Feb 23, 2010

ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ప్రొడ్యూస్

నేను అత్తెసరు మర్కులతో, లోకల్ ఇంజనీరింగు కాలేజీలో, సాదాసీదా యం.సి.యే చదివా. ఏవరేజి మార్కులు. పాస్ అయ్యాక కేంపస్ ఇంటర్వ్యూలు లేవు మాకు. ఏదో కష్టపడ్డా. ఎలానో ఓలా ఉద్యోగం తెచ్చుకున్నా. కిందపడ్డా లేచా. మళ్ళీ పడ్డా మళ్ళీ లేచా. దూరపుకొండల నునుపు చూద్దాం అని ఇక్కడకొచ్చా. నునుపు చూస్తున్నా. ఓ కన్సల్టెంట్ గా నెట్టకొస్తున్నా.
నాకు తెలిసినోడు ఒకడు, పేర్లనవసరం, ఆర్.ఈ.సి లో చదివాడు. మాంచి ర్యాంకు యంసెట్లో. సరే!! సదివాడు. అయ్యింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీయస్లోనో దేంట్లోనో కొట్టేసాడు. రెండేళ్ళయ్యాక అమెరికాలో వాలిపొయ్యాడు. ఓ కన్సల్టెంట్ గా చేస్తున్నాడు.
నాకూ వాడికీ తేడా ఏంటి?
నాబోటి సాధారణ బ్యాక్ గ్రౌండ్ గాడికి గంటకి సే $60 వస్తే, ఆర్.ఈ.సీ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుండొచ్చిన వాడికీ అంతే.
నాకు తెలిసిన కుఱ్ఱాడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో పిజి చేసాడు. బెంగళూరులో ఏదోక కంపెనీలో చేస్తున్నాడు.
మరింక తేడా ఏంటీ?
ఆర్.ఈ.సి లేక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ల నుండి వచ్చిన వాళ్ళు సమాజాన్ని ప్రభావితం ఎందుకు చెయ్యలేకపోతున్నారూ?
వీళ్ళు చదివిన చదువు అడవికాచిన వెన్నెల అవుతోందని ఎందుకాలోచించట్లేదు?

16 comments:

 1. భాస్కర్‌గారు,
  (డిస్క్లైమర్: నేను ఒక "ప్రీమియర్" ఎం.బీ.యే కాలేజిలో చదివాను)
  మీ సంగతేమో కానీ సామాన్యంగా మామూలు కాలేజీలలో చదివిన వారికి ప్రీమియర్ కాలేజిలో చదివిన వారికి జీతాలలో చాలా తేడా వుంటోంది. ముఖ్యంగా ఎం.బీ.యే ల విషయంలో అది బాగా కనపడుతుంది. వాడికేమైనా కొమ్ములున్నాయా అని అనుకోవచ్చుకానీ, ప్రీమియర్ ఇన్స్‌టిట్యూట్‌లో విద్యా విధానం, ప్రీమియర్ ఇన్స్‌టిట్యూట్ అని అక్కడికి చేరే ప్రీమియర్ ప్రొఫసర్లు, పోటీ పరీక్షలో నెగ్గుకొచ్చిన (సాధారణంగా) తెలివైన సహవిద్యార్థులు, అందుబాటులో వుండే వనరుల కారణంగా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్‌లో చదవటంవల్ల మామూలు కన్నా ఎక్కువ పరిజ్ఞానం సంపాదించుకునే "అవకాశం" వుంటుంది. అయితే అలాంటి ప్రీమియర్ ఇన్స్‌టిట్యూట్‌లో అత్తెసరు మార్కులు సాధించినవాడి కంటే మామూలు కాలేజీలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నవాడు ఎక్కువ తెలివైనవాడు అయ్యుండచ్చు. దురదృష్టవశాత్తు ప్రతిభకి కొలమానం కాలేజీ పేరు అయిపోయింది.

  "సమాజాన్ని ప్రభావితం చెయ్యటంలేదు": సమాజాన్ని వీళ్ళే ఎందుకు ప్రభావితం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. ఎవరికి వారు ఎక్కడికక్కడ తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే చాలనుకుంటాను. అదే వారు చెయ్యగలిగిన సమాజ సేవ. ఈ విషయంలో ప్రీమియర్ ఇన్స్‌స్టిట్యూట్ పూర్వ విద్యార్థులు ఎక్కువ శాతం తమ తమ బాధ్యతలు విజయవంతంగానే నిర్వర్తిస్తున్నారని నా అభిప్రాయం.

  ReplyDelete
 2. మీరు చెప్పింది ఆబ్వియస్.
  >>సమాజాన్ని వీళ్ళే ఎందుకు ప్రభావితం చెయ్యాలో నాకు అర్థం కాలేదు.
  వీళ్ళే ఎందుకాలోచించాలి? క్రీం కాబట్టి. వీళ్లకి మీరన్నట్టు కొన్ని ఎక్స్ట్రా వసతులున్నయి కాబట్టి. ప్రీమియర్ ప్రొఫసర్లు దొరుకుతారు కాబట్టీ. తెలివైన సహవిద్యార్థులు, అందుబాటులో వుండే వనరులున్నాయి కాబట్టీ.
  పైగా - వీరి చదువుకోసం ప్రభుత్వం తన ఖజానా నుండి కొంత వెచ్చిస్తోంది కాబట్టి. వీరు అందరిలా ఐపోతే ఉపయోగం లేదు కదా అని నా ప్రశ్న.

  ReplyDelete
 3. మరి ఆర్ట్సు చదివి, ఆపై కష్టపడి అమెరికాకొచ్చి అదే ఐ.టీ దున్నుతున్న నేను మీ గురించి అదే ప్రశ్న వేస్తే, మీరేమంటార్సార్ :-)

  అల్టిమేట్గా ఉద్యోగం/సంసారం దగ్గర మనవాళ్ళు చాలావరకు ఆగిపోతారు. అది వాళ్ళ తప్పు కాదు. మన జనాభా, ఆ కాంపిటీషన్లో మళ్ళీ ఇంకో జాబు దొరుకుతుందో లేదో అని భయం ఉండొచ్చు. అదే ఇక్కడ సంసారం పెద్ద విషయం కాదుకాబట్టి, జనాలు రిస్క్ తీసుకుని సక్సెస్ అవుతారు అని నా అభిప్రాయం. కానీ ఇదంతా సొల్లుగా తీసేసినా, ఎవడి భవిష్యత్తుకి వాడే రాజు.

  ReplyDelete
 4. యం.బి.ఏ లో చాలా తేడా ఉంది కానీ, ఐ.టీ లో అంత పెద్ద తేడా లేదని నా అభిప్రాయం. బహుశా, మా ఊరి కాలేజీ నుండి వచ్చినోడికి పజ్జెందివేలు ఉంటే ఇనీషియల్ బ్రేక్, ఐ.ఐ.టీ నుండొచ్చినోడికి ముఫై-నలభై ఉందేమో ఇనీషియల్ బ్రేక్.

  ReplyDelete
 5. బ్లావీ - ఆ క్రీం కాకపోతే ఏదైనా ఒకటే అని నా అభిప్రాయం

  ReplyDelete
 6. నా ఉద్దేశం లో చదువులు, తెలివి తేటలు, డబ్బు సంపాయించటం, జీవితం సుఖం గ గడపటం అనే ఈ నాలుగూ ఒకదాని మీద ఒకటి ఎక్కువగా ఆధార పడవేమో Maximum లో. Minimum లో అవి ఆధార పడతాయి అనుకుంటా.
  Minimum అంటే మొదట ఉద్యోగం లో చేరేటప్పుడు, చిన్న వయసు లో.
  సరే గొప్ప గొప్ప స్కూళ్ళ లో చదివిన వాళ్ళు ఏం ఊడపోడుస్తున్నారంటే అది Maximum లోకి వస్తుంది.

  ReplyDelete
 7. ప్రీమియర్ కాలేజీలు, సామాన్య కాలేజీలు, Distinction, అత్తెసురు మార్కులు - అమెరికాలో విజయాలు
  నా అమెరికా అనుభవములో నాకు అర్థమయ్యిందేమిటంటే --
  - అమెరికాలో అడుగు పెట్టటానికి సొంత డబ్బులుపెట్టుకొని experience certificates , H1B కొని వెళ్తారు కొందరు
  - అక్కడికి వెళ్ళినతరువాత - స్వంత కుల పోళ్ళ పుష్ , ఫ్రెండ్స్ హెల్ప్ , TIMING (in other words luck) తో వీళ్ళు రెండు మూడేళ్ళు నెట్టు కొస్తే , ofcourse..meanwhile polishing skills, ఇక సెటిల్ అయిపోయినట్లే
  - ఇక రెండో రకం - Premier college, మంచి percentage , కాంపస్ సెలక్షన్ తో, కంపెనీ ఖర్చు తో కొంత మంది వెళ్తారు. వీళ్ళకి ఎక్కడ టెన్షన్ ఉండదు , Even at visa or buying ticket or looking for client posting
  ఇది మీ "మరింక తేడా ఏంటీ?" కి జవాబు.

  సమాజాన్ని ప్రభావితం చేయటానికి IIT, NIT, Nagarjuna university...డిగ్రీ లకు సంబంధం లేదు! మీరు రెండు వైవిధ్యమైన విషయాలు విడి విడి గా చర్చిస్తే బాగుంటుంది.

  ReplyDelete
 8. హ్మ్మ్.. ఒక వైపు సత్యప్రసాద్ గారు, మీ శ్రేయోభిలాషి తొ ఏకీభవిస్తున్నా ... మీరన్నట్టు IT లొ ప్రీమియర్ కి నాన్ ప్రీమియర్ కి తేడా పెద్ద లేదనే అనాలి ..

  తెలివయిన వాళ్ళందరూ ప్రీమియర్ లొనే చదవలేరు.. అప్పట్లొ అవగాహన లేకపొవడం, వున్న తెలివితేట్లని క్రమ పద్దతిలొ (అంటే కోచింగ్ తీసుకొకపొవడం) ఉపయోగించపొవకడం , దాని విలువ అప్పట్లొ తెలీకపొవడం, సీట్ల కొరత, ఎంట్రన్స్ టెస్ట్ లలొ ఆ రొజు చిన్ని చిన్ని తప్పులు చేయడం.... ఇంక రకరకాల కారణాలవల్ల ప్రీమియర్ కాలేజీ లొ చదివే అవకాసం దొరికుండకపొవచ్చు.. IT జాబ్ అనేది అంతకుముందు చదివిన కాలెజి డిగ్రీ నుండి ఏ నాలెడ్జి డిమాండ్ చెయ్యదు.. అందువల్ల IT వుద్యొగం అప్పట్లొ ప్రీమియర్ కాలేజి కొల్పొయిన వాళ్ళకి వాళ్ళని వాళ్ళు నిరూపించుకొవడానికి మళ్ళి కొత్తగా వచ్చిన అవకాసం లాంటిది.. అందువల్ల మళ్ళి అక్కడ తెలివైన వాడిదే రాజ్యం (ప్రీమియర్ అయినా నాన్ ప్రీమియన్ర్ నుండి వచ్చినా) .. Non IT వుద్యొగాల్లొ చదివిన డిగ్రీ నుండి చాలా నాలెడ్జి డిమాండ్ చేస్తుంది కనుక అక్కడ ప్రీమియర్ కాలేజి వాళ్ళదే రాజ్యం

  డబ్బు సంపాదనలొ ఇవన్ని అలొచించక్కర్లే.... అప్పటికి ఏ టెక్నాలజి కి బూం వుంటే దానిదే.. ఇప్పుడు IT రేపు ఎనర్జి సెక్టార్ .. నేను Non IT మరియు IIT చదువు.. సంపాదన IT ఇంజినీర్ కన్నా ఎక్కువ కాకపొవచ్చు కానీ .. రేపటి సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఉద్యొగమే చేస్తున్నా అనుకుంటున్నా :-))

  ReplyDelete
 9. భాస్కర్ గారు,
  --సమాజాన్ని ప్రభావితం ఎందుకు చెయ్యలేకపోతున్నారూ?

  ఎందుకు చెయ్యాలండి?? అక్కడ చదవడానికి ఆ ఎంట్రన్స్ క్లియర్ చెయ్యాలి కానీ, సమాజన్ని ఉద్దరిస్తాం అని ప్రతిజ్ఞ చెయ్యడం లేదు కదా!
  మన వ్యవస్థ లో సమాజం గురించి ఆలోచించాలి అనే విషయాన్ని ఎక్కడా నేర్పరు.. దానికి ప్రీమియర్ కలేజీలు మినహాయింపు కాదు..
  మిగతా వాళ్ళకు లేని వనరులు వాళ్ళకు ఉన్నాయి కదా అంటే, అది నిజమే కానీ దానికి వాళ్ళేం చేస్తారు?? మిగతా వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళు అడ్డం పడటం లేదు కదా??
  మీ ప్రశ్న విన్నాక ఒక చిన్న విషయం గుర్తుకు వచ్చింది.. ఒకసారి ఈ కింద ఉన్న లింక్ చూడగలరు..
  http://ideafest.blogspot.com/2008/09/shreesh-jadhav-real-inspiration.html

  ReplyDelete
 10. >>"సమాజాన్ని ప్రభావితం ఎందుకు చెయ్యలేకపోతున్నారూ?"

  భాస్కర్ గారు, సమాజాన్ని ప్రభావితం చెయ్యగలిగే పనులు చాలానే చేస్తున్నారు. కానీ రకరకాల కారణాల వలన అది తక్కువ స్థాయిలో ఉంటోంది. అవును.మాకు కొన్ని వసుతులూ గట్రా ఎక్కువే మిగతా కాలేజీల్తో పోలిస్తే. కానీ, మాకు ఉండే పని కూడా అదే స్థాయిలో ఉంటుంది.

  మంచుపల్లకీ గారు అన్నట్టు IT అంతకుముందు చదివిన కాలెజి డిగ్రీ నుండి పెద్దగా నాలెడ్జి డిమాండ్ చెయ్యదు. Non IT లో ఆ తేడా స్పష్టంగా ఉంటుంది.

  అంతెందుకూ, నా వరకు నాకు మా కాలేజీలో సమాజాన్ని ఉద్ధరించడానికి బోలేడు అవకాశాలు వచ్చాయి, వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి కూడా. కానీ పూర్తిస్థాయిలో పాల్గొనలేకపోవడానికి కర్ణుడి చావులాగా నాకున్న కారణాలు నాకున్నాయి. కానీ కాలేజీ వాతావరణం సమాజాన్ని ప్రభావితం చేసే దిశగా మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. కానీ ఎవ్వరినీ బలవంతం చెయ్యదు.

  ఉదాహరణకు, మా కాలేజీలో చదివిన ఒక పూర్వ విధార్థి Oil and Natural Gas Corporation (ONGC)లో ఉద్యోగం వచ్చినా కూడా వదులుకొని వ్యవసాయం చేస్తున్నాడు. దిగుబడి పెంచడానికి అతను కొన్ని నూతన పద్ధతులను, ఇంకా కొన్ని కొత్త వ్యవసాయ పరికరాలను కూడా. He has developed a number of simple, farmer-friendly tools for farming areas like seeding, weeding, etc. as we don't have any tools for small farmers.

  ఆ రైతు పేరు మాధవన్.

  మరికొన్ని విషయాలు చూద్దాం. 2008 లో ఒక చిన్న పాటి సర్వే చేశారు. ఆ సర్వేలో తెలిసిన విషయాలు.

  A survey was conducted in December 2008 on the contribution of IITs and IITians to the Indian economy and on their role as leading entrepreneurs of the nation (which was one of the key thoughts which went in the construction of IITs). The survey threw up some rather interesting numbers and generally seemed to be supporting the belief that IITians have done a lot of good work on both of the above counts.


  The survey took stock of the contribution made by IITians over the last half a century across professions and geographies, and to create a fact-base for mobilizing IITs and IITians to find out how they can do even more.

  Contrary to the belief that IITians triggered off brain drain in India, the data from the survey reveals the following:


  1. IITians have been involved in the creation of over 2 crore (20 million) new jobs.

  2. When measured across industry, government, entrepreneurial activity and scientific/technological innovations, IIT alumni have been associated with over $450 billion ( Rs 20,00,000 crore) of incremental economic value creation.

  3. Among the IIT alumni who are in top leadership roles, almost 70 percent are currently based in India, with 20 percent of these being those who come back to India after careers in other parts of the world.

  4. The study says that 54 percent of the top 500 Indian companies currently have at least one IIT alumnus on their board of directors, and these companies have cumulative revenue ten times greater than that of other companies on the list.

  5. Ten percent IIT alumni are currently engaged in social transformation working in NGOs, government administration or politics, on programs relating to eduction, the environment or poverty reduction, etc. IIT alumni working in this area have founded over a 1000 NGOs, the survey adds.

  6. One in 10 IIT alumni has started their own companies, with over 40 percent of them being serial entrepreneurs. Two-thirds of the companies founded are in India.

  However the survey cannot be called conclusive by any count, primarily because of the extremely small number of alumni who participated in it: 4500. Still, it provides a fairly good insight.


  చదివిన చదువు మరీ వేస్టేమీ కావట్లేదు లెండి. ఏదో ఒక స్థాయిలో ఉపయోగపడుతోంది. కాకపోతే ఈ స్థాయి ఇంకా పెరిగితే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాము.

  ReplyDelete
 11. @మీ శ్రేయోభిలాషి
  >>- అమెరికాలో అడుగు పెట్టటానికి సొంత డబ్బులుపెట్టుకొని experience certificates , H1B కొని వెళ్తారు కొందరు
  దీంట్లో చివరి సగం కరెక్టు. మొదటి సగం కొంత కరెక్టు.
  >>- అక్కడికి వెళ్ళినతరువాత - స్వంత కుల పోళ్ళ పుష్ , ఫ్రెండ్స్ హెల్ప్
  :):) ఇదీ కొంత నిజం మాత్రమే.

  @మంచు పల్లకీ భాయ్
  మీరు చెప్పింది కరెక్టే.

  @కార్తీక్ -
  >>మిగతా వాళ్ళకు లేని వనరులు వాళ్ళకు ఉన్నాయి కదా అంటే, అది నిజమే కానీ దానికి వాళ్ళేం చేస్తారు?? మిగతా వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళు అడ్డం పడటం లేదు కదా??
  ఇది కొంచెం కటువుగా ఉంది.
  మా ఊరినుండి బాగా చదువుకుని పైకొచ్చిన వ్యక్తి మా ఊరికి ఏదోకటి చేసాడూ అని ఊళ్ళోని ప్రతీవాడూ ఆశిస్తాడు.
  అలా చేయకపోవడం తమ్మేమీ కాదు. కానీ *చేయగలిగిన వాళ్ళు వీళ్ళు* అని నా పాయింటు.
  @నాగ్
  >>ఉదాహరణకు, మా కాలేజీలో చదివిన ఒక పూర్వ విధార్థి Oil and Natural Gas Corporation (ONGC)లో ఉద్యోగం వచ్చినా కూడా వదులుకొని వ్యవసాయం చేస్తున్నాడు. దిగుబడి పెంచడానికి అతను కొన్ని నూతన పద్ధతులను, ఇంకా కొన్ని కొత్త వ్యవసాయ పరికరాలను కూడా. He has developed a number of simple, farmer-friendly tools for farming areas like seeding, weeding, etc. as we don't have any tools for small farmers.

  ఆ రైతు పేరు మాధవన్.

  ఇలాంటి మాధవన్లు మరెందరో ముందుకి రావాలనే నా ఉద్దేశం.

  ReplyDelete
 12. Education adds only some tiny percent to what one contributes to society. It is the will and intention to make a difference. Many big time CEOs in IT industry are college drop outs, but who pursued some unique ideas into products and dollars. India has an environment minister who is a Stanford graduate, but who wants to bring in BT Brinjal into the country knowing its nothing less than poison to human liver. We have a Home Minister who is a lawyer by profession from Harvard, but cannot do proper judgement of what people of Andhra Pradesh want; Does not matter what one studies; it is the steel heart and sacrifice that can make a difference to the society.

  ReplyDelete
 13. And, we do not need to give undue importance to IITians or other premium institute grads nor look down upon graduates from other schools.

  ReplyDelete
 14. భాస్కర్ గారు..
  కటువుగా ధ్వనిస్తే క్షమించండి. ఎవరినీ నొప్పించడం నా ఉద్దేశ్యం కాదు.
  నేను చెప్పేదేమిటంటే సామాజిక భాధ్యత గురించి మనం చదువుకునే రోజులలో ఎప్పుడు వినం.. అది మన వ్యవస్థలో ఉన్న తప్పు. ఇక ఈ ప్రఖ్యాత" కాలేజీలు ఆ వ్యవస్థ లో భాగం కనుక అవి కూడా అలానే ఉన్నాయి..
  ఎక్కడ చదివిన ఎంత సంపాదిస్తున్నా పక్కన వాడి గురించి ఆలోచించే గుణం లేనప్పుడు ఎన్ని వనరులున్నా దండగే!

  - కార్తీక్

  ReplyDelete
 15. కార్తీక్
  >>సామాజిక భాధ్యత గురించి మనం చదువుకునే రోజులలో ఎప్పుడు వినం.. అది మన వ్యవస్థలో ఉన్న తప్పు.
  ద మోర్ యూ గ్రో, ద మోర్ యూ రీచ్ సర్టైన్ యాబ్స్ట్రాక్షన్స్
  పుట్టుకతోనే ఎవ్వడూ *సామాజిక బాధ్యత* అనే ఓ పదంతో పుట్టడు. మన చదువులోనే మనకు సామాజిక బాధ్యతలు ఉన్నాయి. మన పుస్తకాల్లో ఎన్నో ఉన్నాయి. మనం ఆచరించం.
  వ్యవస్థ సరిగ్గా పని చేయటానికి మేధావివర్గం *ఓ సపోర్ట్ సిస్టం* కావాలి. వ్యవస్థలోని లోటుపాట్లు సరిదిద్దటానికి మేధావితనం ఉపయోగపడకపోతే ప్రయోజనంలేదు. అదిలేనినాడు మనం ఇదే జీవితంలో మగ్గుతుంటాం.

  సాధారణ కాలేజీల్లో చదివి, జీవితంలో ఓ యాబ్స్ట్రాక్షన్ కి రీచ్ కావటానికి ఒక సమయం పడితే, ప్రీమియర్ కాలేజీల్లో చదివిన వారికి తక్కువ సమయం పట్టొచ్చు. వారు ఎలా రియాక్ట్ అవుతున్నారూ? ఎలా ఆలోచిస్తున్నారూ? ఇలాంటివి సాధారణ ప్రజలకీ తెలియాలి కదా.

  >>ఎక్కడ చదివిన ఎంత సంపాదిస్తున్నా పక్కన వాడి గురించి ఆలోచించే గుణం లేనప్పుడు ఎన్ని వనరులున్నా దండగే!
  లేటుగా అయినా లేటెస్టుగా చెప్పావు. మెచ్చుకుంటున్నా.

  ReplyDelete
 16. >>మన చదువులోనే మనకు సామాజిక బాధ్యతలు ఉన్నాయి. మన పుస్తకాల్లో ఎన్నో ఉన్నాయి. మనం ఆచరించం.
  మన చదువులలో సామాజిక బాధ్యత ఉన్నట్టు నాకిప్పటి వరకూ ఎప్పుడూ అనిపించలేదు :( :(
  >>వ్యవస్థ సరిగ్గా పని చేయటానికి మేధావివర్గం *ఓ సపోర్ట్ సిస్టం* కావాలి
  completely agree with this point.

  >>ద మోర్ యూ గ్రో, ద మోర్ యూ రీచ్ సర్టైన్ యాబ్స్ట్రాక్షన్స్. సాధారణ కాలేజీల్లో చదివి, జీవితంలో ఓ యాబ్స్ట్రాక్షన్ కి రీచ్ కావటానికి ఒక సమయం పడితే, ప్రీమియర్ కాలేజీల్లో చదివిన వారికి తక్కువ సమయం పట్టొచ్చు. వారు ఎలా రియాక్ట్ అవుతున్నారూ? ఎలా ఆలోచిస్తున్నారూ? ఇలాంటివి సాధారణ ప్రజలకీ తెలియాలి కదా.

  నాకిది అర్థం కాలేదు.. ఇంకాస్త క్లియర్ గా చెప్పగలరు..
  >>లేటుగా అయినా లేటెస్టుగా చెప్పావు. మెచ్చుకుంటున్నా.
  నెనర్లు..

  ReplyDelete