Jul 2, 2010
ఐఫోన్ లో చక్కటి చిక్కటి తెలుఁగు
సోడ్రసోడ్రీమణులారా
నిన్న రాత్రి నా ఐఫోన్ని ఛార్జింజ్ కోసం కంప్యూటర్ కి తగిలించా. వేంటనే ఐట్యూన్స్ "బాబాయ్!! ఐఫోన్ ఓ.యస్ ౪ వచ్చిందంట. దింపనా?" అని అడిగింది. సర్లే కుమ్ము అని డౌన్లోడ్ కి పెట్టి పడ్ కున్నా. పొద్దున పొద్దున లెగంగనే బాత్రూంకి ఫోన్ ఎత్తుకెళ్ళి మెయిల్స్ గట్రా గెలకటం అల్వాటు కదా, అట్టా ఫోన్ ని తెరిచా. మెయిల్స్ అని కొడితే, మెయిల్ ఇంటర్ఫేస్ కొత్తగా అనిపించింది. వార్నీ ఇదేదో బాగుందే అని జిమెయిల్లోకి ఎంటారవ్వంగనే నన్నిట్టే లాగేసిన ఇషయం - గీతాచార్య బజ్ రిప్లై చక్కటి తెలుగు రెండరింగుతో. ఎప్పుడూ తెలుఁగు ఫాంట్ విచిత్రమైన రెండరింగ్ తో ఉండేది ఇవ్వాళ్ళ చక్కగా కొట్టొచ్చినట్టు తన్నొచ్చినట్టు గుద్దొచ్చిన్నట్టు కనిపించింది. వరేవా అనుకున్నా.
ఇకపై ఐఫోన్నే వాడుకోవచ్చు తెలుఁగులో చక్కగా రిప్లై ఇచ్చేందుకు.
Subscribe to:
Post Comments (Atom)
వావ్. బ్లాక్ బెర్రీకి ఆ శుభదినం ఎపుడు వస్తుందో ?
ReplyDelete:) :)
ReplyDeletesuper
మొబైల్ లో తెలుగు గురించి తెగవెతికా..నాకు దొరకలా..ఇది ఎం ఐనా ఉపయోగ పడుతుందంటారా??
ReplyDeleteCongrats..
ReplyDeleteమీ బ్లాగు ఈనాడు లో వచ్చినందుకు అభినందనలు..
Keep it up...
నాన్నా, ఆ కొత్త ఓయెస్ ఎట్త దింపుకోవాలో నాలాంటి నసాంకేతికాలకి చెప్పి కొంచెం పుణ్యం కట్టుకో! ఆమధ్యనెప్పుడో కన్నగాడు గారు చెప్పారు వెచ్చేస్తోందొచ్చేస్తోందని.
ReplyDeleteఅన్నగారూ
ReplyDeleteఇట్యూన్స్ ఆటోమేటిగ్గా అడుగుతుంది.
ఒకవేళ అడక్కపోతే
ఐఫోన్ ని హుక్ చేసాక, ఐట్యూన్స్ కి వెళ్ళి, ఈ బొమ్మలో చూపిన విధంగా అప్డేట్ అని నొక్కితే మీ ఫోనుకు కొత్త ఓయస్ ప్రాప్తిసుంది
అన్నా లింకు ఇచ్చుట మరచితిని, క్షంతవ్యుణ్ణి. ఇదిగో ఆ లంకె రాజము -
ReplyDeletehttp://www.divshare.com/download/11879579-902
You need to download iTunes 9.2 before you can download iOS4.
ReplyDeletevisit gsystime.blogspot.com
ReplyDelete