మొన్నోరోజు సాయంత్రం 9కి అనుకుంటా ఎవడో ముందు తలుపుని దబాదబా బాది పారిపోయాడు.
నాకు పిచ్చ కోపం వచ్చి, పరిగెత్తుకుంటు వెళ్ళి తలుపు తీసి చూస్తే ముగ్గురు పిల్లలు పరుగెత్తి పోతూ కనిపించారు. ఒకడు దూరంనుంచి మధ్య వెలు చూపిస్తూ Fuck you అనుకుంటూ అరుచుకుంటూ చీకట్లోకి కనుమరుగైపోయారు.
షాక్ కి గురి అయ్యాను. ఒక్కసారి ఏంచేయాలో అర్థం కాలేదు. సూరిగాడు వెనకాలగ వచ్చి కూల్ డౌన్ చిల్ లోపలకి నడువు అంటూ తీసుకెళ్ళాడు నోరు తెరచి చూస్తూ ఉండిపోయిన నన్ను.
భార్య గారు పిల్లలు పిచ్చ లైట్ గా ఉన్నారు సంఘటన గురించి మాట్లాడుతూనే.
నేను మాత్రం షాక్ లో ఉన్నాను ఇంకా. ఎంతకీ ఆలోచనలు తెగలెదు.
సూరిగాడు కూర్చోబెట్టి చెప్పాడు - అలా randomగా ఇంటి తలుపు కొట్టటాన్ని Ding Dong Ditch అంటారు. ఇందులో పేద్ద విషయం ఉండదు. ఇది కేవలం ఫన్ కోసమే. ఇలా తలుపు కొట్టినప్పుడు మనం రియాక్ట్ అయితే మనల్ని ఎంచుకుని మళ్ళి మళ్ళి కొడతారు అని చెప్పుకొచ్చాడు.
ఆరోజుతో ఆ విషయం మరుగున పడిపోయింది.
మూడో రోజున మళ్ళీ - దబాదబా బాదటం పారిపోవటం దదాపు 9గంటలకే. ఈసారి వెంటబడ్డాను. మొత్తానికి పక్కసందులో ముగ్గురు పిల్లలు సైకిళ్ళ మీద కనిపించారు. నన్ను చూసి బెదిరారు.
హేయ్ ఆగు అన్నాను ఒక టోపీ పెట్టుకున్నవాడ్నిని.
ఎందుకాగాలి నేనేం చేయలేదే అన్నాడు.
నువ్వు ఏంచేశావని నేనసలు అడగనే లేదుగా ఎందుకు భుజలు తడుముకుంటున్నావ్ అన్నాను.
దూరం దూరం అసలే కోవిడ్ మేము వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళిపోబోతుంటే చెప్పాను -
నాదగ్గరున్న సర్వైలెన్స్ కెమేరలో మీరు దొరికారు. టోపీ పెట్టుకున్నవాడే తలుపు కొట్టీంది. నువ్వు అచ్చం కెమేరాలో దొరికినవాడి పోలికలోనే ఉన్నావు.
ఇప్పుడు నేను ఇంటికెళ్ళి పోలీసులతో తో మాట్లాడతాను. కెమేరా ఫుటేజ్ చూపిస్తాని వచ్చాను.
ఒకసారి కెమెరా ఫుటేజ్ చూస్తే ఆ పిల్లాడు తలుపు కొట్టి వెళ్ళలేదు. తలుపు కొట్టి కాలితో డోర్ ని తన్ని మరీ వెళ్ళాడు.
నాకెందుకో ఆడ్ గా అనిపించింది. కలితో తన్నటం అనేది కసిని తెలుపుతున్నది. కక్షని తెలుపుతున్నది. ఇది రెసిజం కేస్ అనిపించింది.
భయం వేసింది కూడా. వీళ్ళ ఇంటి ముందు అనఘ బస్ ఎక్కుతుంది. దీన్ని మనసులో పెట్టుకుని అనఘని ఏడిపిస్తారా? అనిపించింది.
తర్వాత తెలిసిన విషయం - ఈ పిల్లలు కేవలం దేశీ ఇళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనీ, అందునా ring లాంటివి లేని ఇళ్ళను టార్గెట్ చేస్తున్నారని.
ఏవైనా పోలీస్ మాట ఎత్తినాక మళ్ళీ రాలేదు వీళ్ళు.
ding dong ditch అని యూట్యూబ్ లో వెతికితే ఓ వీడియో నన్ను అసహనానికి గురిచేసింది.
ఎవడో దేశి. వాడి తలుపు మీద ఇలానే ముగ్గురు తెల్లపిల్లలు తలుపు బాదటం మాయం అవ్వటం.
మరి అలా ఎంతకాలం నడిచిందో తెలియదు.
సదరు దేశీ గాడికి ఎక్కడో కాలింది. ఓ రోజు వాళ్ళని కార్లో వెంబడించాడు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కారుతో గుద్ది వాళ్ళమీద నుంచి పోనిచ్చాడు కారుని.
ముగ్గురు తెల్ల పిల్లల ప్రాణాలు పొయ్యాయి.
సదరు దేశీకి శిక్ష పడింది.
హస్యం అనేది అంతదకా వెళ్ళటం అవసరమా?
చాలా దురదృష్టమైన సంఘటన. నేను కూడా పేపర్లో చదివాను. అతను అంత దాకా వెళ్ళుండకూడదు. ఇటువంటి సంఘటనల్లో ప్రపంచం అంతా ఆ పిల్లల్నే సమర్ధిస్తుంది. "పాపం వాళ్ళు తలుపేగా కొట్టింది, ఇంతదానికే కారుతో గుద్ది చంపేస్తారా?" అని. నిజమే అనిపిస్తుంది మనక్కూడా. కానీ ఎవరికైనా తనదాకా వస్తే కదా తెలిసేది! వాళ్ళు ఎన్ని రోజులలా వచ్చి తలుపుకొట్టి విసిగిస్తే అతను అంత సహనం కోల్పోయి ఆపని చేసుంటాడో ఎవరికీ పట్టదు. ఎంతైనా మనం పరాయి దేశంలో ఉన్నామన్న విషయం ఎప్పటికీ మరవకూడదు. మనమే తప్పూ చేయనంతసేపే మన గోడు ఎవరైనా వినేది. మన గోడు విని వాళ్ళేమైనా ఆరుస్తారా, తీరుస్తారా అన్న విషయం పక్కనపెడితే, మనం ఏమాంత్రం హద్దుమీరినా మనల్ని నడిరోడ్డున పడేస్తుందీ సమాజం. ఆ పిల్లల్ని తరిమి, వాళ్ళపైన కారెక్కించిన అతనికి కూడా పిల్లలున్నారు. వాళ్ళు తండ్రి ప్రేమకు దూరమై పెరగాల్సిందే. ఆతండ్రి క్షణికావేశం అందరి జీవితాల్ని అథఃపాతాళానికి నెట్టేసింది. ఈ సంఘటనలో చనిపోయిన పిల్లలు, నిందితుడీ పిల్లలూ, నిందితుడూ అందరూ బాధితులే నా దృష్టిలో.
ReplyDeleteనువ్వు చెప్పింది నిజం భార్గవా.
ReplyDeleteఆ రోజు సాయంత్రం పనిలో విసిగిపోయి ఉన్న నా మనసు చలా రేజింగా అసహనంగా ఉంది. చెప్పొచ్చేదేంటంటే - చొక్కా విప్పేసినంత ఈజీగా ఆఫీస్ చికాకుల్ని పక్కన పెట్టలేం.
చికాకు కోపాన్ని వెంటనే ప్రోత్సహిస్తుంది.
కోపంలో ఉన్నవాడికి విచక్షణ కరువౌతుంది.
అతనిది తప్పే కాని, దాన్ని ప్రోత్సహించింది పాపం అతని కర్మ
ఒక చిన్న పనికి నాలుగు కుటుంబలు బలి.
There is always an element of risk for outsiders especially in these hard times.
ReplyDeletePlease be careful Bhaskar Garu.
The incident of the three children is really sad.
Don’t get into trouble. Please stay safe
ReplyDeleteఎక్కువసార్లు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి.
ReplyDeleteపెరిగిన విడాకుల కేసులవల్ల పిల్లల పెంపకంలో బోలెడు లోపాలు కనిపిస్తున్నాయని అనలిస్టుల అభిప్రాయం.
Stay safe sodara...
ReplyDeleteThanks bro
Deleteతెలుగు మాష్టారూ...చాలా రోజులకి దర్శనం! సూర్య, అనఘ ఎలా ఉన్నారు?
ReplyDeleteఇది అక్కడే కాదండీ...ఇండియాలో మా అపార్ట్మెంట్లో ఇదే సమస్య! ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్స్ ని టార్గెట్ చేస్తారు!
తలుపు కొట్టేసి పారిపొతారు.... మనం తీసేసరికి ఎవ్వరూ ఉండరు! రోజూ ఒక్కొ ఇల్లు టార్గెట్. ఆరు ఆ సమయంలో.... ఒకసారి కాపుకాసి పట్టుకున్నా.... తుర్రుమని పారిపొయాడు. అసొషియషన్ కి మెయిల్ పెడితే... తెలిసింది అందరిదీ ఇదే పరిస్థితి అని. పైన ఫ్లాట్స్ వాళ్ళ షూ రాక్స్లో చెపులు తీసి కింద వేయడం... గ్రౌండ్ ఫ్లోర్ ఐతే తలుపులు బాది పారిపోవడం!!
చివరికి అసోసియెషన్ కలుగచేసుకుంటే గొడవ సద్దుమణిగింది....
మీరు జాగ్రత్త అండీ... అసలే రోజులు బాలేవు :(
Buddy - hope all are safe and good. Good to read from you after a long time.
ReplyDeletePlease take care and stay safe.
My blessings to you all