Aug 31, 2020

*కుడి-యెడమల ఏకపద సంగమం*

నేను సామాజిక మాధ్యమాల నుంచి నెమ్మదిగా వైతొలుగుతున్నాను. ఫేసుబుక్కు క్లోజు అయ్యింది. ట్విటర్ క్లోజ్ అయ్యింది. వాట్స్‌యాప్ కేవలం మా అమ్మకి కాల్ చేయటం కోసమే ఉంచుకున్నా.


ఇలా సామాజిక మాధ్యమాలను వదలటానికి ఒక ముఖ్యకారణం విరక్తి కలిగింది. చిరాకేసింది.


ఈ చిరాకులో అప్పుడప్పుడు కొన్ని మంచి విస్ధయాలు కొన్ని *పంచుకోబడుతున్నాయి* (forward)

అలాంటి కోవకు చెందింది ఈ #పంచబడ్డటపా

 

*కుడి-యెడమల ఏకపద సంగమం*


క్రింద ఇచ్చిన ప్రతి కుడియెడమ పదాలకు తగినైన రెండక్షరాల పదాన్ని, మొదటి పదానికి చివర, దాన్నే రెండవ పదానికి మొదట జోడించి రెండు క్రొత్త పదాలు పొందగలరు.
*ఉదాహరణ: కంద......పార* 
*జవాబు: కందగడ్డ, గడ్డపార* 

01. వెండి......చాప
02. చేతి........సాము
03. మందు....మల్లె
04. ఉక్క.......పాలు
05. మణి.......కథ
06. పూల......యాత్ర
07. ఇంటి.......గడ
08. బొట్టు.......గోచి
09. సిగ..........చీర
10. అల.........వాన
11. మేక.........రాజు
12. మట్టి........ధారి
13. పాల........గోడ
14. సుడి........పటం
15. పులి........వంక
16. చుర.........పీట
17. చెవి..........గాడు
18. నిండు.......పోత
19. కను..........జాజి
20. నర...........పీఠం
21. ఎగ...........బొట్టు
22. బోడి..........సూది
23. పాము.......వాడు
24. చింత.........బలం
25. నిప్పు.........నిద్ర
26. కుక్క..........చుక్క
27. లెక్క...........బడి
28. గద్ద............చెంబు
29. జన్మ...........దారు
30. నిద్ర............మందు
31. అర............మీను
32. వెన్న...........బంతి

27 comments:

  1. " క్రింద ఇచ్చిన ప్రతి కుడియెడమ పదాలకు తగినైన రెండక్షరాల పదాన్ని, మొదటి పదానికి చివర, దాన్నే రెండవ పదానికి మొదట జోడించి రెండు క్రొత్త పదాలు పొందగలరు.
    *ఉదాహరణ: కంద......పార*
    *జవాబు: కందగడ్డ, గడ్డపార* "
    ---------------------------------
    (solve చేసినది ఇక్కడ మీ బ్లాగులో కామెంట్ గా పెట్టమన్నారో లేదో తెలియదు. అయినా ... నేను solve చేశాను అని చెప్పుకోవడానికి ఇక్కడ నా కామెంట్ పెడుతున్నానన్నమాట 😎.

    ఇవన్నీ కరక్టో కాదో చెప్పగలరు. ఇటువంటి పజిల్స్ ఇంకా ఉంటే పోస్ట్ చెయ్యండి, ఓ పట్టు పడదాం, కరోనా టైం లో కాలక్షేపం 🙂.)
    ---------------------
    As solved by me ⬇⬇
    ---------------------
    01. వెండి..తెర / తెర..చాప
    02. చేతి..కర్ర / కర్ర..సాము
    03. మందు..గుండు / గుండు..మల్లె
    04. ఉక్క..పోత / పోత..పాలు
    05. మణి..కట్టు / కట్టు..కథ
    06. పూల..దండ / దండ..యాత్ర
    07. ఇంటి..ముందు / ముందు..గడ
    08. బొట్టు..బిళ్ళ / బిళ్ళ..గోచి
    09. సిగ..పట్టు / పట్టు..చీర
    10. అల..జడి / జడి..వాన
    11. మేక..పోతు / పోతు..రాజు
    12. మట్టి..పాత్ర / పాత్ర..ధారి
    13. పాల..పిట్ట / పిట్ట..గోడ
    14. సుడి..గాలి / గాలి..పటం
    15. పులి..గోరు / గోరు..వంక
    16. చుర..కత్తి / కత్తి..పీట
    17. చెవి..పోటు / పోటు..గాడు
    18. నిండు..కుండ / కుండ..పోత
    19. కను..సన్న / సన్న..జాజి
    20. నర..బలి / బలి..పీఠం
    21. ఎగ..నామం / నామం..బొట్టు
    22. బోడి..గుండు / గుండు..సూది
    23. పాము..పగ / పగ..వాడు
    24. చింత..పిక్క / పిక్క..బలం
    25. నిప్పు..కోడి / కోడి..నిద్ర
    26. కుక్క..తోక / తోక..చుక్క
    27. లెక్క..పెట్టు / పెట్టు..బడి
    28. గద్ద..ముక్కు / ముక్కు..చెంబు
    29. జన్మ..హక్కు / హక్కు..దారు
    30. నిద్ర..మత్తు / మత్తు..మందు
    31. అర..కొర / కొర..మీను
    32. వెన్న..ముద్ద / ముద్ద..బంతి
    ------------------------------------

    ReplyDelete
    Replies
    1. 07. ఇంటి..ముందు / ముందు..గడ
      ఇదొక్కటి తప్ప నాకూ అన్నీ వచ్చాయండి.
      నేను ఇంటుఎత్తు ఎత్తుగడ అనుకున్నా
      Good try. I really liked this challenge. Thought of sharing.
      -Bhaskar

      Delete
    2. “ఇంటి ఎత్తు .... ఎత్తుగడ”
      ఇదీ బాగానే ఉన్నట్లుందే?

      Delete
    3. అయ్యా.. నా సందేహం ఈ ప్రశ్నది కాదు, మునుపు మీరొకసారి పంచిన ప్రశ్నది, దాని కి సమాధానం కావాలి.
      _ _ యి అని ఉంటే పాపాయి అని వ్రాయాలి, ఆ వరుసలో _ _ గం అన్నదానిని పూరించలేకపోయాను. దయతో సమాధానం చెప్పగలరు

      Delete
  2. This is was very good and interesting. I too was able to solve all except for 7 and 28

    ReplyDelete
  3. ఇంటి తలుపు....తలుపు గడి అని అనుకున్నాను

    ReplyDelete
    Replies
    1. అవదండి.
      ఎందుకంటే మనం అక్కడ జత చెయ్యవలసిన పదం రెండక్షరాలే ఉండాలని పైన చెప్పిన నియమం. “తలుపు” మూడక్షరాలు కదా.

      Delete
  4. ఆ 7వ ప్రశ్నకు ఇందాకనే మా స్నేహితుడొతను చక్కటి సమాధానం ఇచ్చాడు. అతను చెప్పింది ... ఇంటిపన్ను / పన్నుగడ.
    ఇది బాగా కుదురుతుందని నా అభిప్రాయం.

    ReplyDelete
  5. బాగుందండి మెదడుకు మేత. అదేమిటో ఎంత మేత వేసినా మెదడు పని చేయటం తగ్గించేసింది భాస్కర్ గారూ. .......... మహా

    విన్నకోట గారూ....... మీ మెదడు ఇంకా షార్ప్ గానే ఉంది. అభినందనలు. .......మహా

    ReplyDelete
    Replies
    1. ఏదో, మీ వంటి వారి ఆశీస్సులు, సుబ్రహ్మణ్యం గారు 🙏.
      మీ బోటి పెద్దల సాంగత్యం వలన పదును ఇంకా కాస్త మిగిలుంది. .

      Delete
  6. Replies
    1. ప్రవర్గ్య అంటే ఏమిటి సార్?

      Delete
    2. It is a part of some yajnas which creates a beautiful scene. Every thing of it including the pot will be prepared freshly.goat milk will be used in the place of cow derivatives.

      It creates a mushroom cloud like fumes. Normally when something is burnt the fumes will be black in colour. But here, they will be like a rain bow.And red colour dominates giving it's camouflage of fire.

      The sudden outburst of such mushroom cloud like fumes will stun you. You can see Irvin the video.

      Delete
    3. I know what it is. Wanted to see what you know more

      Delete
  7. వాట్సప్ లో వచ్చిన ఈ పజిల్ కూడా ఆసక్తికరంగా ఉంది 👇.
    ————————————-
    WhatsApp msg :-👇
    ————————————-
    Forwarded
    “మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి
    > ఉదాహరణకు: - - లీ, సిసిలీ

    > 1. ➖➖యి
    > 2. ➖➖లు
    > 3. ➖➖న
    > 4. ➖➖త
    > 5. ➖➖జు
    > 6.➖➖ రం
    > 7. ➖➖న
    > 8. ➖➖ధ
    > 9. ➖➖గం
    > 10. ➖➖యి
    > 11. ➖➖లు
    > 12.➖➖ కారం
    > 13. ➖➖త్సుడు
    > 14. ➖➖ఆట
    > 15. ➖➖ని
    > 16. ➖➖ద్రి
    > 17. ➖➖ట
    > 18.➖➖పు
    > 19. ➖➖లు
    > 20. ➖➖మంత్రం
    > 21. ➖➖బసవన్న
    > 22. ➖➖పట్టు
    > 23.➖➖త
    > 24.➖➖నం
    > 25. ➖➖లు. “
    ————————————

    ReplyDelete
  8. 1. పాపాయి
    2. మోమోలు
    4. మమత
    5. రారాజు
    8. వివిధ
    12. మమకారం
    13. యుయుత్సుడు
    14. ఖోఖో ఆట
    15. కాకాని
    18. దాదాపు
    20. తూతూమంత్రం
    21. డూడూబసవన్న
    22. కాకాపట్టు
    24. గగనం
    25. జేజేలు

    ఒక పది రాలేదు ఆచార్య వీయన్నార్ గారు..
    సేమ్ లెటర్ కాకుండా కూడా ట్రై పన్నా.. ఇదు దాన్:
    1. సిపాయి
    2. తాబేలు
    3. యాతన
    4. ఘనత
    5. తరాజు
    6. మందారం
    7. చేతన
    8. మగధ
    9. సోయగం
    10. కుళాయి
    11. నాడులు
    12. వెటకారం
    13. భీభత్సుడు
    14. బంతి ఆట
    15. దుర్బిని
    16. యాదాద్రి
    17. బావుట
    18. వలపు
    19. పెదాలు
    20. నడిమంత్రం
    21. గోవు బసవన్న
    22. కంచిపట్టు
    23. కలత
    24. పయనం
    25. గాజులు

    ఒకే పదం లో నాకు రాని ఆ పది వాక్యాలేవో చెప్పగలరు.

    ReplyDelete
  9. భాస్కర్ రామ రాజు గారు (అనఘా).. యూయస్, రణిత అల గారు (అక్షిత్, వర్ష).. హైదరాదాబ్, నాగరాజూ గారు (రాతిరి మిగిలిన అన్నం తో ప్రయోగం చేసి ఈనాడు సుఖిభవ లో రిపోర్టర్) ..రిగినభువ, జాని పాష గారు మాంచి పెన్సిల్ ఆర్ట్ లో ఘనాపాటి పాతబస్తి, మేరాజ్ ఫాతిమ గారు కోమ్ పల్లి కదిలించే భావాల అక్షరాలు అపుడపుడు సాహిల్ మాటలు, గూగూల్ ప్లస్ లో వీరంతా ఒక పార్టిగా ఉండేవారని ప్రతీతీ.. (2012-16)

    ReplyDelete
    Replies
    1. మీ దగ్గర చాలా సమాచారం ఉందండోయ్.
      ఆరోజుల్లో గూగుల్ ప్లస్ ఒక మంచి వేదికగా ఉపయోగపడింది. నేను + లో యాక్టివ్గా ఉండేవాణ్ణి. కొంతకాలం ప్రైవేట్ మెసేజెస్ పోస్ట్ చేసినా తర్వాత పబ్లిక్ కి వచ్చాను.
      ఆరోజుల్లో + లో అనేక పోస్టులతో పాటు వాక్ ఫోటోగ్రఫీ అంటూ నడవటనికి వెళ్ళినప్పుడు నాకు నచ్చిన సీనరీని క్లిక్ చేసి పంచేవాడిని.
      ఆరోజులు మాయం.
      ఇప్పుడు అనేక సామాజిక మాధ్యమాలల్లోనుంచి నన్ను నేను తప్పించేస్కుంటు వస్తున్నా. జస్ట్ బ్లాగ్ మాత్రమే మిగిలింది.

      Delete
  10. ఈ దరిద్రం మాత్రం ఎందుకు, దీన్నీ మూసి పారెయ్, నీ జగనాల గోల వినలేక పోతున్నాం

    ReplyDelete
    Replies
    1. F*** off man. Did I ask you? Stop the f****** reading my blog. Idiot. Your comments will be f****** blocked from now! Chicken head! F**** off

      Delete
    2. బ్లాగ్స్పాట్ లో బ్లాగ్ రాసుకోవటం గూగుల్ వాడు నాకిచ్చిన అవకాశం. ఇందులో నా అభిప్రాయాలను నేను రాసుకుంటాను. మూసేయమంటానికి నీకు ఎటువంటి హక్కు లెదు.
      చంద్రబాబు మీద నాకున్న అభిప్రాయాలు నావి. నా అభిప్రాయాలు తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు. నా తప్పు అభిప్రాయలు ఒప్పుగా మార్చుకోటానికి నేనెప్పుడు సిద్ధం. నా ఒప్పు అభిప్రాయాలని మార్చుకోవల్సిన పని నాకు ఎలాగూ లేదు.
      నా బ్లాగుని జగన్ భజన బ్లాగుగా నేను ఏనాడూ అనుకోలేదు. నేను జగన్ కి ఓటూ వేయలేదు. జగన్ నాకు బంధువూ కాదు.

      నా బ్లాగ్ చదివేవాళ్ళు కేవలం నా అభిప్రాయాలు చూట్టానికి వెచ్చినవాళ్ళే కానీ నేనెదో ఇరగ కుమ్ముతున్నాని వచ్చినవాళ్ళు కాదు.

      కామెంట్ పెట్టేప్పుడు కాస్త ఇంగితంతో పైవన్ని గుర్తుంచుకుని కామెటితే పెట్టినవాడికీ మర్యాద, పబ్లిష్ చేసేవాడికీ మర్యాద.

      Delete
    3. పైన కామెంట్ వేసినతను సుధీర్ పేరుతొ, ప్రస్తుత బ్లాగులలో ఉన్న నారదుడు అని నా నమ్మకం. "జగనాలు" అన్నది క్లూ 😉

      Delete
    4. ఎవరుటండీ సదరు నారదడు?
      ఏవైనా నా అభిప్రాయాలు నచ్చకపోతే నాతో నడవాల్సిన అవసరం ఏవిటీ?
      చంద్రబాబుని విమర్శించాలంటే క్వాలిఫికేషన్ కావాలా లేక వీళ్ళ పర్మిషన్ కావాలా?

      Delete
    5. ఒడ్డున కూర్చొని, ఆటో పుల్ల, ఇటో పుల్ల వేసి ఆనందించే నారదులకు మీ అభిప్రాయాలతో పని ఏమిటి? మీరు చంద్రబాబు ను విమర్శిస్తే ఏమిటి, పొగిడితే ఏమిటి? ఆ సదరు మనిషే సాక్షి ని కుక్షి అంటూ, ఆంధ్రజ్యోతి ని బోకుజ్యోతి అంటూ, అటూ ఇటూ రెచ్చగొడుతూ శునకానందం పడుతూ, వీలయినప్పుడల్లా హిందూ గురువులను, హిందూ మతాన్ని బూతులు తిడుతూ ఉంటాడు. అతనికి కావలసింది జనాలను రెచ్చగొట్టి చలికాచుకోవటం. Hopefully you got it now.

      Delete
    6. తనివి తీరా సీ బీ ఎన్ చంద్ర జ్యోతి చూసుకో వచ్చు కదా ఈ నాయుడు జూమ్ వీడియోలు.

      ఈ బ్లాగు రచయిత తనకు నచ్చిన విషయాలు రాసుకుంటారు.

      Delete
  11. బహు బాగుంది

    ReplyDelete