Aug 4, 2020

48 గంటలు సమయం ఇస్తున్నా - బాబు

48 గంటలు సమయం ఇస్తున్నా, అసెంబ్లీ రద్దు చేయండి. 

ఎన్నికల మానిఫెస్టోలో మూడు రాజధానులు పెట్టలేదు. 

రాజీనామా చేసి, అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ కి వెళ్ళి .. 


 2014 ఎన్నికలలో అమరావతి రాజధాని అనీ, 
50 వేల ఎకరాలు సెకరిస్తాం అనీ, 
సింగపురం కంపెనీలకు అప్పగిస్తాం అనీ, 
సింగపూర్ ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయనీ మానిఫెస్టోలో చెప్పారా?

అమరావతి అని నిర్ణయం ఏ ప్రాతిపదికన తీసుకున్నారూ? 
ఓటింగ్ పెట్టారా? 
ప్రజల అభిప్రాయం తీస్కున్నారా? 

రేపొద్దున పుల్లయ్య ముఖ్యమంత్రి అయితే ప్రతీ జిల్లా హెడ్క్వార్టర్ రాజధాని అంటాడు. 

ఎవడి పాలనా సౌకర్యం వాడిది. 

ఎందుకింత రాద్ధాంతం.

5 comments:

  1. భ్రమరావతి మాయా నగరం , అస్మదీయుల దురాశ పూరిత భూటకం కుప్ప కూలేసరికి అమరపతికి ఆక్రోశం వెల్లువెత్తింది.

    పచ్చ భూతాలు గంగ వెర్రులెత్తి పోతున్నాయి.

    ReplyDelete
  2. 2014 లో అమరావతి రాజధాని అని చెప్పలేదు. ఓటింగ్ ఎలా పెడతారు? అదే వీలుంటే ఇప్పుడు పెట్టి చూపించొచ్చుగ ఈ మూడు రాజధానుల ఐడియాకి. కానీ నిర్ణయించాక సభలో పెట్టి ప్రతిపక్షం కూడా ఒప్పుకున్నాకే జనం నమ్మి భూములు ఇచ్చారు, ప్రభుత్వం కూడా ముందుకెళ్ళింది.

    యాభైవేల ఎకరాలేం ఖర్మ, జనం దగ్గర లాక్కునె పని, వాళ్ళు కోర్టులకి ఎక్కి సంవత్సరాలు సాగదీసె పని లేకుండా, స్థల సేకరణకి ఖజానాలో డబ్బులు పెట్టే పరిస్థితే ఉంటే లక్ష ఎకరాలైనా సేకరించి పెట్టుకోవచ్చు, భవిష్యత్తులో పారిశ్రామిక, ప్రజా అవసరాలకి వాడుకోవచ్చు.

    సింగపూర్ డెవలెప్‌మెంట్ కన్సార్టియంకి ఇస్తే అభ్యంతరం ఉండాల్సింది భూములు ఇచ్చినోల్లకి, మిగతా వాళ్ళకి కాదు.

    పాలనా సౌకర్యమా, ఎవరికి? ఐనా ఇప్పుడు ఏడుస్తున్న వాళ్ళు భూములిచ్చింది చంద్రబాబుకి కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి. వాళ్ళకి చేసిన ఒప్పందాలను తుంగలో తొక్కింది కాకుండా దాంట్లొ 1600 ఎకరాలు అమ్ముకొటానికి సిద్దమవ్వటంలో సిగ్గులేనితనం మీకు తెలీట్లేదు.

    గత ప్రభుత్వం చేసిన దాంట్లో మోసాలుంటే అవి బయటపెట్టి, చేసినవాళ్ళకి శిక్షలు వేయించటం మానేసి, ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చిన వాళ్ళని ఏడిపించి, వాళ్ళ భూములు అమ్ముకోటానికి రెడీ అయ్యారు.

    అమరావతి రాజధానిగా ఉండొద్దంటే ఆ ముక్క అప్పుడే చెప్పుంటే, జనం ఇచ్చేవాల్లు కాదు, ఇప్పుడు ఏడ్చేవాల్లు కాదు. ఇప్పటికైన ఆ ఒప్పందాలు రద్దు చేసి ఎవరివి వాళ్ళకి అప్పగించెయమని చెప్పండి, ఎట్లాగూ అందులో ఏమీ కట్టలేదు అంతా గ్రాఫిక్స్ అని ఇప్పటికీ ప్రచారం చెస్తున్నారు కద. వాల్ల భూములు వాళ్ళు వాడుకుంటారు.

    ReplyDelete
    Replies
    1. >>అమరావతి రాజధానిగా ఉండొద్దంటే ఆ ముక్క అప్పుడే చెప్పుంటే, జనం ఇచ్చేవాల్లు కాదు, ఇప్పుడు ఏడ్చేవాల్లు కాదు. ఇప్పటికైన ఆ ఒప్పందాలు రద్దు చేసి ఎవరివి వాళ్ళకి అప్పగించెయమని చెప్పండి, ఎట్లాగూ అందులో ఏమీ కట్టలేదు అంతా గ్రాఫిక్స్ అని ఇప్పటికీ ప్రచారం చెస్తున్నారు కద. వాల్ల భూములు వాళ్ళు వాడుకుంటారు.<<

      బాబు గారిని ఈ అంశం పై పోరాడమనండి అజ్ఞాతా

      Delete
  3. అమరావతి పెట్టటం తీసేయటం రాజధాని కట్టటం కూల్చటం ఎన్ని రాజధానులు ఎన్ని సార్లు ఇవన్ని ఓటింగ్ పెట్టి తేల్చే లెక్కలు కాదన్నది ముఖ్య విషయం.
    దానికి ఛాలెంజులు సవాళ్ళు అసెంబ్లీ రద్దు చేయటాలు కాదు కావాల్సింది.
    వాడు చేస్తే వీడు చేయాలా, వాడు చేయకపోతే వీడు చేయొచ్చుగా కదు.
    భూములిచ్చిన రైతుకి న్యాయం జరిగేలా ప్రభుత్వం ఆలోచించాలి/ప్రతిపక్షం పోరాడాలి

    దాన్ని వదిలేసి సవాళ్ళ దగ్గరే కొట్టుకుంటున్నారంటే వీళ్ళని రాజకీయ రాక్షసులు అనక ఏవనాలి?

    ReplyDelete
  4. meaningful discussion here
    https://www.youtube.com/watch?v=TudrPr3iL18

    ReplyDelete