Jul 31, 2010

కేసీఆర్ గెలుపా లేక మిగతా పార్టీల ఓటమా?

తెలంగాణ అమరవీరులకే ఈ విజయం అంకితం: కేసీఆర్‌
హైదరాబాద్‌: ఉప ఎన్నికల విజయం తెలంగాణ అమరవీరులకే అంకితమని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. ఈ సాయంత్రం ఆయన ఉప ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఈ ఫలితాలు ప్రతిబింబించాయని తెలిపారు. తెలంగాణ సాధనకు ఈ విజయం ఓ మెట్టని అన్నారు. ఈ స్ఫూర్తిని తెలంగాణ వచ్చే దాకా కొనసాగించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్‌, తెదేపాలకు ఈ విజయం చెంపపెట్టని అన్నారు. తెరాస ఓటమి కోసం రూ.200 కోట్లు ఖర్చుపెట్టారని విమర్మించారు. లెక్కింపు జరుగుతున్న స్థానాల్లోనూ విజయం తమదేనని చెప్పారు. కేంద్రం ఈ ఎన్నికలను ఓ రెఫరెండంగా తీసుకోవాలని... శ్రీకృష్ణ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజలు చేసిన బలిదానాలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయని విమర్శించారు.



సందట్లో సడేమియా -

ఓటమికి ఆంధ్రా కాంగ్రెస్‌ వాళ్లదే బాధ్యత: కాకా
హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో ఓటమికి ఆంధ్రా కాంగ్రెస్‌ వాళ్లదే బాధ్యతని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటస్వామి అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై మీడియాతో ఆయన మాట్లాడారు. ఓటమిపై డీఎస్సే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.


కాకా ఆపునీ బాకా

వార్తా పుత్రికలను పక్కనబెడితే -
నా దృష్టిలో పై ఫలితాల విశ్లేషణ ఇలా ఉంది :
ఇది కేసీఆర్ గెలుపు కాదు, తెదేపా ఓటమి. అదేందదీ అనుకుంటున్నారా? ఎందుకంటే, కాంగ్రేస్ చరిత్ర రా.శే.రె తోనే ముగిసిపోయింది. అలా ముగిసే సమయంలో తెదేపా జనాల నాడిని తనవైపుకి తిప్పుకోలేక పోయింది. ఎందుకంటే అత్యధిక మెజారిటీతో రెండోస్థానంలో నిల్చున్నది తేదేపానే కదా. బాబు బాబ్లి గోలతో పొయ్యిరాజేసి తెలంగాణ వంటవండుకుందాం అనుకున్యాడు. కానీ అంత పొలిటికల్ ముమెంటం సాధించినట్టు నాకైతే కనపళ్యా. ఈ వంటకి ఎలచ్చన్ల మసాలా నూరదాం అనుకున్యాడు. పాపం ఏమాత్రం కుదరకపోగా మొదటికే మోసం వచ్చింది. తెరాస గెలిచింది.
కొన్ని వేల ప్రజాసమస్యలు ముందుంచుకుని, కొన్ని కోట్ల ఖర్చుని వృధాగా పెట్టించిన తెరాసా పై ఎవ్వరూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) ఫైల్ చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పైగా ఇది రెండోసారి ఇలా జరగటం. కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే *కాంగ్రెస్‌, తెదేపాలకు ఈ విజయం చెంపపెట్టని అన్నారు. తెరాస ఓటమి కోసం రూ.200 కోట్లు ఖర్చుపెట్టారని విమర్మించారు*. మరి కేసీఆర్ ఎంత ఖర్చుచేసి ఉంటాడో గెల్వటానికి అని నే అడగను. మొత్తంమీద నల్లధనం ఎంత ఖర్చై ఉండిఉండవచ్చో కూడా నాకనవసరం. ఆ డబ్బుని తెలంగాణా సోకాల్డ్ అభివృద్ధికి వెచ్చించి ఉంటేనో అని కూడా నే అడగా.
ఇక ఇప్పుడేంటీ?
కాంగ్రేస్ కథ ముగింపు దశకి వచ్చింది అని నాకనిపిస్తోంది.
జగన్ తెలివితేటలు తెల్లారినట్లే ఉన్నాయన్నట్టుంది.
రేపు జగన్ కాంగ్రేస్ ని చీల్చితే కాంగ్రేస్ కన్నా జగన్ కే నష్టం అని నా అభిప్రాయం.
తెదేపా మరోసారి ఆత్మపరిశీలన చేస్తే బెటర్. ఇకనైనా వన్ మ్యాన్ షో షాడో నుండి బయటకొస్తే తేదేపాకి కనీసం ఉనికైన నిలుస్తుంది. ఎటూ తెలంగాణా వస్తుంది, ఇక ఆంధ్రాలో సత్తా చూపుదాం అన్నట్టుంది బాబు వైఖరి. కాంగ్రేస్ కి ప్రత్యమ్నాయం ఏ పార్టీ? అనేది పెద్ద ప్రశ్నే అని నా అభిప్రాయం. ఇటు చిరంజీవి పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయాడు. కాంగ్రేస్ చిరంజీవి కలిస్తే కొంచెం ఏమన్నా ఉపయోగ పడవచ్చు రెండుపార్టీలకి.

చివరగా రెండు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.
కేసీఆర్ గెలుపు తెలంగాణాకి రెఫరెండమా?
కాంగ్రేస్ కి ప్రత్యామ్నాయం ఏంటి?

14 comments:

  1. కేసీఆర్ గెలుపు తెలంగాణాకి రెఫరెండమా?
    కాంగ్రేస్ కి ప్రత్యామ్నాయం ఏంటి?
    >>>>

    కేసీఆర్ గెలుపు తెలంగాణాకి తప్పకుండా రెఫరెండమే!

    ఇంత పెద్దె ప్రజాస్వామ్య దేశం లో ప్రజాభిప్రాయ సేకరణకు రాజ్యాంగం లో అవకాశమే కల్పించకపోవడం మన దౌర్భాగ్యం.
    నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపే విధానమే వుంటే రాజకీయ పార్టీల డ్రామాలకు, వెధవ వేషాలకు అవకాశమే వుండేది కాదు.

    ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యెక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపధ్యం లో 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రత్యెక తెలంగాణా అనే ఏకైక అంశమే ఎజెండా గా పెట్టుకున్న పార్టీ తంపింగ్ మెజారిటీ తో గెలవడం ప్రజాభిప్రాయం కాక మరేమవుతుంది?

    ఇప్పటికీ తెలంగాణా ప్రజల బలమైన ప్రజాస్వామిక ఆకాంక్షను గుర్తించక పోవడం నియత్రుత్వ ధోరణి టపా మొరొకటి కాదు.

    ఇక కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయాన్ని రేపు ప్రజలే సృష్టించు కుంటారు!

    ReplyDelete
  2. నీకులాగా ఆలోచించే వారున్నంతవరకు తెలంగాణ ప్రజలకు దౌర్భాగ్యమే!!!

    తలకిందకాళ్ళుపైనవెట్టి తపస్సు చేసినా కూడా... కేసీఆర్‌ గెలుపు తెలంగాణకు రెఫరెండమే!!!

    కాంగ్రేస్‌కు మరియు తెదెపాకి ప్రత్యామ్నాయం తెలంగాణలో టిఆర్‌ఎస్సే! డౌటా?

    ReplyDelete
  3. తెలుగు - వోహ్. వాహ్.
    >>తలకిందకాళ్ళుపైనవెట్టి తపస్సు చేసినా కూడా
    ఒక్కసారి ఎలా చేస్తారో చూపించవా.

    ReplyDelete
  4. కేసీఆర్ గెలుపు తెలంగాణాకి రెఫరెండమా?
    >> అంటే ఇప్పుడు ఎన్నికలు జరిగిన 12 నియోజక వర్గాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా లేకపోతే కనీసం తెలంగాణా ప్రాంతమా ?

    ReplyDelete
  5. ఓహో మీరు కూడా కామెంట్ మోడరేషన్ పెట్టారా ఈ పోస్టు ప్రభావమా ? మంచి నిర్ణయం :)

    ReplyDelete
  6. శ్రావ్యా - యూ గాట్ ఇట్.

    :)

    ReplyDelete
  7. శ్రావ్య,

    ఒక్క తెలంగాణా అంశమే ప్రాతిపదికగా తీసుకొని తెలంగాణా అంతా ఎన్నికలు జరిపించండి..ఫలితాలు మీకే తెలుస్తాయి..అప్పుడైనా ప్రజల ఆకాంక్షను గుర్తిస్తారేమో..మీ లాంటి వాళ్లు

    ReplyDelete
  8. ఈ తెలంగాణ గొడవంతా కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గఱుండి మఱీ ఆడిస్తున్న భాగోతమనీ, తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా చేసే ఉద్దేశంతోనే వాళ్ళిదంతా చేస్తున్నారనీ ఇందులో కేసీయార్, కాంగ్రెస్ సీనియర్లూ అంతా పెయిడ్ పాత్రధారులనీ గుర్తిస్తే ప్రత్యేక తెలంగాణ వస్తుందో రాదో మీకే అర్థమైపోతుంది.

    జగన్ ప్రత్యేక పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి తప్పనిసరిగా నష్టం ఉంటుంది. జగన్ కి కొత్తగా వచ్చిపడే నష్టమేదీ లేదు. పైపెచ్చు అతని పార్టీ ఒక్కటే ఒంటిచేత్తో కనీసం 60 - 80 సీట్లు గెల్చుకునే అవకాశం లేకపోలేదని నా అనుమానం.

    ప్రత్యేక తెలంగాణ కాన్సెప్టులో ఉన్న తొఱ్ఱ ఏంటంటే - అది కావాలని వాదించేవారు అసలా డిమాండు ఎలా పుట్టుకొచ్చిందో హాయిగా మర్చిపోతూంటారు. అలనాటి చెన్నారెడ్డి నుంచి ఈనాటి చంద్రశేఖరరావు దాకా వేర్పాటువాద నాయకులంతా తమ తమ పార్టీలలోని అగ్రనాయకులతో సరిపడక "జై తెలంగాణ" అంటూ బయటికొచ్చినవాళ్ళు. తమ వ్యక్తిగత రాజకీయ కెరియర్ సమస్యని యావత్తు తెలంగాణ ప్రజల బతుకుపోరాటంగా మార్చినవాళ్ళు. అధిష్ఠానాలతో నిమిత్తం లేకుండా తమకు రాజకీయంగా స్వతంత్ర నామరూపాలు లేని వాస్తవాన్ని కప్పిపుచ్చి తెలంగాణకు గుర్తింపు లేకుండా పోయిందని తమ బాధని యావత్తు తెలంగాణ బాధగా చిత్రించినవాళ్ళు. అంటే నాయకులకు వాళ్ళలో వాళ్ళకి పడకపోతే ప్రజల్ని ప్రత్యేక రాష్ట్రాల కోసం ఎగసనదోయడం అన్నమాట.

    ఇందుకు విరుద్ధమైన పరిస్థితిని కూడా ఒకసారి ఊహించండి.

    ఇప్పుడు మీరు ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్ని వేఱువేఱు రాష్ట్రాలుగా చేశాక రెండింటిలోను ఒకే పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి. అలా వరుసగా రెండుసార్లు జఱిగిందనుకోండి. ఆ విజయాన్ని ఎలా శాశ్వతంగా కన్సాలిడేట్ చేసుకోవాలా అని ఆ పార్టీ నాయకులు ఆలోచనలో పడతారు. అప్పుడు రెండు రాష్ట్రాల్నీ ఒకటిగా కలిపేయడం కూడా ఇలాగే ఒక ఎన్నికల ఇష్యూ అవుతుంది. ఆయా నాయకులకు తమలో తమకు బాగా సరిపోతే తెలుగువారి సమైక్యం వల్ల రాగల ప్రయోజనాల గుఱించి ఉపన్యాసాలు దంచడం మొదలుపెడతారు. ఇదంతా ఒక క్రీడ. మన ప్రజలు వట్టి గొఱ్ఱెలు. నాయకుల్ని అనుసరించడం తప్ప ఇంకేమీ చేతకానివాళ్ళు. వీళ్ళిలా ఉన్నంతకాలం వాళ్ళు వీళ్ళని తమ సౌకర్యానుసారం కలుపుతూ విడదీస్తూ ఉంటారు.

    ReplyDelete
  9. మొత్తం తెలంగాణాలో/ఆంధ్రప్రదేశ్‌లో రెఫరెండం కాకపోవచ్చు కాని ఎన్నికలు జరిగిన స్థానాల్లో, మిగతా స్థానల్లో కూడా ఒకవేళ జరిగుంటే, రెఫరెండంగా భావించవచ్చుగా...

    కేసిఆర్‌కు చెక్ పెట్టాలన్నా, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం అన్నా అది తెదేపానే(బాబు నే).తెదేపా నిఖార్సైన పార్టి అని కాదు..ఉన్నవాటిల్లో బెటర్‌ అదే...

    జై తెలంగాణా...జై ఆంధ్రప్రదేశ్!!

    ReplyDelete
  10. శ్రావ్యా.... బలే మంచి మాట చెప్పారు !

    ReplyDelete
  11. ఫణి గారు నేను, నాలాంటి తెలంగాణా ఆకాంక్ష గుర్తించటం వలన ఒక్క నయాపైసా కూడా ఉపయోగం లేదు కాబట్టి అంత డబ్బు దండగ ఎందుకులేండి.
    సోనియా గాంధీ కి వచ్చే ఎన్నికలలో తెలంగాణా ఇవ్వటం వలన లాభం ఐతే వచ్చే తెలంగాణాని ఎవ్వరు ఆపలేరు అలాగే నష్టమైతే వచ్చే సమస్యే లేదు ఇది నా అభిప్రాయం !
    ఒక్క తెలంగాణా అంశమే ప్రాతిపదికగా తీసుకొని తెలంగాణా అంతా ఎన్నికలు జరిపించండి>> ఒకవేళ నిజం గా ఈ అభిప్రాయ సేకరణ జరగాల్సి ఉంటే ఇప్పుడు విడిపోవటం అన్న సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కాబట్టి మిగిలిన ప్రాంతాల అభిప్రాయం అవసరమే, కాదంటారా ?
    నాకు తెలుసు మీరు మిగిలిన వాళ్ళ అభిప్రాయం తో పనేమిటి అంటారని మరి గతంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం ఎంతో మంది ఆ ప్రాంత జనాలు వాళ్ళ ఆస్తులని ప్రాణాలని పోగొట్టుకొని కూడా ఈ ప్రాంత నాయకులు ప్రజలు ఒప్పుకోకపోవటం వలన కలిసి బతుకుతున్నారు మరి .

    ReplyDelete
  12. >> ఈ తెలంగాణ గొడవంతా కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గఱుండి మఱీ
    >> ఆడిస్తున్న భాగోతమనీ

    ఆళ్ళకంత సీను లేదు తాడేపల్లి గారు.

    @భా.రా.రా.
    రా.శే.రె మాటల్లో చెప్పాలంటే: "యభై స్థానాల్లో పోటీ చేసి, పట్టుమని పది సీట్లు కూడా గెలవలేకపొయారు." ఇప్పుడు ఆ పది సీట్లలో శాయశక్తులూ ఒడ్డి, ఐ.కా.సా ల ద్వారా జనాల్ని పోగేసి, సిట్టసివరివరకూ ఏమవుద్దా అని భయపడుతూ గెల్చారు.

    ఇప్పుడు దాని పట్టూకొని రెఫెరెండం అనటం, హాస్యాస్పదం!

    ReplyDelete
  13. ఈ ఫలితాలను తెలంగాణ ప్రజల అభిప్రాయంగా పరిగణించాలనుకుంటాను. గెలవడమే కాదు, గెలిచిన తీరు చూడాలి. పోలైన ఓట్లలో అరవయ్యైదు శాతానికి పైగా పొందడం సాధారణంగా జరిగేది కాదు. పైగా, ఎప్పుడూ..? మూడు పార్టీలు పోటీ చేస్తూండగా, అందులోనూ కాంగ్రెసు, తెదేపా రెంటికీ కలిపి 50 నుండి 60 శాతం దాకా ఓటుబ్యాంకు ఉండగా! వాళ్ళకు డిపాజిట్లు కూడా దక్కలేదంటే చూడండి.

    అయితే ఇది తెలంగాణ ప్రజల అభిప్రాయం, అంతే. రాష్ట్రాన్ని చీల్చేందుకు అది చాలదా అంటే.. చాలదు. అది చాలే పనే అయితే, శ్రీకృష్ణ కమిటీని వేసి, వాళ్ళ చేత చాకిరీ చేయించాల్సిన పన్లేదు. అవతలివాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, కమిటీ అవసరం పడింది. విడిపోడానికి విడిపోతాననేవాడి అభిప్రాయం ఒక్కటీ తెలుసుకుంటే చాలదు కదా!

    అయితే ఈ విజయం కేసీయారుదేమీ కాదు. ప్రజలది. రేప్పొద్దున రాష్ట్రం చీలినా, తెలంగాణ ఉద్యమం వెనక్కి పోయినా, మళ్ళీ ఎవడి ఓటుబ్యాంకు వాడికే ఉంటది. బీజేపీ, తెరాసా తమ ఒకటీ పదకొండుతో సరిపెట్టుకోవాల్సిందే! లేదా అదీ అనుమానం కావచ్చు. అసలు తెరాస ఉండకనే పోవచ్చు.

    ReplyDelete
  14. kalisivundadamuvalana nastamu vundi kaabhatte vidipodamantunnaru.jai andhravudyamamu enduku vachindo telusaa?kalisivundadamuvalana majoritygaa vunna andhraprajalaku laabam vundi kaabatti minorityga vunna telangana prajala demandku viluva ivvakapovadam prajaswamyam anipinchukodu.kcr puttakamundununchi vunna telanganavaadanni kcrtho mudipettadamu vijnata anipinchukodu.nijangaa telangana raakudadu ani anukune andhraprajalu doubiegame aadutunna paartilanu bhahiskarinchandi.ippatinundi 2014varaku jarige electionlalo vache palitaalu elavuntayo samplega chusaru.jai telangana jaijai telangana

    ReplyDelete