Aug 19, 2020

Phone Tapping


ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద బురద చల్లటం బహు సాధారణం. అయితే బురద చల్లేప్పుడు తమ చేతులకీ సదరు బురద అంటుకుంటుందనీ, అది తమ మీదా పడుతుందీ అని గుర్తించకపోవటం కేవలం కళ్ళుండి గుడ్డితనం.


Phone Tapping అయ్యింది అని ఒక పార్టీ అరుపులు.


అసలు ఇక్కడ Tapping అనే పదం కరెక్టేనా?

నాకు ఒక కాల్ వచ్చినప్పుడు, ఆ కాల్లోకి చొచ్చుకొచ్చి దాన్ని మూడో చెవి వినగలదా?


ఫోన్లోకి దూరి డేటాని కొట్టేయటం అనేది - హ్యాక్ చేయటం అంటాం.

ఫోన్ సంభాషణలు పట్టటానికి చిన్నా చితకా హ్యాకర్లు చేయలెరు అని నా అభిప్రాయం.



నల్లమోతు శ్రీధర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు - 

1. కొత్త టెక్నాలజీతో (ఇజ్రాయల్ సూట్కేస్ సైజ్ ఫోన్ ట్యాపింగ్ సిస్టం) వాయీస్ ట్యాపింగ్ సాధ్యమే.

2. "ఫోన్ ట్యాప్ చేస్తే దాన్ని కనుక్కోలేరు" అని.


నాకున్న నెట్వర్కింగ్ స్కిల్ల్స్ మరియూ పరిజ్ఞానం పై స్టేట్మెంట్స్ మీద కామెట్ చేసే స్థాయిలో లేదు. కానీ, రెండో పాయింట్ - ఫోన్ ట్యాప్ చేస్తే కనుక్కో లేము అనేది wrong statement అని నా అభిప్రాయం.


ట్యాప్ చేస్తే మిమ్మల్ని కనుక్కోలేరు కాబట్టి మీ ఇష్టం అనే ఓ అలోచనకి ఊతం ఇచ్చేలా ఉంది.


ఒక ఫండమెంటల్ ప్రశ్న - ట్యాప్ చేసేంత స్థాయి చంద్రబాబుకి ఉన్నదా?


ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చెసిందనీ, ప్రైవేటు వ్యక్తులు ట్యాప్ చేస్తున్నారనీ ప్రధానమంత్రికి లేఖ వ్రాశారు చంద్రబాబు గారు.


బ్లాగులోకంలో ఎందరో టెకీలు - దీని గురించి స-వివరంగా సమాచారం ఇచ్చేవాళ్ళుంటే బాగుంటుంది.

ఈ వ్యవహారం అనేక కోణాలు

48 గంటలు ఛాలెంజ్ - బుట్టదాఖలు

రోజుకో కొత్త అరుపులు అని కొందరి భావన.


అసలు యై.యస్.ఆర్.సీ.పి న్యాయవ్యవస్థ మీది గౌరవం లేదని అస్థిత్వం లేని జనశక్తి అరుపులు


మీదగ్గర ఆధారాలుంటే ముందుకు రావాలి కదా అని అస్మదీయ వర్తా పరికల అరుపులు


మాదగ్గర ఆధారలున్నాయి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాం అని తెదేపా అరుపులు


6 comments:

  1. జూమ్ బాబు జుంబారే జుంజుంబరే.

    ReplyDelete
    Replies
    1. జూంబా. జీవితమంతా కుట్రలు కూహకాలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు.ఎన్నికల ముందు మోడీ గారిని వారి కుటుంబ సభ్యుల పట్ల అంత దుర్భాషలాడావే. ఇప్పుడు ఇంత అతిగా పొగుడుతున్నావు. అసలు అంతరాత్మ ఉందా. దాన్ని కూడా వెన్నుపోటు చేశావా.

      Delete
  2. హైటెక్కు విజనరీ బాబయ్య ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దరిమిలా ఫోన్ టాపింగ్ అంటూ కుల మీడియాలో వేసిన రంకెలు ఇంకా చెవిలో మారుమోగుతూనే ఉన్నాయి. "Zoom barabar ghoom kharabi" అనే కవ్వాలీ నేపధ్య సంగీతం మళ్ళా షురూ!

    ReplyDelete
  3. పోనీలే అన్నాయ్.. చంద్రబాబు ఫోన్లు ట్యాప్ అయ్యాయి అన్న విషయం ఆయనకు కూడా తెలుసు కాబట్టి, ఎటువంటి ఇల్లీగల్ వ్యవహారాలు ఫోనులో చేయకుండా.. బుద్దిగా ఉంటాడు.

    ఒకవేల ఏదైనా సమాచారం ఫోనులో చేరవేశాడు అంటే.. ఖచ్ఛితంగా ఐద్ వై.సీ.పీ వారిని తప్పు దారి పట్టించడానికో లేక వారిని ట్రాప్ చేయడానికో అయ్యే ఛాన్సుండుంటుంది. ఈ విషయములో వై.సీ.పీ వారు జాగ్రత్తగా ఉండాలి.

    పైపెచ్చు, ఇప్పుడు చంద్రబాబు ఠీవిగా చెప్పుకోవచ్చు.. వారు ట్యాప్ చేసినా, నా దగ్గర ఏమీ దొరకలేదు.. అంటే నేను ఎంత మంచోన్నో కదా అని చెప్పుకోవచ్చు..

    ఇక వై.సీ.పీవారు చంద్రబాబు మీద ఎటువంటి ఆరోపణలూ చేయలేరు ! నీకు తెలిసే కదయ్యా మేము అంతా చేశాం అని చెప్పొచ్చు..

    ReplyDelete
    Replies
    1. I want to have deeper inputs on technicality of this tapping. Every Tom dick and Harry ssuing - oh ya it’s easy and possible. I know it is possible but not at the common man level is my take.

      Question is - is it that easy to intercept voice call?

      Delete
    2. కాదు. అది అంత సులభం అయితే కుదరదు. కేవలం కేంద్రం చేతిలో మాత్రమే ఉంటాయి కొన్ని. ఐ.బీ ట్యాపింగ్ చేస్తుంది కానీ, అవి రాష్ట్ర ప్రభుత్వాలకి దొరకవు.

      నాకు తెలిసినవి..

      1.హ్యాకింగ్. మనం ఏం టైప్ చేసినా, కాపీ, పేస్టు చేసినా మొత్తం తెలిసిపోతుంది. కీ లాగర్స్ ఉంటాయి. మొబైల్ సేఫ్ కాదు. మొబైల్లో జరిగే ప్రతీదీ హ్యాక్ చేసి తెలుసుకోగల టెక్నాలజీ ఉంది.

      2.అదీకాక సోషల్ మీడియా సేఫ్ కాదు. మెయిల్స్ కూడా, జీ మెయిలుతో సహా ఏదీ సేఫ్ కాదు. ఎవరో ఒకరు వాటిని చదివే వీలుంది.

      బహుషా, ఇలా హ్యాకింగు ద్వారా, స్నూపింగు ద్వారా టెలుసుకున్నవాటిని ఉపయోగించి, వై.సీ.పీ వాల్లు మైండ్ గేం అడే చాన్సుంది. మన చంద్రాలు సారు ప్రతిపక్షం కాబట్టి, గట్టిగా తగులుకున్నాడు.

      Delete