Feb 16, 2010

మీకో బంపర్ ఆఫర్ అంట

మీకో బంపర్ ఆఫర్ అంటయ్యా!!

ఎన్దా కతా అంటారా? ఇదిగో సదూకోన్డి -

మీకో బంపర్ ఆఫరండీ. ఇంతకీ *నాన్ స్టాప్* చూసారా? చూడకపోతే ఎన్టనే సూడండి.
పస్టు ప్రైజు సాంత్రో కారండీ
రెందో ప్రైజు లచ్చ రూపాయలండీ
మూడో ప్రైజు యాబయ్య ఏలన్డీ
ఇంకా మరెన్నో ప్రైజులన్డీ

మీరు చెయ్యాల్సిందల్లా
నాన్ స్టాప్ సినిమా జూట్టం, ఈరో ఎవురో ఇలనెవరో కనిపెట్టి
మీ టికట్టుతో పాటు *సుమన్ ప్రొడక్షన్స్* కి పంపించడం.


-----
రిపరెన్సు - ఈనాడు టీవీ

9 comments:

 1. సకలకళాకోవిదుడు సుమన్ కి మీరు ఎంత పెద్ద ఫాన్/ఏసి ఐతే మాత్రం ఇలా బ్లాగ్లోకూడా ప్రచారం చెయ్యాలా?? :P
  ఇతన్ని ఈటీవీ నుంచి తరిమేసారు అన్నారు, మళ్ళీ వెనక్కొచ్చేసినట్టున్నాడు

  ReplyDelete
 2. కొంపదీసి నాన్ స్టాపుగా యు ఎస్ లో కూడా రిలీజ్ అవుతోందా అది?

  ReplyDelete
 3. పైజులిచ్చి థియేటర్లకు రప్పించుకునేంత భయంకరంగా ఉందా సినిమా!!! బ్రతికుంటే బ్లాగులో నాలుగు బొమ్మలేసుకుంటూ కాలం గడుపుతా నాయనా నేన్రాను బాబోయ్!

  ReplyDelete
 4. కెవ్వుకేక డవిలాగు
  *ఏరా నన్ను చూడంగనే వెన్నులో వణుకుకు పుటిందా లేక రక్తం గడ్డకట్టిందా*
  -సుమన్
  ఇంతకన్నా ఏమి చెప్పనూ?????

  ReplyDelete
 5. సుమన్‌బాబును చూడనక్కర్లేదు. తలుచుకున్నంతలోనే వెన్నులోవణుకు, రక్తంగడ్డటం జరుగుతుంది. వీటన్నికిటీకీ మించి నాన్‌స్టాప్‌గా జీవితంపై విరక్తి పుడుతుంది. అన్నట్టూ అన్నాయ్ నీకేమైనా సుమనోహరాలు కేసెట్ కావాలా? మురళిగారినడగండి.

  ReplyDelete
 6. "ఇంకా మరెన్నో ప్రైజులన్డీ"
  అసలంత మంది చూస్తారా!

  ReplyDelete
 7. అదేకదా .... పాపం!!!! హీరో ఎవరో విలన్ ఎవరో , తీసినవాళ్ళకే తెలియకపోతే ఇక చూసినవాళ్ళకెలా తెలుస్తుందీ. అదీ వాళ్ళ దైర్యం . ఏమాటకామాటే చెప్పుకోవాలి కొత్తగెటప్ లో సుమన్ బాబు ఆనవాలు తెలీకుండా వున్నాడు. సినిమా రిలీజ్ కి ముందు పబ్లిసిటీలో హీరో మొహం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు . అప్పుడే అనుమానం వచ్చింది .అసలు హీరో ఎవరో తేల్చుకోలేక అలాచేసుంటారు.

  ReplyDelete