మొన్నీమధ్య కార్లో కాన్సాసు పట్నాకి వెళ్తున్నప్పుడు సూరిగాడు ఎదో బెరికాడు ఓ చిన్న కాయితకం ముక్క మీద. ఎదో రంగులద్దుతున్నాళ్ళే అనుకున్నాం. పెద్దగా పట్టించుకోలేదు. ఇదొక తతంగం ప్రయాణాల్లో. ఎనకమాల ఇద్దర్నీ కట్టిపడేయాలంటే ఓ పది కాయితకం ముక్కలిచ్చి రంగులేస్కోండహే అంటే సప్పుడు సేకుండా రంగులేస్తారు ఇద్దరూ. ఇంతలో మనం చెరాల్సిన సోటికి సేరిపోతావన్నమాట.
ఆతర్వాత రోజో ఎప్పుడో ఈ కాయితకం బయటపడ్డది.
సారాంశం ఏవిటయ్యా అంటే
వీడి తరగతిలోనే ఇశాన్ అనే పిల్లాడు, వీడి సహవాసగాడు. తెలుగు పిల్లాడే. మధ్యానం బువ్వ తినేప్పుడూ ఆడేప్పుడూ వీళ్ళిద్దరూ మరొక తెల్లోడు ఏడ్రియన్ కల్సుంటారు. ఇశాన్ కి వీడేదో అబద్ధం చెప్పాట్ట.
ఒరె ఇశాన్
స్వారీ రా
నన్ను సెమించేయ్
నీకు అబద్ధం చెప్పా
ధన్యవాదాలు
సూర్యా
అని రాసుకున్నాడు ఆ కాయితకం ముక్కమీద, కార్లో ఎల్లెప్పుడు.
ఏట్రా అది అంటే ఏదో రగస్యం అన్నాడు. నేనూ వదిలేసా.
సూరిగాడు ఇలా కాయితకం మీద రా(వ్రా)యటం నాకు బాగా నచ్చింది. వాడికో తెల్లకాయితకాల పుస్తకం ఇచ్చాను. దినచర్య సంచిక అనుకోచ్చు, ఆంగ్లంలో చెప్పాలంటే జర్నల్. రోజూ ఏవేం చేస్సావో రాస్కోరా అని. ఇలా ఇప్పటినుండే రోజుకో వాక్యం కనక రా(వ్రా)య గల్గితే పెద్దైయ్యాక వాడూ ఓ రచయిత కాగల్డని నా ఆశ.
Dec 1, 2011
Subscribe to:
Post Comments (Atom)
బాగుంది :)
ReplyDelete> అబద్ధం, రగస్యం
ReplyDeleteచిన్న వయస్సు లోనే ఏది అబద్ధం, ఏది రగస్యం అని తెలుస్తున్నాయంటే నిజ్జంగా గ్రేట్.
> ఓ రచయిత
అయితే future use కి ఇప్పుడే ఒక బ్లాగ్ ని రిజిస్టర్ చెయ్యండి
బాగుంది !!పూర్తిగా కనపడటం మానేసారు. అనఘ కబుర్లేంటి? ఆ ప్లస్సేమో చాలా చికాకుగా ఉంది. కనీసం ఇలా బ్లాగైనా రాయండి.
ReplyDeleteభాస్కర్ రామరాజు గారూ మీ అనఘ, సూర్య కబుర్లు బాగున్నాయండీ..బ్లాగులో బాల్యాన్ని దాచే మీ ఆలోచన కూడా..
ReplyDeleteమీ సూరిబాబు భలే తెలివైనవాడే!
ReplyDeleteతన తప్పు తాను తెలుసుకున్న వాడు ధన్యుడు. ఓ సారి నా పేరు చెప్పి సూరి గాడి భుజం తట్టి శభాష్ అనండి చెప్తాను.
ReplyDeleteఎందుకో వాడి రాతలో నిజాయితీ కనిపించింది నాకు. అందుకే ప్రచురించాను బ్లాగులో
ReplyDeleteచాలా రోజులకి కనిపించారే! బాగుందండీ సూరిబాబు ఎదిగిపోయాడు! నా తరఫున అభినందన మందార మాల ఒకటి వేయండి!
ReplyDeleteమా మందారాలాన్నీ
ReplyDeleteఉత్తరపు గాలితో
ఉత్తరపు గాలిలో
ఉత్తరపు మంచుతో
ఎండి
కట్టెపుల్లలైపోతే
పారేస్కోలేక
ఉంచుకోలేక
కుండీలని ఇంట్లో పెట్టుకుని
ఎండిన మొక్కలవైపు
చిగురించవా మందారమా
అని జాలిగా
బేలగా చూస్తూ
గడుపుతుంటే,
మధ్యలో రసజ్ఞ,
మందార మాల కట్టి
మెడలో బహుమతిగా
మెచ్చుకోలుగా
వెలకట్టలేని మాలగా
అలంకరించండీ అంటూ సంజ్ఞ చేయటమా?
అయ్యారే
అబ్బా గుంటూరు యాస..... చెవుల్లో అమృతం పోసినట్టే ఉంది..... సూరిగాడ్ని నా తరపున కూడా అభినందించండి!
ReplyDelete:))బాగుంది .God bless him.
ReplyDeleteబాగుంది .God bless him.
ReplyDeleteVery good pempakam :-))
ReplyDeleteNice !
ReplyDeleteరసజ్ఞ గారు లాభం లేదు మీరు ఈ కవిత కి పోటీ గా ఒక పద్యం రాయాల్సిందే :)
సుర్య కి నా తరపున ఓ ఇరవై, ముప్పై ఢెబ్భై శభాష్ లు!
ReplyDeleteశభష్.. సూరీ... ;)
ReplyDeleteఅనఘ అభిమాన సంఘం తరపున సూరికి శెబాషులు.
ReplyDeleteవ్యాఖ్యానించిన పురప్రముఖులందరికీ పేరు పేరునా మంగిడీలు.
ReplyDeleteరాజ్యకుమార్ : ఏవిటోయీ! శభాష్ సూర్య అనే సినిమా గానీ తీద్దావంటావా?
మురళీ : అబ్బా!! ఎంత ఔన్నత్యం అనఘ అభిమాన సంఘం వారికి. ఆహా
మీ షేరింగ్ బాగుందండీ .. రోజు కోక వాక్యం వ్రాస్తే.. ఓ..మంచి రచయితా కాగలడని ఆశ. ఇది ఇంకా బాగుంది. మీ అనఘ కబుర్లు.. తో..పాటు.. మీ సూర్య కబుర్లు.. చాలా బాగున్నాయి. .
ReplyDeleteముచ్చటేస్తుంది, కాయితం మీద రాయడం చూస్తుంటే; అదీ కంటెంట్ చూస్తే ఇంకా ఆనందం. సారి చెప్పడంకన్నా, సారీని ఫీల్ అవ్వడం నిజంగా గ్రేట్. తప్పక రచయిత అవుతాడులెండి :-)
ReplyDelete"స్వారీ రా"
ReplyDeleteyou always prove that you are different.
:) Just enjoy the moment.మీరదే చేస్తున్నట్టున్నారులే. రోజుకో వాక్యం వ్రాస్తే రచయిత అవ్వవచ్చనే ఆశాభావం నచ్చింది. నాకేమో పిల్లలతో రోజుకో వాక్యం తెలుగులో వ్రాస్తే తెలుగు బాగా వస్తుందనే ఆశ పుట్టింది. చూడాలి :)
ReplyDeleteభాస్కర్ - ఇప్పుడేగా వ్రాసేది. తర్వాత ఎలాగూ అంతా కంప్యూటర్లోనే. :) నాకూ ముచ్చటేస్తున్నది. అందుకే నేను కూడా అప్పుడప్పుడు ప్రచురించబోయే టపాని పేపరుపై పెడతా. చేతికి కాస్త పని. ఈ మధ్య రుద్రమ్ ఇత్యాది నిత్య పారాయణా మంత్రాలను నోటు పుస్తకంలో వ్రాసుకుంటున్నాను. ఆనక ప్రింటౌట్లన్నీ పక్కనపెట్టి స్వదస్తూరీ చదుకోచ్చు అని. కాస్త వ్రాతని తిరిగి పట్టుకున్నట్లూ ఉంటుందని.
ReplyDeleteచందు గారూ - :):)
లలిత గారూ -
మా పిల్లలిద్దరూ తెలుగే మాట్లాడుతున్నా, తెలుగు అక్షరాలను ఇంకా నేర్పలేదు మేము లేక, పిల్లకి ఇంకా సమయం ఉన్నట్లుగా అనిపిస్తున్నది, వాడేమో, అ - అః దాకా నేర్చుకున్నా, అంతటితో ఆగింది పండి.
సమయాభావం వల్లనో ఎంచేతనో మేమూ పెద్ద ఫోర్స్ చేయటంలేదు. కానీ కనీసం వరకూ నేర్పాలన్నది నా కోరిక.
"మా" అని వ్రాశాననుకున్నాను. మా పిల్లల గురించి ఆలోచిస్తూ వ్రాశానండీ ఆ మాటలు. మీ ఆశాభావం చూసి నాకూ ఆశ కలిగిందన్నమాట. :)మాది రివర్సు కేసు. వ్రాయడం చదవడం అలవాటైతే మాట్లాడడానికి మొహమాటం తగ్గుతుందేమో అని ఆశ. ఆంగ్లం మాట్లాడడానికీ, ఇష్టపడడానికీ వ్రాయడం, చదవడం బాగా తోడ్పడ్డాయి కనుక.
ReplyDeleteమీ అబ్బాయికి అభినందనలు. ఆ సున్నితత్వం గమనించీ గమనించనట్లు ఉంటేనే స్వఛ్ఛంగా, స్వఛ్ఛందంగా ఎదుగుతుంది. ఆ పనే మీరు చేస్తున్నట్లనిపిస్తోంది. అందుకు మీకు అభినందనలు.