Dec 22, 2009

శనిభగవానుడు సదా రక్ష్మించుగాక

మొన్న శనివారం, పొద్దున్నపొద్దునే గుడికెళ్ళా. ఇక్కడ పొద్దున్నే గుడి అంటే తొమ్మిది అని అర్ధం, సాధారణ పరీస్థితుల్లో. శనివారం, కాస్త తెల్లజుట్టువచ్చినోళ్ళ దగ్గర్నుండి ముగ్గుబుట్టైన జనులందరూ సాధారణంగా గుడిని విధిగా దర్శిస్తుంటారు. శనివారం పొద్దునే అలా వచ్చి, చక్కగా కూర్చుని, అందరూ కలసి సుప్రభాతం, సూక్తాలు (నారాయణ, శ్రీ, దుర్గా, పురుష), లక్ష్మీ/శ్రీ విష్ణు/లలితా సహస్రనామాల్లో వారానికొకటి చదువుకుని వెళ్తుంటారు. మరి మనకీ జుట్టు తెల్లబడుతోందికదా అందుకే, మరీ ప్రతీవారంకాదుగానీ అప్పుడప్పుడూ వెళ్ళి మనగొంతుని ఆళ్ళతో కలిపి ఆలపించి అదీఇదీజేసి వస్తుంటా. సరే, మొన్న మన సమయంలో వెళ్ళా, హాశ్చర్యం గుడి ఖాళి. నగ్రహాలవద్ద పండిట్ సిమ్మాగారు, మనకి తెలిసిన ఓ పెద్దవారు నవగ్ర్హార్చన చేస్తున్నారు. వెళ్ళి నిలుచున్నా. సిమ్మాజీ చేతులు కలుపు అని నువ్వుల నూనె చేతికిచ్చి అభిశేకం చేయమన్నాడు, మొదలెట్టా. ఆయన, పక్కనున్న వారు ఇద్దరూ మంత్రోఛారణ చేస్తున్నారు. నువ్వు చదవవయ్యా భాస్కరా అన్నారు సిమ్మాజి. అదేంమంత్రం అంటే -
శన్నో దేవీ రభిష్టయే | ఆపో భవంతు పీతయే” | శమ్యో రభిస్ర వంతునః ||.
అనగా - ఆ శనిభగవానుడు, సదా కాపాడుగాక, అభీష్టాలు నెరవేర్చుగాకా అని.
కరెష్టుగా మనం ఎళ్ళిన టయానికి ఆయన అభిషేకం చేస్తూండతం, మనల్నీ భాగస్వామిగా పిలవటం, పై మంత్రం..కొంచెం ఆనందం వేసింది.
ఆటుపిమ్మట, ఏటి సావీ ఈ రోజు గుడి నిశబ్దంగా, ఖాళీగా ఉంది, జనులెరీ అంటే, ఓరీ, బిడ్డా, ఇది ధనుర్మాసం కావున, పొద్దున ఆరుకే గుడి తెరవబడుతోంది, పొద్దున్నే తిరుప్పావై, సుప్రభాతం, అవీవి కార్యక్రమలు ఐపోతున్నాయి అని తెలిపారు.
అదీ కధ

3 comments:

  1. అయిన అన్నాయ్ నువ్వు 9 కా గుడికి వెళ్ళేది ...
    నేనైతే ... 8 కే వెళ్ళి పొతా హి హి :)

    ReplyDelete
  2. హ హ హ ఫన్నీగా ఉంది. ఇలా మనల్ని ప్రత్యేకంగా పిలిచి మన గోత్రనామాలడిగి పూజ జరిపించడం బాగుంటుంది కదా..... ఈ ప్రత్యేకత మన హైదరాబాదులో నాకు వీసాల చిల్కూర్ దేవాలయం దగ్గర జరిగింది. అప్పుడు అక్కడికి దగ్గర్లో ఉద్యోగం చేసేదాన్ని ఒక్కళ్ళు కూడా వచ్చేవారు కాదు అక్కడికి వెళ్ళిన ప్రతీసారి గర్భగుడిలోకి తీసుకెళ్ళి మరీ పూజ చేయించేవారు. ఇప్పుడు కనీసం కాలు పెట్టడానికి కూడ కుదరడంలేదు అంత ప్రాచుర్యం ఇసుకవేస్తే రాలనంత జనం అక్కడ, -:)

    ReplyDelete
  3. ఆ శనిభగవానుడు, సదా కాపాడుగాక, అభీష్టాలు నెరవేర్చుగాకా.

    ReplyDelete