Dec 17, 2009

పుత్రోత్సాహం...

మావోడు నిన్న ఏదోబెరికి ఓ కవర్లో పెట్టి నిన్ననే తెరిచ్చూడమని తెరిచిందాకా పీకలమీన కూకున్నాడు. ఏట్రా అంటే ఇదిగో ఇది -
ఇది ముఖపత్రం -


ఇది సివరాకరి పత్రం అనగా ఎనకమాల కాయితకం -ముఖపత్రం -
అక్వేరియం.
సున్నాలు సున్నాలు రంగురంగుల నీటి బుడగలు. కొన్ని సేపలు సొరసేపలు, కొన్ని ఆక్టోపస్లు, ఓట్రేండు తిమింగళాలు [యాడా సూపీ అనమాక], కింద ఓ ముత్యంసిప్ప, అందులొ ఓ ముత్యం, పక్కనే ట్రేజర్ ఛెస్ట్ అనగా భోషాణం పెట్టె, అడుగున సీవీడ్స్.
ఎనకమాల -
సెట్టు, ఉయ్యలలు సెట్టుకి.
మొట్టమొదట ఆడు, తర్వాద్ది నేను, నాఎమ్మట ఆళ్ళమ్మ, సివరాకర్న సెల్లి.
ఓ పువ్వు...
ఐనాక లైటెనింగ్స్, లైటేనింగ్ మెక్వీన్. నెంబరు తొంబ్బైయ్యైదు.
సివరాకర్న గ్లోబు కాదంటయ్యా, అది కాలి బంతంట. నేనూ ఆడు ఆడుతున్నట్టూహించుకోవాలంట.

36 comments:

 1. సూపర్ సూరి. లామినేషన్ చేసి పెట్టుకోవాలన్నా.
  నీజీవితంలో బెస్ట్ గ్రీటింగ్.
  కింద కాన్సెప్టుకేక. ఓపక్క కిటికీలో చంటిది, సూరి, మరోపక్క ఒదిన.

  ReplyDelete
 2. ఏంటబ్బా అయన్నీ కుతంత పేర్లు రాసుంటే పోయె కదా.
  ఒక్క విషెస్ తప్ప ఇంకేమి ఎలగలే నా మట్టి బుర్రకి.యెనకాతల పేజిలో మీరంతా ఎందుకు వేళ్ళాడుతున్నారు ప్చ్.ఒరే సూరిగా ఏంట్రా ఇది(హిహిహిహి).

  ఎనీవే "బిలేటెడ్ హేపీ బర్త్‌డే విషెస్ అండ్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే టు యు" బాచి బాబూ.

  ReplyDelete
 3. శ్రీని అన్నాయ్ - ఇయ్యాలే పుట్టిన్రోజు.

  ReplyDelete
 4. ఆ 95 ఏందిరా అబ్బాయా నాకుబుర్ర చించుకున్నా అర్దంకావటంలేదాయె...

  అంతే అన్నేల్లు బతకమనారా నాయనా...బాగుందిరా ఈ కాలం పిల్లకాయలు చానా తెలివైనోల్లుకదేటి మరి ...

  ReplyDelete
 5. 95 - http://www.pixar.com/featurefilms/cars/tale.html the famous car *The Lightening Mcquuen*'s Number is 95. Lightening McQueen is a Ferrari yata yata yata .....http://en.wikipedia.org/wiki/List_of_Cars_characters#Lightning_McQueen

  ReplyDelete
 6. పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు ప్రతి సంవత్సరం పుత్రోత్సాహంతో ఇలా పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...... 95 నాకు కూడా వెలగలేదు? :(

  ReplyDelete
 7. చాలా విలువైన శుభాకాంక్షలు. మీ వాడి తెలివితేటలు ఇలానే ఇంతింతై వటుడింతై అన్నట్లు వృద్ధిచెంది మీకు ప్రతీ పుట్టినరోజునూ ఆసంవత్సరమంతా గుర్తుంచుకునేటట్లు చేయాలని కోరుకుంటున్నాను.

  పుట్టినరోజు శుభాకాంక్షలు. :)

  ReplyDelete
 8. Many Many Happy Returns of the Day Bhaskar gaaru. The gift/greeting card is awesome.

  ReplyDelete
 9. వాట్ ఏ కోఇన్సిడెన్స్!ఇవ్వాళ నా మేనల్లుడు అభిరాం పుట్టిన రోజు కూడా(6). పార్టీ ముగించుకుని ఇలా బ్లాగ్ తెరిచానో లేదో సూరిబాబు కార్డ్ కనబడింది. మంచి గిఫ్ట్ ఇచ్చాడు మీకు. Many many happy returns of the day!

  ReplyDelete
 10. many many happy returns of the day sir,
  your kid is really creative.. my best wishes to him as well...

  ReplyDelete
 11. ఇంకేవండీ.....మీరు రాసేయడం వాటికి మీ బాబు బొమ్మలు వేసేయడం! పోస్ట్ అదిరింది:)many more happy returns of the day.

  ReplyDelete
 12. మంచి గిఫ్ట్ ఇచ్చాడు మీ బాబు మీకు. happy birthday

  ReplyDelete
 13. Happy b'day bro.

  మరి కేకులు తిన్నారా, కోకులు తాగారా?

  ReplyDelete
 14. అంతకంటే అందంగా ఇంకెవరైనా మీకు జన్మది శుభాకాంక్షలు చెప్పారా? నిజం చెప్పండి.:)
  Happy Birthday.

  ReplyDelete
 15. Many Many Happy Returns of the Day.
  మీ సూరి బలే బొమ్మ వేసేడే మీ వుయ్యాలలు కేక. వాళ్ళ అమ్మ కు కొంచెం పెద్ద తాడు ఇచ్చాడే పెద్ద వూగులు వూగమనేమో.. :-) ఆ భోషాణం పెట్టెలో ఎంత ప్రేమ పెట్టి ఇచ్చాడో కదా.. :-)

  ReplyDelete
 16. య్యాపీ బర్తుడే భాస్కరూ!సూరిబాబు చింపిరి తెల్లగడ్డం స్సాయిబూతో పోటీ పడేటట్లున్నాడే! ఇక మీకు కోట్లకు కోట్లే.వాడది ముందుగా ఊహించే భోషాణం పెట్టె వేసినట్లున్నాడు.:)

  ReplyDelete
 17. జన్మది శుభాకాంక్షలు అన్నాయ్ :)

  ReplyDelete
 18. నాన్నకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన మీ బుడ్డోడిని ముద్దెట్టుకోవాలని మా ఇదిగా ఉందండీ నాకు...వాడి గిఫ్ట్ ఒకెత్తు అయితే మీ వాక్యాలు ఇంకో ఎత్తు..నవ్వుకోకుండా ఉండలేకపోయాను. మీరు గుంటురు వారు కదా మరి రాయలసీమ యాస ఇంత బాగా ఎలా రాస్తున్నారు? మర్చేపోయా..అసలు విషయం చెప్పక ఏదేదో రాస్తున్నాను..Belated Happy Birthday...

  ReplyDelete
 19. నిజంగానే గొప్ప గిఫ్ట్ . ఎన్ని డబ్బులు పోసి కొన్నా దొరకని గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు మీ అబ్బయి మీకు అదే పుత్రోత్సాహం . పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న గారు

  ReplyDelete
 20. అదన్నమాట పుత్రోత్సాహం!Belated Happy Birthday...

  ReplyDelete
 21. అన్నాయ్, బ్లాగుముఖంగా మళ్ళోసారి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. సూరి క్రియేటివిటీ అదిరింది :-)

  ReplyDelete
 22. Belated birthday wishes Bhaskar garu :)
  the card is so sweet.

  ReplyDelete
 23. వ్యాఖ్యాతలందరికీ *తుంబ ధన్యవాదగళు*

  ReplyDelete
 24. వ్యాఖ్యాతలందరికీ *తుంబ ధన్యవాదగళు*

  శుభాకాంక్షలు చెప్తే ఇలా తిడతారా వా :((((((

  ReplyDelete
 25. Err!!! సమైక్య భారతం!! అందుకే బహుభాషలు తప్పనిసరిగా నేర్చి, ఇలా భాషాపాండిత్యాన్ని బయల్పరుస్తున్నా..ఏమీ అనుకోకండేం.....రుంబ నండ్రి.

  ReplyDelete
 26. పుట్టినరోజు శుభాకాంక్షలు కొద్ది గా ఆలస్యం గా :)

  ReplyDelete