Feb 25, 2010

తెలుగులో మాట్లాడినందుకు ఓ చిన్నారిని అర్థనగ్నంగా నిలబెట్టిన సంఘటన

తమ్ముడు సుబ్బులు ఓ లంకెని పంపాడు. దాని సారాంశం ఇది -

"తెలుగులో మాట్లాడినందుకు ఓ చిన్నారిని అర్థనగ్నంగా నిలబెట్టిన సంఘటన విజయవాడ లో చోటు చేసుకుంది. స్థానిక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న యామిని అనే విద్యార్థిని తెలుగులో మాట్లాడిందని టీచర్‌ అర్థనగ్నంగా నిలబెట్టింది. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు స్కూలు యాజమాన్యాన్ని నిలదీయడంతో విషయం బయటికి తెలిసింది. ఆ స్కూల్లో ఇదొక్కటే ఘటన కాదని, ఇంతకు ముందు కూడా ఇలాంటి దండన ఇచ్చారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు."

వప్పుకుంటా!! ఆంగ్ల భాషా మాధ్యమ పాఠశాలల్లో తెలుగు మాట్లాట్టం ఘోరం, క్షమించరాని నేరం, శిక్షార్హం. ఐతే ఎలాంటి శిక్ష? ఆ పాఠశాల నిబంధనలు ఏంటీ? ఏమైనా పబ్లిష్డ్ డిస్క్లైమర్ ఉందా? తెలుగులో మాట్లాడితే ఇదీ శిక్ష అని తల్లితండ్రులకు ఏమన్నా చెప్తున్నరా?

ఇక నాణేనికి ఇంకో వైపు -
అసలు ఆంగ్ల భాషా మాధ్యమ పాఠశాలల్లో పనిచెసే ఉపాధ్యాయులకు భాషార్హతలు ఏంటీ?

8 comments:

  1. ఇది చాలా దారుణం అండీ......రియల్లీ టూమచ్......

    దీనికి నా ఫూర్తి స్పందన ఈ కింద లింకులో చదవండి....

    http://sri-ineedi.blogspot.com/2010/02/blog-post_26.html

    ReplyDelete
  2. ఈ వీడియో చూడండి -
    http://www.youtube.com/watch?v=zgCNriFfB0U

    ఇలాంటెధవలు మన నాయకులైతే - ఒక భాషేంఖర్మ మొత్తంగా సంస్కృతిని సాంప్రదాయాల్ని వాటికన్ కు తాకట్టు పెట్టేస్తారందరు కలిసి. అనుమానించక్కర్లేదు వీడు తడిగుడ్డేసి గొంతుకోసే శిక్ష అమలుచేస్తాడు. చిన్నారిని అర్థనగ్నంగా నిలబెట్టిన సంఘటన అసలు శిక్షే కాదు!!!

    ReplyDelete
  3. పోయినసారి ఇసారి రెండు సంఘటనలూ కమిషనరీ బళ్ళలోనే జరగటం యాధృచ్చికమా?
    ఇక జగన్ స్పీచ్ -
    ఇంగ్లీష్ లో ఆలోచిస్తే ఇంగ్లీష్ బాగా వస్తుంది.
    దాని కాన్ట్రరీ -
    తెలుగులో ఆలోచెస్తే తెలుగు బాగా వస్తుంది కదా. తెలుగు ఎందుకు వద్దు అనుకుంటున్నారు జనాలు?
    అసలే జనాలు ఇంగ్లీష్ లో ఆలోచించాలీ?

    ReplyDelete
  4. ఈ వెధవల అత్యుత్సాహం అంతే కానీ నిజంగా నేర్చుకోవలంటే పిల్లలు చాలా తొందరగా భాష నేర్చుకుంతారు, మనకంటే కూడా! అంతగా వారిని హింసించాల్సిన పని లేదు. ప్రతి నగరంలోనూ పేరు పొందిన ఒకటి రెండు స్కూళ్ళలో మాత్రమే పూర్తి స్థాయిలో ఆంగ్ల మధ్యమంలోనే బోధిస్తారు. మిగతా అన్నీ బడుల్లో ఇంగ్లీష్ లో పాఠం చదివి తెలుగులో చెప్తారు. అంతా బోగస్. పైన పటాటోపానికి ఇలాంటివి చేస్తుంటారు. మిషనరీ అన్న ఆలోచన నాకూ వెంటనే స్ఫురించింది :)

    ReplyDelete
  5. కమీషనరీ కాదు, మిషనరీ...అచ్చుతప్పుకు చింతిసున్నా!!:)

    ReplyDelete
  6. చాల దారుణమైన విషయమండి.... ఇలాంటి సంఘటనలు మిషనరి స్కూల్స్ కాకుండా ప్రైవేటు కాన్వెంట్ లో కూడా జరుగుతున్నయి .తల్లి దండ్రులు మాత్రంవాళ్ళ పిల్లలకు ఇంగ్లీష్ బాగా రావాలని ,ఇంగ్లీష్ మీడిం స్కూల్ లోన్నేవేస్తున్నారు .వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లోసరిగ్గా మాట్లాడకపోతే వెళ్లి అడుగుతారు,అందుకే వీళ్ళు ఇలాంటి దారుణాలు చేస్తున్నారు .మా పనమ్మాయి వాళ్ళ పిల్లలు ఇద్దరినీ ప్రైవేటు కాన్వెంట్లో చేర్పిచ్చింది ,అక్కడ ఫీస్లు ఎక్కువ ...ఆమె స్తోమతకు కట్టడం కష్టం . గవెర్నమెంట్ స్కూల్లో చదివించవచ్చుగా అంటే ?మాకు కష్టమయిన పిల్లకి ఇంగ్లిష్లో మంచి చదువు వస్తుందని అనిచెప్పింది .ఇంకేమి మాట్లాడుతము ...

    ReplyDelete
  7. ఇది చాలా దారుణం ఇటువంటివాటిని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి.

    ReplyDelete