Feb 25, 2009

పిల్లలకి చదువుతోబాటు సామాజిక బాధ్యత నేర్పాలి

ఈ మధ్య మన సహ బ్లాగరు అరుణ పప్పు గారి ఓ టపా "ఒక కధనం"కి నేను ఇలా కామెంటు రాసా:-

ఆడవాళ్లు స్వేఛ, మగవాళ్లు స్వేఛ, మనిషి స్వేఛ అనేది ఒక మల్టై ఫోల్డెడ్ ఇస్స్యూ. మన సమాజం ఆ మాటకొస్తే ఏ దేశంలోనూ స్త్రీకి నూటికి నూరు శాతం స్వేఛ లేదు. ప్రతీ బలమైన జంతువు బలహీనమైన జంతువునే వేటాడాలని చూస్తుంది. ఇప్పటి మన సమాజంలో, ఈ ఆధునిక యుగంలో, ఇలాంటి "అనుకోని దాడులు, దోపిడీ"లకి కారణం ఏంటంటారు? మా ఇంట్లో మా నాన్నగానీ, అమ్మగానీ "మనకేంటి!! ఈద్దరూ అబ్బాయిలే" అనే మాట నేను ఎప్పుడూ విన్లా. మా సూరిగాడు పుట్టినప్పుడుకూడా "అబ్బా!! అబ్బాయి పుట్టాడహో" అనేమి అనుకోలేదు, ఇప్పుడు అనఘ పుడితే "అయ్యో!! అమ్మాయి పుట్టిందేంటిరా ఖర్మా" అనుకోలేదు. నా ఉద్దేశంలో జనాల ఆలోచనా సరళిలో మార్పు రానంతవరకూ జీవితాలింతే.
ఇలాంటి ఎట్రాసిటీస్ చేసేవారు, అంటే, అమ్మాయి నడుస్తుంటే వెళ్లి ఢీ కొట్టడం ఇలాంటివి, వయసు పొంగులో (ఎడాలసెన్సు) చేసేవాళ్లు ఎక్కువశాతం అయితే, అదో మానసిక వ్యాధితో చేసేవాళ్లు కొంతమంది.
గర్హించతగ్గ విషయం ఏంటాంటే, ఈ సోకాల్డ్ శ్రీరాం సేన "ప్యాంటు చొక్కాలు, జీన్సు" వేస్కుని, "సారాయి అమ్ముతున్న వాణ్ని" వదిలేసి అమ్మాయిల్ని కొట్టడం. ఇది కేవలం ఓ ప్రత్యేకమైన అజెండాతో చేసింది మాత్రమే అనిపించింది నాకు.
అసలు ఇలాంటి వాటికి కారణాలు ఏంటి? యూత్ పై నేను రాసిన పోష్టులోలా(http://ramakantharao.blogspot.com/2009/01/so-called.html), ఇది ఓ వర్గం యొక్క జాఢ్యం. ఆ వర్గం రాజకీయ వర్గం కావొచ్చు, లేక డబ్బునోడు కావొచ్చు, లేక ఇంట్లోని తల్లితండ్రుల గొడవల్తో చికాకెత్తిపొయ్యి ఓ రకమైన ఇంబ్యాలెన్సుతో మానసికంగా వికలాంగత్వం చెందినోడు కావొచ్చు, దీన్ని మనం ఉన్మాదం అనికూడా అనుకోవచ్చు.
"a man on a bicycle stretched his hand.....orange rubber bands around his ankles." ప్రతీ మగోడిలోనూ ఇలాంటోడు ఉంటాడు. కొంతమందికి నిద్రావస్తలో, కొంతమందిలో చాలా యాక్టివ్గా. ఇంట్లో కాలేజికి వెళ్తున్నా అని చెప్పి వెళ్లినోడు బయట ఏంచేస్తున్నాడో ఎలా తెలుస్తుంది.

సోదాపి అసలు నే చెప్పదల్చుకున్నదానికి వస్తే - నా దృష్టిలో దీనికి మార్గం -
౧. పిల్లలకి చదువుతోబాటు సామాజిక బాధ్యతని బోధించాల్సిన సమయం వచ్చింది.
౨. ఇకనైనా రాజకీయనాయకులు కనీసం స్త్రీ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నిధుల్ని మింగటం ఆపి "సంక్షేమం" వైపు నడావాలి
౩. ఉన్నత విద్యలకి వెళ్ళేప్పుడు కేవలం మార్కులు కొన్నుక్కున్నాడా లేదా కన్నా విధిగా
ఎ. పిల్లోడి సామాజిక ధృక్పదం ఏంటి
బి. వాడు ఎలాంటి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడు
సి. తన కింది జనాలతో ఎలా మెలుగుతున్నాడు(తనకన్నా బలహీనమైన వాళ్లతో)
డి. పై జనాలతో ఎలా మెలుగుతున్నాడు(తనకన్న బలమైన వాళ్లతో)
ఇలాంటి విషయాల్ని కూడా వెయిటేజీ ఇచ్చి, సామాజిక వికాసం లేనోడికి ఒకటో ర్యాంకు వచ్చినా ఉపయోగంలేదు అనేలా ఉండాలి.
---------------------------

ఇప్పటిదాకా నేను మన సమాజం గుడ్దిగా పాటిస్తున్న, అనుసరిస్తున్న, యువత ఓ చట్రంలో ఇరుక్కుపోయి అదే చట్రం ఊబిలోకి కూరుకుపోతున్న అంశాలపై కొన్ని పోస్టులు రాసాను, అవి, నాతిచరామి, 2035, ముందుతరాలకి ఆస్థులు సంపాదన, So Called యూత్ లాంటివి.
నా దృష్టిలో మన ఈనాటి సమాజంలోని ప్రతీపౌరుడికి కావాల్సింది, అస్సలు లేనిదీ - సామాజిక బాధ్యత. మన విద్యావిధానంలో సామాజిక బాధ్యతని ఒక అంశంలా దేనికి జొప్పించకూడదూ? అదొక పాఠ్యాంశంగా అయినా లేక ఒక వర్కషాప్ గా అయినా. ప్రతీ నెలలో ఓ రోజున తరగతి దాటి బయటి ప్రపంచంలోకి తీస్కెళ్లటం, పిల్లలకి ఓ స్పృహని కలుగజేయటం ఇలా. రిసైకిల్ అంటే ఏంటి, కాయితాన్ని ఎలా వాడుకోవాలి, చెట్లు ఏంటి, నీళ్ల వాడుక ఎలా, ఎన్వైరాన్మెంటు గురించి, ప్లాస్టిక్కు గురించి ఇలా.

2 comments:

  1. మంచి ఆలోచన.. ఆసిడ్ దాగులవంటివి జరిగినప్పుడల్లా నేనూ ఇలాగే ఆలోచిస్తున్నా..

    ReplyDelete
  2. Post Title 100% acceptable !
    Only Youth? మరి కాని ఈ సామాజిక మార్పు కు అసలు కారణమైన 30-40 మధ్య ఉన్న వాళ్ళ సంగతి?

    ReplyDelete