Jul 29, 2020

కిన్నెత్ కథ

సాక్షి నాటకం మూడు భాగాలుగా ఆకాశవాణి రేడియోలో ఇప్పటికి అనేక సార్లు ప్రసారం అయ్యింది, అనేక సార్లు విన్నాను కూడా.
ఈ నాటకంలో జంఘాల శాస్త్రిగా కీశే సుత్తివేలు
సాక్షి రంగారావు కూడా నటించారు.
ఎందరో గొప్ప నటులు. వారందరికీ వందనాలు.
వీళ్ళు గొప్ప నటులంటే.
సుత్తివేలు, సాక్షి రంగారావు, పొట్టి ప్రసాదు, గొల్లపూడి, రావు గోపాల రావు, కైకాల, కాకరాల ఇలాంటివాళ్ళు గొప్ప నటులు.


ఏవైనా సాక్షి మూడో భాగంలో కిన్నెత్ కథ ఎంతో ఆసక్తిగా అనిపించింది.
ఇది కథే కావచ్చు. కాని ఒక కోణాన్ని ఆవిష్కరించారు రచయిత పానుగంటి.
ఇందులో షాజహాన్ ముంతాజ్ ల మధ్యలోకి ఇంకోక స్త్రీ భార్యగా రావటాన్ని ముంతాజ్ సహించకపోవటం, అసూయతో ఆమెని అంతమొందించటానికి పరిచారిక అయిన రోషనారతో ఒక పధకం రచించటం, షాజహాన్ ఆ పధకంలోకి లాగబడటం, వెరసి కిన్నెత్ బలి కావటం.

కథని పక్కనపెడితే, షాజహాన్ కి ముంతాజ్ అంటే అంత ప్రేమా? వీడికి బహు భార్యలు. ఇందర్లో ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించాడంటే ఎక్కడో ఓ పెద్ద డిస్కనెక్ట్.

PN Oak లాంటి వాళ్ళు ఎన్నో రాసుకొచ్చారు ఈ అంశం మీద.

నిజానిజాలు దేవుడికెరుక.

https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF_%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B0%B5_%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%82/%E0%B0%85%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81

3 comments:

  1. interesting story. thanks for sharing

    ReplyDelete
  2. ఆసక్తికరమైన కథ..
    // “ పరిచారిక అయిన రోషనారతో” // అన్నారు పైన. రోషనార పరిచారిక కాదు, రాకుమారి అండి. షాజహాన్ ముంతాజ్ ల
    చిన్న కూతురు (పెద్ద కూతురు జహనార), ఔరంగజేబుకు సోదరి.

    ReplyDelete
  3. నాటకంలో అలానే చెప్పారండీ. ఒకసారి సాక్షి చదివి చూస్తాను.

    ReplyDelete