Aug 5, 2020

ప్రతిపక్ష రావణాసురుడు

ప్రతిపక్ష రావణాసురుడు

ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి అనేది ఎక్స్పెక్టేషన్. ఎవరి ఎక్స్పెక్టేషన్ అంటే - సాధారణ పౌరుడి ఎక్స్పెక్టేషన్ అనుకుందాం. నెలబారు మనిషికి ఆమాత్రం కోరికలు ఆమాటకొస్తే హక్కులు ఉండకూడదా?

కానీ 21 శతాబ్దిలో ఏదేశంలో చూసినా ఏప్రాంతంలో చూసినా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుందాం అనే రంధిలో ఉన్న మనిషి/అతను నిర్మించిన రాజకీయ వ్యవస్థ ఎన్ని అక్రుత్యాలకు పాలుపడుతున్నాయో చూస్తే జుగుప్స కలుగుతుంది.

ప్రతిపక్షం పాలకవర్గాన్ని దించటానికి హత్యలు చేయటానికి మారణకాండ చేయటానికి నలుగుదిక్కులా ప్రజల మనోభవాల్ని రెచ్చగొట్టి ఎగదోస్తున్నాయి.

అటుజెసి ఇటుజెసి మధ్యలో జనాల ప్రాణాలే రాలిపోతున్నాయి. ప్రజలు మళ్ళీ మళ్ళీ గొర్ఱెలు కాబడుతున్నారు. రాజకీయ క్రీడలో పావులు కాబడుతున్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం కోవిడ్ సమయంలో ఎలా ప్రజల ప్రాణాలతో ఆటాడుతున్నదో ఓసారి చూద్దాం.

ఓ పెద్దాయన
67 ఏళ్ళు
పాపం ఏవో కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్
బిపీ సుగర్ లాంటివి వెంటాడాయి నేలబారు మనిషికి నేలబారు రోగాలు
ఇంతలో ఆయన భార్య గారికి కోవిడ్ వ్యాధి లక్షణాలు
ఆయన అల్లుడు ముప్పతిప్పలుపడి ఆశుపత్రిలో ఒక బెడ్ సంపాదించాడు
ఆమెకి ట్రీట్మెంట్ దొరికింది. తగ్గి ఇంటికి వచ్చింది. ఇంతలో ఆయనకి కరోనా లక్షణాలు.
మళ్ళీ అల్లుడు తీవ్రంగా శ్రమించి ఆశుపత్రిలో ఒక మంచాన్ని సాధించాడు.
మామగారు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా?
నేను వెళ్ళను అంటాడు.
ఎందుకయ్యా అంటే - ఆశుపత్రిలో భోజనం సరిగ్గా పెట్టటంలేదని పలానా ఛానల్లో చెప్పారు, పలానా పార్టీవాళ్ళు చెబుతున్నారు అంటాడు.
ఆశుపత్రికి వెళితే అటునుంచి అటే అట అంటాడు. ఎవరన్నారయ్యా అంటే ప్రతిపక్షం కోడైకూస్తున్నదిగా అంటాడు. పలానీ ఛానల్లో దీనిమీదే నిన్న చర్చ జరిగింది అంటాడు.
ఆశుపత్రిలో చికిస్త అసలు జరగంటంలేదుట అంటాడు.
తగినంత మంది డాక్టర్లు లేరు అంటాడు. వాదన.

ఈ తర్జన భర్జనలో ఆయన పోనేపోయాడు.

ప్రతిపక్షం ఆయన్ని తిరిగితేగలదా?

జనాల్లో అపోహలను నరనరాల్లోకి ఎక్కిస్తున్న ప్రతిపక్షం పోయిన ప్రాణాలను తేగలదా?

జనాలలో బతికే సైకలాజికల్ స్ట్రెంత్ ని ఇవ్వాలన్న కనీస ధర్మాన్ని పాటించని ప్రతిపక్షం ఉండి దేనికి?

ప్రభుత్వం తప్పు చేయచ్చు. దాన్ని కరెక్త్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. ఆ పాత్రని ప్రతిపక్షం పోషిస్తున్నదా?

30 comments:

  1. వచ్చాడు పెద్ద పుడుంగి అని అనుకోవచ్చు నన్ను ,
    కానీ , నేను ఊరు దాటి , సిటీ దాటి , దేశం దాటి వచ్చిన తరువాత చాలా బాగా అర్ధం అయింది . మన చర్చలు ఎంత అధమ స్థాయి లో ఉన్నాయో , మన నాయకులూ జనాలని ఎంత నిర్లజ్జగా వాడుకుంటారో , పార్టీ కి ఊడిగం చేసి , నాయకులూ పాదాల దగ్గర చిన్న చోటు దొరికితే చాలు అని కష్టపడే సిగ్గు , ఆత్మాభిమానం లేని , వ్యక్తులు మధ్యే నేను బ్రతికాను అని , అందులో కొంతమంది నా స్నేహితులు అని . నా ఆలోచనలు కూడా ఒకప్పుడు ఇంచు మించు ఇవే . మన ఆలోచన స్థాయి ఇంత అధమమా ?

    ఏది అయినా విమర్శించాలి అంతే , ఓట్లు ఓట్లు , మతం , కులం , భాష , ప్రాంతం అన్ని ఓట్లు కురిపించే పనిముట్లు . నా బాధ ఏంటంటే , ఈ మాత్రం తెలియాలంటే నాలాంటి సామాన్యుడు దేశం దాటి రావాల్సి వచ్చింది , నేను ఊళ్ళో ఉన్నపుడే తెలియకపోవడం .

    ReplyDelete
  2. ఆంధ్ర లో ఉన్న ప్రతిపక్షం నాయకుడు, వారి అనుకుల మీడియా తీరు అసహ్య కరం. ప్రజాస్వామ్యానికే అవమానకరం. మంచి లేదు చెడు లేదు దేన్నైనా గుడ్డిగా వ్యతిరేకించడమే. గోల చేసి అరాచకం చేయడం. వ్యవస్థలను దురుపయోగం చేసి అడుగడుగునా అడ్డు పడడం. దానికి కుల ప్రాతపదికగా వంత పాడటం. Very bad situation.

    ReplyDelete
  3. ఒక్కోసారి రగిలిపోతుంటుంది అజ్ఞాత గారూ. జనంకూడా అదే మూసలో పడిపోతున్నారు. ఒక రకంగా రాజకీయ రాక్షసులకు ఇది విజయం. వాళ్ళనుకున్నది సాధిస్తున్నారు.
    గొఱ్ఱె మాత్రం తన విధిగా కసాయివాడినే నమ్ముతున్నది.


    ప్రజలలో చైతన్యం రానంతవరకూ
    వ్యవస్థలో చైతన్యం రానంతవరకూ
    ఈ రాక్షస రాజకీయ క్రీడ నడుస్తూనె ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. దారుణం ఏంటంటే ఇదే జీవితం , ఇలానే బ్రతకాలి అనుకోవడం . ఇది తప్పు అని చెప్పలేని పరిస్థితి ఊళ్ళల్లో . అసలు ఈ స్థితి దాటి ఆలోచించండి అని కూడా చెప్పలేకోపోతున్నాం .

      మూడు పోస్ట్ గ్రాడ్యుయేట్ లు చేసిన ఒక వ్యక్తి , ట్విట్టర్ లో , పెట్టిన ట్వీట్ ఏంటంటే , వైస్సార్ పెళ్లి శుభలేఖ చూసే అంత అదృష్టం , ఆయన కాలం లో పుట్టినందుకు మనం ఎంతో అదృష్టవంతులం అంట . చంద్రబాబు ఓడిపోయాడని ఇంట్లో పొయ్య వెలిగిన్చుకోలేదంట కొంతమంది . పిచ్చ కోపం . వ్యక్తి పూజ లు ఇంత నిర్లజ్జ గా న. సొంత ఆలోచన కూడా ఉండదా ? అభిమానించు , చర్చించు . విరుద్ధమైన అభిప్రాయాలు ఉంటె గౌరవించు . కానీ మనకి కనీసం మాట్లాడ్డం కూడా రావడం లేదు . పైగా వాళ్లంతా చదువుకున్నవాళ్ళు .

      ఈ మధ్యన మా ఖర్మకాలి ఒక నాయకుడు మాకు దగ్గర చుట్టం అయ్యాడు , గొప్పలు కోసం ఆయన చెప్పేవి , ఆయన సెటిల్మెంట్ లు చూస్తుంటే మతిపోయింది . ఇన్నాళ్లు వాళ్ళు వీళ్ళు చెప్పేవి ఇంకా తక్కువే . విచిత్రం ఏంటంటే , ఆయన స్నేహితులు కొందరు ఆ పార్టీ , ఈయనేమో ఈ పార్టీ . బిజినెస్ లు , మామూళ్లు , గొడవలు సెటిల్ చేయడం , పై వాళ్లకి డబ్బులు , ఇవన్నీ విని ఆశ్చర్యం , భయమేసింది . ఆయన ముందు ఎదో ధైర్యంగా ఆయన్ని పొగిడి పక్కకి వస్తే దిగులేసింది . ఎందుకంటే అందరు ఒకటే . అసలు గొడవలు అనేవి కేవలం మీడియా ముందు మాత్రమే .

      వెనక్కి ఇండియా కి వచ్చేయాలి అనుకున్న ప్రతీసారి ఇవే విని, చూసి భయంగా అనిపిస్తుంది . స్కూల్ లో బాత్రూం కాంట్రాక్టు లు నుండి , వేల కోట్లు ప్రాజెక్ట్ లు , ఏదైనా అదే అవినీతి . ఇవన్నీ చదవడం వేరు , ప్రత్యక్షంగా వినడం వేరు .

      కానీ ఇండియా లో దీనికి ముద్దు పేరు బ్రతక నేర్చిన తెలివితేటలు . అబద్దం చెప్పడం రాకపోతే , లంచం ఇచ్చి పని చేయించుకోవడం రాకపోతే వీడికి మరీ బొత్తిగా తింగరోడు అయిపోయాడు అంటారు అంతే కానీ నువ్వు కరెక్ట్ అని మాత్రం అనరు .

      ఏమో జనం ఇవన్నీ తెలిసే నటిస్తున్నారేమో , ఇంట్లో నాలానే ఆలోచిస్తారేమో , అన్న పిచ్చి ఊహ కొంచెం ఆనందాన్నిస్తుంది.

      Delete
  4. ఒక పార్టీకి అభిమాని ఐతే చాలు. తమ ప్రియతమ నాయకుడికి నచ్చని పార్టీ వాళ్ళు రాక్షసులే. ఆ నచ్చని పార్టీ నాయకుడు ఏకంగా రావణాసురుడే. ఇంకేముంది అభిమానం దురభిమానం ఐపోతుంది. తమ చేతిలో ఒక బ్లాగో వ్యాఖ్యాస్థలమో ఉందికదా అని ఇష్టం వచ్చినట్లు రక్తికట్టించే రాతలు హోరెత్తించేయటమే. దానితో పాటు అస్మదీయులు పొలో‌మని తందానాలు, తస్మదీయులు లబోమని శాపనార్ధాలు. ఏమిటీ సంత? గుడ్డి అభిమనాల విషజ్వరాలనుండి బయట పడి మీరు కాస్త శాంతంగా ఉండండి, ప్రపంచాన్ని మీ‌కామెర్లరోగపు కళ్ళతో చూస్తూ నిప్పులు చెరగటం ఆపండి. ఈమాట అటూ‌ ఇటూ ఉన్న అందరికీ వర్తిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత రావణా -
      ఏడ్చింది చాలు, పచ్చ కళ్ళద్దాలు పక్కనపడేసి సావధానంగా చదివే ఓపిక ఉంటే చదువు.
      పైన నువ్వు ఏడ్చిన ఏడుపు నీకు వినిపించిందా?
      అంటే పైన నువ్వన్న మాటలు నీకు వర్తించవా?
      >>ఒక పార్టీకి అభిమాని ఐతే చాలు. తమ ప్రియతమ నాయకుడికి నచ్చని పార్టీ వాళ్ళు రాక్షసులే. ఆ నచ్చని పార్టీ నాయకుడు ఏకంగా రావణాసురుడే. ఇంకేముంది అభిమానం దురభిమానం ఐపోతుంది<<
      దురభిమానానికి పరాకాష్ఠ కాబట్టేకదా నీ ఏడుపు.
      అంటే నీకు అభిమానం గొప్పది. ప్రశ్నించటం అనేది మాత్రం దురభిమానమో లేక ఒక పార్టి రంగో! అంతేనా?

      >>గుడ్డి అభిమనాల విషజ్వరాలనుండి బయట పడి మీరు కాస్త శాంతంగా ఉండండి, ప్రపంచాన్ని మీ‌కామెర్లరోగపు కళ్ళతో చూస్తూ నిప్పులు చెరగటం ఆపండి. ఈమాట అటూ‌ ఇటూ ఉన్న అందరికీ వర్తిస్తుంది.<<
      గుడ్డి అభిమాని గుడ్డి వ్యాఖ్యలు వెళగక్కితే మాత్రం పర్వాలేదు అంటావు.

      విషయం ఏవన్నా ఉంటే చెప్పు. ఏడవమాక ఉడుకుపోతా

      Delete
  5. మరి ప్రభుత్వం చని పోయియిన వారిని JCB లో ఎందుకు తరలించింది?

    ReplyDelete
    Replies
    1. >>మరి ప్రభుత్వం చని పోయియిన వారిని JCB లో ఎందుకు తరలించింది?<<
      దానికీ నేను పైన రాసిందానికీ సంబంధం ఉందా?

      Delete
    2. ఏ ప్రభుత్వమైనా ఇదే చేస్తుంది . డ్రైవర్ లు రావడం లేదు . వాహనాలు దొరకడం లేదు . ఎన్ని రోజులు పెట్టుకుంటారు . బడ్జెట్ వదలరు . వదిలే ముందు మనకి ఎంత అని చూస్తారు . అంత్యంత ఎక్కువ నిర్లక్ష్యం చేసిన రంగం ఏంటంటే వైద్య రంగం. ఇప్పటికి గిరిజనులు ని బుజాల మీద మోసుకొచ్చే రోజుల్లో ఉన్నాం . తు మన బతుకులు . నిజం చెప్తున్నాను , ఫార్మా లో పనిచేసే ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే , ఇవి వాళ్ళకి గోల్డెన్ డేస్ . 15 కోట్లు మందులు ని , 85 కోట్లు కి అమ్మారు గవర్నమెంట్ కి . ఆ కంపెనీ ఒక పెద్ద నాయకుడిది . వాళ్ళే కాదు మిగతా వాళ్ళు కూడా ఇలానే . ఫార్మా ఇండస్ట్రీ కి ఇవి బంగారపు రోజులు .

      Delete
    3. ఇంత దారిద్య్రం, అవినీతి, కుల వివక్ష చూస్తూ కూడా , జనం మన సంస్కృతీ ని , మన దేశాన్ని పొంగుకోవడం , మనమే బెస్ట్ అని చెప్పుకోవడం .

      Delete
  6. వ్యాపారం రాజకీయానికి మూలం. దాన్ని ఆపలెరు.
    ఇదే వ్యపారస్తులు రజకీయనాయకులకి మేత పడేస్తారు. వాళ్ళ పర్టీలకు ఫండ్స్ ఇస్తారు.
    రాజకీయ వినాయకులు వ్యాపారస్తులకి కొమ్ము కస్తారు.
    ఫార్మా రంగం దీనికి ఏమాత్రమూ ఇమ్యూన్ కాదు.

    జనం చేత మందు మింగించి, ఆమందుకి విరుగుడు మందు ప్రభుత్వం చేత వందరెట్లు ఎక్కువకి కొనిపించి మరీ కల్తి మందు అమ్ముతారు



    ఆందరూ ఆ తాను ముక్కలే
    ప్రపంచం మొత్త నడిచే సర్కసే ఇది.

    ReplyDelete
  7. దీనికో యజ్ఞమో, ప్రార్ధనో చేస్తే పోలా?

    రాజకీయనాయకులకి కులాలుదాటి, మతాలు అంటగట్టడం మొదలెట్టడంతోటే... ప్రతిపక్షం, వారి కుల మీడియా, దుర అభిమానులు బ్రష్టుపట్టిపోవడం మొదలైంది.

    ReplyDelete
    Replies
    1. నీకోసం ఇప్పుడే ప్రార్థన చేసొచ్చా

      Delete
    2. అయ్యలారా! నాకోసం చేయకండి. మీకోసం.. మీ బిడ్డలకోసం చేయండి

      Delete
    3. అయ్యా! మీ స్లాంగ్ అర్థమైంది. మీరు ఎవర్ని ఉంటంకిస్తూ ప్రార్థనలు యజ్ఞాలు అంటున్నారో అదీ అర్థమైంది.
      నేను బ్రాహ్మణుడిని కాబట్టి అంటునారనీ నన్ను ఎక్కిరుస్తున్నారని నేను అనొచ్చు. కానీ అనను
      అయితే - నమ్మకాన్ని ఎద్దెవా చేయటం ఎగతాళి చేయటం మంచిది కాదని సున్నితంగా చెబుతూ మీరు లిస్ట్ చేసినవాటికీ పైటపాకి ఏమాత్రమూ సంబంధం లేదని స్నేహపూర్వకంగా చెబుతున్నా

      Delete
    4. నేను బ్రాహ్మణేతరుడ్ని. యజ్ఞాలు బ్రాహ్మణులే చెయ్యాలా? అని నేనడగను.

      పెళ్ళి మంత్రాలు తెలుగులో చదివితే మాకుగూడా అర్ధమౌతయి కదా అని అడిగి బూతులు తిట్టిచ్చుకున్న అనుభవం ఉంది.

      ఇక ఎగతాళి అంటారా! అది ఎవడికి తగలాలో వాడికే తగులుతుందని మీకుతప్ప అందరికీ తెలుసు.

      Delete
    5. యజ్ఞ యాగాదులు బ్రాహ్మణులే చేయాలని నేను అడ్వకేట్ చేస్తే తప్పకుండా వాదించుకోవచ్చు ఇక్కడ.
      మంత్రం అనేదానికి కొన్ని డెఫినిషన్స్ ఉంటాయని చెప్పే ఓపిక నాకులేదు
      ప్రతీ ఒక్కడూ లెక్కల చెప్పలేడు
      ప్రతీ ఒక్కడు ఫిజిక్స్ చెప్పలేడు
      ప్రతీ ఒక్కడూ ఎలక్ట్రానిక్ సర్క్యుట్ డిజైన్ చెయ్యలేడు
      ప్రతీ దానికీ ఒక ప్రమాణం పరిమాణం లెక్క డొక్క ఉంటుందని ఈజీగా అర్థం చేస్కోవచ్చు
      ఏజ్ ఓల్డ్ ట్రడిషన్స్ ఒక్క ముక్కలో ట్యాగ్ చేసి హా బ్రహ్మలు అనో అంటం కేవలం అవివేకం అని చెప్పేంత సమయం నాకు లేదు

      ఎవరికి తగలాలో తగిలేలా మీ మీ వేదికలపై నిల్చుని అస్త్రాలు సంధించుకోండి

      ఇక్కడం ఎందుకూ?
      (సున్నిత మైన సూచన)

      Delete
    6. ఇక్కడం ఎందుకూ?

      I respect your word

      Delete
    7. >>మంత్రం అనేదానికి కొన్ని డెఫినిషన్స్ ఉంటాయని చెప్పే ఓపిక నాకులేదు

      ఒక పక్క బైబిల్ అన్నిభాషల్లోకి అనువదింపబడి అందర్నీ దగ్గరకు తెచ్చుకుంటుంటే, ఇంకా మనం ఎవ్వరికీ అర్ధంకాని భాషల్లోనే బతకాలంటూ సామాన్యుల్ని దూరం చేసుకుంటున్నాం.

      స్వస్తి

      Delete
    8. బైబిల్ ని అనుకరించి అనుసరించాల్సిన అవసరం నాకైతే కనిపించడం లేదు.
      ఎవరు దేన్ని ఇష్టపదితే దాన్ని ఫాలో అవుతారు.

      Delete
  8. పెళ్ళి మంత్రాలుబ్రాహ్మణులే చదవాలని లేదు
    ప్రకాశం జిల్లాలో గుంటూరులో కొన్నిప్రాంతాలలో ఒక కులం ఆడవాళ్ళు చేయిస్తారు పెళ్ళిళ్ళు
    భావప్రాప్తి ఒక్కొక్కరికి ఒక్కోరకం

    మీకు ది బాగుంటే అక్కడ చేయించుకోండి
    బ్రహ్మడు సంస్కృతంలో చదివే మంత్రాలతోనే ఎవడు చేయించుకోమని బలవంతం చేశాడూ?

    పెళ్ళికి కావాల్సింది మంత్రాలు కాదు
    రెండుకుంటుంబాలు కలిసి మమేకమైపోయే మనసులు వేదిక
    మంత్రాలు ఆ వ్యవస్థని బలోపేత్మ్ చేసేవి మాత్రమే
    మంత్రం ముగ్ధుల్ని చేయాలి
    ప్రశ్నల్ని లేవదీయకూడదు
    అల తీస్తున్నదంటే ఫోకస్ దేనిమీదా?

    ReplyDelete
    Replies
    1. మీది మీకు, మాది మాకు అనుకుంటే ఇక ఘర్ వాపసీ లాంటి ప్రోగ్రాంలెందుకు? మందిబలం కోసమా? ఒంగోలులో తెలుగు మంత్రాలు చదివేది మాల మాదిగ కులస్తులే. వాల్ల పెల్లిల్లకి బ్రాహ్మణులు రారు. డబ్బులున్న వాల్లైతే వెల్తారేమో!

      Delete
  9. >>మీది మీకు, మాది మాకు అనుకుంటే ఇక ఘర్ వాపసీ లాంటి ప్రోగ్రాంలెందుకు? మందిబలం కోసమా? ఒంగోలులో తెలుగు మంత్రాలు చదివేది మాల మాదిగ కులస్తులే. వాల్ల పెల్లిల్లకి బ్రాహ్మణులు రారు. డబ్బులున్న వాల్లైతే వెల్తారేమో!<<

    now I got you.
    i am trying to show you to east but you are looking at south west. no way we can see in one direction.
    >>ఒంగోలులో తెలుగు మంత్రాలు చదివేది మాల మాదిగ కులస్తులే<<
    కొత్త విషయం. నేనెప్పుడూ వినలేదు.
    ఏకులం వాళ్ళు ఆకులం పంతుళ్ళను తయ్యారు చేసుకుంటే ఇక సమస్య ఏవిటీ? చర్చ దేనికీ?
    సదరు కుల పూజారులు కూడా సంస్కృతంలో మంత్రం చదువుతున్నారనా?

    ReplyDelete
    Replies
    1. 》》కొత్త విషయం. నేనెప్పుడూ వినలేదు.

      నేను అలాంటివి చూశాను కాబట్టే చెపుతున్నాను.


      >>సదరు కుల పూజారులు కూడా సంస్కృతంలో మంత్రం చదువుతున్నారనా?

      వచ్చీరాని సంస్కృతంలో కొంత, మిగితాది తమకితోచినట్టు తెలుగులో..చదువుతారు.. అవిమాత్రం పెల్లిలో బ్రాహ్మణులు చదివే మంత్రాలు కావు.

      Delete
    2. వాళ్ళెవరో సంస్కృతంలో మంత్రం చదవటానికీ, బేపనోళ్ళు మంత్రాలు అంటానికీ ఏవిటి గురూ సంబంధం చోద్యం కాకపోతే.

      Delete
    3. నాపాయింటు మీకు అర్ధంకాలేదా?అంతా లోకల్ భాషల్లోకి వాల్ల గ్రంధాల్ను మార్చుకోని సామాన్యుల్ని ఎట్రాక్ట్ చేసుకుంటుంటే, మేము మాత్రం ఇలానే ఎవరికీ అర్ధంకాకుండానే ఉంటాం అనేవాల్లకి నేనిచ్చిన సలహా అది. దానికే బూతులు తిట్టాడు నన్ను అని చెప్పాను. ఇక మీకు స్వయంతృప్తులు, భావప్రాప్తులు కనిపిస్తే నా తప్పేం ఉంది?

      Delete
    4. నా పాయింటూ నీకు అర్థం కాలేదులేబ్బా!

      ప్రపంచంలో ఎవడు సంస్కృతంలో మాట్టాడినా దానికి బేపనోళ్ళు బాధ్యత తీస్కోవాల్సిన అవసరం లేదు.

      మంత్రాలను తెలుగీకరించటం అనేది ఓ పెద్ద టాపిక్. అదంత హర్రీబుర్రీగా చెప్పేది కాదు. ఆ టాపిక్ ని టచ్ చేయాలంటే ఒక పర్స్‌పెక్టివ్ తో రావాలి.

      ప్రశ్నించేతత్వం ఉండాలి, శోధించే తత్వం ఉండాలి కానీ హేటువాదం అనే కళ్ళజోడుతోనో లేక మరే ఇతర ఇజం తోనో వస్తే ఫలితం లేదు.

      మీకు ఖాళీ ఉన్నప్ప్డు చెప్పండి, మనం మాట్టాడుకుందాం.

      పై టపాకి ఈ సమస్యకి సంబంధం లేదు. Lets stop here

      Delete
    5. బేపనోళ్ళు బాధ్యత తీస్కోవాల్సిన అవసరం లేదు.

      Delete