Dec 18, 2011

పుట్టినరోజు కానుక

ఈవేళ నా పుట్టినరోజు. నిన్న భారతకాలమానం ప్రకారం. నిన్నటినుండే బంధుమిత్రులంతా పుట్టినరోజు శుభాభినందనలు తెలియజేయటం ప్రారంభించారు.  మొత్తానికి ఈరోజు పొద్దున్నే బాక్సింగుకి వెళ్ళొచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నా.
ఈవేళ మధ్యాహ్నం భోజనం ముగించి, సిటీకి వెళ్ళి అటు గుడికి అయ్యాక ఇటు దేశీకొట్టుకి వెళ్ళి కానిచ్చుకొద్దాం భక్తి భుక్తి అనుకున్నాం. రెండింటికి రోడ్డెక్కాం. ముందు ఎటూ? చూడండి ఎంత గమ్మత్తో. ముందు ఎటూ? అన్నాను హోం గారితో. గుడి అన్నది చూచాయగా. వెళ్ళేప్పటికి మూడు దాటుతుందిగా, మూడింటికి గుళ్ళో పూజారిగారు కూడా ఉండరేమో కదా? ముందు దేశీ కొట్టుకే వెళ్దాం అని నా ప్రపోజల్ తన ముందు పెట్టాను. బిల్లు పాస్ అయ్యింది. నింపాదిగా వెళ్ళాను దేశీ దుకాణానికి, పిల్లాజెల్లా నిద్రపోతుంటే వెనక కూర్చుని.
కొనాల్సినవన్నీ కొన్నాం. పిల్లలిద్దరూ ఏవో చిరుతిళ్ళు తిన్నారు. అక్కడనుండి గుడికి చేరుకునేప్పటికి ఐదూ నలభై.
దర్శనం చేస్కున్నాం. తను, కొద్దిగ సేపు కూర్చుని వెళ్దాం అన్నది. సరే అని, అలా కూర్చున్నాం, ఇంతలో ఓ మిత్రులు కనపడ్డారు. భాస్కర్ వెళ్తున్నారా ఉంటున్నారా అన్నారు. ఏవిటండీ సంగతీ అన్నాను. మరో పావుగంటలో మన మిత్రులంతా వస్తున్నారు. ఈవేళ మహా మృత్యుంజయ మంత్ర పారాయణ చేస్తున్నాం. అనుకోకుండా వచ్చావు. ఉండు అన్నారు.
ఆరుంబావుకి మిత్రులంతా వచ్చారు. అంతలో పూజారి గారు శ్రీ శ్రీనివాసాచార్యులగారితో చెప్పాను, గురువుగారూ! ఈవేళ నా పుట్టినరోజు ఆశీర్వాదం కోసం వచ్చాను అని. వారు ఆశీర్వదించి, కూర్చోమన్నారు.
రావాల్సిన వారంతా వచ్చాక, అంత కూర్చుని రుద్రం చదివి, మొదలుపెట్టాం మహామృత్యుంజయ మంత్ర పారాయణ.


నేను ముందుగా ప్రిపేర్ అయి వెళ్ళకపోవటం చేత కొంతసేపు పారాయణలో పాల్గొని ఇంటికి చేరుకున్నాను.
ఇంతకన్నా మంచి పుట్టినరోజు కానుక ఏంకావాలీ?
ఓం

14 comments:

  1. ఖండిస్తన్నా ఖండిస్తన్నా
    మా సూరిబాబేమో సూరిగాడా
    మా మరదలేమో హోం గారా?
    ఈ వ్యత్యాసాలని ఖండిస్తన్నా

    ReplyDelete
  2. శుభాకాంక్షలు!
    భుక్తి,భక్తి,మిత్రపుష్టి మీకు మెండుగా వుండు గాక!

    ReplyDelete
  3. సోదరా!హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. లేటుగా అయినా కొత్తగా ...."HAPPY जन्मदिन శుభాకాంక్షలు " :):)

    శ్రేయోభిలాషి ,
    RAAFSUN

    ReplyDelete
  5. puttina roju shubhaakaankshalu.. bhaskar ramaraju gaaru. Eeshwara krupaa kataaksha praapthirasthu.

    ReplyDelete
  6. చాలా మంచి కానుక పొందారండి. మీకు జన్మ దిన శుభాభినందనలు.

    ReplyDelete
  7. హోంగారి చీఫ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..

    ReplyDelete
  8. !! భాస్కర్ రామరాజు !! గారికి జన్మదిన శుభాకాంక్షలు..

    ReplyDelete
  9. భాస్కరన్నా,
    హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.. కొంచెం ఆలస్యంగా..

    ReplyDelete