Feb 14, 2010

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ

ఓం నమో భగవతే రుద్రాయ

అయ్యా అదీ సంగతి.
జీవితంలో మొట్టమొదటి సారి శివరాత్రికి జాగారం చేసా. అదీ శివాలయంలో, అదీ అనుకోకుండా, అదీ శివ ధ్యానంలో, అదీ శివ ఘోషలో తడిసిపోతూ, అదీ ఆ ఘోషలో పాలుపంచుకుంటూ.
అత్భుతమైన అనుభవం.
ఆనందకరమైన అనుభవం.
చాలా అవసమైన దీవెన.

శుక్రవారం, మా ఊళ్ళో శివరాత్రి పండుగని జనసందోహం భక్తి శ్రద్ధల్తో జరుపుకున్నాం. వారంముందే పోష్టరేసారు. అహోరాత్ర మహన్యాస పారాయణలో పాల్పంచుకోండీ అని. అప్పుడే చెప్పా, రెండో ఝాములో వస్తా అని చెప్పా.

పదకుండింటికల్లా చేరుకున్నా. కొందరు వారి టర్మ్ ముగించేయబోతున్నారు. వెళ్ళా. కూర్చున్నా.
నా స్లాట్లో మొత్తం ఐదుగ్గురు ఔత్సాహితులు ఉన్నారు నాతో కలిపి.
ఎలా ఏంటి ప్లాన్ అన్నా.
ప్రతీ ఝాముకి పదకుండుసార్లు పారాయణం చేయగల్గాలి అన్నారు.
లఘున్యాసం తో మొదలియ్యింది పారాయణ.
త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనం
ఊర్వారుకమివ బన్ధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతా"త్॥

అయ్యాక చమకప్రశ్నలోని మొదటి పన్నా
అగ్నావిష్ణూ సజోషసేమా వర్ధన్తు వాంగిరః। ద్యుమ్నైర్వాజేభిరాగతం....శరీరాణి చ మే।
జ్యైష్ఠం చ మ ఓం శాంతిః శాంతిః శాంతిః

తో ఆగి మళ్ళీ మొదలై
ఓం నమో భగవతే రుద్రాయ।
ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
...నుండి
త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనం
ఊర్వారుకమివ బన్ధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతా"త్॥

తర్వాత
జ్యేష్ఠం చ మ ఆధిపత్యం చ మే ... మతిశ్చ మే సుమతిశ్చ మే।
శం చ మే। ఓం శాంతిః శాంతిః శాంతిః

తో ఆగి మళ్ళీ మొదలి......
అలా పదిసార్లయ్యాక, పదుకుండోసారితో అభిషేకం చేసి, అలంకారం చెసి, నివేదనలు చేసి...
మళ్ళీ మొదలుపెట్టి...
అలా....
తెల్లవారి ఆరుకల్లా మొత్తం పూర్తిచేసి,
కలసాలను కదిలించి, వాటితో అభిషేకించి -
అలంకారం నివేదనలు చేసి - అయ్యా అని నమస్కరించుకుని, గుడి మొత్తం శుభ్రంగా ఊడ్చి పొద్దున ఏదుకి ఇంటికిజేరా.

నేను ముందు పదకుండునుండి కూర్చుని, పదకుండు సార్లు చదివి వచ్చేద్దాం అనుకున్నా.
ఇంతలో ఓ పెద్దాయన, భాస్కరం! సాధ్యమైనంత సేపు కూర్చోండి, పూజారికి కాస్త తోడుగా ఉండండి, ఏమైనా అభ్యంతరమా అన్నారు.
సరే నండీ మాష్టరూ ఉంటా అన్నా....మొత్తానికి ఓ పదిమందిమి ఆ పరమశివుని సేవలో తరించాం.

చాలా ఆనందంగా ఉంది.

మరొక్కసారి -
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ
మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ
త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్మహాదేవయ నమః



From shivaratri

5 comments:

  1. అదృష్టవంతులు.ఉపవాసమున్నాను జాగరణకూడా చేద్దామని నేనుకూడా మాఊరిలోని బుగ్గరామలింగేశ్వరాలయానికి వెళ్ళి స్వామివార్లను,రాజరాజేశ్వరీదేవిని,సీతాలక్ష్మణహనుమత్ సమేత శ్రీరాములవారిని దర్శనం చేసుకున్నా.మూడు గంటలవరకు మేలుకున్నా తర్వాత నావళ్ళ కాలేదు.

    ReplyDelete