ఫ్యాక్టరీ బెట్టారు. ఆ తర్వాత పిడుగురాళ్ళకి దగ్గర్లో బెట్టారు. దానిపేరు సీతారాంపురం క్వారి అనేవాళ్ళు. సరే ఇక, తలకాయ ఇటు తిప్పితే దూరంగా "నడికుడి" అనే పచ్చ బోర్డు కనిపించేది. అదే నడికుడి రైల్వే స్టేషన్. తల తొంభైడిగ్రీలు ఇటు తిప్పితే నాగులేరుపైన కట్టిన రైల్వే బ్రిడ్జి కనిపించేది.
మా ఇల్లు దాదాపు చివర, మా ఇల్లు దాటినాక రెండు ఇళ్ళే. అవి దాటితే కొంత ఖాళీ దాటితే రైలుపట్టాలు. మరి మా వైపు అన్నీ రాళ్ళేగా. ఎక్కడ చూసినా, రాళ్ళు బయటికి పొడుచుకుని కనపడేవి. వానపడితే ఆ రాళ్ళెంబట నీళ్ళూజేరేవి. ఆటిల్లోకి కప్పలు. కప్పల్ని పట్టుకోడం, రాళ్ళుపెట్టికొట్టటం ఇలాంటివిజేసేవాళ్ళం.
అప్పుడప్పుడు నడికుడి స్టేషన్ కి వెళ్ళేవాళ్ళం. స్టేషన్ కి రెండోవైపున ఓ పెద్ద పార్కు ఉండేది. అక్కడ జారుడుబండ, అవి ఇవి ఉండేవి. ఇక పున్నాగ పూలు రాలి కిందపడినవి తెచ్చి ఒకదాంట్లో ఇంకోటి గుచ్చి మలలు చేసేవాళ్ళం. పున్నాగ పూల వాసన భలే ఉండేది.

ఇప్పుడు ఆ తాతా బొయ్యాడు, ఇల్లూ బోయింది, జ్ఞాపకాలు మాత్రం మిగిల్నై.

22 comments:

  1. మనకయినా ఆ జ్ఞాపకాలు వున్నయ్. ఈ తరం పిల్లలకి అలాంటి చక్కటి అనుభూతులు వుంటాయంటారా? వాళ్ళు గుర్తుకుతెచ్చుకునేది వీడియో టైటిల్సూ, ఇంటర్నెట్ సైట్స్ అవుతాయేమో.

    ReplyDelete
  2. kaalam jarigipoetoonae undi, manalni praekshakulni chaesi.

    ReplyDelete
  3. "ఇప్పుడు ఆ తాతా బొయ్యాడు, ఇల్లూ బోయింది, జ్ఞాపకాలు మాత్రం మిగిల్నై." మనం భద్రంగా దాచుకోగలిగే ఆస్తులు ఈ జ్ఞాపకాలే..

    ReplyDelete
  4. "చిన్ననాటి జ్ఞాపకాలు..చిగురించిన మందారాలు"
    ఎప్పటికీ వాడిపొనివీ వీడిపోనివీ ఈ జ్ఞాపకాలే నండి..

    ReplyDelete
  5. సునీతగారు - మీరు తీయబోయే సీరియల్ ఎంతవరకూ వచ్చిందోగానీ, మంచి మంచి వాక్యాలు రాస్తున్నారు, పొయెటిగ్గా, ఓ మాటల రచయితలా
    "కాలం జరిగిపోతూనే ఉంది, మనల్ని ప్రేక్షకుల్ని చేసి". వాహ్!! కేక
    శరత్ భాయ్ - ఔను..నిజమే. కోతికొమ్మచ్చి అంటే ఇప్పటిపిల్లలు, ఆ వీడియో గేం ఏ షాప్లో దొరుకుతుందీ అని అడుగుతారేమో!!
    మురళి భాయ్ - అవును...
    తృష్ణ - మరే!! మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఎక్కాల్లాగా, అలా మనసులో ముద్రలా పడిపోతాయ్ "ఎప్పటికీ వాడిపొనివీ వీడిపోనివీ ఈ జ్ఞాపకాలు..".

    ReplyDelete
  6. అవును..గుర్తుకొస్తున్నాయి...ఆ రోజులు ...ఇవన్ని నాకు కూడా తెలుసు ..ఎందుకంటే...నేను చదువుకున్నది...పక్కనే దుర్గ పబ్లిక్ స్కూల్ లో....ఎండాకాలం ఈత కి వెల్లడి....రైల్వే బ్రిడ్జి దగ్గరకి....శలవల్లో ...రేగ్గయలకి...క్వారీ ...పక్కకి.....

    ReplyDelete
  7. నాకు మామందిరం ఇల్లు గుర్తొచ్చింది. మా అమ్మవాళ్ల తాతకి మందిరంలో పౌరిహిత్యంతోపాటు ఇచ్చారు దాన్ని. అందులోనే మా అమ్మమ్మకి నలుగురు, తరువాత మేము నలుగురం పుట్టాం. ఇల్లు పెద్దదికాదుగానీ ఇరుకనిపంచేదికాదు. మాకు కొన్ని ఇబ్బందులు తలెత్తినపుడు అదేమాకు గొడుగైంది.

    ReplyDelete
  8. సైతన్య బాబయ్యా!! ఓ పాలి నీ బ్లాగులో సెయ్యెట్టా సూస్కో బాబయ్యా

    ReplyDelete
  9. ఇప్పుడే సూశా. ఎవరైనా సెయ్యెట్టితే నాకు అలారంగంట కొట్టుద్ది.నేను ఇక్కడ తడిమితే నువ్వు అక్కడ రక్కావన్నాయ్

    ReplyDelete
  10. రక్కువారు ఎవరూ రక్కించుకొనబడువారు ఎవరూ!! అంతా ఇష్ణుమాయ!!

    ReplyDelete
  11. ఇష్ణుమూర్తి తలకే తప్పలేదు ఈకలికాలంలో.

    ReplyDelete
  12. రక్కువారు ప్ర.శర్మ గారు రక్కించుకొను వారు ప్ర.శర్మ కు సమాధానాలిచ్చువారు :)

    ReplyDelete
  13. భా.రా.రె - కేక, కెవ్వు!!
    సైతన్య - ఇదేం బాలేదోయ్. నీకు అసలు బొత్తిగా లోకగ్యానం లేదోయ్. ఇలా ఐతే ఎలా?
    ప్ర.శర్మ = ప్రగ్యాన శర్మ. అంటే మహా తెలివితేటలు గల్గిన సెరమ అని. అలాంటోళ్ళుని బూంపైన ఏళ్ళతోలెక్కెట్టొచ్చు. ఒక్కళ్ళ పేరుజెప్పు చూద్దాం. ఓర్నీఇంటవాన కురవ, ఒక్కళ్ళూ తెలియదా! సరే నేనేజెప్తా, కాస్కో, సెప్పేత్తన్నా, సెప్పేత్తన్నా, ప్రవీణ్ శర్మ, సెప్పేసా.
    ప్ర.శర్మ = ప్రవీణ్ శర్మ

    ReplyDelete
  14. రామరాజు గారు,
    not a right place yet, in response to your comment I responded at maruvam and adding here too....

    మాస్టారి 83 వ పుట్టిన రోజని తెలుసండి. మా వూర్లో 6 గురు మున్నాము. ప్రతి బుధవారం గ్రూప్ మెడిటేషన్ చేసుకుంటాము. నెలకొకసారి సత్సంగ్ జరుతుంది అపుడు ప్రక్కవూర్ల వారు కలిసి ఎక్కువ మందిమి అవుతాము. మీకు తెలిసేవుంటుంది http://www.sahajmarg.org/live-from-tiruppur మా అత్తయ్య వాళ్ళు వెళ్ళారక్కడికి. మిమ్మల్ని అపుడపు తలుచుకుంటూనేవున్నాను. బహుశా నాలో ఆ కవితలోని వేదన, శోధన మాస్టారు కలిగించిందేకావచ్చును.

    ReplyDelete
  15. @ ఉష
    మీది సహజమార్గమా! మా అమ్మగారు కూడా ఈ మార్గమే పాటిస్తుంది.
    @ రామరాజు
    మీదీ సహజమార్గమా?

    ReplyDelete
  16. ఉష గారు - ధన్యవాదాలు.
    శరత్ భాయ్ - మనది మధ్యే మార్గం :):)

    ReplyDelete
  17. "ఇప్పుడు ఆ తాతా బొయ్యాడు, ఇల్లూ బోయింది, జ్ఞాపకాలు మాత్రం మిగిల్నై. " ఎంత విషాదం .. ఎంత విషాదం.. భారారా గారు ఓ సిట్టింగు వేద్దాంరండి.. ఓ రెండు కోటర్లు దిగాక.. ఆ మిగిలినవీ బోతై .. :-).. అనుభవంతో చెబుతున్నా..

    బాగుందండీ మీ పోష్టు. మాఊరూ పాత పాకా ఇల్లు గుర్తుచేశారు. ధన్యవాదాలు .

    ReplyDelete
  18. నాదీ మీదీ ఒకటే వ్యధ - మీది వచనం నాది కవిత. మీరు మునుపు చదివి వ్యాఖానించినదేలేండి. "ఈ జాడలు, నా గుండె వేసిన వూడలు! " http://maruvam.blogspot.com/2009/05/blog-post_26.html

    ReplyDelete
  19. చాల బాగున్నాయండి మీ జ్ఞాపకాలు ..ముఖ్యంగా
    'రాత్రుళ్ళు అక్కడ కూచూటానికి భయం. కారణం, ఈ కానాలోంచి చూస్తే పక్కన ఉన్న ఖాళీ స్థలంతో బాటు దానిపక్కనున్న ఓ గుడిశె, దానిముందు రెండు సమాధులు కనిపిస్తాయ్. సమాధులు అంటె మరి భయం ఉండదా?'
    చెప్పడం భలే వుంది . రైల్లో వెళ్ళేప్పుడు ఎప్పుడైనా మా పాప అలాటి సమాధులు చూసి చిన్న చిన్న చర్చి లు అని అందరికి చూపించేది ,నాకిప్పుడు చూడడం భయమే .

    ReplyDelete
  20. వేణు గోపాల్ రెడ్డి - ధన్యవాదాలు. మన ఊళ్ళు, ఆ జ్ఞాపకాలు, రేగిపళ్ళు!! ఉఫ్, తల్చుకుంటే మనసు ఊగిపోతుంటుంది.
    అందుకే ఈ పాట భలే తిరుగుతుంటుంది మనసులో.
    "ఆనాటి ఆ స్నేహమానందగీతం
    ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
    ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
    ఆ రోజులు మునుముందిక రావేమిరా"
    ఆత్రేయ కొండూరు - రెండు కోర్టర్లు దిగితే ఇంకేం గుర్తుంటాయ్ సోదరా, ఇక అంతా, జ్యాపకాలు ఏట్ర..నయ్యాల్ది, బాసు స్టడీ స్టడీ, అరే..ఇలా పొతుంటుంది బండి ఇక.
    ఉష గారు - సమఝ్గాలే.
    చిన్ని - రైల్లో వెళ్ళేప్పుడు ఎప్పుడైనా మా పాప అలాటి సమాధులు చూసి చిన్న చిన్న చర్చి లు అని అందరికి చూపించేది ,నాకిప్పుడు చూడడం భయమే.
    క్రిస్టీన్ వారివైతే అలా, హిందువులవి ఐతే కోటలా - నిజమే..

    ReplyDelete