Feb 28, 2009

సత్యం - ఇదీ సత్యం

సత్యం రామలింగరాజు కుంభకోణంపై శ్రీ గొల్లపూడి మారుతీ రావు గారి కాలం ఇక్కడ చదవండి


చివరి రెండు పేరాలు
కొందరు జారడు బల్ల మీద క్రమంగా జారుతారు. కొందరు జారి ఏదో ఒకచోట నిలిచిపోతారు. కొందరు పుంజుకుని మళ్లీ మెట్లెక్కుతారు. కొందరే - రాడ్ స్టీగర్లూ, ప్రొఫెసర్లూ, రామలింగరాజులూ అవుతారు. ఆ పతనం క్రమంగా జరగదు. హఠాత్తుగా, స్పష్టంగా, భయంకరమైన వేగంతో జరుగుతుంది. విచారణలూ, జైలు శిక్షలూ, అవమానాలూ, ఆత్మహత్యలూ - ఇవన్నీ కధలో భాగం. అవి పతనం తర్వాతి పర్యవసానాలు. కాని ఎందుకు ఈ పతనం? కారణం ఏమిటి?
గుర్తుపట్టగలిగితే కారణాన్ని - కొన్నివేల సంవత్సరాల కిందట భగవద్గీత చెప్పింది. దానికి హిందూమతం, శ్రీకృష్ణుడూ, దేవుడూ, తీవ్రవాదం - లాంటి రకరకాల రేపర్లు తొడిగి చాలామంది "కుహానా" ఆధునికులు అటకెక్కించారు. కాని పలకరితే మనిషిని కాపాడే శాశ్వత విలువల్ని ఈ దేశంలో పెద్దలు 5000 సంవత్సరాల కిందట పొందుపరచారని గర్వపడడానికే ఈ కాలమ్. బగవద్గీత పుక్కిట పురాణంకాదు. మతఛాందసం కాదు. మనిషి మనుగడని నిర్దేశించే మాన్యువల్. అందుకనే దాన్ని ఏ తరానికి ఆ తరం మేధావులు ఆ కాలానికి అన్వయిస్తూ భాష్యం చెపుతూ వచ్చారు. అనిబిసెంట్ వంటి విదేశీయురాల్ని భగవద్గీత ఆకర్షించింది.
సాంఖ్య యోగంలో 62,63 శ్లోకాల వివరణతో ఈ కాలం ముగిస్తే చాలు.
ఇంద్రియాలను ఉత్తేజపరిచే విషయాల గురించి ఆలోచించే కొలదీ 'ఆసక్తీ పెరుగుతుంది. ఆసక్తి వల్ల వాటిని సంపాదించాలనే 'కోరిక' పుడుతుంది. కోరికవల్ల దానికేదైనా విఘాతం కలగడంతో 'కోపం' పుట్టుకొస్తుంది. కోపం 'అవివేకాన్నీ కలిగిస్తుంది. అవివేకం వల్ల మంచెడ్డల విచెక్షణ పోతుంది. దానితో 'బుద్ధి' నశిస్తుంది. తర్వాత మానవుడు పతనమౌతాడు.
'సత్యం' విషాదం ఈ సత్యాన్ని ఆవిష్కరించగలిగితే మన జీవితాల్లో కొత్త పుటని తెరచినట్టే. ఈ నిజాన్ని నమ్మితే వెంటనే 'భగవద్గీతా బూజు దులపండి.

1 comment:

  1. మంచి రచయితని పరిచయం చెసారు.

    ధన్యవాదాలు.

    ReplyDelete