Feb 28, 2011

రెండు దశాబ్దాల్లో 2 శాతం తగ్గిన వ్యవసాయ భూమి

రెండు దశాబ్దాల్లో 2 శాతం తగ్గిన వ్యవసాయ భూమి
కేంద్ర మంత్రి పవార్‌ వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ ఒక చేదువాస్తవాన్ని వెల్లడించింది. దేశంలోని వ్యవసాయ భూమి రెండు దశాబ్దాల్లో రెండు శాతం మేర కుంచించుకుపోయిందని తెలిపింది. 1988-89లో 185.142 మిలియన్‌ హెక్టార్లుగా ఉన్న వ్యవసాయ భూమి 2008-09 నాటికి 182.385 మిలియన్‌ హెక్టార్లకు తగ్గిందని పేర్కొంది. అంటే 2.757 మిలియన్‌ హెక్టార్లు క్షీణించింది. ఎకరాల్లో చెబితే.. ఇది 68,12,695 ఎకరాలు. అర్థగణాంక సంచాలక కార్యాలయం నివేదికను ఉటంకిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో వ్యవసాయ భూమి ఏటా తగ్గుతూ వచ్చిందన్నారు. అయితే ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తిపై ప్రభావం చూపలేదని చెప్పారు. 1988-99, 2008-09 మధ్య ఉత్పత్తి దాదాపు 38 శాతం పెరిగిందన్నారు. భూమి రాష్ట్రాల పరిధిలోని అంశమని, సేద్యయోగ్య భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడాన్ని నివారించేందుకు తగిన విధానాన్ని రూపొందించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని పవార్‌ స్పష్టం చేశారు.
================================================================
మరో రెండు దశాబ్దాలలో జఱుగబోయేది అలోచించండి. తొంభైలనుండి భూ దందాకి తెఱలేచింది. రెండువేలకల్లా ఓ భయంకఱ రూపం దాల్చింది. ప్రొపోర్షనేట్ గా చూస్తే, సేద్యపు భూమి తగ్గుదల శాతం పైన ఉటంకించిన రెండు దశాబ్దాలలో, చివరి దశాబ్దంలో బాగా జఱిగుంటుంది. అది ఇప్పుడే వికృత రూపం దాల్చింది. పోను పోనూ అది పెను భూతంగా మారిపోతుంది.
దాంతో, నిత్యావసర కూరలు, పప్పు ధాన్యాల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. కారణం? ప్రతీ పట్టణం చుట్టూ ఉన్న సేద్యపు భూమి కుచించుకుపోవటం, ఇళ్ళ కట్టడాలకి, నిత్యావసరాలకీ నీళ్ళు అటువైపు వెళ్ళటం, పచ్చదనం కనుమరుగు కావటం, పండిన పంట రవాణా ఖర్చులు పెరగటం, కొత్త కొత్త చీడాపీడా రావటం, ఉన్నచీడాపీడా తక్కువ వైశాల్యంలో కాన్సన్ట్రేట్ అవ్వటం. అంతేకాదు, డైయరీ అంటే పాల ఉత్పాదన కూడా తగ్గుతుంది చూస్తూ ఉండండి. మరోకోణం - నిత్యావసర పంటలు పక్కనపెట్టి కమర్షియల్ క్రాప్ వైపుగా వెళ్తున్నారు మన రైతులు. పొగాకు ఇత్యాదివి మరియూ బయో ఇంధనం. అంతేకాదు, పండించే పంటలో ముఫై ఐదు శాతం లైవ్‌స్టాక్ అంటే మాంచాన్నిచ్చే జంతువులకే పోతోంది.

మరో హరిత విప్లవం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని శాస్త్రవేత్తల సూచన ఒకవైపు, తగ్గిపోతున్న సేద్యపు భూమి మరోవైపు.
new-green-revolution-illustration.jpg

[చిత్రం నేషనల్ జియోగ్రాఫిచ్ నుండి]
ఐతే, హరిత విప్లవం వాటర్ టేబుల్ని డిస్ట్రబ్ చేస్తుందనేది ఒకవైపు, తిండి గింజల కొఱత మరోవైపు. మరోకోణం, ఫర్టిలైజర్స్. తక్కువ వైశాల్యంలో ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడితే, నీళ్ళు కలుషితం అవ్వటమే కాకుండా, ప్రాణాంతకంగా మారిపోతున్నదనేది సత్యం.
అంతేకాదు, అవేనీళ్ళు ఆవులకు గేదెలకు మేత. వాటిపాలల్లోకూడా ఫర్టిలైజర్స్ ట్రేసెస్.
ఈ ఆర్టికల్ చదవండి ఇంటరెస్టు ఉంటే -
http://ngm.nationalgeographic.com/2009/06/cheap-food/bourne-text

Feb 24, 2011

బంద్ సంపూర్ణం

23pan18a.jpg
వరంగల్‌ జిల్లాలో మణుగూరు ప్యాసింజర్‌ రైలుకు ఆందోళనకారులు నిప్పంటించటంతో ఒక బోగి పూర్తిగా, రెండు పాక్షికంగా కాలిపోయాయి.

Integral Coach Factory -
Production began in a modest manner in 1955 with the manufacture of seven third class coach shells. Today the coach factory produces more than 1600 coaches of more than 170 varieties. In the year 2007-08, ICF created a milestone by producing 1291 railway passenger coaches, coaches per annum. It employs about 13,000 persons. Nearly 1336 coaches are manufactured every year, and 6 coaches are manufactured per day.

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పదమూడువేల మంది పనిచేస్తూ సంవత్సరానికి పదమూడొందల బోగీలను‌లను తయ్యారు చేస్తారు ఉజ్జాయింపుగా. ఎంత శ్రమ సమయం సదుపాయాలు వనరులు అవసరం అవుతాయీ బోగీలను తయ్యారు చేయాలంటే? అలాంటిది ఒక్క అగ్గిపుల్లతో భగ్గున బూడిద చేస్తే బంద్ సంపూర్ణమైనట్లా?
ఆపండయ్యా మీగోల. ఇప్పటికి కొన్ని వందల బస్సులు ధ్వంసం. రైళ్ళు ధ్వంసం, పట్టాలు ధ్వంసం, చదువులు ధ్వంసం, ప్రాణాలు ధ్వంసం.
రాష్ట్ర ముఖ్యమంత్రికీ ఇతర పార్టీలకు నా అభ్యర్థన. పొలిటికల్ ప్రాసెస్ తో తేల్చుకోవాల్సిన సమస్యలు ఇవి. తొందరగా తేల్చండి. ఎంతకాలం నానుస్తారు? మరెంత నష్టం మానెత్తిన రుద్దుతారూ? మరెన్ని విద్యా సంవత్సరాలు నాశనం చేస్తారూ? మరెందరి లేత జీవితాలను బలితీస్కుంటరూ?

Feb 22, 2011

ప్రత్యేక ఆంధ్రా కొత్త రాజధాని - మాచెర్ల

చదువరి గారి "గవర్నరు గారూ వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా http://chaduvari.blogspot.com/2011/02/blog-post_17.html" టపా వ్యాఖ్యల్లో శ్రీ తాడేపల్లిగారి ప్రపోజల్ నాన్నాలోచింపచేసింది. ప్తాడేపల్లిగారి స్టాండు విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి సర్క్యూట్ లో కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని. గుంటూరు విజయవాడ కృష్ణా డెల్టాల్లో పంటలు బాగా పండేది ఈ సర్క్యూట్ లోనే. కాబట్టి ఆ భూమిని కదల్చటం మంచిది కాదేమో. నా దృష్టిలోనైతే ఆంధ్రాకు రెండు రాజధానులుండాలి.
౧. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, శాసనసభ, ప్రభుత్వ యంత్రాంగం పాలన, కోర్టులు, న్యాయ కేంద్రం ఇత్యాదివి. ప్రభుత్వానికి పనిచేసేవారు ఇక్కడ నివసిస్తారు. వారికి ప్రభుత్వం క్వార్టర్సే కట్తితుందో ఏం చేస్తుందో అంతా ఈ రాజధానిలోనే.
౨. ఫైనాన్సియల్ రాజధాని. ఇక్కడ వ్యాపార సంబంధిత యంత్రాంగం.

దీనివల్ల చాలా లాభాలున్నాయని నా భావన.

ఇక ఏ సర్క్యూట్? ఆంధ్రా/రాయలసీమ లనుండి తెలంగాణను పీకేస్తే, రేపొద్దున, ఆంధ్రావాళ్ళు రాయలసీమలోకొచ్చి మెక్కుతున్నారని మరో మారు పోరాటమనో ఎదోకటి మొదలు కాదని నమ్మకం ఏంటీ?
కాబట్టి ఆ తలనొప్పెదో ఇప్పుడే చెసేస్తే మంచిదిని నా అభిప్రాయం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని నేను కోరుకుంటున్నా.
అదే కనక జరిగితే, మాచర్లని ప్రభుత్వ పరిపాలనా రాజధానిగా చేయాలని నా అభిప్రాయం. పక్కనే కృష్ణమ్మ. నాగార్జున సాగర్. కొండ ప్రాతం. ఏ సమస్యా ఉండదు. చక్కటి ప్లానుతో కట్టవచ్చు. రైల్వే లైను ఉంది. కనెక్టివిటీకి ఏ మాత్రం గోల లేదు.

జై హింద్

Feb 21, 2011

జస్సికని ఎవరూ చంపలేదు!

నిన్న నో వన్ కిల్డ్ జస్సిక అనే సినిమా చూసాను.
కొన్ని కొన్ని సీన్స్ చాలా అత్భుతంగా తీసాడు దర్శకుడు.
జస్సిక అనే ఓ అమ్మాయిని రాజకీయ బలం నెత్తికెక్కిన ఓ కుఱ్ఱాడు, కేవలం మందు ఇవ్వలేదని ఆవేశంతో షూట్ చేస్తాడు. పోలీసు కేసు గట్రా....కోర్టులో కేసు హియరింగుకు వస్తుంది.
ముందు సాక్ష్యం చెప్తాం నిజాయితీగా అన్న సాక్షులు కోర్టులో అడ్డంతిరుగుతారు.
ముద్దాయివైపు వాదించే లాయరు (ఏవంటారూ ఈన్నీ? డిఫెన్స్ లాయరా?) మొదలెడతాడు
మొదటి సాక్షి - ముద్దాయిని పార్టీలో ఢీకొన్న వాడు
లాయరు : అబ్బాయి నువ్వు ముద్దాయిని ఆరోజు పార్టీలో చూసావా?
మొ. సా : చూసాను
లా : ఎలా?
మొ. సా : రెండుచేతుల్తో మద్యపు గ్లాసులు పట్టుకుని వెళ్తుంటే నన్ను ఢీకొట్టాడు
లా : ఓహో! అంటే రెండు చేతుల్తో మద్యపు గ్లాసుల్తో తిరుగుతన్నావన్నమాట. నిజ్జంగానే ఇతన్ని చూసావా? ఆర్ యూ స్యూర్?
మొ. సా : అవును. చూసాను.
లా : ఐతే ఆరోజు నువ్వు ఎన్ని గ్లాసులు తాగా౨వు మద్యం?
మొ. సా : హ్మ్! గుర్తు లేదు.
లా : నువ్వు ఎన్ని గ్లాసులు తాగా౨వో నీకే గుర్తులేదు కానీ ఓ మనిషి, నిన్ను ఢీకొన్న మనిషిని గుర్తుపడతావ్. తాగుబోతా.
అతని సాక్ష్యం చెల్లలేదు.
రెండో సాక్షి - ఈమె హత్య జరిగిన నిమిషంలోపే హత్యా స్థలంలోకి వెళ్తుంది. జస్సి చచ్చి పడుంది. ముద్దాయి చేతిలో రివాల్వర్లోంచి ఇంకా పొగ వస్తూనే ఉంది. అతన్ని ఆపుతుంది. ఏంచేసావ్ నువ్వూ అని.
లా: నువ్వు ఇతన్ని చూసావా అక్కడా
రెం. సా : చూసాను. కానీ ఐ యాం నాట్ స్యూర్
లా: నువ్వు చూసావా అతన్ని?
రెం. సా : చూసాను కానీ
లా: నువ్వు చూసావా
రెం. సా: ఐ యం నాట్ స్యూర్.
ఈమె సాక్ష్యం చెల్లలేదు
మూడో సాక్షి : ఈమె హత్య జరిగినప్పుడు అక్కడె ఉంది. జస్సికి స్నేహితురాలు కూడా. రెండో సాక్షి కూతురు.
లా: నువ్వు ఇతన్ని చూసావా అక్కడా?
మూ. సా : చూసాను. ఇతనే చంపింది.
లా: ఆర్ యూ స్యూర్
మూ. సా: స్యూర్
లా: అతను ఏం డ్రస్సు వేస్కున్నాడో చెప్పగలవా?
మూ. సా: జీన్సు మెరూన్ చొక్కా
లా: అబ్బో. మరి నువ్వేం వేస్కున్నావో చెప్పు
మూ. సా : మౌనం
లా: నువ్వేం వేస్కున్నావో చెప్పు
మూ. సా: మౌనం
లా : తాగుబోతులు. ఎంత తాగారు తెలియ్....
మూ. సా: అయ్యా నేను వెర్సాచే బ్లూవిస్కస్ గౌన్ వేస్కున్నా, లోపల దుస్తులు పలనా వేస్కున్నా. చెప్పమంటే అండర్ ప్యాంటు ఏంటో కూడా చెప్పగలను.

నాలుగో సాక్షి - మూడో సాక్షి తండ్రి. ఇతనూ చెప్తాడు ముద్దాయే చంపాడని.
మూడు, నాలుగు సాక్షాలను కోర్టు ఎంతవరకూ అంగీకరించిందో కథనంలో లేదు.
ఐదో సాక్షి - అడ్డం తిరిగాడు
ఆరో సాక్షి - అడ్డం తిరిగాడు.
ఏడో సాక్షి - అడ్డం తిరిగాడు
ఇలా సాగుతుంది కోర్టుహాలులో.
నాకర్థంకాని లాజిక్కు.
ఒక వ్యక్తి ఆల్కాహాల్ ఎన్ని పెగ్గులు కొట్టాడో గుర్తులేనంత మాత్రాన అతన్ని ఢీకొన్న వాణ్ణి గుర్తుంచుకోలేక పోవడానికి ఎంతశాతం ప్రాబబిలిటీ ఉందీ?

ప్రతివాది లాయరు ఇలా వాదిస్తాడు - అక్కడ ఓ పొడవాటి వ్యక్తి ఓ పొట్టి వ్యక్తి కాల్చారు. వాళ్ళు మా క్లైంటు మరియూ అతని మితృల్లా అనిపించారు. అందుకే సాక్షులు కన్ఫ్యూజ్ అయ్యారు.
కోర్టు వాయిదా వేస్తుంది.
అలా సంవత్సరాలు గడుస్తాయి. ఆరేళ్ళ తర్వాత కోర్టు సరైన సాక్షులు లేనందున కేసుని కొట్టేస్తుంది, ముద్దాయిలను వదిలేయాలని ఆర్డరు వేస్తుంది.

నాకు మిస్సింగా అనిపించిన పాయింట్లు
>>ప్రతివాది లాయరు ఇలా వాదిస్తాడు - అక్కడ ఓ పొడవాటి వ్యక్తి ఓ పొట్టి వ్యక్తి కాల్చారు.
అని ప్రతివాది లాయరు వాదించినప్పుడు, సాక్షులను ప్రశ్నించాలి కదా, అక్కడ వీరు కాకుండా మరెవరున్నారూ అని? ఉన్నది ఏడుగ్గురే. మరి కాల్చిన వారు ఆ ఏడుగ్గురిలో కాకపోతే ఎక్కడనుంచి వచ్చారో కనుక్కోవాలని కోర్టు ఆర్డరు వేయదా?
ఆరేళ్ళ పాటు పై విషయాన్ని స్పృశించలేదంటే ఆశ్చర్యం వేసింది నాకు. ఇది సింపుల్ పాయింట్ కదా.
అక్కడ ఏడుగ్గురే ఉన్నారు. ఏడుగ్గురిలో చంపిన వాళ్ళు లేరని సాక్షులు చెప్పారు. మరి చంపిందెవరూ? అని తేల్చటానికి ఆరేళ్ళు పట్టి చివరకు ఏం తేలలేదని కొట్టేసింది కోర్టు.
హ్మ్!!

ముద్దాయి నేరం చేసి పారిపోయి తర్వాత పోలీసులకు దొరికాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీస్కొచ్చి బొక్కలో పెట్టారు. ఇన్స్పెక్టరు ఆడియో రికార్డరుతో అతన్ని ప్రశ్నిస్తాడు.
టెక్నాలజీ యొక్క ఉపయోగాన్ని ఇరవైఒకటో శతాబ్దంలో కూడా వాడకపోతే ఎలా?
కథ జరిగింది 1999 లో. అప్పటికే ఢిల్లీలాంటి మెట్రోలలో క్లోజ్డ్ సర్క్యూట్ కెమేరాలు వచ్చాయి.

సరే ఓ సినిమా కాబట్టి వదిలేద్దాం.

నిజజీవితంలో, ఇప్పటికైనా మన పోలీసు యంత్రాంగం టెక్నాలజీని ఎడాప్ట్ చేసుకోవాలని నా సూచన. కనీసం ఇంటరాగేషన్ రూము. అందులో నాలుగు యాంగిల్స్ లో కెమేరాలు. ఇలా చేయటం వల్ల వీడియోని టాంపరించ్ చేయలేరు కట్టుదిట్టంగా నిర్వహిస్తే మరియూ సాక్షులో నేరస్తులూ మాటా మార్చలేరు.

Feb 19, 2011

చేతన్ లా పోరాటం చేస్తే వ్యవస్థ మారి తీరుతుందా?

http://weekend-politician.blogspot.com/2011/02/chetans-fight.html
మన వ్యవస్థలో ఇన్ని లోపాలున్నాయి నిజమే. కానీ ఇన్ని లోపాలతో అందరూ ఇంత పోరాటం చెయ్యాలా? కొంతవరకైనా న్యాయం పొందడానికి అందరూ చేతన్ లా పోరాటం చెయ్యాలంటే జరిగే పనేనా? వ్యవస్థ అన్యాయంగా ఉందని, తలొంచుకోవడమో, అడ్డదారులు తొక్కడమో లాంటి బలహీనతలకి మనం లొంగితే ఈ వ్యవస్థ బాగు పడే అవకాశం అసలేమాత్రం ఉండదు. చేతన్ లా కొంతమందైనా పోరాటం చేస్తే వ్యవస్థ మారి తీరుతుంది. అంతేకాదు ఈ అనుభంతో, భవిష్యత్తులో ఎవరైనా పోలీసు, న్యాయ వ్యవస్థల్లో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తే, ఆప్రయత్నాన్ని అర్థం చేసుకొని సరిగ్గా అంచనా వెయ్యగలిగిన చేతన్ లాంటి ఒక పౌరుడు ఈ దేశానికి దొరికడం శుభ సూచికం. వచ్చే వందేళ్ళలో మనం నిర్మించబోయే నవీన భారతావనికి ఇలాంటివాళ్ళే పునాది రాళ్ళు.
చేతన్ కథలో అసలు విలను ఎవరూ? పోలీసు వ్యవస్తా? చట్టవ్యవస్తా? లేక డబ్బా?
నాకైతే మూడూ కాదు అనిపిస్తుంది. మరి తప్పు ఎవరిదీ? పోలీసుకి తప్పుని తప్పులా పట్టుకునే పరికరాలనూ, పోలీసుకు వచ్చే కాల్స్‌ని రికార్డు చేసే పరికరాలనూ, పోలీసుకు ఆడిటింగ్ అనే ఓ ప్రక్రియలోకి తీసుకువచ్చే ఓ వ్యవస్తనూ ప్రభుత్వం చేకూర్చలేక పోతోంది. సో అసలు తప్పు ప్రభుత్వానిది.
పైన మీరు చెప్పిన కథలోని లోపం - యాక్సిడెంటు ఐంది. అవ్వగానే సంఘటనా స్థలం నుండి క్షతగాత్రులను జనాలే తలా ఓ చెయ్యి వేసి తీసారు. అక్కడకి పోలీసు వచ్చాడా? రాలేదా? క్షతగాత్రులను ఎలా ఆసుపత్రికి తరలించారూ? ఎవరు తరలించారూ? సంఘటనా స్థలం నుండి క్షతగాత్రులను తీసుకెళ్ళిన తర్వాత అక్కడేమి జరిగిందీ?

కేసుకి ఇవి ముఖ్యం. ఇవి లేకుండా చేతన్ కింది కోర్టులో గెలిచాడంటే అతని అదృష్టం.
ఇక మీరు లేవనెత్తిన ప్రశ్నలు
ఇన్ని లోపాలతో అందరూ ఇంత పోరాటం చెయ్యాలా?
చెయ్యాలి మరి. చేయకుండా ఉండాలంటే వ్యవస్థలో ఏం మార్పులు కావాలో ఆలోచించాలి. ప్రజాప్రతినిధులు ఓట్లడగటానికి వచ్చినప్పుడు వారికి సలహా ఇవ్వాలి. ప్రజాప్రతినుధుల దృష్టికి జనావసరాలను తీసుకెళ్ళగలగాలి. వాటిని అమలు పరిచేందుకు హామీలు పొందగలగాలి. హామీలు అమలుపరచకపోతే పోరాడే దిశగా వెళ్ళాలి.
కొంతవరకైనా న్యాయం పొందడానికి అందరూ చేతన్ లా పోరాటం చెయ్యాలంటే జరిగే పనేనా?
కాదు. అందుకే వ్యవస్త ఇలా అయ్యింది.
వ్యవస్థ అన్యాయంగా ఉందని, తలొంచుకోవడమో, అడ్డదారులు తొక్కడమో లాంటి బలహీనతలకి మనం లొంగితే!!
మి క్వరిదొ అమిగో! ఎన్నో శతాబ్దంలో ఉన్నావ్? లొంగి అఱవైఏళ్ళు దాటింది.
చేతన్ లా కొంతమందైనా పోరాటం చేస్తే వ్యవస్థ మారి తీరుతుంది.
చేతన్ పోరాటానికీ వ్యవస్త మారటానికీ సంబంధం లేదబ్బా.
అంతేకాదు ఈ అనుభంతో, భవిష్యత్తులో ఎవరైనా పోలీసు, న్యాయ వ్యవస్థల్లో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తే, ఆప్రయత్నాన్ని అర్థం చేసుకొని సరిగ్గా అంచనా వెయ్యగలిగిన చేతన్ లాంటి ఒక పౌరుడు ఈ దేశానికి దొరికడం శుభ సూచికం.
మీ కథనంలో లాస్ట్ పేరా ఇలా చెప్పింది
>>అనుకున్నట్టుగానే అవతలి వాళ్ళు హై కోర్టుకి అప్పీలు చేశారు. ఏదో ఒక రోజు, అలసిపోరా వీళ్ళు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఈ మొత్తం కథలో, అద్భుతమైన మంచి జరిగింది ఇక్కడే. హైకోర్టు మళ్ళీ కేసుని సాగదీయకుండా, వెంటనే సగం పరిహారం చెల్లించి కేసు కొనసాగించుకోమ్మని రూలింగ్ ఇచ్చింది. సగం పరిహారం కోర్టు ద్వారా చెల్లించ బడింది.<<
ఈ అనుభవంతో భవిష్యత్తులో ఎవరైనా పోలీసులు..............హైకోర్టు పోలీసు వ్యవస్తను తప్పుపడుతూ ఏమన్నా తీర్పునిచ్చిందా? లేదుకదా. మరి ఒక సామాన్య కక్షిదారు కేసు గెలిచినంత మాత్రాన చట్ట న్యాయ వ్యవస్తలో మార్పులు వచ్చే పనైతే ఇప్పటికి కొన్ని లక్షల కేసులకు తీర్పులు వచ్చాయి. ఎన్ని కేసులు న్యాయచట్టవ్యవస్తలోని లోపాలను ఎత్తి చూపగలిగాయీ? ఎన్ని సందర్భాల్లో ఆ ఎత్తిచూపులపై నిజ నిద్ధారణజరిగి ఎమెండ్మెంట్ జరిగిందీ?

Feb 16, 2011

ᠤᠯᠠᠭᠠᠨᠪᠠᠭᠠᠲᠤᠷ=ఉలన్ బాటర్

అర్థం అవ్వలేదా
ᠤᠯᠠᠭᠠᠨᠪᠠᠭᠠᠲᠤᠷ=ఉలన్ బాటర్
కథలోకొస్తే

నాన్నా రెక్టాంగ్యులర్ బిస్కెట్‌ని ఒకమూల, చిన్నగా కొరికితే
అంటే ఎలారా
ఎలుక కొరుకుతుందే అలా కొరికితే
ఆ కొరికితే
అదే కేన్సాస్ స్టేట్, ఆ కొరికిన పక్కనే టొపీక
ఓహో
నాన్నా క్యాపిటల్ అంటే ఏంటీ?
గవర్న్మెంట్ ఉండేది అక్కడేరా
గవర్న్మెంట్ అంటే?
నీకిప్పుడే అర్థం కాదులేరా నాన్న
మరి కేన్సాస్ పైన ఏముందీ?
నెబ్రాస్కా
అటుపక్కన
వయోమింగ్
ఇటు పక్కన
మిజోరి
ఇటుపక్కన
కొలరాడో
కిందో?
ఒక్లహామా
మరి ఏ ఆర్ రాసి కేన్సాస్ అని ఎందుకు రాసారూ
అర్కాన్సస్ రా
కాదు నాన్నా
అర్కాన్సా
అదేలేరా
నన్నా ఇదిగో చూడూ


పై బొమ్మ గీసి సూపెట్టాడు.
పై బొమ్మలో టైం మూడైతే క్లాక్ ఎలా చూపుతుందీ అంటే పైన కార్నర్లో వేసాడు.

అమెరికా మ్యాపు వేసే ప్రయత్నం చేసాడు.

ఏందిరా అంటే వాళ్ళకి కేన్సాస్ మ్యాప్ పాయింటింగ్ నేర్పించారు. అక్కడ నుండి మొదలైంది ఈ గోల. గూగుల్ మ్యాప్ చూపెట్టు అని గోల. పెడితే ఏఏ స్టేట్ ఎక్కడా? మొత్తం అడిగాడు. వాటి రాజధానులు ఓ రౌండు అయింది.
ఇక వాడి భోషాణం పెట్టె తీసి ఈ పాత మ్యాపు తెచ్చాడు. బణ్ణుంచి ఇంటికొచ్చాక అదే పని. నేను ఇంటికి రాంగనే దాన్ని పరుస్తాడు. నాన్నా ఉలన్ బాటర్ ఎక్కడో చూపించు అంటాడు. లిబియా ఎక్కడా? మేడగాస్కర్ ఎక్కడా? చైల్ ఎక్కడా? ఉరాగువే ఎక్కడా నా మొహం ఎక్కడా ఇదే గోల.



నాన్నా అలాస్కా ఆ కార్నర్లో ఉంది ఈ కార్నర్లో ఉంది ఎందుకూ? ఇవయ్యా ప్రశ్నలు.

సరేగానీ
సీ ఆఫ్ ఒఖోట్స్క్ హెక్డా ఉంటాయో చెప్తా?

Feb 15, 2011

సీతపై టపాలు కట్టుట ఇకనైనా నిలిపివేయుడి!

పతివ్రత అంటే ఏమిటి ? ఆ పదానికి అర్ధం ఎక్కడైనా ఉందా ? మీరు ఏ నిఘంటువులలోనయినా చూసారా ? నేను చూడలేదు కానీ విన్నాను.
పతీవ్రత అంటే తెలియకుండానే సీత పతీవ్రతా అని ఒకసారి, నేనూ పతీవ్రతనే అని మరోసారి ఎలా స్టేట్మెంట్లించ్చిందామె?

ఇక్కడ కొందరు చెప్పిన దానిని బట్టి తెలిసినదేమంటే పతిని నమ్ముకోవడం, పతిని ఆరాధించడం, పతియే ప్రత్యక్షదైవం అని భావించడం, పతిని జతగాడుగా చూడడం అనేవి నాకు బాగా నచ్చాయి, బాగుంది. మరి సీత ప్రతివ్రతా ? పతిని నమ్మిందా ? ఆరాధించిందా ? ప్రత్యక్ష దైవం అనుకుందా ? పతిని జతగాడుగా అనుకుందా ? వీటన్నిటికీ మీ సమాధానం అవును అయితే మరి ఎందుకు అడవులకు పంపాడు రాముడు అన్నది నా ప్రశ్న ?
మరి కాదూ అంటే?
భార్య పతివ్రత అయితే ముందుగా భర్తకి తెలియాలి ఆ తర్వాతనే ఇతరులకి తెలుస్తుంది.
ఇతరులు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటిటా?. ఇదే భావదారిద్ర్యం. నీకోసం నువ్వు బతకవయ్యా బాబూ. మరొకరికి నువ్వు "నేను మంచోణ్ణే" అని చూపించుకోవాల్సిన అవసరం ఏంటీ?
ఇతరులు విమర్శించారని భార్యని అడవులకి పంపినవాడు రాముడు. అపుడు ఎవరికి విలువ ఇచ్చాడు రాముడు? భార్యకా ? ప్రజలకా ? పతిని సతి నమ్ముకుంటే చాలా ? పతి సతిని నమ్మనవసరం లేదా ? పతినే ప్రత్యక్షదైవంగా, జతగాడుగా భావించి, పతిని నమ్ముకున్న సీతకు మిగిలిందేమిటి? చివరికి  పతిత అన్న ముద్ర మాత్రమే !!
ఓహో! పతిత అనే బిరుదు ఎవరిచ్చారబ్బా? నువ్వా?
కాబట్టి దీన్నిబట్టి ఏం అర్థం అయ్యిందయ్యా అంటే, పతిని నమ్ముకోకూడదు. పక్కింటోణ్ణో ఎదురింటోణ్ణో నమ్ముకోవాల.
ఇలాఉంది మన కాలం.
మొన్నీమధ్య శరత్ కాలం అనే బ్లాగులో ఒకతను ఇలా రాసాడు.

@శరత్ గారు,
చాలా కాలం క్రిందట మీ మిని మీల్సో , టిఫిన్లో టపాలో రాస్తే నేను విసుక్కుని ఇటు రావడం మానేసినట్టు గుర్తు.
*వివాహేతర సంబంధాలు ఎల్లవేళలా తప్పు కావని నా అభిప్రాయం. కొన్నిసార్లు అవి అవసరాలు.* కానీ అవసరానికి అత్యాశకి తేడా వుంటుంది. మీది కడుపు నిండినా తనివి తీరని ఆశ అనుకున్నాను.
ఇలా ఉన్నాయి మన విలువలు. వివాహేతర సంబంధాలు ఎల్లవేళలా తప్పు కాదట. పిచిచ్చివాళ్ళారా. పెళ్ళి చేసుకుని వివాహ బంధానికి విలువ ఇస్తూ ఇంట్లో కూర్చుని మగ్గిపోతున్నారా? పాపం. చట్టాలను మార్చాలి. అవసరాలను చట్టాలు గుర్తించాలి. వాటికి విలువనివ్వాలి. విలువలను వలువల్లా మార్చి, రీతిరివాజులను వివస్త్రలను చేసి, అభ్యుదయపు బాటలో ఊరేగించాలి.

ఇలా ఉన్నారు మన జనాలు. రాముడు సీతని అడవికి పంపిస్తే ఏవిట్టా? రామాయణాన్ని రాసిన వారికి మీకున్నంత తెలివి లేక ఏడ్చిందనుకున్నారా?

చచ్చిన తరువాత వచ్చిన పతివ్రత బిరుదులూ, కళ్యాణాలూ, ఆదర్శ దాంపత్య మన్న ఆదర్శాలూ ఏం చేసుకుంటుంది సీత?
బ్రతికి సాధించలేనిది చచ్చి సాధించేదేమిటి ? బ్రతికి ఉన్నపుడు ఈసడించిన వాళ్ళు చచ్చాక ఆర్భాటంగా దినం చేస్తే చచ్చిన వాళ్ళు వచ్చి చూస్తారా? బ్రతికి ఉన్నవాళ్ళమీద రాళ్ళు వేసేవాళ్ళు సీత చస్తే గానీ నిజం తెలుసుకోరా?
రేపొద్దున మీరు చస్తేగానీ జనాలకి నిజం తెలియదు. సీత చస్తే గానీ నిజం ఏం తెలిసిందబ్బా? నా మట్టి బుఱ్ఱకు అర్థం కాలేదు.
అపుడొచ్చిన ప్రతివ్రతా సర్టిఫికెట్ ఏ షోకేస్ లో పెట్టుకోవాలి ? ఎవరు పెట్టుకోవాలి ? 
రేపొద్దున్న తమరు చస్తే, మీ రేపటి తరాలకు ఒక్కో తరానికి ఒక్కోటి చొప్పున పటం కట్టి మరీ పంచుతారు జనాలు.

అయ్యా నేను కోరుకునేది ఒక్కటే. మీకు నాతో సమస్య ఐతే నా మీద టపా రాయి. సీత మీద పిచ్చి రాతలు ఎందుకూ? అదీ ఒకదానికొకటి సంబంధం లేకుండా? పై ప్రశ్నలవల్ల తమరి ప్రశ్నించే తత్వం మాట అటుంచి ఈవిట్రా ఈ చికాకు ప్రశ్నలు అని అనిపించటమే కాకుండా కోపానికు కూడా తావిస్తున్నాయి.

మీకు నిజంగానే సీతా చరిత్ర మీద అనుమానాలు సందేహాలూ ఉంటే మీరు ఏ పుస్తకాలు చదువుతున్నారో ఏఏ పేజీలలో ఏఏ ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయో ఆయా పేజీలను ఉటంకిస్తూ టపా వేయండి. మీ జ్ఞానికి దాసోహమౌతాం.


సీతని రావణుడు ఎన్ని సార్లు చెరిచాడూ?
సీతలాగా ఉండే ప్రయత్నం చేస్తున్నా!

పై రెండు స్టేట్మెంట్లను కలిపి చూస్తే ఏవిటి అర్థం అవుతున్నదీ?

మీరు రావణుణ్ణి కోరుకుంటున్నారని. రావణుడికోసం ఎదురు చూస్తున్నారాని.

మానసికంగా ఎదగటం అనేది వయసుతో పాటు రావాలి. దాన్నే పరిణితి అంటారు. ఆ పరిణితిని పొందలేని నాడు, స్థితికి తగ్గ ప్రశ్నలు పరిశోధనలు టపాలు కట్టుకోవాలి. తనకి అందని తగని విషయాన్ని సత్-బుద్ధితోనైనా ముట్టుకుంటే విషం అవుతుందే తప్ప మంచిని పెంచదు.

సత్‌చింతన సత్‌బుద్ధి వలన, సత్‌బుద్ధి సత్‌సాంగత్యం వలన మరియూ సత్‌సంఘం వలన ప్రాప్తిస్తుంది.

ఇకనైనా సీతపై టాపాలు ఆపి తమరి మానసిక/భావ వైశాల్యాన్ని పెంచుకోండి.
పోరాటాలు, ఆవేశాలు, ఆక్రోశాలు, విజయాలు, ఓటములు ఇవన్నీ జీవనంలో భాగాలు. మీరు వీటిని నడపాలి, అవి మిమ్ములను నడపకూడదు.

జనాల మనోభావాలతో ఆడుకోవలదు. ప్రశ్నించే తత్వం మీకే కాదు, అందరికీ ఉంది. ప్రపంచంలో మీరొక్కరే కాదు ఆలోచించగలిగిన వాళ్ళు. ప్రతీవాడికీ ఆలోచనా శక్తి పటిమా ఉంటాయని గమనించండి.

సీతపై నాలుగు టపాలు రాసినంత మాత్రాన మీరు అపర అవతార మూర్తికాలేరు.

అయ్యా, ఈ సిరీస్‌లో ఇదే నా చిరాకరి టపా. ఇకపై ఆమె సీతపై మరెన్ని దాడులు జరిపినా నేనైతే ఇక స్పందించను. నా ఈ స్పందనకు కారణం, నా ఐతిహాసం, నా లెగసీపై ఆమె జరుపజూచిన గుడ్డి/అజ్ఞాన/క్షణికావేశ దాడి. ఎవరిపైననో కసిపెంచుకుని ఏడ్వలేక మద్దెలపై పడిన చందాన, ఏడువేల సంవత్సరాల క్రిందటి ఓ స్త్రీ, తన మనోబలం చేత, తను నమ్మిన సిద్ధాంతాలకు తను నమ్ముకున్న సిద్ధాంతాలకు కాలాన్ని ఎదురొడ్డి కట్టుబడి దేవతైన ఓ హైందవ వీరపత్ని గురించి ఏ మాత్రం జ్ఞానం లేకుండా ఏ మాత్రం చరిత్ర తెలియకుండా క్షణికావేశంలో చెప్పుడుమాటలు నమ్మి, ఉమ్మజూసిన నేనలా ఓర్వవలే. నేనూ హైందవవీరుడనే కదా. నా ఐతిహాసము శతృవునకు రొమ్ముజూపనే చెప్పినదే. నా సంపదపై దాడిజరుగ ధైర్యముతో ఎదుర్కొనమనే చెప్పినదే. నే ఎందుకు, నాకెందుకులేమ్మని కూర్చొనవలే?
అందుకే నా మాటని విన్నవించాను. నా ధృక్కోణాన్ని నా టపాలద్వారా తేటతెల్లముగా వివరించాను.
ఇంకనూ వినని ఎడల, సీతమ్మవారినే ప్రార్థించెదను, ఓ తల్లీ, బిడ్డలను కనుటయే నీ వంతు, వారి వారి బుద్ధి వారి కర్మననుసరించియే ఉండును. ఐనననూ నీ ప్రయత్నమున, నీ బిడ్డను సరియైన మార్గమున నడిపించు భారము నీదియే అని విన్నవింతును.

సర్వేజనాః శుఖీనౌ భవంతు.
జై హింద్.

నరహంతక పేట

*నరక పేట రౌడీ*

జైహో జైహో!! నరకన్న పేటకీ జైహో!!
*కుమార్ నరహంతక* బహుపరాక్
*ఆర్కె నరహంతక* మంగిడీలు


సివరాకరికి
బాచిబాబాయ్ నరహంతక!!!

ఏటిసేత్తాం బాబయ్యా! వలాక్కానిద్దాం

పైనోళ్ళంతా ఇంటరునెట్టులో నరహంతక పేటలో ఉంటున్యారంటబ్బా.

Feb 12, 2011

సీత ఇస్మైల్ = మొమైత్ ఖాన్ ఇస్మైల్! హౌ??

విషయ పరిజ్ఞానం ఓ పెద్ద అఖర్లేదు ఇవ్వాళ్ళ రేపట్లో సొంత బ్లాగులో వాంతి చేస్కోటానికి. ఎవరి బ్లాక్కి వాడు/ఆమె రాజు/రాణి, వాంతే చేస్కుంటారో పారుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ, సభ్యసమాజంలో ఉన్నప్పుడు చారిత్రక/ఐతిహాసిక వ్యక్తుల గురించి రాస్తే చూడక తప్పదు. అదీ ఎగ్రిగేటర్లు ఉన్నప్పుడు.
ఇహ, బ్లాగులో, ఓ టపా రాస్తున్నాం అంటే, కూసింత చదువుకున్నేళ్ళే అయి ఉండాలని నా ఊహ.

సీత మొమైత్ ఖాన్‌లాగా నవ్విందా? సీతకి మొమైత్ ఖాన్ ఎలా తెలుసూ?

సో ఈక్వేషన్ ఈజ్ వెరీ సింపుల్.

Feb 10, 2011

ఔరా! ఓ ఇంతీ!! ఇదినీకు చెల్లునా?

దైనందిన జీవినంలో ఎందర్నో కలుస్తుంటాను. మరెందరితోనో మాట్లాడుతు ఉంటాను. కొందరితో ఓ సమూహంలా ఏర్పడతాను. సమూహం అంటే ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువమంది. ఐతే ఎప్పుడైతే నేను కాకుండా రెండోవ్యక్తి సమూహంలోకి వస్తాడో నాతో మాట్లాట్టం ప్రారంభిస్తాడో అప్పుడు సదరు వ్యక్తిలోని మంచి చెడు రెండు కనిపిస్తుంటాయి. కారణం, నా కళ్ళకు మంచి చెడు అద్దాలు రావటం. సో, ద వే యూ లుక్, యూ సీ దట్. ఏ కళ్ళద్దాలతో చూస్తావో అదే రంగు కనిపిస్తుంది.
ఈ సోది దేనికంటే, ఆ రెండో వ్యక్తిలో నాకు నచ్చని గుణాలు అంటే అతను నాకనుగుణంగా లేని లక్షణాలు ఎక్కువున్నాయి అనుకుందాం. మరి నా ఇగో ఊర్కుంటుందా. బ్యాషింగ్ కి దిగుతుంది. అతన్ని కుళ్ళబొడిచెయ్యాలని పిస్తుంది. అతన్ని నా ఇగోలతో నా అభిప్రాయాలతో కుమ్మేసి ప్రపంచానికి నేనేంటో నిరూపించుకోవాలని పిస్తుంది. అందుకు కుతంత్రం పన్నుతుంది మనసు. దీన్నే కోల్డ్ బ్లడెడ్ అంటాం. ఈ కుతంత్రాలను పన్నేప్పుడు ఇతరత్రా సమూహాల సహాయం తీస్కుని, కుమ్ముటం మొదలెడితే, ఎన్డ్ రిజల్ట్ ఏంటబ్బా? అని ఎవరైనా అడగవచ్చు. నా మటుకు నాకు, నా ఇగో సాటిస్ఫై అయ్యిందా అనేది ముఖ్యం. దాంతోబాటు ప్రపంచానికి చూపుకోవలనుకున్నా కదా, ప్రపంచం నా పోరాటాన్ని మెచ్చి ఏనుగునెక్కించి ఊరేగిస్తుందని నా నమ్మకం.
ని(నీ)హారిక అదే చేసింది. భరద్వాజతో విబేధాలు! ఉన్నాయి. తప్పులేదు. రెండో మనిషి. నువ్వు ఏదోక సమాజంలో ఉన్నావు. సమాజం జన సమూహం. నువ్వు ఒక్కత్తివే సమాజం కాదు కదా. వెల్, దెన్, ఇగో సమస్యలు వచ్చాయి. బ్యాషింగులు మొదలైయ్యాయి. గుడ్. ఫైట్. లడాయీ లడ్నా హై నహీ హై తో మర్నా హై. అవును యుద్ధం చెయ్యాల్సిందే. ఐతే, ఆ యుద్ధంలో ఉపయోగించే అస్త్రాలు ఏంటీ? అనేది ముఖ్యం. కుటుంబ సభ్యులను లాగటం అనే ఓ పనికిమాలిన ప్రక్రియతో యుద్ధం గెలిస్తే నీ సమాజం, నీ వెనకనుండి నిన్ను ముందుకు నెట్టిన జనసందోహం నిన్ను అందలం ఎక్కిస్తుందని భావించావు, కానీ, ఆ అందలం పక్కనే ఉన్న అగాథాన్ని గమనించలేక పొయ్యావు.
ఇప్పుడేమైంది. పలు రకాలుగా జన దూషణను చవిచూస్తున్నావు. అగాథంలోకి నిన్నునీవే, నువ్వు నమ్ముకున్నవారే నిర్దాక్షిణ్యంగా నెట్టేసారు.

నీకూ ఇంకా సమయం ఉంది. ఆ అగాథంలో పూర్తిగా జారిపోకముందే నిద్రలే. నిన్ను నీవు సంస్కరించుకో. సమయం మించిపోలేదు.
ఆ సీత ఎవరో కాదు, ప్రతీ హైంద స్త్రీలో ఉందీ అని గ్రహించు.
రావణుడెవరో కాదు నీలోని ఇగో అని గ్రహించు.

నిన్ను నీవు సంస్కరించుకో.


సోదరుడు భరద్వాజకి నా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నా. రేపొద్దున ఇలాంటి సంఘటనలు పున్రావృతం కావచ్చు. నన్నో నిన్నో లేక నీ మితృడినో ఇలా ఇగోల గోలవాళ్ళు గేళి చేయవచ్చు, రచ్చ చేయవచ్చు. దాన్ని తిప్పికొట్టటానికి ఎవరైనా సత్యాగ్రహమో సహాయ నిరాకరణోద్యమమో లేక మౌనవ్రతమో చివరికి నిరాహార దీక్షో చేయాల్సిన పనిలేదు. వారు చేసిన తప్పులను నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఎత్తు చూపితే చాలు.

తప్పు చేయుట మానవ సహజం
నోరు జారుట క్షణికావేశం
సరిదిద్దుకొనుట ఉన్నతం

Feb 9, 2011

ప-తీవ్రత

సీతకన్నా నేనేం తక్కువా? అని నిన్న ఓహరు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఐతే, సదరు వ్యక్తి లేవనెత్తిన ప్రశ్నలకు ఆ వ్యక్తి టపా శీర్షికకు ఏమాత్రం సంబంధం లేదనుకోండి. అది తర్వాత విషయం. అక్కడి కొందరు వ్యాఖ్యాతలకు ప్రతివ్యాఖ్యలు కుమ్మరిస్తూ ఇలా చాటిచెప్పారు. *సీత కన్నా నేను ఎందులో తక్కువా?* అని. ఆమె ఉద్దేశం, సీతని ఒక్కమాటంటే ఇందరు ఇంతలా ఉలిక్కిపడతున్నారే, మా తల్లి మా అమ్మనే అంటావా అంటున్నారే? నేను మాత్రం ఆడకూతుర్ని కాదా? నన్ను ఎందుకు వేధిస్తున్నారూ? అని కావచ్చు. ఐతే, ఆమె ఎంచుకున్న శీర్షిక భలే గమ్మత్తైన శీర్షిక. రావణుడికి సీతమ్మకు మధ్య ఏం జరిగిందీ? ఏం జరిగుండవచ్చూ? ఇలాంటి వాటికి ఓ పెద్ద శ్రమపడి రీసెర్చులు చేయాల్సిన పనిలేదు. రాముడికీ శూర్పణఖకి మధ్య ఏంజరిగిందీ? ఇత్యాది ప్రశ్నలు వేయటం భలే సుళువు. కృతం కర్మ, ఎవడి కర్మ ఫలితంగా వాడికి జ్ఞానం అబ్బుతుంటుంది. కొందరు రాముడు విల్లు ఎక్కుపెట్టాడ్రా అంటే భక్తితో పూజిస్తారు. వాళ్ళ కర్మ అలా ఉంది. మరి కొందరు ఎక్కుపెట్టాడ్రా అంటే ఎడంచేత్తోనా కుడిచేత్తోనా అడ్డంగానా నిలువుగానా ఎడం కాలు ముందుకేసాడా కుడికాలా గోచీ ఎగతోపా౨డా కిందకే ఉంచాడా బిళ్ళగోచీనా మామూలూదా కాటన్ పంచె కట్టాడా లేక పాలిస్టరా ఇస్త్రీ చేసుందా ఇలాంటివి అడగవచ్చు. వారి కర్మ అలా ఉంది.

ఇంతకీ, సీతకన్నా నేనేం తక్కువా? ఈ ప్రశ్నని వర్చ్యువల్ ప్రపంచంలో ఎలా వేస్తారూ? అథవా వేసినా, మెజరింగ్ స్కేల్ ప్రశ్న వేసిన వారి దృష్టిలో ఏంటీ?

సమాజం, ఒక జీవన విధానం నిరంతరం సాగాలంటే ధర్మం అవసరం. అందుకే మన పోనీ, పురుషాధిక్య సమాజం కాబట్టి, పురుషార్థాల్లో మొదటిది ధర్మం అయ్యి కూర్చుంది. ధర్మం కొనసాగాలంటే కొన్ని అవసరాలు ఉన్నాయి. వాటిల్లో పతివ్రత ఒకటి. ధర్మం నడవాలంటే పతీవ్రతల అవసరం ఎంతైనా ఉంది.
సతి పరమశివుని భార్య. సతి అంటే పతివ్రత. పతిని నమ్ముకున్న స్త్రీ పతివ్రత. సమాజం అధిక భాగం సంతానం మీద ఆధారపడి ఉంది. సంతానమే సమాజపు నిరంతర జీవనం. సంతానం తల్లి మీద స్త్రీ మీద ఆధారపడి ఉంది. కావున స్త్రీయే సమాజం. స్త్రీ ఎంత సౌశీల్యవతి ఐతే సమాజం అంత సుశీలం అవుతుంది. ఇంటికి వచ్చిన కోడలును వేదం సామ్రాజ్ఞీభవ అంటుంది. తన కుటుంబానికి ఆమె మహారాణి.
సీతమ్మకానీ రాముడుకానీ రామాయణంలో వారు సుఖించిన జాడ లేదు. అయినా అందరూ సీతారాముల వంటి దాంపత్యాన్నే కోరుకుంటారు.
దీనివల్ల ఏంతెలిసిందీ? ఏం అర్థం అయ్యిందీ?
పాతివ్రత్యం అంటే అదో డిగ్రీ కాదు, మెడల్ కాదు మెళ్ళో వేస్కుని తిరగటానికి. అది మనసుకి సంబంధించింది. కుటుంబనికి సంబంధించింది. మొగుడూ పెళ్ళానికి సంబంధించింది. కబట్టి దాన్ని మెళ్ళో వేస్కుని, నేను పతీవ్రతనే అని ఎక్కడా చాటి చెప్పుకోవాల్సిన పనిలేదు, భార్యైనా భర్తైనా. భార్యని భర్త, భర్తని భార్యా ఒకరినొకరు ఆదరించుకుంటూ కుటుంబాన్ని పిల్లలనూ ఎక్కదీసుకురావటమే ఆడదానికి పాతివ్రత్రం అంటే, భర్తకైన అంతే. వైవాహిక బంధానికి కట్టుబడి ఉండుట, కుటుంబాన్ని కూర్చుకొనుట, నిరంతరం కుటుంబం కోసం శ్రమించుట అనేవే అండర్లైన్డ్.

నేను సీతకన్నా ఏం తక్కువా అనుకునే వాళ్ళు ఉండచ్చు. తప్పులేదు. ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినవి హౌ ఎక్జంప్లరీ ఆర్ యూ ఫర్ యువర్ కిడ్స్/ఫామిలి/సొసైటి. నీ పిల్లలకు/కుటుంబానికీ/సమాజానికీ నువ్వు ఎంతవరకూ ఉదాహరణగా నిలుస్తున్నావూ అని.

సర్వే జనా శుఖినౌభవంతు.

జై హింద్.

Feb 7, 2011

అవార్డులు

నిన్న సోనీ గాడు యాభైఆరొవ ఫిల్మ్‌ఫేర్ అవార్డు ప్రథానోత్సవాన్ని ప్రసారం చేసాడు. రెడ్ కార్పెట్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. షారుఖ్‌ఖాన్ వచ్చాడు తెరమీదకి, అమితాబచ్చనుకు నలభైయేళ్ళ సినీ యువకునిగా పురస్కరించారు. యష్ ఛోప్రా పురస్కారాన్ని అందించాడు.
1969 లో సినిమాల్లోకి వచ్చాట్ట పద్మవిభూషణ్ అమితాబచ్చన్. కభీ కభీ మేరే దిల్ మే అనే పాట వస్తుండాగా అబితాబ్ వేదికని చేరుకున్నారు, యష్ ఛోప్రా అవార్డ్ ఇస్తే వినమ్రతతో స్వీకరించాడు అబితాబ్. శ్రీ మన్నా డే జీవితకాల పురస్కారాన్ని స్వీకరించారు. ఓ మేరి జొహర జబీ తుఝే మాలూం నహి, యే దోస్తీ హం నహీ ఛోడేంగే లాంటి పాటలను ఒకసారి గుర్తుచేసారు.
మిగతా పురస్కారాలను పక్కనపెట్టి, ఇవి చూద్దాం -
మమతా శర్మ అనే గాయకకి "మున్నీ బదనాం హుయీ" అనే పాటని ఆలపించినందుకు అత్యుత్తమ నేపథ్య గాయని అవార్డు ప్రకటించారు.
వారేవా! అసలు ఈ పాట పాట్టం ఎంత కష్టం. ఎన్ని స్వరాలు సంగతులు, మరెన్నో గమకాలు. ప్రత్యేకంగా మున్నీ జందూ బాం హుయి, డార్లింగ్ తేరే లియే అన్న పంక్తి, తెరమీద నృత్యకారిణి యొక్క వైవిద్య భరితమైన హావ భావప్రకటన, నేపథ్యగాయకి సుస్వరమాధుర్యం. కళ్ళారా చూసి చెవులారా విని ఆనందించ వలసిందేగానీ, చెప్పనలవి కాదు. ఆమె, తన ప్రియుని కొరకు జందూ బాం అయ్యిందట. అంతటితో ఊర్కోలేదు, భావప్రకటనలో  పిఱ్ఱని రుద్దుకుంటుంది జందూబాంతో. చిన్నప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలలో జందూ బాం ప్రకటన వినేవాణ్ణి. "జందూ బాం జందూ బాం నొప్పి హరించే బాం" అని. ప్రియుని కొఱకు జందూ బాం అవ్వటమేంటో, అయినా, ఏ తలకో వెన్నుకో జందూబాం పూస్కుంటే బాగుంటుంది గానీ పిఱ్ఱకి పూస్కుంటే ఏమౌతుందో నాకర్థం కాలేదు. ఆ నృత్యభంగిమని అల్లిన కూర్చిన నృత్యకారిణి/ణులు ఫరాఖాన్ లేదా/మరియూ గీతా కపూర్‌కే తెలియాలి.
ఇక అత్యుత్తమ నేపథ్యగాయకునిగా రాహత్ ఫతే ఆలీ ఖాన్ ఇష్కియా అనే చిత్రం కొఱకు ఆలపించిన "దిల్ తో బచ్చా హై జి" అనే పాటకు అందుకున్నారు. రాహత్ ఈ కార్యక్రమానికి రాలేకపోతే, విశాల్ భరద్వాజ్ అందుకున్నాడు.
విశాల్ భరద్వాజ్ ఇష్కియా అనే చిత్రానికి రచయిత, నిర్మాత, మరియూ సంగీత దర్శకుడు.
ఈ మధ్య కొత్త యంపిత్రీలను దింపినప్పుడు ఈ పాటని కూడా దింపాను. మొన్న డ్రైవ్ లో విన్నా ఈ పాటని. ఈ పాటను రాసిన కవికి, అత్యుత్తమ గీత రచనా పురస్కారం దక్కింది. అతనెవరో కాదు, గుల్జార్.
ఈ పాట విన్నప్పుడు పాటలోని మాధుర్యం ఎంత తియ్యగా ఉందో సంగీతం కూడ అంతే తియ్యగా ఉందనిపించింది. విశాల్ భరద్వాజ్ కి ఓ మారు జైహో.
గుల్జార్+భరద్వాజ్ కాంబినేషన్ అత్భుతంగా ఉంటుంది.
ఇలాంటి పాటలు తెలుగులో రావట్లేదని బాధేసింది కూడా.

http://www.youtube.com/watch?v=F90BfpaKGB4

ఒక ముసలోడు ప్రేమకో పడితే ఏమౌతుందో అనేదే ఈ పాట.

ऐसी उलझी नज़र उनसे हटती नहीं
दांत से रेशमी डोर कटती नहीं
उम्र कब की बरस के सफेद हो गयी
कारी बदरी जवानी की छट्टी नहीं
वल्ला ये धड़कन
बढने लगी है
चेहरे की रंगत
उड़ने लगी है
डर लगता है तनहा.. सोने में जी
दिल तो बच्चा है जी ....
थोडा कच्चा है जी
ऐसी उलझी नज़र उनसे हटती नहीं
दांत से रेशमी डोर कटती नहीं
उम्र कब की बरस के सफेद हो गयी
कारी बदरी जवानी की छट्टी नहीं
रा रा रा रा रा

किसको पता था पहलू में रखा
दिल ऐसा पाजी भी होगा
हम तो हमेशा समझते थे कोई
हम जैसा हाजी ही होगा
हाय जोर करें , कितना शोर करें
बेवाज़ा बातें पे ऐंवे गौर करें
दिलसा कोई कमीना नहीं
कोई तो रोके ,
कोई तो टोके,
इस उम्र में
अब खाओगे धोखे
डर लगता है इश्क करने में जी
दिल तो बच्चा है जी ....
दिल तो बच्चा है जी ....
दिल तो बच्चा है जी ....
थोडा कच्चा है जी

ऐसी उधासी बैठी है दिल पे
हसने से घबरा रहे हैं
सारी जवानी कतरा के काटी
पीरी में टकरा गए हैं
दिल धड़कता है तो
ऐसे लगता है वो
आ रहा है यहीं
देखता ही न हो
प्रेम की मारें कतार रे
तौबा ये लम्हे
कटते नहीं क्यूँ
आँखों से मेरी
हटते नहीं क्यूँ
डर लगता है मुझसे कहने में जी
दिल तो बच्चा है जी ....
दिल तो बच्चा है जी ....
थोडा कच्चा है जी
हाँ दिल तो है बच्चा जी




ఇక ఈ షారుఖ్‌ఖాన్ని ప్రతీ సినిమా పురస్కారానికీ ప్రత్యేకంగా పిలవటం ఎందుకో, అతను నటించిన ఏదోక సినిమా అత్యుత్తమ పురస్కారాన్ని గెలుచి తీరుతుంది కదా. ఆస్థాన సినీ కథానాయకునిగా నియమించుకుంటే పోలా. మై నేం ఈజ్ ఖాన్ అనే చిత్ర దర్శకుడికి అత్యుత్తమ దర్శకత్వ పురస్కారం దక్కింది, అతని పేరు కరణ్ జోహర్. హ్మ్.
అత్యుత్తమ చిత్రంగా దబాన్గ్ ఎంపికైంది.
దబాన్గ్ చిత్ర దర్శకుడు - అభినవ్ కశ్యప్. ఇతను అనురాగ్ కశ్యప్ సోదరుడట.

Feb 5, 2011

12 things that will cost less in 2011

Blu-ray players

2009 lowest: $76, Curtis Mathes Blu-Ray Disc Player from Target ($11.83 shipping) 

2010 lowest: $50, Samsung BD-C5500 from HP Home & Office (free shipping)

2011 prediction: $39

Why? You'll probably see a lot of blu-ray players bundled as extras with TVs, but you'll also see them as doorbusters.

 

Kindle e-Book reader

2009 lowest: $259, Kindle 2 from Amazon.com (free shipping)

2010 lowest: $130, Kindle 3 Wi-Fi from Sobongo.com (free shipping)

2011 prediction: $99

Why? Because $99 is a major inflection point for consumer adoption, it was always the inevitable price for the Kindle. You'll pay just slighly more for newer models.

 

42" HDTV

2009 lowest: $490, Panasonic VIERA 42" 600Hz 720p Plasma HDTV from Best Buy ($70 shipping)

2010 lowest: $370, Insignia 42" 600Hz 720p Widescreen Plasma HDTV from Best Buy (free shipping)

2011 prediction: $299

Why? Once they hit $299, LCD HDTVs will destroy the waning market for 32" LCD HDTVs.

 

55" HDTV

2009 lowest: $1,115, LG 55" 120Hz 1080p LCD HDTV from Fry's ($110 shipping)

2010 lowest: $699, Element 55" 120Hz 1080p Widescreen LCD HDTV from Wal-Mart (free shipping)

2011 prediction: $599

Why? 55" LCD HDTV prices ae now where 46" LCD HDTVs were in 2008. So, for 2011, we're predicting what we saw for 46" in 2009.

 

Wii System bundles

2009 lowest: $170, console bundle from Conn's (free shipping)

2010 lowest: $150, console bundle from Best Buy ($10 shipping)

2011 prediction: $99

Why? Expect more price drops as new models come out and competition drives down prices.

 

16GB SD card

2009 lowest: $20, Lexar 16GB Platinum II SDHC Class 4 card from Adorama.com (free shipping)

2010 lowest: $17, Centon 16GB SCHC Secure Digital Class 4 card from TigerDirect.com ($2 shipping)

2011 prediction: $12

Why? Yes, it'll be cheap to pick up a 16GB SD card, but that's because you'll be needing a bigger card before too long for your new, cheap SLR camera.

 

Full-size digital SLR camera

2009 lowest: $346, Pentax K2000 10.2MP Digital SLR Camera with 18-55mm lens from Meijer ($8 shipping)

2010 lowest: $319, Canon EOS Rebel XS 10MP Digital SLR Camera with lens from Barnes & Noble ($5.49 shipping)

2011 prediction: $299

Why? In 2011, these high-powered cameras will start to cost what point-and-shoots cost a few years ago. Why go for ridiculously high megapixel counts in a digital camera when you can get a great SLR instead?

 

15"-16" dual-core laptop

2009 lowest: $299, Dell Inspiron 15n Celeron 2.16GHz 16" Widescreen Laptop from Dell($29 shipping)

2010 lowest: $218, HP G56-127NR AMD 2.3GHz 16" Widescreen Laptop from Fry's ($8 shipping)

2011 prediction: $199

Why? Last year's $300 laptop is today's cheap grab for those who still want computing power but want to pay what they would for a netbook or a cheap Android tablet.

 

17" dual-core laptop

2009 lowest: $450, Acer Aspire Intel Dual Core 2.1GHz 4GB 17" Widescreen Laptop from Staples (free shipping)

2010 lowest: $450, HP G71 Intel Dual Core 2.2GHz 4GB 17" Widescreen Laptop from Office Depot (in store)

2011 prediction: $399

Why? This basic desktop replacement, with a dual-core processor and at least 4GB of RAM, will drop even further in price.

 

Portable GPS

2009 lowest: $42, Magellan Roadmate 1200 at Toys 'R' Us ($8 shipping)

2010 lowest: $45, Motorola MOTONAV 3.5" Portable GPS Navigator with TTS from Woot ($5 shipping)

2011 prediction: $40

Why? Forty dollars seems to be the floor in GPS prices. As people have turned to their smart phones and in-car models, portable GPS manufacturers are desperately adding features, driving up prices for new models.

 

External 2TB USB drives

2009 lowest: $140, Fantom G-Force 2TB eSATA/USB Drive from NewEgg.com (free shipping)

2010 lowest: $90, Fantom Green Drive Pro 2TB eSATA/USB Drive from Buy.com ($7 shipping)

2011 prediction: $50

Why? Because 2TB is the new 1TB. Upgrade to one of these and you'll never have to delete a file just to clear up room.

 

iPhone 3GS

2009 lowest: $199, iPhone 3GS from Apple (free shipping)

2010 lowest: $97, iPhone 3GS from Wal-Mart (in store)

2011 prediction: $49

Why? This price drop is already here! For an 8GB 3GS phone in 2011, at least. Prices will drop for other models, but you'll likely not see the 3GX on sale new for too much longer.


Reference

http://money.msn.com/saving-money/article.aspx?post=6bbf06f4-2701-4d76-b934-eacecdb7bbe9&GT1=33021




20 Things That Will Be More Expensive in 2011

http://dealnews.com/features/20-Things-That-Will-Be-More-Expensive-in-2011/413416.html

Gold — You might have thought Cash4Gold sites were cheesy scams, but you might think about melting down some of your old jewelry if you're watching this commodity. Prices per ounce just keep going up and up. It's a bit of a roller coaster ride if you're looking for an investment, but if you're thinking about selling some gold, 2011 will be a good time.

Feb 2, 2011

వారికి ప్యాకేజీ ఇస్తాం - కిరణ్‌కుమార్‌రెడ్డి

మక్కామసీదు కుట్ర హిందూసంస్థలదే
కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌ : మక్కామసీదులో బాంబు పేలుళ్లకు పాల్పడింది హిందూ తీవ్రవాద సంస్థలేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హఫీజ్‌బాబానగర్‌లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ నగరంలో మత కలహాలు సృష్టించేందుకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలనుంచి కుట్రలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మక్కామసీదు పేలుళ్ల అనంతరం ముస్లిం మైనార్టీ యువకులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని వారికి ప్యాకేజీ ఇస్తామని ఆయన ప్రకటించారు

అత్భుతమైన అలోచన. వచ్చే ఎన్నికల దాకా కిరణ్‌కుమార్‌రెడ్డి, నువ్వు కుర్చీలో ఉంటే, కాంగ్రేస్ గెలుస్తుందీ, నువ్వే సీయం.




జైహింద్

Feb 1, 2011

80 శాతం టీనేజీ యువత పొగరాయుళ్లే

80 శాతం టీనేజీ యువత పొగరాయుళ్లే
అసోచామ్‌
న్యూఢిల్లీ: దేశంలో మెట్రో నగరాల్లోని దాదాపు 80 శాతం మంది టీనేజీ యువత సిగరెట్లకు బానిసయ్యారని 'అసోచామ్‌' సర్వే ఆదివారం వెల్లడింది. గతేడాది నవంబర్‌, ఈ ఏడాది జనవరిలో ముంబయి, గోవా, కొచ్చిన్‌, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, ఇండోర్‌ పాట్నా, పుణె, ఢిల్లీ, చండీగఢ్‌, డెహ్రాడూన్‌ తదితర ప్రధాన నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా 14 నుంచి 19 ఏళ్ల వయస్సున్న 3 వేల మందిని ప్రశ్నించారు. ప్రతి ఐదుగురిలో ఒకరు రోజుకి 13 నుంచి 15 సిగరెట్ల వూదేస్తునట్లు తేలింది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, సిగరెట్లు ఎక్కడైనా సులువుగా లభిస్తుండడం, స్నేహితుల వద్ద నేర్చుకోవడం తదితర కారణాలతో యువతలో పొగతాగే అలవాటు క్రమంగా పెరుగుతోంది. కొందరు పాఠశాల దశలోనే సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. ప్రతిరోజూ దాదాపు 600 మంది టీనేజీ యువత మొదటిసారి పొగతాగుతున్నారు.




పొగతాగటం సరదాగా మొదలౌతుంది. పొగతాగటం నేర్చుకునేది కేవలం *హీరోయిజం* అనుకోవటం వల్ల లేక స్నేహితులు తాగటం వల్ల లేక అభిమాన హీరో తాగటం వల్ల. మొదట పైపైన తాగేవాడు, నెమ్మదిగా లంగ్స్ లోకి పీల్చటం మొదలెడతాడు. లేత ఊపిరితిత్తులు, సచ్చూరుకుంటాయి. కొన్ని కొన్ని ముఖ్య విషయాలు గమనించాలి. మన వెనక తరాలు కూడా చుట్టా బీడీ కాల్చాయి. ఇప్పుడో? సిగరెట్టు కాలుస్తున్నాయి. చుట్ట, శుద్ధ పొగాకు. బీడీ, బీడీ ఆకు. మరి సిగరెట్టో? ప్రాసెస్డ్ పొగాకు. అందువల్ల కెమికల్స్ కలుస్తాయి. పొగాకు వల్ల కలిగే హాని కొంతైతే, ఆ కెమికల్స్ వల్ల కలిగే హాని చాలా ఎక్కువ. రెండో ముఖ్య విషయం, లైఫ్ స్టైల్. ఆరోజుల్లో కనీసం శారీరక శ్రమ ఉండేది. చేతులు కాళ్ళూ ఆట్టం వల్ల హాని కొంతవరకు తగ్గేది. శరీరం తట్టుకోగలిగేది. ఇవ్వాళ్ళ శ్రమ తగ్గింది. బండికో కారుకో అలవాటు పట్టం ఎక్కువైంది. బండి ఓ స్టేటస్ సింబల్ అయ్యింది. సైకిలు తొక్కటం నామోషీ అయ్యింది. నడవటం లేదు. పచ్చిగాలిని పీల్చటం లేదు. బయట లోపలా ఎక్కడచూసినా ప్రాణాంతకమైన కాలుష్యం, పైన దమ్ముకొట్టుట. ఘోరమైన పరిణామాలు ఎదుర్కోబోతున్నారు ముందరి తరాలవాళ్ళు. ముఖ్యంగా భారతీయ యువత. మనవాళ్ళు పాశ్చాత్య పోకడా అంటూ అంటించుకుంటున్న కొన్ని అలవాట్లు నిజానికి పాశ్చాత్యపోకడలు కావు. వీటిని సూడో పాశ్చాత్యపోకడలు అనవచ్చు. మంచిని గ్రహించటం బహుకష్టంగానూ చెడుని మాత్రమే తీసుకొనుట బహు తీపిగానూ.

నేను పొగ మానేసి మూడేళ్ళు కావొస్తోంది. పొగతాగినందువల్ల కలిగిన కొన్ని విపరీతాలు ఇంకా వెంటాడుతున్నాయి. తొందర్లో వాటిని విజయవంతంగా వదిలిచ్చుకో గలననే నా నమ్మకం.




పొగతాగే వారికోసం -