Dec 31, 2015

ప్రాజెక్ట్ లైబ్రరి

మీ అందరికీ తెలుసు, కేవలం బళ్లో పాఠ్యపుస్తకాల వల్ల విజ్ఞానం పెరగదూ అని. విజ్ఞానం పెంపొందాలంటే కావాల్సింది చదవడం, చిన్నవయసప్పటినుండే పుస్తకాలు, రకరకాల పుస్తకాలు చదవడం ఒక వ్యసనంలా మారాలి.
నేను ఇక్కడకి వచ్చాక, నా చుట్టుపక్కల ఉన్న కొంతమంది మన దేశీ పిల్లల్ని గమనించే అవకాశం లభించింది. అలాంటివారిలో అజిత్ గారి కూతురు, నాలుగో గ్రేడ్ అనుకుంటా, ఎన్ని పుస్తకాలు చదువుతుందో ఆ అమ్మాయి. దేనికంటే, వాళ్లకి ప్రతీవారమో ఎప్పుడో రీడ్ఔట్ ఉంటుందట, అంటే తరగతిలో అందరిముందు చదవటం. కొన్ని కొన్ని మనం చాలా నిర్లక్ష్యం చేస్తామేమో/చేస్తున్నామేమో/చేసామేమో అనిపిస్తుంటుంది. అలాంటి వాటిల్లో "చదవటం" ఒకటి. రకరకాల అంశాలు, తరగతిలో చదవటం ఇలాంటివి. మా దోస్తు టోనీగానితో మాటల సందర్భంలో మాకు బడిలో లైబ్రరి అనేది ఉందదు అని చెప్తే ఆశ్చర్యపొయ్యాడు. చెప్పాను, లిబ్రరీ అనే వసతి బడి కలిపించాలి అంటే, ఆ బడి ఉన్న కమ్యూనిటీ వాళ్లు బడి యాజమాన్యంతో మాట్లాడి వారు ఆ బడికి పిల్లల్ని పంపాలి అంటే ఏమేమి వసతులు కావాలనుకుంటున్నారో చెప్పాలి. కాని, మనకి, ప్రభుత్వపాఠశాలలు కేవలం విమర్శలని అందుకునేందుకే ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు నువ్వు పంపితే పంపు లేక పోతే నీ ఖర్మ అనే స్థాయికి ఎదిగిపోయ్యాయి. కాబట్టి లైబ్రరీ ఏ కాదు ఏ వసతైనా ఇచ్చింది తీస్కో, ఎక్కువ అడక్కు అనే చందానికి వచ్చింది మన కధ.
ఇక, జిల్లా గ్రంధాలయాల పరీస్థితి చెప్పాల్సిన పని లేదు. నే ఇంతక ముందు చెప్పినట్టు, మా ఊరి శాఖాగ్రంధాలయం వారి ముద్రని సినిమా టికెట్లపై ముద్రలా వాడుకున్నారు. మా ఊరి శఖాగ్రంధాలయం, ఊరి నడిబొడ్డున, ఓ చిన్న గదిలో, బానే ఉండేది. ఓ మాదిరి పుస్తకాలతో ఉండేది. నాకు బాగా గుర్తు మా అన్న ఎండాకాలం శెలవలకి వచ్చినప్పుడు గ్రవంధాలంనుండి "ఏడుతరాలు" అనే పుస్తకం తెచ్చి చదవటం. కొంతకాలాని, ఆ గ్రంధాలయం సగం అయిపోయింది. కారణం, కొందమంది ఔత్సాహికులు, హ్యాప్పీగా ఆ చిన్న గదికి, బ్రంహాండంగా రంధ్రం పెట్టి, మన దొంగోడు టైపులో ప్రతీ రోజు కొన్ని బొక్కులు లేపుకెళ్ళారు.
శాఖా గ్రంధాలయాలల్లో ఒకటి నుండి పది తరగతులవారికి అందించగలిగే రచనలు పెద్ద ఉండేవి కాదేమో, నాకైతే గుర్తులేదు. కానీ యండమూరి నవలలు గట్రా మాత్రం ఉండేవి.
ఏమైనా, గ్రంధాలయాలు మసిబారిపొయ్యాయి. వాటిలోని విజ్ఞానపు వస్తువులు రకరకాల చేతులు మారి ఎటో వెళ్లిపొయ్యాయి. మిగిలింది "గ్రంధాలయ తెల్ల ఏనుగు" మాత్రమే.
సరే, ఇప్పుడు ఈ సోది దేనికంటే - ప్రాజెక్ట్ లైబ్రరీ గురించి.
పిల్లలకి జ్ఞానాన్ని ఇద్దాం ముందుకు రండి. ప్రతీ సంవత్సరం కొన్ని పుస్తకాలని కొనైనా, లేక మీ పిల్లలకోసం మీరు కొని మీకు అవసరం అనిపించినవైనా, మీరు చదువుకున్న పాఠశాలకి పంపండి.

ఈవేళటి యువతకి నే ఇచ్చే అతి చిన్న క్లాస్ ఇదీ -

ఈవేళటి యువతకి నే ఇచ్చే అతి చిన్న క్లాస్ ఇదీ -

౧. వ్యాయామం ముఖ్యం
౨. మానసిక ఒత్తిడిని తగ్గించుకోటం ముఖ్యం
౩. బరువుని అదుపులో పెట్టుకోటం ముఖ్యం
౪. వేళపట్టున భోజనం ముఖ్యం
౫. కంటి నిండా నిద్ర ముఖ్యం
౬. ఇంటికి వెళ్తూ ఆఫీసుని, ఆఫీసుకి వెళ్తూ ఇంటినీ తీసుకువెళ్ళకుండా ఉంటం ముఖ్యం
౬. గీత గీస్కొని, అది దాటకుండా ఉంటం ముఖ్యం. అనగా, ఒక పెగ్, లేక ఒక బీర్.  అంతే! ఒక చుట్ట. మానేయండి అని చెప్పను. అది ఎవరికి వారు తెలుసుకోవాల్సిన విషయం.

పైవాటిల్లో అనేకం (బొంగు, ఉన్న ఐదు పాయింట్లలో అనేకం ఏవిట్టా అంటావా?) నేను చేయలేకపోయా. కనీసం, ఇప్పటకిన్నా కండ్లు తెరిచా. నన్ను ఫాలోకండీ అని చెప్పను. ఏదోకచోట మొదలుపెట్టుకోండీ అని చెప్తా!

ఎవరైనా ఎవరికైనా స్పూర్తిని రగిలించవచ్చు! చూసే దృష్టిలో ఉంటుంది!!

జై భారత్!!

నాన్న జ్ఞాపకాలు - రావిశాస్త్రి - 2

అలా ఆడి సెంపపేల్సినాక యెడ్డు మమ్మలొందర్ని అదరగొట్టి సెప్పేడు; ఉరే యెదవలఁజాకొడకల్లార, సెంట్రల్జెయిల్దప్ప ఇంకో
యెడ్రసే లేని దొంగలంజాకొడకల్లార, బేచీలకింద సెట్టయిపొయ్యి ఊరుని దోసుకునీ దగుల్బాజీ నా కొడకల్లారా! ఊరంట దిరిగీ
ఎర్రిపీరు నా కొడుకుల్ని దోసుకొమ్మని జెప్పి మీకు ఒవడిచ్చేడ్రా అక్కు? ఏడుకొండల ఎంకటేస్సెర సోవి ఇచ్చేడా, లేక, మాల కొండ
మల్లికార్జునస్సోవి ఇచ్చెడా? ఒవుడిచ్చేడ్రా మీకు ఆ అక్కు లంజాకొడకల్లారా? దేవుడివ్వని అక్కు మేం మీకిస్తే దేవుడితొ సకంవోటా
ఏసుకుంటావురా లంజాకొడకా నువ్వు?! నీకు అస్సలు వోటాయే లెద్దు! ఫో పొమ్మంటాను! పొమ్మంటె నువ్వు నా
పిక్కమీది సొట్ట ఎఒంట్రుక తెంపగలవా నువ్వు?! తెంపగలుగుతావురా నువ్వు?, సెప్పర, సత్తరకాయ సొట్టెంట్రుక లఁజాకొడకా!
నీకు బుస్ కోట్లు, టైటు పేంట్లు, రిస్టోసీలు, బాటా బూట్లు, సెంట్లు పౌడర్లు, పాలకంట ముంక్డ్లు అన్ని నీకెలాగొచ్చాయిరా,
లంజాకొడకా! ఇయ్యన్ని నీకు నీ అక్కు మీద దొరికినయ్యా, లెక్కపోత్తె మా పెర్మిసన్ మీద దొరికినయ్యా?! పో, లజికొడకా! పో, నీకు అస్సలు ఓటయే లెద్దు. ఉరే, సిత్తర్లేక్కా ఇదిగొ నీ రొండొందలు, ఉరే బైరాగి బంగారి నా కొడక, ఇదిగొ నీ రెండొందలు!
ఒట్టుకుపొండి!పొండి!పొయ్యి సెంకరమ్మ కొట్టుకాడ సారాయే తాగుతారో, సందలి సత్రఁకాడికెళ్ళి సిలువే పీలుస్తారో, సింతసెట్ల
తోటకాద సిలకమ్మ కంపెనికెళ్ళి సిపిలెస్సే సంపాయిచ్చుకుంటారో, అదంతా మాకు అనువసురం! మీ సేర్లు మీరు తీసుకుపొయ్యి ఎల్లా
సస్తారో సవ్వండి! ఈ సత్తరకాయ సెత్తాకారిలంజాకొదుకు మట్టుకు మాతొ టేసంకొస్తాడు!

**********

సినిమాస్టారు జీవితం చాలా పవిత్రమైనదని తెలిసిన జనమూ తెలియని జనమూ కూడా ఎలాఐతే నమ్మరో అల్లగే రైల్వే ఇంజనీరు లంచాలు కొట్టలేదంటే యెవ్వరూ నమ్మరు

**********

నలుగురి చెల్లెళ్ళ బరువూ తనమీద పడకుండా ఇద్దరన్నలూ తండ్రితో వేరయిపోయి ఎవరిభార్యతో వారు వేరే వూళ్ళలో ఉద్యొగాలు
చేసుకుంటూ వారున్నారు. ఆ అన్నలిద్దరికీ తమ తండ్రి మిగతా ఇంజనీర్లలాగా లంచాలు పుచుకోకుండా మడికట్టు క్కూర్చున్నాడని చలా కోపం ఉంది. వీలూన్నప్పుడు డబ్బు ఎందుకు తీసుకోకపోవాలి? తీసుకోక, మమ్మల్ని ఎంతోకాలం బీదగా ఉంచి ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అనేది వారి అప్పటి వాదన, వారి భార్యల ఇప్పటి వాదన కూడాను.
**********

కధల్లో నాయకుల్లాగా సినెమాల్లో హీరోల్లాగ్గ చిలకదాసు తనే కట్నం లేకుండా పెళ్ళి చేసుకోబోతున్నాడు. "సోదర సోదరీమణులారా,
బంధుమిత్రులారా,ఆర్యులారా, నా భార్యలారా, నీను చిలకదాసుని,సూర్యబింబానికి చినబాబు కొడుకుని, చంద్రబింబానికి చిట్టి
మేనల్లుణ్ని! హిందీ హీరోలకి తెలుగు తమ్ముణ్ని! నేను కట్నం పుచ్చుకోకుండా పెళ్ళి చేసుకోబోతున్నాను! పిల్ల ఎలాగ ఉంటుందంటే: గాజు బొమ్మ, గులాబి పువ్వు, గంధంగిన్నే - అదీపిల్ల! దాని అయ్య దాని అక్కలకి కట్నాలు ఇచ్చుకున్నాడు. దాంతో వాడి
ఇల్లు గుల్లయిపోయింది. కట్నాలు పుచ్చుకొని మా అన్నలకి పెళ్ళిళ్ళుచేసి తెగబలిసాడు మా అయ్య! కానీ నేను గాంధీ మహాత్మాగారి
నీతిసూత్రాలకి కట్టూబడి ఓ బతికిచెడ్డ ఆడపిల్లని కాణీ కట్నం లేకుండా నా భార్యగా స్వీకరించి బాగుచేస్తున్నాను. కొట్టండి జెయ్ కొట్టండి చిలకల ఆంజనేయదాసుగారికి ఛ్చీర్స్ చెప్పండి!"

*********

కడసారి కొడుకు కాబట్టి అతనికి తన తండ్రి తాలూకు పేదరికపు తొలిరోజుల సంగతి తెలియదు. తన తండ్రిపడ్డ కష్టాల గురించి కాని వాటి లోంచి బైటపడాలనే తన తండ్రి పట్టుదల గురించి కాని అతని దీక్షా ధైర్యాల గురించి కాని అతనికి తెలియదు. అలాగే
అతనికి తన అన్నల పిత్రుభక్తి గురించి కూడా తెలియదు. అతనికి జీవితం సరిగా తెలియదు; అతను తెలుగు సినిమాల మీద పెరిగేడు

********

కాని త్వరలోనే దాసుకి తెలిసిపోయింది. సరళ యెడల తనకి ఉన్న ప్రేమ కాంక్షలో నూటికి నూరువంతులు సరళ చీర విప్పిచూడాలనే కాంక్షతప్ప మరేదీలేదని దాసుకి తెలిసిపోయింది

********

నాన్న జ్ఞాపకాలు - రావిశాస్త్రి - 3

అటుచూస్తే కొడబండలు,ఇటు చూస్తే రాక్షసి డొంకలు.
కాని ఇది విమల.
అటుచూస్తే పెద్దపులుల కోరలు, ఇటు చూస్తే పడగలెత్తిన పాములు,
కాని ఇది విమల.
అటు చూస్తే సెగలు సెగలు, ఇటు చూస్తే పొగల సుడులు,
కాని ఇది విమల.
అటు చూస్తే దొరికే ఎండలు, ఇటు చూస్తే కొరికే నీడలు,
కాని ఇది విమల.
అవును సరే, కాని ఇది విమల.
అటు చూస్తే ఎత్తుదొరకని మహా పర్వతాలు, ఇటు చూస్తే లోతుచిక్కని చీకటి అగాధాలు లేదా ఒడ్డులేని మహా సముద్రాలు,
అవునవును కాని ఇది విమల.
అటుచూస్తే అన్నలిద్దరూ దూరాలు, ఇటు చూస్తే అక్కలిద్దరికీ యెన్నేన్నో భారాలు.
అటు చూస్తే నాన్న కళ్ళనిండా శూన్యాలు, ఇటు చూస్తే అమ్మ కంటి నిండా శోకాలు.
అటుచూస్తే అద్దెకోసం ఇంటివారి అరుపులు, ఇటు చూస్తే ముద్ద కోసం కడుపంతా పేగుల కేకలు.
కాని ఇది విమల.

కూడలి

కూడలిని మూసివేయటం బాధగా అనిపించింది. ఎందరో తెలుగు బ్లాగులోకపు బావిలో కప్పలకు దొరికిన ఒక పెద్ద తామరాకు కూడలి. నా బ్లాగుగుకి ఇన్ని హిట్స్ తెచ్చిపెట్టిన కూడలిని మూసివేయటం కన్నా ప్రజలకు అంకింతమిచ్చి మీరే మేనేజ్ చేస్కోండర్రా అనుంటే బాగుండేది. నాబోటి కప్పలు కొన్ని కాస్తోకూస్తో విత్తసహాయం కూడా చేసే అవకాశం ఉంది. ఏవైనా - గూగుల్ లాంటి వాళ్ళే ఈరోజు టెక్నాలజీని రేపు మింగేస్తున్న తరుణంలో కూడలి ఎన్ని కష్టాలొచ్చినా కలకాలం బతకాలని కోరుకోవటం సమంజసం కాదని నాకు తెలుసు.
ఏవైనా తెలుగు బ్లాగులోకానికి కూడలి సేవలు శ్లాఘనీయం.