Dec 12, 2009

నాకూ ఓ బస్సు కావాలి

ఇందాక సూరిగాడు ఓ బొక్కు తెచ్చుక్కూర్చుని సదివి ఇనిపించమన్నాడు.
ఇంతలో సంటిదొచ్చి ఆ బొక్కుని లాగేస్కుళ్ళింది. ఆడు దాన్ని ఇటు గుంజను, పిల్ల అటు గుంజనూ. ఛీఛీ నాకర్జెంటుగా ఓ ఎఱ్ఱబస్సుకవాలి పగల్నూకటానికి.
[సమైక్యాంధ్రా జెయెసి అంట ఇరవై కోట్లకి పగల్నూకితే, ఇట్టాజరగాల్సిందే అనెజెప్పిన తెలంగాణా సవరయ్యలు యాభైకోట్లకి పగల్నూకారు బస్సుల్ని, ఆళ్ళఆళ్ళ బాబుల సొమ్ములు కదా]

13 comments:

 1. మావోయిస్ట్ పార్టీ అభిమానిగా చెపుతున్నాను. గతంలో మా పార్టీ వాళ్ళు బస్సులు తగలబెడితే అది విద్వంసం అన్నారు తెలుగు దేశం, కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఆ పార్టీల వాళ్ళే బస్సులు తగలబెడుతున్నారు. చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ళ పాలనలో మా పార్టీ బలంగా ఉన్న టైమ్ లో కూడా మా పార్టీ ఇన్ని బస్సుల్ని తగలబెట్టలేదు.

  ReplyDelete
 2. హా..హా..హా
  భాస్కర్ గారు ఇప్పుడు వుందో లేదో తెలియదు కానీ ఇంతకు ముందు APSRTC వారు పెళ్ళిళ్ళు, యాత్రలు 'మొదలగు' కార్యాలకు 'Dial a bus' సేవలు ఉండేవి.
  నాకు తెలియదు కానీ ఫోన్ కొడితే చాలు, గుమ్మం ముంగిట బస్సు ఉంటుందని విన్నాను.
  మరి ఇప్పుడు ఈ సేవలు వున్నా మరీ అమెరికాకు వస్తారో లేదో తెలియదు.
  వచ్చినా మొదలగులో కోపం చల్లార్చు కోవడానికి వాడచ్చో లేదో నాకు తెలియదు.
  ఒకవేళ వాడినా ఆ చర్య అగంతుడి మీదకు ఎలా తొయ్యాలో నాకు తెలియదు.
  నేనేమి చెప్పలేదు. నాకు ఏమీ తెలియదు.

  ReplyDelete
 3. అన్నట్టు ఇంకో మాట. మీరు చూసారో లేదో నాకు తెలియదు కదా, అందుకే చెప్తున్న.
  రాష్ట్రములో వేడెక్కిన పరిస్థితిలకు చలి ఏమైనా మందగించిందా చూద్దాం అని పేపర్ తిరగేసాను.
  చలిపులి అనే column కనిపించలేదు కానీ మూడు tables కనిపించాయి.
  1 బూడిదైన బస్సుల సంఖ్య ప్రాంతాల వారిగా
  2 ప్రజా ప్రతినిధుల రాజీనామాలు పార్టీల వారిగా
  3 ప్రభుత్వ ఆస్తి నష్టం అంచనా జిల్లాల వారిగా

  ReplyDelete
 4. "మా పార్టీ బలంగా ఉన్న టైమ్ లో కూడా మా పార్టీ ఇన్ని బస్సుల్ని తగలబెట్టలేదు." అయ్యో ప్రవీణ్ గారు, అలా ఎలా వెనకబడిపోయింది మీ పార్టీ, మీరు ఎలా ఊరుకొన్నారు వాళ్లు తగలబెట్టటంలో వెనకపడిపోతుంటే? తక్కువ బస్సులు తగలెట్టినందుకెనెమో మీ మావోఇస్ట్ పార్టీ దెబ్బతినిపోయింది? అదెదో dial RTC పథకం కింద, మావోఇస్ట్లకు సీకాకులం లో తగలెడతానికి ఓ ఫోన్ కొట్టకపోయారా?

  ReplyDelete
 5. హ్మ్ మీ టపాలో వ్యంగ్యానికి నవ్వాలో రాష్ట్రంలో పరిస్థితులకు ఏడవాలో అర్ధంకావడం లేదు సోదరా..

  ReplyDelete
 6. తగలెట్టు కోనీయన్నా ఆనాయాళ్లని. ఇంకో అర్దరూపాయొ రూపాయో పెరుగుద్ది టికెట్టు అంతేగా. అలవాటు పడిపోయాం

  ReplyDelete
 7. ఒక అండర్ గ్రౌండ్ పార్టీ వాళ్ళు తొమ్మిదేళ్ళలో తగలబెట్టలేని బస్సుల్ని రెండు ప్రజాస్వామిక పార్టీల వాళ్ళు రెండు రోజుళ్ళో తగలబెట్టగలరు. ఏమి గొప్ప ప్రజాస్వామ్యం ఇది!

  ReplyDelete
 8. ఓహో ప్రవీణ్ గారు ఐతే ఈ తగలబెట్టుడు మీ పార్టీ నేర్పిన విద్యేనా ?

  ReplyDelete
 9. praveen.. meeru bussuluni kaadu manushulnu tagalette batch kada. krishna express ni tagalettindi meeru marchipoyaremo..

  ReplyDelete
 10. "చవటాయిని నేను, నీకన్న పెద్ద చవటాయిని నేను"
  అనేపాట ఎవురికైనా గుర్తుందా?? ఆపాట కొంతమందికి సక్కంగా సరిపోయిద్ది. ఆళ్ళెవురో సెప్పినోళ్ళకి రెండు ఎఱ్ఱి(ఎఱ్ఱ)బస్సులుచితం.
  ఓరినీ ప్రవీణూ -
  ఒక అండర్ గ్రౌండ్ పార్టీ వాళ్ళు తొమ్మిదేళ్ళలో తగలబెట్టలేని బస్సుల్ని రెండు ప్రజాస్వామిక పార్టీల వాళ్ళు రెండు రోజుళ్ళో తగలబెట్టగలరు. ఏమి గొప్ప ప్రజాస్వామ్యం ఇది!
  పెజాసోమ్యానికి ఎతిరేకం ఐతే బస్సులు తగలబెట్టాలా? దీన్ని మాఓఇజం అంటారా? ఆలెక్కన చైనాలో బస్సులన్నీ అయిపోయుండాలిగా.
  ఇది పెజాసోమ్యం గాబట్టే నీలాంటి బస్సులు తగలెట్టే, ప్రభుత్వ ఆస్థులను తగలెట్టే, తగలబెట్టే జనాల్ని సమర్ధించే, జనాలున్నారు.
  >>ఒక అండర్ గ్రౌండ్ పార్టీ వాళ్ళు తొమ్మిదేళ్ళలో తగలబెట్టలేని బస్సుల్ని
  అండర్గ్రౌండ్ పార్టీ కాబట్టి బస్సుల్నేసేయొచ్చా.
  మా బాస్సులన్నీ బస్టాండ్లో ఆపేసాం. ఇక తమరు దయచేయండి. వేరే బస్టాండ్ కి ఎళ్ళండి.

  ReplyDelete
 11. అదేదో సైన్మా, హా!! బావగారూ బాగున్నారా అనుకుంటా. కోట శ్రీనివాసరావు, కొడుకు శ్రీహరి. కొడుకెళ్ళి చూడు ఎలా కష్టపడుతున్నానో అనంగనే, నేపడిన కష్టలతో పొలిత్తే ఇదీ కట్టవట్రా .. అలా
  నే పగల్నూకిన బస్సుల్తో పోలిత్తే నువ్వు పగల్నూకిన బస్సులు....

  ReplyDelete
 12. సుబ్బూ - అదేమరి!! అర్ధరూపాయి పెంచితే, పెంచినందుకు మరో రెండుమూడు బస్సులు..ఢాంఢాం..

  ReplyDelete
 13. ఆళ్ళఆళ్ళ "బాబు/ల" సొమ్ములు కదా...ఎక్కడో శ్లేష ధ్వనిస్తోంది.... సరైన మాటన్నారు.....

  ReplyDelete