Dec 31, 2015

ప్రాజెక్ట్ లైబ్రరి

మీ అందరికీ తెలుసు, కేవలం బళ్లో పాఠ్యపుస్తకాల వల్ల విజ్ఞానం పెరగదూ అని. విజ్ఞానం పెంపొందాలంటే కావాల్సింది చదవడం, చిన్నవయసప్పటినుండే పుస్తకాలు, రకరకాల పుస్తకాలు చదవడం ఒక వ్యసనంలా మారాలి.
నేను ఇక్కడకి వచ్చాక, నా చుట్టుపక్కల ఉన్న కొంతమంది మన దేశీ పిల్లల్ని గమనించే అవకాశం లభించింది. అలాంటివారిలో అజిత్ గారి కూతురు, నాలుగో గ్రేడ్ అనుకుంటా, ఎన్ని పుస్తకాలు చదువుతుందో ఆ అమ్మాయి. దేనికంటే, వాళ్లకి ప్రతీవారమో ఎప్పుడో రీడ్ఔట్ ఉంటుందట, అంటే తరగతిలో అందరిముందు చదవటం. కొన్ని కొన్ని మనం చాలా నిర్లక్ష్యం చేస్తామేమో/చేస్తున్నామేమో/చేసామేమో అనిపిస్తుంటుంది. అలాంటి వాటిల్లో "చదవటం" ఒకటి. రకరకాల అంశాలు, తరగతిలో చదవటం ఇలాంటివి. మా దోస్తు టోనీగానితో మాటల సందర్భంలో మాకు బడిలో లైబ్రరి అనేది ఉందదు అని చెప్తే ఆశ్చర్యపొయ్యాడు. చెప్పాను, లిబ్రరీ అనే వసతి బడి కలిపించాలి అంటే, ఆ బడి ఉన్న కమ్యూనిటీ వాళ్లు బడి యాజమాన్యంతో మాట్లాడి వారు ఆ బడికి పిల్లల్ని పంపాలి అంటే ఏమేమి వసతులు కావాలనుకుంటున్నారో చెప్పాలి. కాని, మనకి, ప్రభుత్వపాఠశాలలు కేవలం విమర్శలని అందుకునేందుకే ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు నువ్వు పంపితే పంపు లేక పోతే నీ ఖర్మ అనే స్థాయికి ఎదిగిపోయ్యాయి. కాబట్టి లైబ్రరీ ఏ కాదు ఏ వసతైనా ఇచ్చింది తీస్కో, ఎక్కువ అడక్కు అనే చందానికి వచ్చింది మన కధ.
ఇక, జిల్లా గ్రంధాలయాల పరీస్థితి చెప్పాల్సిన పని లేదు. నే ఇంతక ముందు చెప్పినట్టు, మా ఊరి శాఖాగ్రంధాలయం వారి ముద్రని సినిమా టికెట్లపై ముద్రలా వాడుకున్నారు. మా ఊరి శఖాగ్రంధాలయం, ఊరి నడిబొడ్డున, ఓ చిన్న గదిలో, బానే ఉండేది. ఓ మాదిరి పుస్తకాలతో ఉండేది. నాకు బాగా గుర్తు మా అన్న ఎండాకాలం శెలవలకి వచ్చినప్పుడు గ్రవంధాలంనుండి "ఏడుతరాలు" అనే పుస్తకం తెచ్చి చదవటం. కొంతకాలాని, ఆ గ్రంధాలయం సగం అయిపోయింది. కారణం, కొందమంది ఔత్సాహికులు, హ్యాప్పీగా ఆ చిన్న గదికి, బ్రంహాండంగా రంధ్రం పెట్టి, మన దొంగోడు టైపులో ప్రతీ రోజు కొన్ని బొక్కులు లేపుకెళ్ళారు.
శాఖా గ్రంధాలయాలల్లో ఒకటి నుండి పది తరగతులవారికి అందించగలిగే రచనలు పెద్ద ఉండేవి కాదేమో, నాకైతే గుర్తులేదు. కానీ యండమూరి నవలలు గట్రా మాత్రం ఉండేవి.
ఏమైనా, గ్రంధాలయాలు మసిబారిపొయ్యాయి. వాటిలోని విజ్ఞానపు వస్తువులు రకరకాల చేతులు మారి ఎటో వెళ్లిపొయ్యాయి. మిగిలింది "గ్రంధాలయ తెల్ల ఏనుగు" మాత్రమే.
సరే, ఇప్పుడు ఈ సోది దేనికంటే - ప్రాజెక్ట్ లైబ్రరీ గురించి.
పిల్లలకి జ్ఞానాన్ని ఇద్దాం ముందుకు రండి. ప్రతీ సంవత్సరం కొన్ని పుస్తకాలని కొనైనా, లేక మీ పిల్లలకోసం మీరు కొని మీకు అవసరం అనిపించినవైనా, మీరు చదువుకున్న పాఠశాలకి పంపండి.

3 comments:


 1. వావ్ ! ఎన్నాళ్ళకెన్నాళ్ళ కండీ భాస్కర రామ రాజు గారు పునర్దర్శనం !

  వెల్కం బెక బెక !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
 2. బెక బెక!
  చిన్న బావి నుండి తప్పించుకొచ్చి పెద్దబావిలో పడ్డానండి. ఇంకా తామరాకు దొరకలేదు. వెతుకుతున్నా!

  ReplyDelete

 3. ప్రస్తుతాని కున్న 'టుమారో' ఆకులు బ్లాగిల్ల్లు , మాలిక ! 'టుమారో' ఏమి అగునో ఎవరికెరుక !

  ఉన్న తామరాకులు రెండు వెల పదహారులో కూడా ఉంటాయని ఆశిస్తో !

  జిలేబి

  ReplyDelete