అవును, మనం పుట్టినప్పటినుండీ మన తల్లితండ్రులు మనల్ని ఎంతగానో ప్రేమించి, మన తొలిఅడుగు, తొలిమెతుకు, తొలిపలుకు ఇలా ప్రతీ దాంతో పులకించి, మనకి ప్రతీ అవసరంలో ఆసరాగా నిలిచి, మన ముందడుక్కి తమ కాయకష్టంతో తడిపిన ఇటుకల్తో బాటనేర్పాటు చేసి, తమ ఓర్పుని చీపిరిగా చేసి ఆ బాటలోని ముళ్లన్నిటినీ ఊడ్చి మనల్ని ఇంత ఎత్తుకి తెచ్చారు. మా నాన్న కూడా మా కోసం సైకిలు బుట్టలో ప్రతీరోజూ ఏదోక పదార్ధం తెచ్చేవాడు. సైకిలు మీద నేను ముందు నా అన్న వెనక కూర్చుంటే సినిమాకి తీస్కెళ్లేవాడు. పిడుగురాళ్ల లో ఉండి మేము షోలే, 36 ఛాంబర్ ఆఫ్ షావొలిన్, ఎంటర్ ది డ్రాగెన్, ఇలాంటి సినిమాలు ఎన్నో చూసాం. మా నాన్న అమ్మ తమ సర్వస్వాన్ని ఒడ్డి మాకు చదువులు చెప్పించారు. అయితే ఇది అందరు తల్లితండ్రులు చేసేదేగా. దానికి నా జవాబు, ఈ ప్రపంచంలో ఏ ఒక్కడి తల్లితండ్రులూ సమానంకాదు. ఏ ఇద్దరు తల్లులకూ నొప్పులు సమానంగా ఉండవు. ఎవడికి వాడికి వాడి తల్లితండ్రులు గొప్ప. This is a rule of thumb. ప్రపంచంలో మనకి అత్యంత విలువైన వ్యక్తులు ముగ్గురు. తల్లి, తండ్రి, గురువు. ఆ తర్వాతే సంసారం, పెళ్లాం, పిల్లలు అందరూ.
ఇంతకీ నేచెప్పొచ్చేదేంటంటే. ఈ కధని:
నేను ఎదో చదువుకున్నా. కొన్ని సార్లు ముందుకెళ్లా, కొన్ని సార్లు వెనక్కొచ్చా, కొన్ని సార్లు కిందపడ్డ కొన్ని సార్లు లేచి నుంచున్నా. అన్నిట్లో నా వెనక మా నాన్న ఉన్నాడు. ఆయన నా కోసం చేసిన త్యాగాలు కోకొల్లలు. బయట టీ తాక్కుండా ఆ రూపాయి మిగిల్చి నాకు బిస్కెట్టు కొనిపెట్టాడు. తాను రోడ్డుమీద వెళుతూ బజ్జీల కొట్టు ముందునుండే వెళ్తూ, ఆక్కుండా, ఇంటికి వచ్చి చద్దన్నం తిని గొక్కెడు నీళ్లు తాగి ఓ రూపాయిని ముంతలో ఏసాడు నాకోసం, పెన్సిలు కొనిపెట్టొచ్చు ఆ రూపాయితో తర్వాత అని. తాను సైకిలు తొక్కుతూ నన్ను తిప్పాడు, బండి కొంటే ఖర్చు అని. ఇలా ఎన్నో కష్టాలు పడి నన్ను పైకి ఎక్కదీస్కొచ్చిన నా కన్న తండ్రికి నేనేమి చేసాను?
ఈ పూట ఎక్కడికి పోదాం నాన్నా అని అడిగా. నా దగ్గరకి రా నాన్నా అని టికెట్లు పంపించా. రైల్ స్టేషన్ నుండి కార్ పెట్టుకుని ఇంటికి తీస్కొచ్చా. మద్రాసు మొత్తం తిప్పా. ప్రతీరోజు సాయత్రం ఆఫీసు నుండి తొందరగా ఇంటికి వచ్చి ఓ 5 నిమిషాలు అలా బయటకి తిప్పా. చేతిలో చెయ్యి పెట్టి నాన్నా నేను కొనుక్కున్న బండి అని చూపించా. నాన్నా నేను అద్దెకు తీస్కున్న ఇల్లు అని చూపించా. వారాంతాలు బీచుకి తీస్కెళ్లా. ఓ సాయంత్రం బిసెంటునగర్ బీచ్కి వెళ్తే, ఇంకోసాయంత్రం మెరీనా బీచ్కి తీస్కెళ్లా. ఓ పూట శర్వణాభవన్ లో కాఫీ తాగితే ఇంకోపూట కేఫ్ కఫీ డే లో తాగించా. ఓ రోజు బీసెంటు నగర్లో జ్యూస్ తాగితే ఇంకోరోజు సంగీతలో టిఫ్ఫిన్ పెట్టించా. ఓ వారంతం స్పెన్సర్ ప్లాజాకి తీస్కెళ్తే, ఓ వారంతం లైఫ్స్టైల్ కి తీస్కెళ్లా.
ఓ వారాంతం బీసెంటునగర్ లోని బట్టల కొట్టుకి తోస్కెళ్తే, ఇంకోవారంతం నుంగంబాక్కం ఎత్తురోడ్డులోని బట్టలకొట్టుకి తీస్కెళ్లా. మేము కొనేదేమి ఉండదు. సరదాగా అలా వెళ్లి, విండోషాపింగు చెయ్యటమే. ఇలా మేము తిరగని ప్రదేశం అంటు లేదు. ఊర్కనే అలా వెళ్లటం, ఓ చుట్టు చుట్టుకునిట్టి రావటం. అలానే కాపాలేశ్వరస్వామి గుడికి వెళ్లటం, మైలాపూర్లోని సాయిబాబా మందిరానికి వెళ్లటం. ఇలా.
నేను హైదరాబాద్లో ఉన్నప్పుడూ అంతే.
ఇక్కడి మూల కధ ఏంటంటే, నేను గొప్ప అని కాదు, నేను మాత్రమే ఇలా చేసా అని కాదు. ఇది కేవలం ఉదాహరణకి మాత్రమే.
గమనించాల్సిన అసలు విషయం - "కన్న తల్లితండ్రుల" కళ్లల్లో తృప్తి. నాన్నా, నేను కారు కొన్నా, అని ఆయన చెతిలో చేయివేసి ముందటి డోరు తీసి ఆకారులో కూర్చోబెట్టి, డోరు మూసేసి, డ్రైవింగు సీట్లో కూర్చొని ఇది ఇది, ఇది అది అని చెప్తూ ఈ పూట ఎక్కడికి వెళ్దాం అని అడిగినప్పుడు ఆ తండ్రికి కలిగే తృప్తి.
నాణానికి మరోవైపు : ఉద్యోగ వత్తిడిలో, అంబరాన్ని తాకాలనే తపనలో, ఆకాశానికి నిచ్చనేసి, పెళ్లాన్ని సుఖపెట్టటమే పరమావధిగా భావించి, అత్తమామలకి భజన చేస్తూ సొంత తల్లితండ్రుల్ని అవమానిస్తూన్న మనం, రేపు మనకి జరిగే ప్రమాదాన్నిగూర్చిన ఆలోచన లేకపోవటం. రేపొద్దున రాబోయే కొమ్ములు వాడి.
Feb 19, 2009
Subscribe to:
Post Comments (Atom)
No words to comment.
ReplyDeleteనాన్నను గుర్తుకు తెచ్చారు.అదృష్టవంతులు మంచినాన్నను కలిగినందుకు.మా నాన్న నాకు 5 సం.వయసులోనే వెళ్ళిపోయారు బస్సు ప్రమాదంలో.
ReplyDeletebaagundi andi....very nice.........blags chdavadam modalu pettinapatinundi choostunnanu..andaru amma ani antaaru gani father gurinchi cheppare ani.nenu amma takkuva anatam ledu..evaru koncham kooda gurtuchesukovadam ledani.........anyway....verynice....
ReplyDeleteas usual great article.
ReplyDeleteచెమ్మగిల్లిన కళ్లు రాయలేవు నాలో కలిగిన భావాలు
ReplyDeleteరాసే చేతికి తెలీదు చిన్ననాటి జ్ఞాపకాలు ....
అన్నీ తెలిసిన హృదయం చెప్తోంది మీకు
ధన్యవాదాలు ......
మానాన్నగారంటే నాకూ చాలా ఇష్టమండీ .
అంతా బాగానే ఉంది కానీ ఎందుకు పెళ్ళాల మీద పడతారు.
ReplyDeleteతల్లి దండ్రులను సుఖ పెట్టాలనే ఉద్దేశమే ఉంటే పెళ్ళాలు మీకు అడ్డా??
మనసుంటే ఎంతమంది నైన సుఖ పెట్ట వచ్చు.
పెళ్ళాలను బాగా చూసుకోని వాళ్ళనే వాళ్ల పెళ్ళాలు అసంతృప్తి తో ఇంకెవరినో బాగా చూసుకొంతున్నరేమో అని బాధ పడతారు/ పెడతారు.
Heart touching !
ReplyDeletebagundi, but i also got the same doubt ..
ReplyDeleteఅంతా బాగానే ఉంది కానీ ఎందుకు పెళ్ళాల మీద పడతారు.
తల్లి దండ్రులను సుఖ పెట్టాలనే ఉద్దేశమే ఉంటే పెళ్ళాలు మీకు అడ్డా??
నాన్న కళ్ళలో సంతోషం చూసిన కొన్ని సందర్భాలను గుర్తుచేశారు..
ReplyDeleteబావుంది కాని మధ్యలో భార్య వారి తల్లితండ్రులు ఏమి చెశారో అర్ధం కాలేదు. మీకు మీ నాన్నగారు ఎలగో.. భార్యకు వాల్ల అమ్మ, నాన్న అంతే కదా. అవసరమైతేనే అత్త మామలు గుర్తు వస్తారు కాని, అత్తమామలకు భజన చెసే అబ్బాయిలు ఎక్కడ ఉన్నారండి!! భజన చేస్తున్నారు అంటే వారు అత్తమామలనుంచి ఎదో ఆశించే వారే అయ్యి ఉంటారు..
ReplyDeletebeautiful.
ReplyDeleteI too have the same doubts.
ముందుగా కామెంటేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు.
ReplyDelete@హైమ, బుజ్జి, మాధవి గారు: "పెళ్లాల మీద పడలేదు". పెళ్లాలమీద పడటం కొంచెం తీవ్రంగా అనిపించింది.
>>తల్లి దండ్రులను సుఖ పెట్టాలనే ఉద్దేశమే ఉంటే పెళ్ళాలు మీకు అడ్డా??
మీరే ఆలోఛించండి ఒకసారి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. భార్య సహకారంలేకుండా తల్లితండ్రులని చూడాగలమా?
>>అత్తమామలకు అడుగులకు మడుగులొత్తే వాళ్లని ఎంతమందిని చూపించమంటారు?
>>మీకు మీ నాన్నగారు ఎలగో.. భార్యకు వాల్ల అమ్మ, నాన్న అంతే కదా.
అసలు సమస్యంతా ఇక్కడే. ఆడవాళ్లకు తల్లితండ్రులెలానో మగవాళ్లకి కూడా అంతే. సమస్యేంటంటే కేవలం ఆడవాళ్ల తల్లితండ్రులే తల్లితండ్రులు, మగోడి తల్లితండ్రులు అసలు మనుషులేకారు దగ్గర. అలాంటోళ్లని ఎంతమందిని చూపమంటారు?
>>భజన చేస్తున్నారు అంటే వారు అత్తమామలనుంచి ఎదో ఆశించే వారే అయ్యి ఉంటారు..
ఇది హాస్యాస్పదం. పెళ్లాన్ని ఆశించి పెళ్లాం తల్లితండ్రులకి భజన చేస్తున్నాడు అని ఎందుకనుకోకూడదూ.
ఏమైనా, ఇది ఆడవాళ్లకి తల్లితండ్రులు లేరా, లేక, భార్యపై నిందలా అనే చర్చ కాదు. నేను పైన రాసింది అమ్మాయి ఐనా అబ్బాయి అయినా, విలువ ఇవ్వాల్సిన వాళ్లకి ఇవ్వాలి అని. ధన దాహంలో బంధాలని మర్చిపోకూడాదూ అని. శాసించే పెళ్లాం ఉంటే ఆమె తల్లితండ్రులేకాక, తన తల్లితండ్రులు కూడా మనుషులే అని గుర్తించాలి అని.
మీరు సరిగ్గా చదవండి మళ్లీ:
"పెళ్లాన్ని సుఖపెట్టటమే పరమావధిగా భావించి, అత్తమామలకి భజన చేస్తూ సొంత తల్లితండ్రుల్ని అవమానిస్తూన్న మనం"
ఇదొక జనరలైజ్డ్ స్టేట్మెంటు.
మీకు ఓపిక ఉంటే ఇది చదవండి
http://ramakantharao.blogspot.com/2008/10/blog-post_03.html
ఏమో.. మన నాన్నలు (కొంత మంది) వాళ్ల పెళ్ళాలని (అంటే మన అమ్మలు) సుఖ పెట్టడానికి మన తాతలని, బామ్మలని అవమానించి, neglect చేసి ఉండ వచ్చు. కొట్టి పారేయలేము కదా??
ReplyDeleteబాచి బాబూ...చెప్పిన పాయింట్ నిజమే కానీ అందరూ అలా లేరు,ఉండరు కూడా,నాణేనికి రెండు పక్కలా ఉంది ఈ సమస్య.ఈ రోజుల్లో కొంచం ఎక్కువే ఉందనుకుంటాను.
ReplyDeleteఒకటి మాత్రం నిజం..ఇంటి ఇల్లాలికి నచ్చకపోతే/ఇష్టం లేకపొతే ఏ మొగాడయినా/మొగుడయినా ధైర్యం గా ఎలా సాయం చేస్తాడు ఏ అమ్మా నాన్న కయినా?అందువల్ల ఏదయినా అర్థం చేసుకున్నదాన్ని బట్టే విషయం అంతా...
"లేకపొతే ఎప్పటికెయ్యది నెయ్యమో అప్పటికామాటలాడి" లౌక్యం గా అవసరాన్ని బట్టి బండి పట్టాలమీద జాగ్రత్తగా లాగించెయ్యడమే..
చాలా బాగా రాసారు.తల్లితండ్రులు,గురువు ముందు..ఆ తరువాతే మిగతావాళ్ళు అని నమ్మే వ్యక్తులం మేమిద్దరం...!
ReplyDelete