Nov 17, 2010

సెల్ఫ్ మోటివేషన్

సెల్ఫ్ మోటివేషన్, పంతం, పట్టుదల వీటితో దేన్నైనా సాధించవచ్చు.
ఏమా కథ?
నేనీమధ్య నా నడక ట్రెండ్ లేక పా౨టర్న్ మార్చాను. ఇంతకమునుపు గంటకి 3.5 లేక 3.6 మైళ్ళ వేగంతో నడిచేవాణ్ణి.
ఈ మధ్య ఇలా చేస్తున్నా-
నడిచే అరగంటో లేక నలభైనిమిషాల్లో మొదటి ఐదు నిమిషాలు వార్మ్-అప్. మిగతా ముఫై నిమిషాల్లో, మొదటి పదినిమిషాలు గంటకి 4.1 మైళ్ళ వేగంతో, తర్వాతి పదినిమిషాలు 4.0 మైళ్ళ వేగంతో, చివరి పదినిమిషాలు 3.9 మైళ్ళ వేగంతో నడవటం మొదలెట్టా. ఇన్క్లినేషన్ 1 పెడతా. ఈ పా౨టర్న్ వల్ల నా వర్కౌట్ అయ్యేప్పటికి షుమారుగా 280 కేలరీలు ఖర్చు ఔవుతున్నాయి.
నిన్న ఇలా చేసా
గోల్ 45 నిమిషాలు
మొదటి ఐదు నిమిషాలు వార్మ్-అప్
తర్వాతి పది నిమిషాలు 4.1 మైళ్ళ వేగంతో
తర్వాతి పదినిమిషాలు 3.2 మైళ్ళ వేగంతో, ఇన్క్లినేషన్ 10
తర్వాతి పదినిమిషాలు 3.3 మైళ్ళ వేగంతో, ఇన్క్లినేషన్ 9
చివరి పదినిమిషాలు 3.4 మైళ్ళ వేగంతో, ఇన్క్లినేషన్ 8
అంటే కొండ ఎక్కిన ఎఫెక్ట్‌తో నడిచాను.
దానివల్ల నా టోటల్ వర్కౌట్ అయ్యేప్పటికి ఖర్చుచేసిన కేలరీలు 420.
బ్రదరూ, కావాల్సింది మోటివేషన్. నీ మీద నీకు నమ్మకం, *నేను నడవగలను* అనే ఓ నమ్మకం, నడవాలి అనే పంతం. మొదటి పదినిమిషాలు బానే అయ్యింది. ఇన్క్లినేషన్ పెంచా. బాడి అబ్బా, ఆపరా, వెళ్దాం ఇక అని గోల మొదలెట్టింది. నీ ఎన్కమ్మ, నడువ్ అని నడిపించా. చెమట కక్కాను. మూడొ పదినిమిషాలు బుద్ధి తన అసలు రూపం చూపింది. ఇక పద అంది. నో అన్నా. మంచీళ్ళు కావాలి నాకు అంది. అరవమాక అన్నా. షూ లేస్ ఊడింది చూసావా ఇక ఆపు అంది. ఏంపర్లేదు నడువ్ అన్నా.
బీట్ ది క్రాప్ బడ్, దేన్నైనా నువ్వు చేయాలి అనుకుంటే, నువ్వు తప్పక చేయగలవు. కానీ ఎప్పుడూ? ఆ కసి, పంతం పెంచుకున్నప్పుడు.
నిజంగా నువ్వు చేయగలవు.
బీట్ ది క్రాప్ బడ్....

2 comments:

  1. మెషీన్లో పదిహేను ఇంక్లినేషన్లుంటే - ఇలా చేస్తే - ఇరవైఐదు నిముషాల్లోనే 400 కాలరీలు కరుసవుతాయి.....గంట లగెత్తఖ్ఖర్లా...పిక్కలు, తొడలు కూడా గట్టిపడతయి ...స్పీడు - 3.6 లో పెట్టి ఈ క్రింది టైముటేబిలేసుకోని రిజల్ట్స్ ఎలాగున్నాయో సూస్కోవచ్చు...ఎలాగెలాగ తెలుసేటి? ఇయ్యన్నీ నేను రోజూ చేసేయే గాబట్టి.. :)

    Set the speed at 3.6
    First 2 mins - inclination 0
    2 - 3 mins - inclination 2
    4 - 5 mins - inclination 4
    6 - 7 mins - inclination 6
    7 - 11 mins - inclination 10
    12 - 14 mins - inclination 13
    15 - 17 mins - inclination 15
    18 - 20 mins - inclination 10
    20 - 22 mins - inclination 5
    23 - 25 mins - inclination 0

    మిగిలిన అరగంటలో బస్కీలు తీస్కోవచ్చు....అదీ సంగతి....:)

    ReplyDelete
  2. నాకవన్నీ ఏమీ అఖ్ఖరలేదు. ఓ మాంఛి (నెట్‌ఫ్లిక్స్)సినిమా వుంటే చాలు. పట్టుదల, ఓర్పు, సహనం, సమయం, పట్టుదలా గట్రాలు అన్నీ అవేవస్తాయి. ఆకలి దప్పులు కూడా వుండవు.

    నెట్‌బుక్కులో ఓ సిన్మా వేసుకొని ట్రెడ్‌మిల్ మీద నడక లాగిస్తుంటాలెండి. ఆ నడకకు కావాల్సిన అన్నింటినీ ఆ సినిమానే చూసుకుంటుంది. కాకపోతే సినిమా బావుండాలంతే. అది బాగోక పోతే మళ్ళీ అన్నీ మొదటికివస్తాయి.

    ReplyDelete