మన పెళ్లిల్లలో అతి ముఖ్యమైన మంత్రం -
'ధర్మేచ అర్ధేచ కామేచ త్యయేషా నాతిచరితవ్యా నాతిచరామి' ధర్మార్ధ కామములందు ఒకరికొకరు తోడుగా వుంటామని ఇద్దరు కలసి చేసే ప్రతిజ్ఞ "నాతిచరామి". ఇంతవరకూ బాగానే ఉంది. ప్రకృతి స్వభావాలతో కూడ అని చెప్పించకపోవటం నమ్మలేని నిజం. అంటే, ధర్మ అర్ధ కామములలో కలసి నడుద్దాం అన్నారేకాని, ప్రకృతి స్వభావంతో బుద్ధి వికటిస్తే మాత్రం ఏమి చెయ్యాలో చెప్పకపోవటం.
అసలు కధ:
మగాడు ఆడదాన్ని దేనికి శీలపరీక్షకి గురిచేస్తాడు?
ఉదాహరణ:-
నేను ఇంతక ముందు ఉన్న అపార్టుమెంట్లో మా పక్క బ్లాకులో ఓ తమిళ కుటుంబం ఉండేది. అతనూ ఓ కన్సల్టెంటే. మేము ఆ అపార్టుమెంట్లో చేరినప్పటికి ఆమె కడుపుతో ఉంది. వాళ్లకి పాప పుట్టింది అనుకుంటా. తర్వాత్తర్వాత హలో అంటే హలో అనుకుంటూండేవాళ్లం. మేము ఇల్లు మారాం. అప్పుడప్పుడూ కనపడుతుండేవాడు అతను. ఇంతలో ఆమె వెనక్కి వెళ్లిపోతున్నది అని మా ఆవిడ చెప్పింది. అదేంటి మొన్ననేగా వెళ్లొచ్చింది, అయినా వెళ్లిపోవటం అంటే ఏంటి అని అడిగితే, వాళ్లు విడిపోతున్నారు. విడాకులు మంజూరు కూడా అయినయ్ అని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ కుటుంబంతో పెద్దగా నాకు పరిచయం లేకపోయినా వాళ్లని అంత దగ్గరగా గమనించకపోయినా, విడిపోయ్యేంత ఏముందా అని అనిపించి, అదేంటి, దేనికి? ఏమైనా కారణమా అని అడిగితే, ఇలా చెప్పుకొచ్చింది.
అతను ఆమెని అనుమానిస్తున్నాడట. అనుమాననించటామేకాక, అవమానిస్తున్నాడట. పుట్టిన పిల్ల అతనికి పుట్టింది కాదట. ఆమె పిల్లని పడుకోబెట్టి బాత్రూమ్ కో వెళ్తే ఆ పసిపిల్ల చేతిలో కత్తో, కత్తెరో పెడుతున్నాడట. ఆ అపార్ట్మెంట్లో ఉన్న అందరితో ఆమెకు సంబంధం ఉందీ అంటాడట. అందుకే ఆమె విసిగి వేసారిపోయి వెళ్లిపోతున్నదీ.
నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాడు చదువుకున్నోడే, సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇంగితం ఉన్నోడేనా అనిపించింది. మనిషి, ఎంత చదువుకున్నా, ఎంత ప్రపంచాన్ని జయించినా తనకున్న కొన్ని గుణాలని సరిచేస్కోలేడు, వాటిల్లో ముఖ్యమైనది తనకన్నా తక్కువ వాళ్లపై పెత్తనం చలాయించాలని చూడటం, వాళ్ల మూలాలపై దెబ్బకొట్టడం. గమ్మత్తేంటంటే, మనం, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పనిచేస్తూ పనిచేసే కంపెనీకి, క్యూ.ఏ, ఆడిట్ ప్రాసెస్, క్యూ.సి, ఐ.యస్.ఓ 9000, ఐ.యస్.ఓ 9001, ప్రాసెస్ ఓరియంటేషన్, డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ అవి ఇవీ మట్టీ మషాణం, సిక్స్ సిగ్మా, సి.యం.యం.ఐ లెవెల్ స్టాండర్డ్స్ ఇలా పాటిస్తూ మిగతావారితో గొప్పగానో లేక వెటకారంగానో "బాసూ!! మా కంపెనీ సిక్సు సిగ్మా" అని చెప్పుకుంటాం. ఇవన్నీ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చెయ్యటానికీ అని చెప్తాం. మన నిజ జీవితంలో మచ్చుకి ఒక్క స్టాండర్డ్ని కూడా దత్తత తీస్కోం. చాలా ఆశ్చర్యంగా అనిపిసూంటుంది నాకు. అమెరికాకి వచ్చి, ఒక పెద్ద ప్రభుత్వకార్యాలయంలో ఐ.టీ గుత్తేదారుగా పనిచేస్తూ "పెళ్ళాం శీలాన్ని" తూలనాడటం "మనిషి" అనే పదానికే అవమానం. అదీ పసిపిల్లకి చేతిలో కత్తులు పెట్టి ఆడించటం అనేది మోస్ట్ ఇన్-హ్యూమన్. ఆమే అతన్ని దేనికి వదిలేసిందో కానీ 911 కి కాల్ చేసి ఉండాల్సింది. ఇలా చెయ్యటం నేరం, ఇట్స్ ఏ క్రైం.
ఇక్కడి విషయం ఏంటంటే, దేనికి మగాడు ఎప్పుడూ ఆడదాని శీలాన్నే దెబ్బకొడతాడూ అని? ఆమె అంటే ఇష్టంలేకపోతే, అమ్మాయి, నీకు నాకు సరిపోవటంలేదు, మనం విడిపోదాం, అని గౌరవంగా చెప్పుకోవచ్చుగా? నేను ఇటు అంటే నువ్వు అటు, నేను అ అంటే నువ్వు క. కాబట్టి నీకూ నాకు సరిపడదు. బెట్టర్ సపరేట్ అని చెప్పుకోవచ్చుగా? ఇలా నీకూ పలానోడికి లింకు ఉంది, విడిపోవాల్సిందే అనే కాన్సెప్ట్ దేనికి?
ఈరోజు రేపట్లో విడిపోవటం ఓ పెద్ద విషయం ఏమీ కాదు. అయితే మనం ఇలాంటి "విడాకుల్ని" ఇప్పుడిప్పుడే ఎక్కువగా చూస్తున్నాం. ఇంకా మన సమాజం "విడాకుల్ని" అంగీకరీంచటంలేదు. చర్చ "విడిపోవడం" కన్నా, ఈ విడిపోయే వాళ్ల కారణాల మీద.
నాకు తెలిసి, ఈ రోజున విడిపోతున్న జంటలు చూపుతున్న ముఖ్య కారణం -
అబ్బాయి అమ్మాయి శీలాన్ని శంకించడమే.
అమ్మాయిలు కూడా అబ్బాయి శీలాన్ని శంకించడమే.
ఇంక ఇంతకన్నా వేరే కారణాలే దొరకవా జనాలకీ?
ఇక ముందుముందు ఎలా ఉండబోతోందో.
పడమటి దేశాల్లో ఎక్కువ మందికి తమ తండ్రి ఎవ్వరో తెలియదు. ఇలాంటి వాళ్లలో నల్లవాళ్లు ఎక్కువే. వాళ్ల జీవితాలు నేరమయం కావటానికి "తల్లిలేమి" "తండ్రిలేమి" "ప్రేమలేమి" "మారు తండ్రి హింస" ఇలాంటివి ముఖ్యమైన కారణాలు అని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన దేశంలో కూడా నెమ్మదిగా సింగిల్ పేరెంట్ పిల్లలు పెరుగబోతున్నారేమో?
నా దృష్టిలో -
వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేద్దాం అనేది శుద్ధ తప్పు మాట. అలాచేస్తే, ఒక్క నిజం చాలు ఆ సంసారాన్ని కూలగొట్టటానికి.
పెళ్లికి ముందు ఇద్దరికీ కౌన్సిలింగు చాలా అవసరం. ఈరోజూ రేపట్లో ఇది చాలా ముఖ్యం. అస్సలు పిల్లలు పెళ్లికి తయ్యారయ్యారా లేదా అని తల్లితండ్రులు తెల్సుకోవాలి. పెళ్లికి కావాలింది వయ్యసే కాదు, వయ్యస్సుతోబాటు వ్యక్తిత్వం, పెళ్లి చెసుకునేందుకు కావాల్సిన మానసిక స్థితి.
Feb 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
సోదరా బాగా చెప్పావు .అభద్రతా భావం (ఎదైనా కారణం కావచ్చు)వల్లే ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి అనుకుంటా!
ReplyDeleteఈ జాడ్యం ఇప్పటిదికాదు ...రాముని కాలం నుండి వుంది. సమాజం పేరుతో, పరువు పేరుతో చాలమంది ఇలాగే ప్రవర్తిస్తారు. మార్పు మనిషిలో వచ్చే వరకు ఎలాంటి వాళ్ళని ఎవరు మార్చలేరు.
ReplyDelete"మనిషి, ఎంత చదువుకున్నా, ఎంత ప్రపంచాన్ని జయించినా తనకున్న కొన్ని గుణాలని సరిచేస్కోలేడు, వాటిల్లో ముఖ్యమైనది తనకన్నా తక్కువ వాళ్లపై పెత్తనం చలాయించాలని చూడటం, వాళ్ల మూలాలపై దెబ్బకొట్టడం." ...నిజం...
ReplyDeleteతమ మీద తమకి ఉన్న అపనమ్మకమే ఈ అనుమానం రూపంలో వేధిస్తుంటుంది అని నా అభిప్రాయం.నేను అనాకారిగా ఉన్నాననో(అంటే పక్కవాళ్ళు అందంగా ఉన్నారేమో)లేక పైకి కనిపించని ఏదో ఒక మానసిక రుగ్మతతో ఉండడంవల్లనో లేదా ఇటువంటి ఆలోచనల తీవ్రత వల్లా ఈ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయేమో?
ReplyDeletetrue
ReplyDeleteBut it applies equally to men and women.
"తనకన్నా తక్కువ వాళ్లపై పెత్తనం చలాయించాలని చూడటం, వాళ్ల మూలాలపై దెబ్బకొట్టడం"
ReplyDelete"మన నిజ జీవితంలో మచ్చుకి ఒక్క స్టాండర్డ్ని కూడా దత్తత తీస్కోం."
"వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేద్దాం అనేది శుద్ధ తప్పు మాట. అలాచేస్తే, ఒక్క నిజం చాలు ఆ సంసారాన్ని కూలగొట్టటానికి".
అక్షరలక్షలు.
@అరుణాంక్ - అవును నిజమే.
ReplyDelete@వేణుగోపాల్ రెడ్డి - మార్పు మనిషి చాలా అవసరం. ఐతే, మనం మారటానికి మనకి చాలా అవకాశాలు వచ్చినై, వస్తున్నై, వస్తూనే ఉంటయ్. కానీ మనం మారం.
@మురళి - ధన్యవాదాలు
@పప్పు యార్ - మూడొందల అరవై డిగ్రీల్లో ఈ "అపనమ్మకం" అనే ఒక్క డిగ్రీ మిగతా మూడొందలయాభై తొమ్మిది డిగ్రీలనీ ఎలా కప్పేస్తుందీ అనేది ప్రశ్న.
@కొత్తపాళీ అన్నగారు - అవును ఇది ఇద్దరికీ వర్తిస్తుంది.
నాకు తెలిసి, ఈ రోజున విడిపోతున్న జంటలు చూపుతున్న ముఖ్య కారణం -
అబ్బాయి అమ్మాయి శీలాన్ని శంకించడమే.
అమ్మాయిలు కూడా అబ్బాయి శీలాన్ని శంకించడమే.
@సత్యసాయి కొవ్వాలి - ధన్యవాదాలు
వాడు చదువుకున్నోడే, సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇంగితం ఉన్నోడేనా అనిపించింది. మనిషి, ఎంత చదువుకున్నా, ఎంత ప్రపంచాన్ని జయించినా తనకున్న కొన్ని గుణాలని సరిచేస్కోలేడు ... కరెక్టు. బ్లాగ్లోకంలో కొంత మందికి ఇది చాలా చాలా బాగా వర్తిస్తుంది.
ReplyDelete"వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేద్దాం" అనేమాట అసలెలా పుట్టిందో? బహుశా "విడాకులు" అనేపదానికి అర్ధం తెలీని రోజుల్లో పుట్టిందేమో? లేదా కామిక్ గ్గా పుట్టుంటుంది దాన్ని మన సినిమాల్లో యమా సీరియస్ గా వాడేసుంటారు..
ReplyDeleteఏదేమైనా ఈరోజుల్లో విడాకులు అనేది బుగ్గలు నొక్కుకునేంత పెద్ద పదమేకాదు.ఏంటో రోజులు...