Dec 31, 2009

ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు..

నేను రూటుమార్చా. అసలు రూటుకొచ్చా. ఇకపై న్యూఇయర్ చేస్కోను. కొత్తసంవత్సరం అంటే ఉగాది అని మాత్రమే నమ్ముతున్నా ఇకపై.
సరే ఇక న్యూ ఇయర్ చేస్కునే వాళ్ళతో నాకేమీ పగలు ప్రతీకారాలూ లేవు కనుక, వాళ్ళందరికీ ఓ సారి -
నూతన సంవత్సర శుభాకాంక్షలు

2009 ఇంకొన్ని ఘడియల్లో ముగియబోతున్నది. ఇంకో సమచ్చరం కాలగర్భంలోకి జారిపోతుంది. మనంకూడా అయ్యిందోయ్ పోయ్యిందోయ్ అనుకుంటాం, డిశెంబరు ముప్పైఒకటి అర్ధరాత్రి దాకా తాగి తందనాలాడతాం, పన్నెండుకాంగనే ఆవేశంతో ఊగిపోతాం. మర్రోజు అనిపించిన ప్రతీవోడికీ ఆంగ్లంలో ఏప్పీ న్యూ ఇయర్ అనిజెప్పేసి ఆరోజుని ముగించేస్తాం. ఆమర్రోజు, షరా మమూలే తిన్నామా పడుకున్నామా లేచామా....అంతకాడికి రెండ్రోజుల ముందుదాకా నిద్రెగ్గొట్టి అర్ధరాత్రిదాకా ఉండుడెందుకూ, మందుకొట్టుడెందుకూ, ఉన్న నాలుగు డబ్బులూ గుండు గీకించుకోటం ఎందుకూ??

నాకైతే ఈ న్యూ యియర్ ఎందుకుజేస్కోవాలీ అనిపిస్తోంది...కారణం
మన రాజకీయనాయకులు రాజేసి రగిలించిన రావణకాష్టంలో సమిధలైన మూగ పదార్ధాలు, నోరులేని జీవుల విలువ కళ్ళముందు కదులుతోంది. ఆం.ప్ర.రా.రో.ర.సం కి ఇప్పటికి ఐదువందల కోట్లు నష్టం.
మొన్నటి వరద భీభత్సంలో కొన్ని వేలకోట్లు నష్టం. ఇలాచెప్పుకుపోతే బ్లాగు చాలదు.
ఏమైనా గతం గతః..అయ్యిందేదో అయ్యింది. ఈ సమచ్చరాంతం సివరి నిమిషాల్లో ఓ సారి ఏంచేద్దాం అనుకున్నాం ఈ సమచ్చరం మొదట్లో ఓపాల్జూసుకుని, ఆటిని గోడామీద *వచ్చే ఏడు* అనిరాస్కుని, మురిసిపోదాం.
వచ్చే ఏడాదన్నా మనం అనుకున్నవి జరక్కపోతాయా, గుఱ్ఱం ఎగరకపోద్దా...
ఎప్పట్లానే ఉషారుగా కుషీకుషీగా ఉంటానికి, గతాన్ని గమ్మత్తుగా మర్సిపోటానికి ఈ కిందిపాటల్ని అంమృతంలా సేవించండి మరి -
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వుల నవ్యతారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ...
................

పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే .
.పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే ..
ఓ చెలీ ..... ఓ చెలీ .....
నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊపిరైనీవు నాలోన సాగెవు
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే
పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే
ఓ చెలీ ..... ఓ చెలీ .....
ఎన్నో జన్మల బంధము మనది
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిది
నీవు నా గానమె .. నీవు నా ధ్యానమే
నీవు నా గానమె .. నీవు నా ధ్యానమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే
పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే
ఓ చెలీ ..... ఓ చెలీ .....

...........
ఓహో చెలీ ఓ నా చెలీ
ఇది తొలి పాట
ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట ఆ పాట
ఇది తొలి పాట
ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట ఆ పాట
ఎదుట నీవు ఎదలో నీవు ఎదిగి ఒదిగి నాతో ఉంటే
మాటలన్ని పాటలై మధువులొలుకు మమతే పాట
నీలి నీలి నీ కన్నులలో నీడలైన నా కవితలలో
నీ చల్లని చరణాలే నిలుపుకున్న వలపీపాట
పరిమళించు ఆబంధాలే పరవసించి పాడనా పాడనా పాడనా...ఓహో చెలీ ఓ నా చెలీ
ఇది తొలి పాట
ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట ఆ పాట

చీకటిలో వాకిట నిలచీ దోసిట సిరిమల్లెలు తొలిచి
నిదురకాచి నీకై వేచీ నిలువెల్లా కవితలు చేసీ
కదలి కదలి నీవొస్తుంటే
కడలిపొంగుననిపిస్తుంటే
వెన్నెలై నీలో అలనై....
................
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలదీ పెరుగును అనురాగం....
........
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే //సిరిమల్లె నీవే//

ఎలదేటిపాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వనదేవతల్లే
పున్నాగపూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే // సిరిమల్లె నీవే //

మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే //సిరిమల్లె నీవే//
..................
నా ప్రేయసీ ఊహలో ఊర్వశి
ఆకాశ వీధిలో అందాల రాశి
(బాల సుబ్రహ్మణ్యం గారు తప్ప ఈపాటని ఇంకెవ్వరూ పాడలేరై నా ఘట్టి నమ్మకం, ముఖ్యంగా పాట మొదలయ్యేప్పటి గమకాలు).
..............
కలహంస నడక దానా
కమలాల కనులదానా
నీకనులు నీలికురులు నను నిలువనీకున్నవే...

.........
మధుమాస వేళలో మరుమల్లె తోటలో
మధుమాస వేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ లేదేలనో
మధుమాస వేళలో మరుమల్లె తోటలో

ఆడింది పూలకొమ్మ పాడింది కోయిలమ్మా
అనురాగ మందిరంలో కనరాదు పైడిబొమ్మ
ప్రణయాలు పొంగేవేళా ప్రణయాలు పొంగేవేళా
నాలో రగిలే ఏదో జ్వాలా
మధుమాస వేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ లేదేలనో

ఉదయించె భానుదీపం వికసించలేదు కమలం
నెలరాజు వ్రాతకోసం లేచింది కన్నెకుముదం
వలచింది వేదనకేనా వలచింది వేదనకేనా
జీవితమంతా దూరాలేనా

మధుమాస వేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ లేదేలనో
మధుమాస వేళలో మరుమల్లె తోటలో
................

మల్లెలు పూసే వెన్నలకాసే ఈ రేయి హాయిగా...

..............
అహో అందాలరాశి ఓహో అలనాటి ఊర్వశి ఆగలేడు నీ మందు ఏ ఋషి
.................
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టీ నే కట్టే పాటను చుట్టీ
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
తెల్ల చీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా
నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా
ఎఱ్ఱచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా
పచ్చచీర కట్టుకుంటే పంటచేను సిరివమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
నేరేడు పళ్ళరంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు
వంగపండు రంగులోన పొంగుతాయి సొగస్సుల్లూ
వన్నె వన్నె చీరల్లోన నీ ఒళ్ళే హరివిల్లు
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టీ నే కట్టే పాటను చుట్టీ
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
.........................

నేనోక ప్రేమ పిపాసిని నీవోక్క ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హౄదయం కదలనిది
నెనొక ప్రెమ పిపాసిని
తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్న
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వేలుతున్న
తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్న
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వేలుతున్న
నా దాహం తీరనిది నీ హ్రుదయం కదలనిది
నెనొక ప్రెమ పిపాసిని
పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సేగరేగిన గుండేకు చేబుతున్న నీ చేవిన పడితే చాలు
నీ గ్న్యపకాల నీడలలో నన్నేపుడో చూస్తావ్వు
నను వలచావని తేలిపేలోగ నివురై పోతాను
నెనొక ప్రెమ పిపాసిని
.............................
నవ్వవే నాచెలి చల్ల గాలి పిచేను మల్లు పులు నవ్వేను మమతలు పొంగే వేళలో..

................

సన్నాజాజికి గున్నమామికి పెళ్ళికుదిరింది
నాదేగెలుపని మాలతీలత నాట్యమాడింది..
..............
నికోసం యవ్వనమంతా వేచాను దాచాను మల్లెలలో
నీకోసం జీవితమంతా వేచాను సందెలలో
........
మెరుపులా మెరిసావు వలపులా కలిసావు..కన్నుమూసి తెరిచి చూసేలోగా మిన్నలలో నిలిచావు...
...............
నిన్నుమరచిపోవాలనీ అన్ని విడిచివెళ్ళాలనీ ఎన్నిసార్లు అనుకున్నా మనసురాక మానుకున్నా
......


ఇలారాస్కుంటూపోతే పేజీలు చాలవు...కమ్మని ఈపాటలు ఇక్కడ వింటూ...రాబోయే సమచ్చరం జీవితాల్లో అంమృతాన్ని నింపాలని ఆసిద్దాం....

10 comments:

  1. మొత్తానికీ ఈసమచ్చరాన్ని అంత్యాక్షరితో మొదలెడుదాం. ఆపినచోట మొదలెడితే ఆఆనందమే వేరు.
    'న'-
    నినుచూడకనేనుండలేను నినుచూడక నేనుండాలేను
    ఈజన్మలో మరి ఆజన్మలో ఇకఏజన్మకైనా ఇలానేను
    నినుచూడకనేనుండలేను
    ఆహాహా ఓహొహో ....

    ఏహరివిల్లు విరబూసినా నీదరహాసమనుకుంటినీ
    ఏచిరుగాలి నడయాడినా నీచరణాల సడివింటినీ
    నీప్రతిరాతలో ఎన్నిశశిరేఖలో
    నీప్రతిరాతలో ఎన్నిశశిరేఖలో....

    ReplyDelete
  2. చివరాకరికి (సంవత్సరం చివరకు అని) ఏమి పోస్ట్ వేసారు అద్దెచ్చా! అన్నీ మంచి పాటలు. మా mp3 దుమ్ము దులుపి బైటికి తియ్యచ్చు.

    ReplyDelete
  3. మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  4. ఆహా అన్నీ సూపర్ పాటలు, మీకూ మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సోదరా.

    ReplyDelete
  5. మీకూ మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .

    ReplyDelete
  6. చక్కని పాటలు.. ఇంకొంచం శ్రమజేసి ఎమ్పీత్రీ లంకెలు కూడా ఇచ్చే పని కదా..
    నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    ReplyDelete
  7. నాన్న గారు, మీకూ మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  8. అయ్యో నేనిది మిస్సయ్యానే...?!
    మీరు కూడా మావారి రూటేనా? ఉగాదే మన నూతన సంవత్సరం..న్యూ ఇయర్ ఏమిటి? అని పదింటికే దుప్పటి ముసుగెట్టేస్తారు మాష్టారు...:)
    good songs..!అయినా అక్కడున్నారు కాబట్టి "హాపీ న్యూ ఇయర్"....:)

    ReplyDelete
  9. మీకు ,మీకుటుంబ సభ్యులకు నూతన సంవత్సర 2010 శుభాకాంక్షలు .

    ReplyDelete