Jun 28, 2011

కార్స్ ౨ (త్రిడి)

మేం సినిమాహాలుకి వెళ్ళి సినిమా చూసి ఆరేళ్ళపైనే అయ్యింది. చివరిసారి కుటుంబసహితంగా వెళ్ళి చూసిన సినిమా శంకర్ దాదా యంబిబియస్. ఆతర్వాత థియేటరుకి వెళ్ళి సినిమా చూసిన సందర్భం లేదు. అమెరికా వచ్చిన తర్వాత, సూరిగాణ్ణి ఒకటి రెండు సందర్భాల్లో తీస్కెళ్దాం అనుకున్నా మనోడు తెలుసుగా, ఒకడు ఇద్దరితో సమానం కాబట్టి, కొంత భయపడ్డాం. అనఘ పుట్టినాక రోజూ సినిమాలే కాబట్టి ఇక ప్రత్యేకించి థియేటరుకి వెళ్ళాల్సిన అవసరం రాలేదు.
ఇహ ఇప్పటి సందర్భానికి ప్రేరణ -
రెండువేల ఆరులో ఈ కార్స్ సినిమా రిలీజు అయ్యింది. అప్పట్నుండి సూరిగాడు లైటెనింగ్ మెక్వీనుకి పెద్ద పంఖా అయిపొయ్యాడు.

Cars_2006.jpg

ఎంతలా అంటే నిద్రలో లైటెనింగే లేస్తే లైటెనింగే పడుకుంటే లైటేనింగే. మావిడ ఏదో ఓ మాట చెప్తుంది ఈలాంటి పిచ్చికి. లాఫ్ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ? అనుకుంటా. అంటే, వాడినకొద్దీ పిచ్చి పెరగటం. ఎవరికైనా వాడినకొద్దీ మోజు తగ్గుతుంది. కానీ మనోడికి చూసినకొద్దీ పిచ్చి ఎక్కువౌతున్నది. వాడు గీసే బొమ్మలన్నీ లైటెనింగ్ మెక్వీనువే. మొదట్లో ఓ యాంగిల్లో గీస్తే ఇప్పుడు రకరకాల యంగిల్సులో గీస్తున్నాడు.
అనఘకీ ఎక్కించాడు. అనఘ ఎక్కడ లైటెనింగ్ మెక్వీన్ కనిపించినా సూర్యా మెకీన్ మెకీన్ అన్నకి చూపిస్తుంది.
ఇహ ప్రస్థుతంలోకి వస్తే మూడు నెలల ముందునుండి ఈ కార్స్ రెండు చిత్ర ప్రకటనలు మొదలైయ్యాయి. వీడి గోల మొదలైంది. ఇట్టే పట్టేసాడు ఆ ప్రకటనలలలో వచ్చే పేర్లను. ఫ్రాన్చెస్కొ బెర్నౌలి పేరు పట్టేసాడు. చూద్దామా రిలీజ్ అయ్యిందా చూద్దామా రిలీజు అయ్యిందా అని గోల మొదలైంది. జూన్ ఇరుబత్తినాల్గున రిలూజు. దాన్ని నోట్ చేస్కున్నాడు. ఇవ్వాళ్ళ జూన్ పది, పదకుండు, ఇవ్వాళ్ళ పన్నెండు ..ఇలా లెక్కబెట్టటం మొదలైంది. మొత్తానికి జూన్ ఇరుబత్తినాల్గు రానేవచ్చింది. నాన్నా రిలీజు అయ్యింది నాన్నా, ఎత్తుకెళ్తవా నాన్నా అని పాట పాట్టం మొదలెట్టాడు. మా టైని టీనీ ఊళ్ళో అది రిలీజు కాలేదు. ఏంజేస్చాం బాబూ దగ్గర్లోని సిటీలోని ఏ.యం.సి వారి ఐమాక్స్ త్రి-డీ థియేటరులో టిక్కెట్లు బుక్ చేసి ఎత్తుకెళ్ళాను జనాలని.
వాడికి, వాడి జీవితంలోనే మొట్టమొదటి సినిమా, థియేటరులో, అదీ త్రీడీ. ఎక్జైట్మెంట్ తట్టుకోలేక పొయ్యాడు బిడ్డ.
Cars_2_Poster.jpg

బాగా ఎంజాయ్ చేసాడు. అనఘ కూడా అరవకుండా కూర్చుంది. ఐమాక్స్ లో మాకూ మొదటి సినిమానే. మేమూ ఎంజాయ్ చేసాం. ఆరేళ్ళ తర్వాత థియేటరుకి వెళ్ళటం బాగుంది.
ఇక కార్స్ ౨ త్రిడి సినిమా కథ ఇవన్నీ పక్కనపెడితే, తెల్లోడి టేకింగ్ బాగుంది. వాడి ఊహా స్థాయి అత్భుతం.
డిస్నీ గాడు వరసబెట్టి వాడి పాతసినాలకి బూజుదులిపి త్రీడీలోకి వదుల్తున్నాడు. లైయన్ కింగ్ రాబోతోంది త్రిడీలో. సదరు ప్రకటన అత్భుతంగా ఉంది కూడా.
ఐతే త్రిడీ చూట్టం మంచిదేనా కళ్ళకూ? అనేది ప్రశ్నే! కళ్ళు బాగా స్ట్రైన్ అవుతాయట. అంతేకాక తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉందట. కాబట్టి, ఇకపై సూరిగాణ్ణి కేవలం టుడి సినిమాలకే తీస్కెళ్ళాలని నిర్ణయించాను.
article-1271618-096A5718000005DC-566_468x479_popup.jpg

Jun 23, 2011

బజ్జులో కవితావేశం

muralidhar namala -
కచ్చగా రాసా నేనొక కవిత
అది కసి గా తీసుకొచ్చి చదువుతా
వినకపొతే మీ అందర్ని నరుకుతా
అది విని బతికితె మళ్ళీ చదువుతా..
మళ్ళీ చదువుతా..మళ్ళీ చదువుతా..
muralidhar namala - ఓ పిల్లా…….
సరదగా నీపై వేసాను వల…
నువ్వు తగిలావు ఒక చేపలా…
పట్టుకున్నావు నన్ను ఒక జలగ లా..
నిన్నిప్పుడు వదిలించుకొవడం ఎలా.. ఎలా..

Bhãskar Rãmarãju - సచ్చిన పావుని మల్లీమల్లీ సంపటం నేయవా?
అహా!! నాకు తెలవక అడుగుతా
నేయవేనా

Venu Srikanth Darla - అద్దీ అట్టా నిలదీయి భయ్యా..
muralidhar namala - ఏవండీ ఎవన్నా అంటే అన్నామంటారు. ఎవరు విద్యలు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. స్టేజీ మీద మాకూ ఒక అవకాశముంటది కదా.

Bhãskar Rãmarãju - కచ్చగా రాసావా ఓ కవిత
మల్లీమల్లీ సదూతావా ఆ కవిత
మేం ఏంపాపంసేసుకున్నామో చెపుత
అప్పుడైనా ఆపుతావా ఈ కవిత
ఓరి మార్తాండోయ్ ఆపరా నీ మోత
మోగట్నేదు నీ ఈడియో ఏ మోత
ఇట్టా జనాల మీనకు ఒదలమాక ఓ ఉడుకుమోత
మాకసలే ఉక్కపోత
ముర్లి, నువ్వు లగెత్తుకొచ్చెయ్ ఎందుకీ కవిత
సవిత
మోత
కత
కిత

muralidhar namala - ఇస్తా వేడిగా మరొకటిస్తా
చూస్తా మీ అందరి అంతూ చూస్తా
తీస్తా ఒక్కోరికి తిత్తి తీస్తా
కోస్తా బ్లేడుతో సమ్మగా కోస్తా
వేస్తా వేగిన నూనెలో వేస్తా
వస్తా మరో కవితతో మళ్ళొస్తా

Bhãskar Rãmarãju - నువ్వు మరోటి ఏస్తే నే తీస్తా
అంతు చూస్తానంటే బైటికి తీస్తా
తిత్తితీస్తానంటే జర్రున తీస్తా
జోబిలోంచి తాళం తీస్తా
సర్రున స్టార్టు చేస్తా
కారుని రోడ్డుపైకి తెస్తా
ఇక లగెత్తిస్తా

muralidhar namala - వేణుగారు నన్నాపకండి ఈ రోజు నాలో చెలరేగిన ఈ చైతన్య స్రవంతిని ఆపకండంతే. భాస్కరన్నాయ్ ఎంత దూరం పారిపోతాడో చూస్తా ఈ రోజు.

Venu Srikanth Darla - ఓకే మురళి గారు.. ఐతే మీరు తగ్గకండి.. కమాన్ కిల్ ఎవ్రిబడీ... నేను మాత్రం పారిపోతున్నా...

Bhãskar Rãmarãju - లగెత్తే నన్ను
పట్టుకోవలనుకుంటున్న నిన్ను
ఆపలేదు ఏ మన్ను మిన్ను
చూపకు వెన్ను
చూపను నా కన్ను [అంటే నేను ఎనక్కి తిరిగి చూడను అని]
ఉన్నాడు వేణు వెన్ను దన్ను
బయటకి మాత్రం తీయకు పెన్ను
పొడవకు నన్ను
ఒప్పుకుంట నిన్ను
ఒప్పేస్కుంటా ఇంకన్ను

Bhãskar Rãmarãju - రావాల రావాల
కవితలతో కొట్టాల
ఆలోచనల సెగ పుట్టాల
ఇంత సేపెందుకే బాల
అందుకో నా ఈ హేల
రావాల రావాల

Bhãskar Rãmarãju - ఏవిటయ్యా మురళీ
చేయవయ్యా ఏదోక రవళీ
ఆడించెయ్ కవితలతో కథాకళీ
విరగ్గొట్టేయ్ నీ పాళీ

Bhãskar Rãmarãju - అబ్బే
నీ డప్పే
డల్ల మొప్పే
మ్రోతేలే దబ్బే
మ్రోగించాలి మ్రోతబ్బే

muralidhar namala - బజ్జులో కాళుడ నేనే
భరతం పడతారోయ్
కవితా భూతం నేనే
నీఅంతం చుస్తారోయ్

బెజవాడ గుడివాడ
గుంటూరు ఏలూరు
వైజాగ్ ఈజీనరం
భూతాన్ని సాతాన్ని నేనే

జెర్మన్ను లండన్ను
న్యూజెర్సీ షికాగో
దుబాయి మలేషియా
కాష్మోరా కాద్రాని నేనే

Bhãskar Rãmarãju - ఇంత సేపు టయంతో
ఈ కవితా వ్రాసేది
కవితలతో భరతం
పడతావని అనుకుంటే
నలుగంటే నాలుగే
పన్నాలతో తుఱ్ఱున
నీళ్ళు పోసి
ఇదే కాద్రా ఇదే
ఇదే కాష్మోరా ఇదే
అంటావేంటి

Bhãskar Rãmarãju - విరామం
ఇప్పుడే వస్తా
బేగి వస్తా
పెన్నులో ఇంకు పోస్కు వస్తా
నీ భరతం పట్టేందుకు వస్తా
చూస్తూండు వస్తా

Bhãskar Rãmarãju - తెలుఁగు ప్రేక్షకులు
మరీ ప్రేక్షకులై
చడీ చప్పుడు చేకుండా
మన కవితావేశపు
వరదలో
ప్రేక్షకులై
స్థాణువులై
అణువులై
శిల్పాలై
ప్రతిమలై
ఇలా చూస్తున్నారేంటీ
ఒక్క జై లేదు
ఒక్క మాట లేదు
ఒక్క ఉలుకు లేదు
ఒక్క పలుకు లేదు
బాగుందని లేదు
బాలేదని లేదు
చప్పట్లు లేవు
అసలు చేతులే లేవు.................................
[నిరసిస్తూ]

muralidhar namala - రామునితోక
గరుక్మంతుని ఈకా......

శేబ్బాసు రెండోసారి బాబు అందరూ కోరస్ ఇవ్వాలి.

రామునితోక
గరుక్మంతుని ఈకా......

ద్రౌపదికోక అద్గదీ
ద్రౌపదికోక

నే జంధ్యాల వారి మేకా ఆఆఆఆ.....

Bhãskar Rãmarãju - రామునితో ఇక
గరుత్మంతుని ఈక
గూర్చి నే మాట్టాడనిక
ఏవైతే అదైతుంది ఆనక
నేనేం చెప్పనిక

muralidhar namala - నేనుకూడా నిరసిస్తూ నీరసిస్తూ

kumar n - హ హ హ హ హాహ్ AWESOME!!! :-)))))))))))))))))))))
మైండ్ కొందరికే దొబ్బిందనుకున్నాను నిన్నటి వరకీ, ఈ దెబ్బతో అందరికీ మోతెత్తి పోవాల,
రండి రండి అందరూ, ఈ గోలలోమ్ మోతలొ ఊగిపోదాం :-)

Venu Srikanth Darla - కుమార్న్ గారు తగునా మీకిది.. ఇలా ఉసిగొల్పడమ్ న్యాయమేనా మీకిది తగునా అని ప్రశ్నిస్తున్నానధ్యక్షా....

Bhãskar Rãmarãju - ఏవిటయ్యా ఇది ముర్లీ
ఎక్కుడన్నారు ప్రేక్షకులు దొర్లి
కవితా వానలో తడిసి ముద్దై
ఆ వానటిలో పొర్లి!!

Venu Srikanth Darla - Jokes apart.. you aguys are awesome :-)))))))))

muralidhar namala - కవి కోరుకునేది చిటికెడు పసుపు డబ్బాడు కుంకుమా కాదన్నయ్యా.. నాలుగు చప్పట్లు రెండంటే రెండే ఈలలు

Bhãskar Rãmarãju - హహహ
Venu Srikanth Darla - అవి కోరుకునేది కవి కదా మురళి గారు.. మీకెందుకు దిగులు :-P :-)))

Bhãskar Rãmarãju - ముర్లి!!
విన్నావా వేణూ మాట
అదే అన్నాను ఆ పూట
వినకు వేణు మాట
అన్నానా పూట
వినలేదు నువ్వు నా మాట
ఇప్పుడు చూడు వారి మాట
నీది కవిత మాట
కాదట నీ మాట
ఒట్టి మూట అట నీ మాట

muralidhar namala - ఎంత మాటన్నారు వేణుగారు హమ్మా

ఈలలు లేవు
గోలలు లేవు
ఈ బజ్జుగోళంలో

మేళాలు లేవు
తాళాలు లేవు
ఈ చర్చల్లో

కలాలు విరిగి
గళాలు కరిగి
తరాలుగా నినదిస్తున్నా

ఈలలు లేవు
గోలలు లేవు
ఈ బజ్జుగోళంలో

Venu Srikanth Darla - అసలే గేయపు గాయలతో గిల గిల లాడుతున్నాం మీరు మరీ చెరోవైపునుండి ఇలా బాదేస్తే ఇంకేమంటాం.. మీరు కత్తి..సుత్తి.. తురుం.. ఎట్సె... చెలరేగిపోండి అంతే అడ్డేలేదు :-)

Bhãskar Rãmarãju - ఈలలు లేవు
గోలలు లేవు
ఈ బజ్జు కీకారణ్యంలో
చప్పట్లు లేవు
అరుపులు లేవు
ఈ కవితార్ణవంలో
*రగ్గుల్లేవు
బొగ్గుల్లేవు* [కీ.శే శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారికి హృదయపూర్వక పాదాభివందనాలతో, వారి స్పూర్తితో]
ఈ నిశీధి నిద్రారణ్యంలో

muralidhar namala - నేను కవిని కాదంటే
అదరను బెదరను
నేను కవిని కాదంటే
అరవను కరవను

కవితలతో పొంగి
గేయాలుగా కురుస్తా
గుండెల్లోకి ఇంకి
గాయాలుగా నిలుస్తా.

Bhãskar Rãmarãju - అడ్డులేదంటూ
అడ్డులేడంటూ
అడ్డు తొలిగవా నేస్తం

నా కవితకు అడ్డే లేదంటూ
నా కవితకు అడ్డే లేడంటూ
నా కవితకు అడ్డు తొలిగావా నేస్తం

కానీ నా కవితకు అడ్డం
ఆ అడ్డు కాదు నేస్తం
నా కవితకు అడ్డం
పోత్సాహం లేకపోవడం నేస్తం

Bhãskar Rãmarãju - ఏంటి ముర్లీ
ఈ బజ్జేంటీ ఇలా ఉందీ?
ఏంటీ ఇంత నిశ్శబ్దంగా ఉందీ?
అమావాశ్య అర్థరాత్రిలా ఉందీ?
చిమ్మచీకట్లో గుమ్మనంగా పడుకున్నట్టుందీ?
రోహిణీకార్తె మిట్ట మధ్యాహ్నంలా ఉందీ?
దుప్పట్లో ముసుగుతన్ని నిద్రిస్తున్నట్టుందీ?
ఏంటి ముర్లీ?
ఈ బజ్జేంటీ ఇలా ఉందీ?

muralidhar namala - కవికి మనుజులెల్ల తోడురాకపోవు గాక
కవితకు జేజేలు లేకపోవుగాక
రావిగాంచని చోటు కవిగాంచు
చూచి ఊరకుండ శోధించు
శోధించి చేధించి కవితలుగా గర్జించు
ఎవ్వరాపగలరూ ఈ కవితా కంచు ఊఊఊ..

[కుమార్ గార్కి, మురళీధర్ నామాల గార్కి, వేణు శ్రీకాంత్ గార్కీ కృతజ్ఞతలతో]

Jun 22, 2011

వీడియో గేమింగులో క్రొత్త ఒరవడి

ఈ మధ్య ఓ మితృడి ఇంటికి వెళ్ళినప్పుడు, వారి పిల్లాడు సూరిగాడు కల్సి ఓ ఆటఆడుతుంటే చూట్టానికి నేనూ వెళ్ళాను. నన్నాశ్చర్యపరచిందా ఆట. బౌలింగ్ ఆట అది. ఆశ్చర్యపరచటాకి కారణాలు ఇవి -
ఇంతక మునుపు నేను ఆడిన చూసిన ఆటలన్నీ ఓ కుర్చీలోనో సోఫాలోనో కదలకుండా కూర్చుని, ఆట్టానికి రిమోటు చేతిలో పెట్టుకుని రిమోటుని మాత్రమే వాడుతూ ఆటలోని కారెక్టర్లను కదలించటం జఱుగుతుండేది. కానీ ఇక్కడ, ఓ చిన్న సెన్సర్ ఉంది ఓ మూల, అది మన కదలికలను పట్టి, ఆ ఆటలోని ఓ కారెక్టరుకి ఆపాదిస్తుంది. వావ్!! భేషైన ఆలోచన అనుకున్నాను. ఆశ్చర్యపోయాను. ఆ సెన్సరుని ఎక్సుబాక్సు వాడు కినెక్ట్ అంటాడు. ఆవేళ వాళ్ళు ఆడింది ఎక్సుబాక్సులో కినెక్టు ద్వారా బ్రున్స్విక్ ప్రొ బౌలింగ్. చాలా బాగా నచ్చింది నాకు. సూరిగాడిక్కూడా బాగా నచ్చింది.

ఇంటికి వచ్చాక, మరి మనవద్ద పి.యస్ త్రీ కదా ఉంది, దానిక్కూడా ఇలాంటి ఇంటరాక్టివ్ గేమింగ్ టూల్స్ ఏవన్నా ఉన్నయా అని కొట్టాను గూగుల్లో.
ప్లేస్టేషన్ త్రీ కోఱకు , మరియూ మూవ్ మోషన్ కంట్రోలర్ అని ఒక సెట్టు కనిపించింది.
PlayStation_Eye.png
PSMove.png
 ఇదేదో బాగుందే అనుకుని వెతగ్గా వెతగ్గా ఓ బండిల్ దొరికింది అమెజాన్లో. పియస్ త్రీ మూవ్ + ఐ + స్పోర్ట్స్ ఛాంపియన్స్ బండిల్. సామ్స్ క్లబ్బులో ఏదోక డీల్ ఉంటే కొట్టేసా మొత్తానికి. ఇంటికెత్తుకెళ్ళంగనే టివీ మీద ఇ ని పెట్టా. స్పోర్ట్స్ ఛాంపియన్స్ గేమ్ డివిడి పీయస్ త్రీలో పెట్టా. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్కుంది. ఆట్టం మొదలెట్టా.
ఈ స్పోర్ట్స్ ఛాంపియన్సులో మొత్తం ఆర్ ఆటలు ఉన్నాయి.
255px-Sports_Champions.png
టేబుల్ టెన్నిస్ (పింగ్ పాంగ్)
బీచ్ వాలీబాల్
గ్లాడియేటర్
డిస్క్ గోల్ఫ్
బాచి
ఆర్చెరి

టెబుల్ టెన్నిస్ నన్ను భలే ఆకట్టుకుంది. ఎంత ఇంటరాక్టివ్ అంటే అంత. నిజ్జంగా టిటి ఆడిన ఫీలింగ్ వచ్చింది. మరోమాట, చెమటలు కక్కేలా ఆడుతున్నా. అదీ ముఖ్యమైన విషయం.
ఇక బీచ్ వాలీబాల్ కూడా చాలా బాగుంది. అనఘ నేనాడతా నేనాడతా అని దూకుతున్నది.
సూరిగాడికి ఫ్రిస్బి డిస్క్ గోల్ఫ్ బాగా నచ్చింది. తెగ ఆడ్డుతున్నాడు.
ఇక ఆర్చెరి భలే ఇంటరెస్టింగా ఉంది. ఐతే ఆర్చెరి ఆట్టానికి రెండు మోషన్ కంట్రోలర్స్ కావాలి. ఒకటి సంధించేది, రెండోది ఎక్కుపెట్టేది. సూరిగాడికి ఇదికూడా నచ్చింది. ఐతే ఇంకాస్త పెద్దైతేగానీ పూర్తిగా అర్థం అవ్వదు+కంట్రోల్ రాదు.
గ్లాడియేటర్ ఆట
Sports_Champions_Gameplay.jpg
గ్లాడియేటర్ అంటే కత్తి యుద్ధ వీరుడు అనగా కత్తుల కాంతారావ్ అన్నమాట. ఈ ఆటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఆడితే చక్కటి కార్డియో గేం అవుతుంది.

వీడియో గేమ్స్, పొట్టకదల్దు ఇత్యాదివి అనుకునేవారు ఈ ఆటని తప్పక ప్రయత్నించాలి.

Jun 16, 2011

ఆమరణదీక్షలో అమరుడైన ఓ స్వామిజీ

ఆమరణదీక్షలో అమరుడై!
గంగను కాపాడే పోరాటంలో

114వ రోజు కన్నుమూసిన స్వామిజీ

డెహ్రాడూన్‌, న్యూఢిల్లీ
భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే గంగానదిని కలుషితం చేస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని, కుంభమేళా జరిగే ప్రాంతంలో నెలకొల్పిన కంకర మిల్లులను తరలించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరాంచల్‌లోని హరిద్వార్‌లో నాలుగు నెలల క్రితం ఆమరణదీక్షకు దిగిన స్వామి నిగమానంద్‌ డెహ్రాడూన్‌లోని హిమాలయన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం 114వ రోజు మరణించారు. నల్లధనంపై ఆమరణదీక్షతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాబా రామ్‌దేవ్‌ ఇదే ఆస్పత్రిలో దీక్ష విరమించారు. రామ్‌దేవ్‌ దీక్షకు అత్యంత ప్రాధాన్యమిచ్చి దేశం నలుమూలల నుంచి ప్రముఖులను పిలిపించి దీక్ష విరమింపజేసిన ఉత్తరాంచల్‌ ప్రభుత్వం నాలుగు నెలలుగా నిరాహారదీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో అదే ఆసుపత్రిలో చేరిన నిగమానంద్‌ను పట్టించుకోలేదన్న విమర్శకు గురైంది.







రాజకీయ సన్నాసుల్ని, రాజకీయ స్వామీజీలనూ పొడవలేని పక్షులు ఏంజేస్తయి? సన్నాసులు స్వామీజీలు అంటూ అందర్నీ ఒకేదాటన కట్టేసి, ముక్కుతో పొడుస్తయి. అసుమంటి పక్షులు/ ఆ పక్షి రెట్టలు ఏరుకుని నెత్తినేస్కునే కుంకలూ ఈ వార్తజూసి ఏడ్చుకోవచ్చు. దమ్ములుంటే, అంత నీతీ నిజాయితీ ఇంటే వాళ్ళూ అంతర్జాలంలో విషాన్ని చిమ్మటం ఆపి, దేశానికి మేలు చేసే దిశలో ఏదోక సాంఘీకాంశంపై నిరాహార దీక్షబూని మమ్మల్ని(సాధారణ జనాల్ను) దేశాన్ని ఉద్ధరించాలని సవాలు చేస్తున్నాను.

ప్రతీ త్యాగాన్ని, ప్రతీ పోరాటాన్నీ రాజకీయం చేసే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం, మనబ్రతుకులు ఇంతేనని గుర్తించేలేని జనాన్ని చూసి బాధగా ఉంది. ఉలుకు పలుకు లేనందుకు కోపంగా ఉంది. కీ.శే నిగమానంద్ ఇలాంటి ఓ సత్యాగ్రహాన్ని మొదలెట్టారని సదరు ఈనాడు వారూ ఎక్కడా వార్తే వేయలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకేసారో నాకైతే అర్థం కాలేదు. పచ్చి స్వార్థపరులు బాబాయ్, పచ్చి స్వార్థపరులు. ఛీఛీ

Jun 14, 2011

తెలుగులో ప్రభుత్వ వెబ్‌సైట్లు

ఇకపై 'అంతర్జాలం'
తెలుగులో ప్రభుత్వ వెబ్‌సైట్లు
ఏక సంకేత లిపిలో సభ్యత్వం!
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్‌సైట్లను తెలుగులోకి అనువదించనున్నారు. ఇక నుంచి ప్రతి వెబ్‌సైట్‌ ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు అంతర్జాలం (ఇంటర్నెట్‌) అమలు కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏక సంకేత లిపి (యూనీకోడ్‌)లో ఇప్పటికే ఎన్నో భాషలు సభ్యత్వం తీసుకున్నాయి. దేశంలో తమిళానికి సభ్యత్వం ఉంది. తాజాగా తెలుగు భాషకు ఏక సంకేత లిపి సమాఖ్య (యూనీకోడ్‌ అథారిటీ)లో సభ్యత్వం తీసుకునేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. దీంతో తెలుగు అక్షర, పదాలు, సంఖ్యలు, అర్థాలకు సంబంధించిన సంకేతాలు(కోడ్‌), అనువర్తనాలు (అప్లికేషన్లు) అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. ఏక సంకేత లిపి సమాఖ్య సమావేశాలకు రాష్ట్రం తరఫున హాజరయ్యే అవకాశం ఏర్పడుతుంది. దీనికి తోడుగా రాష్ట్రంలో వెబ్‌సైట్లకు ఒకే రకమైన ప్రమాణాలు రూపొందించనున్నారు. సెర్చింజన్‌లో తెలుగు భాషలోనూ వెబ్‌సైట్లు సెర్చ్‌ చేయడానికి వీలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బాగుంది. అత్భుతమ్. ఆహ్వానించతగ్గది. ఐతే, ఈ తెలుగీకరణ ప్రహసనంలో ఆంగ్లంనుండి తెలుగుని పుట్టించే ప్రమాదం లేకపోలేదు. అలా ఐతే, ఒక్క పదం కూడా అర్థం కాక జనాలు బుర్రలు నేలకేసి కొట్టుకునే ప్రమాదం ఉంది.
తెలుగు పదాలను ఉన్నవి ఉన్నట్టు వాడటం ఒకెత్తు, ఆంగ్లపదాలను తెలుగులోకి మార్చటం మరో ఎత్తు.
అనువర్తనాలు = అప్లికేషనులు.
బ్రౌన్ నిఘంటువులో అనువర్తనము అంటే -
అనువర్తించు (p. 0057) [ anuvartiñcu ] anu-vartinṭsu. [Skt.] v. a. To attend on, serve, follow, court one's favour. అనుసరించి నడచు. అనువర్తనము n. Serving or following another.
గ్విన్ నిఘంటువు ప్రకారం
anuwartanam

anuwartanam n. application

బూదరాజు గారి నిఘంటువులో
అనువర్తనము అంటే అప్లికేషన్ అని ఉన్నది.

సాధారణ వాడుకదారు నిఘంటువులను అనుక్షణమూ అందుబాటులో ఉంచుకోలేడు.
వెబ్సైట్లలోని పదాలను ఎవరు ఎలా స్టాండర్డైజ్ చేస్తారు? అనేది పెద్ద ప్రశ్నే అని నా అభిప్రాయం.

తెలుగు అంతర్జాల అమలు కోసం నియమింపబడ్డ కమిటీలో వీవెన్ గారికి చోటు దక్కటం గొప్ప విషయం వీవెన్ గారికి అభినందనలు. వారు శక్తికొద్దీ పనిచేసి చక్కటి ప్రమాణాలతో తెలుగు అంతర్జాలాన్ని అభివృద్ధి చేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వారికి నాతరఫునుండి పూర్తి మద్దతుని బ్లాగ్ ముఖంగా ప్రకటిస్తున్నాను. వీవెన్ గారూ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నన్ను సంప్రదింప వలసిందిగా కోఱుతున్నాను.

Jun 12, 2011

జ్ఞాపకాల దొంతర : జిందగీభీ ఏక్ నషాహై దోస్త్ జబ్

సోనీ టీవీలో ఎక్స్ ఫాక్టర్ అనే ఓ ప్రోగ్రాములో ఓ పెద్దాయన ఈ పాట పాడాడు.
din Dhal jaaye haay, raat naa jaay

    * Movie: Guide
    * Singer(s): Mohammad Rafi
    * Music Director: S D Burman
    * Lyricist: Shailendra Singh
    * Actors/Actresses: Waheeda Rehman, Dev Anand
    * Year/Decade: 1965, 1960s

Back to: main index
View: Plain Text, हिंदी Unicode, image


दिन ढल जाये हाय, रात ना जाय
तू तो न आए तेरी, याद सताये, दिन ढल जाये

प्यार में जिनके, सब जग छोड़ा, और हुए बदनाम
उनके ही हाथों, हाल हुआ ये, बैठे हैं दिल को थाम
अपने कभी थे, अब हैं पराये
दिन ढल जाये हाय ...

ऐसी ही रिम-झिम, ऐसी फ़ुवारें, ऐसी ही थी बरसात
खुद से जुदा और, जग से पराये, हम दोनों थे साथ
फिर से वो सावन, अब क्यूँ न आये
दिन ढल जाये हाय ...

दिल के मेरे तुम, पास हो कितनी, फिर भी हो कितनी दूर
तुम मुझ से मैं, दिल से परेशाँ, दोनों हैं मजबूर
ऐसे में किसको, कौन मनाये
दिन ढल जाये हाये ...

ఈ పాట నాకు భలే ఇష్టం. ఆరోజుల్లో రూములో ఉండేప్పుడు కీ.శే శ్రీ మహమ్మద్ రఫీ గారి పాటలు అలా పెట్టుకుని, కోరస్లో పాడుతూ, డిమ్ము లైటులో ఆనందించేవాళ్ళం నేనూ నా మిత్రుడు నరేంద్ర. జ్ఞాపకాలను తాజా చేసిందీ పాట
జిందగీభీ ఏక్ నషాహై దోస్త్ జబ్ ఛడ్ తాహై తో పూఛో మత్ క్యా ఆలమ్ రెహతాహై, లేకిన్ జబ్ ఉతర్ తా హై.............
ఈ పాటకి ముందు దేవానంద్ గారి చాలా ఖ్యాతి పొందిన డైలాగులు పైవి.
ఇక్కడ చూడచ్చు ఈ పాటని
http://youtu.be/xJuK5K0zCa0

Jun 10, 2011

రాందేవ్‌ ఆస్తి ఎంతా?

రాందేవ్‌ ఆస్తి రూ.1100 కోట్లు
వెల్లడించిన బాబా సహాయకుడు
క్షీణిస్తున్న యోగాగురువు ఆరోగ్యం
హరిద్వార్‌: బాబా రాందేవ్‌ నెలకొల్పిన నాలుగు ట్రస్టుల విలువ రూ.1100 కోట్లపైనే ఉంది. వీటిలో దివ్యయోగ మందిర్‌ ట్రస్టు రూ.249.63 కోట్లు, పతంజలి యోగపీఠ్‌ ట్రస్టు రూ.164.80 కోట్లు, భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు రూ.9.97 కోట్లు, ఆచార్యకుల్‌శిక్ష సంస్థాన్‌ రూ.1.79 కోట్ల మూలధనాన్ని కలిగి ఉన్నాయి. ఈ సంస్థలు ఏర్పాటైనప్పటి నుంచి అయిన వ్యయం రూ.751.02 కోట్లు. మొత్తమ్మీద ఈ నాలుగు ట్రస్టుల విలువ రూ.1100 కోట్ల పైనే. బాబా సహాయకుడు బాలకృష్ణ గురువారం ఈ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 'మేము పనిలోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ పారదర్శకతను పాటిస్తాం. ఆదాయం ఎంత? ఖర్చు ఎంత అయింది? ఎలా అయింది? వంటి వివరాలన్నీ కచ్చితంగా నమోదు చేస్తాం' అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము పన్ను కడతామని, తమ అనుబంధ సంస్థల వివరాలను కంపెనీల రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి తీసుకోవచ్చన్నారు. పన్ను వివరాలు, ట్రస్టుల బ్యాలెన్స్‌ షీట్లను తమ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేశామన్నారు. బాబారాందేవ్‌ ఆస్తులపై దర్యాప్తు జరిపించాలంటూ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడించారు.

నాదొక ప్రశ్న -
ఈ వార్తాశీర్షిక *రాందేవ్ ఆస్తి* అని వ్రాసారు. వార్తలోకి వెళ్తే, ఆయన ట్రస్టుల ఆస్తులు అంటున్నారు. ఏవిటీ ఇదీ? ఆయన ఆస్తి వేరే ఆయన ట్రస్టు ఆస్తి వేరే కాదా?

Jun 1, 2011

పోరాడాలె, నిజ్జం! పోరాడకపోతే మెత్కుదొర్కని దినాలు!

ఒక ప్రసంగం
ఒక మాట
ఒక పాట
ఒక బాట
మడుసుల్ని గుడ్డోళ్ళను సేస్తాయంటే
నే నమ్మలా
తెలంగాణా వచ్చుడుకీ
పంట బీడుపోటానికీ
మోకాలుకీ
బోడిగుండుకీ
యాడా సంబందం?
పోరాడాలె
నిజ్జం
పోరాడకపోతే
మెత్కుదొర్కని
దినాలు
ఆ మెత్కులు
దోసే రాజకీయ నాయకులు
రాజకీయ నాకొడ్కులు
నిన్ను కరెంటు బుగ్గకి
ఏల్లాడదీస్చాన్నారు
రాజకీయ బలిమితో
రాజకీయ సొర్థంతో
రాజకీయ కుట్రలతో
రాజకీయం కోసరం
ఆవేశపు
ప్రసంగం
మాట
పాట
బాట
రాపిస్చన్నారు
లెగు లెగు, పోరాడు
సొర్థపు రాజకీయ నాకొడుకుని
సంపేసేయ్
నీలోని
సమాజామ్లోని
మడిసిలోని
సోర్థపు రాజకీయనాయకున్ని
సంపేసేయ్
వెయ్యి తెలంగాణాలు ఒస్తై
వెయ్యి భారతదేశాలు ఒస్తై
అవే ఒస్తై
ఏ తమ్ముళ్ళానూ బలిచ్చే పనిలా
ఏ అన్నలనూ సంపేసే పనిలా
ఏ బస్సులనూ తగలనూకే పనిలా
ఏ జీవితాలనూ కాలరాచే పనిలా
లెగు లెగు.......