Dec 6, 2009

వేణుశ్రీకాంత్ కి ...

ఆర్యా
ఇయ్యాలనీ పుట్టిన్రోజు.
సరే, శుభాకాంక్షలు అందజేస్కుంటన్నాం...
ఇంతవరకూ బానే ఉంది. ఈ కత ఇనుకో...
మా ఇంటి ఎనకమాల బెండకాయ మొక్కలేఏసాం. బెమ్మాండంగా కాపొచ్చింది. లేతోటిని కోసి మార్కెట్టుకేసినం, మాంచి రేటొచ్చింది.
ఒట్రెండు ముద్రిపొయినై. రేటు పడిపోయింది.
మరింక సెప్పేదేముంది.
మోస్టు ఎలిజబుల్లు బేచిలర్ అనే టేగు...ఇంక మింగుడుబడట్లా.

సోదాపి ఇషయానికొత్తే -
పప్పనం ఎప్పుడూ?
ఇది నా ప్రశ్నే కాదు, మా సూరిగాడు, సివరాకరికి మా సంటిదిక్కూడా అడగమంది.

మరదీ కత

మళ్ళోస్సారి -
పుట్టిన్రోజు శుభాకాంక్షలు.

27 comments:

 1. వేణు, పుట్టినరోజు శుభాకాంక్షలు. సదా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో మీరు ఆనందంగా గడపాలని అభిలషిస్తూ ...

  మీ నేస్తం,
  ఉష.

  భాస్కర్ రామరాజు గారు, తెలిపినందుకు థాంక్స్.

  ReplyDelete
 2. హ్యాపీ బర్త్ డే వేణు.. మరి భర్త ఎప్పుడవుతున్నారు????

  ReplyDelete
 3. వేణూ శ్రీకాంత్ గారికి, జన్మదిన హార్దిక శుభాకాంక్షలు. బెండకాయలే కలకాలం తినమంటే ఎలా గండి. వివాహ శుభాకాంక్షలు కూడా అందజేసే అవకాసం ఇవ్వండి మరి.

  ReplyDelete
 4. వేణుగారు, పుట్టినరోజు శుభాకాంక్షలు.

  ReplyDelete
 5. venugaaru,
  here is a wish for you from all of us...see the link.
  May all your dreams come true..

  http://www.yahoo.americangreetings.com/ecards/display.pd?prodnum=3166188&path=41027

  bhaskargaaru,thanks.

  ReplyDelete
 6. పుట్టినరోజు శుభాకాంక్షలు వేణుగారు. పప్పు రేట్ ఇంకా పెరగకుండా తొందరపడండి మరి.... పప్పన్నం కాక బిర్యాని పెడ్తానంటారెమో.. ఆ పప్పులు ఉడకవు ... :)

  ReplyDelete
 7. hi anaya nen sushmitha
  puttina roju subakankshalu
  meru kalakaalam arogya,aishwaryalatho,sukha-santhoshalatho anandam ga undalani aa devudini prarthisthunnanu....
  telugu language loki ela type cheyyalo theliyaka ila pamputhunnanu sorry....

  ReplyDelete
 8. వేణూ శ్రీకాంత్ గారికి,పుట్టినరోజు శుభాకాంక్షలు.

  ReplyDelete
 9. Many more happy returns of the day Mr. Venu Srikanth..wish you all success..

  ReplyDelete
 10. వేణుకు జన్మదిన శుభాకాంక్షలు.ఆ వేణు మాదిరి అష్టమభార్యలు(పదహారువేలని మరికొందరు) కాకపోయినా రుక్మిణమ్మలాంటి అమ్మాయిని ఒక్కరిని ఎత్తుకొచ్చికాకుండా పెళ్ళికానిచ్చేసేయండి మరి. :)

  ReplyDelete
 11. పుట్టినరోజు శుభాకాంక్షలు వేణు :D

  ReplyDelete
 12. Happy birthday Venu srikanth!
  nanna garoo,
  post addirimdi :)

  ReplyDelete
 13. కామెంటేసిన అందరికీ ధన్యవాదాలు.
  గుజ్జ - తెలుగులో టైపు కొట్టుట ఎటులా? అదేమీ ప్రశ్న ఐతే -
  ఇటుల http://paatapaatalu.blogspot.com/2009/03/blog-post.html అని నా సమాధానం
  తెరేస గారూ - బహుకాల దర్శనం. దుర్గమ్మతల్లి ఆశీస్సులతో మీరు క్షేమం అని భావిస్తా.
  కొన్ని అవాంతరాల వల్ల బ్లాగ్ మిత్రులకు సరిగ్గా ప్రతి వ్యాఖ్యలు ఇవ్వలేకపోతున్నా. తొందర్లో, ఏంటా అవాంతరాలు ఏంసంగతి గట్రా మీముందుంచటానికి ప్రయత్నిస్తా

  ReplyDelete
 14. వేణూ శ్రీకాంత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

  ReplyDelete
 15. వేణు గారు, కొంచం ఆలిసంగా...అందుకోండి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

  ReplyDelete
 16. వేణు శ్రీకాంత్, ముందు శుభాకాంక్షలు. ఆ తరవాత .. ముదురు బెండకాయ పులుస్లోకి తప్ప ఎందుకూ పనికిరాదు. ఆ పైన నీ ఇష్టం

  ReplyDelete
 17. వేణు శ్రీకాంత్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు !
  ఈ పెళ్లి అయిన వాళ్ళందరికీ కుళ్ళు మేమే ఎందుకు బాధలు పడాలి అని అందరిని ఆ సాలె గూడు లోకి లాగటానికి ట్రై చేస్తుంటారు మీరేమాత్రం కంగారు పడద్దు, take your own time:)
  @భాస్కర్ గారు ఏమిటి అల్బని నుంచి న్యూయార్క్ జంప్ చేసారా ?

  ReplyDelete
 18. సోదరా... పుట్టినరోజు శుభాకాంక్షలతో ఆశీర్వదిస్తూ పనిలో పనిగా ముదురుబెండకాయ అని అక్షింతలు కూడా వేసేసారుగా :-) టపా మాత్రం మీ శైలిలో అదిరింది :-) చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ For giving me such a nice gift. కాస్త బిజీగా ఉండి వెంటనే జవాబివ్వలేకపోయాను.

  ఇక విషయానికి వస్తే అమ్ముడు పోయే ఉద్దేశ్యాలు లేవు కనుక రేటు పడిపోద్దని ఆలోచించాల్సిన పని లేదు ఏది ఏమైనా వచ్చే పుట్టినరోజుకు నీకు మళ్ళీ ఇలాటి టపా రాసే అవకాశం ఇవ్వను సరేనా :-)

  ReplyDelete
 19. బాసూ శ్రీకాంతా,
  అమ్ముడుపోడం అంటే, పెళ్ళిసేసీతానికి పెళ్లికూతురు దొరకతం అని, అంతేకానీ కట్నకానుకలుచ్చుకుని ఎహే అంటానిక్కాదు.
  కర్సు అవ్వటం అటారు కొందరు దీన్నే.
  ఏదైతేనేందీ, తొందర్లో ఇవాహాలాడేసేసి, ఓ ఇంటోడివై, అదై ఇదై నువ్వానందంగుండాలని పెద్దల ఇసారణ.

  ReplyDelete
 20. ఉషగారు నెనర్లు.

  జ్యోతిగారు నెనర్లు. ఖచ్చితంగా 2010 అని మాత్రం చెప్పగలనండి.

  జయ గారు, సునీత గారు నెనర్లు.

  తృష్ణ గారు నెనర్లు. కార్డ్ చాలా బాగుందండి. ఐడియా ఇంకా సూపర్ ఉంది :-)

  రమణి గారు నెనర్లు. బిర్యాని వద్దంటే పోనీ పిజ్జాలు, బర్గర్లూ, పాస్తాలు, శాండ్విచ్ లూ ఎలా ఉంటాయంటారు :-) అసలే ఈ మధ్య బెంగళూరు లో పోటీలు పడి వీటి రేట్లు తగ్గించేస్తున్నారు.

  సుస్మిత నెనర్లు. తెలుగు లో రాయడం గురించి భాస్కర్ గారు ఇచ్చిన లింక్ తో ప్రయత్నించు. Lekhini.org మరింత సులువైన మార్గం.

  పరిమళం గారు, మురళి గారు,

  విజయమోహన్ గారు నెనర్లు. రుక్మిణీ కళ్యాణం కథను మార్చేస్తే ప్రజలు ఊరుకుంటారా... రుక్మిణమ్మలాటి అమ్మాయి కావాలంటే ఎత్తుకొచ్చేయక తప్పదు మరి :-)

  నేస్తంగారు, గిరీష్ గారు, తెరెస గారు నెనర్లు.

  లలిత గారు, లక్ష్మిగారు నెనర్లు.

  కొత్తపాళీ గారు నెనర్లు. పులుసుమాత్రం తక్కువా చెప్పండి అయినా అందరికి చెప్పినట్లు 2010 ఖచ్చితమేలెండి గురువుగారి మాట ఙ్ఞాపకముంచుకుంటాను :-)

  మాలా కుమార్ గారు నెనర్లు.

  శ్రావ్య గారు నెనర్లు.. మరే ’కుళ్ళు’ భలే చెప్పారు, మొత్తానికి సూక్ష్మం గ్రహించారు :-)

  వ్యాఖ్యాతలందరికీ మరో మారు ధన్యవాదాలు. భాస్కరునికి ప్రత్యేక కృతఙ్ఞతలు. ఆలశ్యానికి క్షంతవ్యుడను.

  ReplyDelete
 21. వాకే సోదరా గాట్ యువర్ పాయింటూఊఊ... :-)Thanks again.

  ReplyDelete
 22. వేణు శ్రీకాంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తొందలో శ్రీ కాంతుడు అవ్వాలని ఆశిస్తూ... ఇంకో సారి యాపీ పుట్టిన రోజు.

  ReplyDelete
 23. వేణు శ్రీకాంత్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ... (ఆలస్యంగా :))

  ReplyDelete
 24. భావన గారు, చైతన్య గారు, శివరంజని గారు నెనర్లు.

  ReplyDelete