ప్రపంచ కప్పు ఓ చుట్టు దాటి ఇంకో ఘట్టంలోకి అడుగుబెట్ట బోతోంది.
ఇప్పటికి జరిగిన గుంపు స్థాయి ఆటల్లో కొన్ని మాత్రమే అనూహ్య మలుపులు కాగా మిగతా అన్నీ అనుకున్నట్టే జరిగాయి.
ఫ్రాన్స్, ఇటలీ జట్లు గుంపు స్థాయిలోనే తిరుగుముఖం పట్టగా, అమెరికా స్యూపర్ పదహారుకి చేరుకుంది.
స్యూపర్ పదహారు స్థాయిలోకి రాంగనే అమెరికా, ఇంగ్లెండు, మెక్సికో లాంటి జట్లు ఇకచాల్లే అని ఓడిపోయి వెనుతిరిగారు. జపనీయులు పోరాడి ఓడారు. హాన్డా బాగా ఆకట్టుకున్నాడు. పోర్చుగీసువారు గ్రూపు స్థాయిలో రాణించినా స్యూపర్ పదహారు మాచిలో పాపం రాణించలేకపొయ్యారు. ఆ జట్టు లోని స్టార్ ఆటగాడైన క్రిస్టియానో రొనాల్డో ఏమాత్రం ఆకట్టుకోలేకపొయ్యాడు. ఆ దేశం ఈ టోర్నమెంటులో ఆడిన నాలుగు ఆటల్లో అతను ఓ కీలక ఆటగానిలా ఉన్నాడేకానీ కేవలం ఒకే గోల్ ని చేయగలిగాడు.
క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్న జట్లు -
జెర్మని
ఉరుగ్వే
పరాగ్వే
స్పెయిన్
అర్జెంటీనా
బ్రాసిల్
నెదర్లాండు
ఘన
స్వల్ప విరామం తర్వాత, జూలై రెండునుండి తుది సమరానికి తెరలేవనుంది
ఉరుగ్వే - ఘన
బ్రసిల్ - నెడర్ల్యాండెన్
పోరు జూలై రెండున జరగనుంది
జెర్మని - అర్జెంటీనా
ఇస్పాన్య - పరాగ్వే
పోరు జూలై మూడున జరగనుంది
దీంట్లో జెర్మని - అర్జెంటీనా పోరు అత్యంత ఉత్సుకత కలిగించే పోరూ అని చెప్పవచ్చు. కారణం రెండు జట్లు ఇప్పటికి కనీసం ఒకసారి ప్రపంచకప్పుని గెలిచన జట్లే. అర్జెంటీనా ఇప్పటికి రెండుసార్లు రెండోస్థానం మరియు రెండుసార్లు కప్పు గెలిస్తే, జెర్మనీ ఇప్పటికి నాలుగు సార్లు రన్నర్స్ అప్, మూడు సార్లు కప్పు గెలిచింది. ప్రేక్షకవీక్షకులకు ఈ రెండు జట్లు క్వార్టరు ఫైనల్స్ లో తలపట్టం కొంచం నిరుత్సాహ పరిచే విషయం. ఏ సెమీస్ లోనో ఫనల్స్ లోనో తలపడాల్సిన జట్లు ఇవి.
ఇక మిగతా జట్లలో బ్రాసిల్ ఇప్పటికి ఐదు సార్లు కప్పు కొట్టింది. ఉరుగ్వే ఇప్పటికి రెండు సార్లు కప్పు కొట్టింది. ఘనా అనే నల్లవజ్రాల దేశం మొట్టమొదటి క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చింది. అలాగే పెరాగ్వే కూడా. ఇస్పాన్యా ఇంతవరకూ ఒక్కసారి మాత్రం నాలుగో స్థానం వరకూ రాగలిగింది. అంటే ఒక్కసారి సెమీస్ కి చేరగలిగింది. ఇక మిగిలింది నెడర్ల్యాండెన్ - ఈ జట్టు ఇప్పటికి ఒకసారి సెమీస్ ఆడగలిగితే రెండు సార్లు రన్నర్ అప్ గా నిలిచింది.
ఎతావాతా, బ్రాసిల్ నెదర్ల్యాండ్ పోరు కూడా ఆసక్తిగా ఉండొచ్చని పండితుల అంచనా. కానీ అర్జెంటీనా జెర్మనీల పోరు వీక్షకులను అల్లాడించవచ్చని నా ఊహ.
ఇక బెట్టింగ్ బంగార్రాజు [అంటే నేనే] ప్రకారం -
క్వార్టర్స్ -
జెర్మని - అర్జెంటీనా : అర్జెంటీనా గెలుస్తుంది
ఉరుగ్వే - ఘన : ఉరుగ్వే గెలుస్తుంది
నెదర్ల్యాండ్స్ - బ్రాసిల్ : బ్రాసిల్ గెలుస్తుంది
ఇస్పాన్యా - పరాగ్వే : ఇస్పాన్యా గెలుస్తుంది
సెమీస్ -
ఉరుగ్వే - బ్రాసిల్ - బ్రాసిల్ గెలుస్తుంది
అర్జెంటీనా - ఇస్పాన్యా - అర్జెంటీనా గెలుస్తుంది
టట్టడాయ్ - ఫైనల్స్ -
బ్రాసిల్ - అర్జెంటీనా
ఎవ్రు గెలుస్తురూ? నా బెట్ - అర్జెంటీనా
ఇక వీరి మెఱుపులు ఎలా మఱవనున్నాయో చూడాలి -
మెస్సి - ఇతను ఎక్కువ గోల్స్ చేయనప్పటికీ అర్జెంటీనా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు
గొన్జాలో - ఇతను ప్రపంచకప్ లో అత్యధిక గోల్స్ చేసిన ఆటాగాడు
కార్లోస్ తెవేజ్ - ఇప్పటికి రెండు గోల్స్ కొట్టాడు
ముల్లెర్ - ఇప్పటికి మూడు కొట్టాడు
ఫాబియానో - మూడు గోల్స్ వీరుడు
క్లోజ్ మరియూ పొడోల్స్కి - ఇద్దరూ చెరి రెండు గోల్స్ చేసారు
అసమో గ్యాన్ - ఇప్పటికి మూడు గోల్స్ చేసిన నల్ల వజ్రం
ఇక చెలరేగి ఆడాల్సిన వ్యక్తి మాత్రం కాకా
Jul 1, 2010
Subscribe to:
Post Comments (Atom)
డేవిడ్ విల్లా ని మర్చిపొయారు.. అతను 4 గొల్స్ తొ గొన్జాలో తొ సమానంగా వున్నాడు..
ReplyDeleteif the final happens to be b/n Brazil and Argentina it will be a treat to watch.. because the Latin Americans play with their hearts out unlike their European counterparts..
ReplyDeleteఅయితే జర్మనీ ఓడిపోతుందంటారా... అంతేనా? :-(
ReplyDeleteనాకెందుకో జేర్మనే attacking చూస్తుంటే వాళ్ళు గెలిచే చాన్సు ఉందనిపిస్తోంది మెస్సి ని అడ్డుకుంటే జెర్మనీ కి ఎదురుడులేదు
ReplyDeletebut it takes a team to stop messi :)
బ్రెజిల్ ఈ నిమిషానికి ఏమి జరుగునో any thing can happen
Gonzalo Higuaín or David villa or muller
ఎవరో ఒకరు గోల్డెన్ బూట్ సొంతం చేసుకుంటారు
spain and germany are my favourites
భాస్కర్ అన్నయ్యా
ReplyDeleteమెస్సి మారడోన వీడియో పెట్టినప్పుడే అనుకున్నాను ఇలాంటి కుట్ర ఏదో ఉంటుందని మీ ఫేవరెట్ అర్జంటినానే అని :)
betting ramraju :)
ReplyDeletevisit gsystime.blogspot.com
ReplyDelete