నేను చలాన్ని చదవలేదు అంతకన్న పూసుకోలేదు
చలాన్ని చలం కళ్ళతో చూసే స్పూర్తి లేదు మత్తి లాంటి వాళ్ళు చలాన్ని మోయటం ఒక కారణం కావచ్చు.
ఈ మధ్య ఆకాశవాణిలో అలనాటి సవ్య సౌరభాలు నాటకాలు - రేడియో శబ్ద భాండాగారం నుండి అలనాటి నాటకాలు ప్రసారం అవుతున్నాయి.
అందులో విన్నది ఈ నాటకం.
చలం రచించిన పురూరవ.
నన్ను కట్టివేసింది ఊర్వశి పాత్ర. ఈ నాటకంలో రెండే పాత్రలు. ఊర్వశి, పురూరవుడు.
ఊర్వశిగా నటించినామె శారదా శ్రీనివాసన్. పురూరవుడిగా K చిరంజీవి.
ఊర్వశి:
నీ జ్ఞాపకాన్ని తీసేయనా? పూర్వం వలే సుఖంగా జీవింతువుగాని.
పురూరవుడు:
నీ జ్ఞాపకం లేకుండానా?
వద్దు? ఇట్లానే ఆశతో నీ విరహంతో కాలనీ
ఊర్వశి:
చూశావా మరి ఈ వియోగం, బాధ ఎందుకని ఏడుస్తావు గాని, వాటివల్ల కలిగే అశాంతే లేకపోతే ఏం అందుకో గలరు మీరు? అన్నీ సహించు. విధిని ప్రార్థించు. దిక్కులదిరేట్టు "ఊర్వశీ" అని ప్రణించు. సాధించు, నీ కోసమే కాచుకుని ఉంటాను. నేను చాలా సత్యం. నీదాన్ని. నీజీవితం ఒక్క క్షణం. ఊర్వశితో అనుభవం అనంతం.
గొప్ప నాటకం.
ఆర్కైవ్స్ లో పుస్తకం దొరికింది
ఆకాశవాణి వారు ఈ నాటకాన్ని యూట్యూబ్ లో ఉంచారు. ఇక్కడ వినవచ్చు
చలం అంటేనే .. అదన్నమాట.
ReplyDeleteఅలాంటిది - ఈనాటకం కట్టిపడేశింది. లింకు లిచ్చినందుకు ధన్యవాదాలు
interesting find.
ReplyDeleteచాలా చక్కటి నాటకం, ఎన్నో ఏళ్లుగా వెతుకుతూ ఉన్నాను. దొరికింది. ధన్యవాదాలు.
ReplyDelete