ఓరి గూగులు ఎదవా!!!
ఇదేట్రా? ఇట్టా సీపెడతన్నా నా దేశాన్ని?
ఎవరైనా గమనిమ్చారా? బ్లాగు ఎనలిటిక్స్ లోకెళ్తే, గూగుల్ భారతదేశాన్ని ఎట్టా సీపెడతన్నాడో?
భారతదేశ పటం తమకి తెలియక పోతే అడిగి తెలుసుకోవలి. అంతేకానీ ఇలా రెండర్ చేస్తారట్రా గూగులు ఎదవా!! గూగులు పెట్టి కొడితే గూగుల్లో కనిపించకుండా పోతావ్, ఎదవా!
Dec 24, 2011
Dec 23, 2011
చిపోట్లే మెక్సికన్ గ్రిల్ కి వెళ్తారా మీరెప్పుడన్నా?
మీరు శాకాహారులైతే
మీరు చిపోట్లే మెక్సికన్ గ్రిల్ అనే రెస్టారెంటుకి వెళ్ళేవాళ్ళైతే
బీన్స్ తినే వాళ్ళైతే
ఒక్కసారి చూసుకుని తినండి.
చిపోట్లేలో రెండు రకాల బీన్స్ ఉంటాయి. బ్లాక్ బీన్స్, పింటో బీన్స్ అని.
పింటో బీన్సులో బేకన్ వేస్తాడు.
ఒక్కసారి ఇక్కడ చూడండి
http://www.chipotle.com/en-US/menu/special_diet_information/special_diet_information.aspx
You should avoid our pinto beans (they are cooked with a small amount of bacon).

Dec 18, 2011
పుట్టినరోజు కానుక
ఈవేళ నా పుట్టినరోజు. నిన్న భారతకాలమానం ప్రకారం. నిన్నటినుండే బంధుమిత్రులంతా పుట్టినరోజు శుభాభినందనలు తెలియజేయటం ప్రారంభించారు. మొత్తానికి ఈరోజు పొద్దున్నే బాక్సింగుకి వెళ్ళొచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నా.
ఈవేళ మధ్యాహ్నం భోజనం ముగించి, సిటీకి వెళ్ళి అటు గుడికి అయ్యాక ఇటు దేశీకొట్టుకి వెళ్ళి కానిచ్చుకొద్దాం భక్తి భుక్తి అనుకున్నాం. రెండింటికి రోడ్డెక్కాం. ముందు ఎటూ? చూడండి ఎంత గమ్మత్తో. ముందు ఎటూ? అన్నాను హోం గారితో. గుడి అన్నది చూచాయగా. వెళ్ళేప్పటికి మూడు దాటుతుందిగా, మూడింటికి గుళ్ళో పూజారిగారు కూడా ఉండరేమో కదా? ముందు దేశీ కొట్టుకే వెళ్దాం అని నా ప్రపోజల్ తన ముందు పెట్టాను. బిల్లు పాస్ అయ్యింది. నింపాదిగా వెళ్ళాను దేశీ దుకాణానికి, పిల్లాజెల్లా నిద్రపోతుంటే వెనక కూర్చుని.
కొనాల్సినవన్నీ కొన్నాం. పిల్లలిద్దరూ ఏవో చిరుతిళ్ళు తిన్నారు. అక్కడనుండి గుడికి చేరుకునేప్పటికి ఐదూ నలభై.
దర్శనం చేస్కున్నాం. తను, కొద్దిగ సేపు కూర్చుని వెళ్దాం అన్నది. సరే అని, అలా కూర్చున్నాం, ఇంతలో ఓ మిత్రులు కనపడ్డారు. భాస్కర్ వెళ్తున్నారా ఉంటున్నారా అన్నారు. ఏవిటండీ సంగతీ అన్నాను. మరో పావుగంటలో మన మిత్రులంతా వస్తున్నారు. ఈవేళ మహా మృత్యుంజయ మంత్ర పారాయణ చేస్తున్నాం. అనుకోకుండా వచ్చావు. ఉండు అన్నారు.
ఆరుంబావుకి మిత్రులంతా వచ్చారు. అంతలో పూజారి గారు శ్రీ శ్రీనివాసాచార్యులగారితో చెప్పాను, గురువుగారూ! ఈవేళ నా పుట్టినరోజు ఆశీర్వాదం కోసం వచ్చాను అని. వారు ఆశీర్వదించి, కూర్చోమన్నారు.
రావాల్సిన వారంతా వచ్చాక, అంత కూర్చుని రుద్రం చదివి, మొదలుపెట్టాం మహామృత్యుంజయ మంత్ర పారాయణ.
నేను ముందుగా ప్రిపేర్ అయి వెళ్ళకపోవటం చేత కొంతసేపు పారాయణలో పాల్గొని ఇంటికి చేరుకున్నాను.
ఇంతకన్నా మంచి పుట్టినరోజు కానుక ఏంకావాలీ?
ఓం

Dec 13, 2011
బ్రాహ్మణులు భారతీయులు కారన్నది నిజం(ట)
నాటి మగధ సామ్రాజ్యాధి నేతలే నేటి మాదిగలు. ఆ నాడు విజేతలైన ఆర్యులే నేటి బ్రాహ్మణులు. అంటే 'బ్రాహ్మణులు భారతీయులు కారన్న నిజం' ఇన్ని రోజులు దాచబడిన నగ్నసత్యం.
మేము ఈ దేశ మూల వాసులం. మాకు ఇష్టమున్న మతంలోకి స్వేచ్ఛగా మారడం మా హక్కు. అడగడానికి ఓ విదేశీయుడికి, విజాతీయుడికి హక్కులేదు.
- దొమ్మటి ప్రవీణ్‌కుమార్
దళిత శక్తి
ఆయ్యా
దొమ్మేటి ప్రవీణ్ కుమార్ గారూ
మీరు స్వేఛగా మతాలే మారతారో మాగాయే తీంటారో నాకైతే సంబంధం లేదు. కానీ, తమరు వాక్రుచ్చేప్పుడు ప్రూవెన్ హిస్టరీ ముందుపెట్టితే బాగుంటుంది.
>>నాటి మగధ సామ్రాజ్యాధి నేతలే నేటి మాదిగలు<<
ఐ డోంట్ కేర్. మీవద్ద సాక్ష్యం ఉంటే తేండి అని అడగను.
>>ఆ నాడు విజేతలైన ఆర్యులే నేటి బ్రాహ్మణులు<<
దీనికి సాక్ష్యం అన్నా చూపండి, లేక తప్పువ్రాసానని ఒప్పుకోండి.
>> అంటే 'బ్రాహ్మణులు భారతీయులు కారన్న నిజం' ఇన్ని రోజులు దాచబడిన నగ్నసత్యం.<<
నగ్న సత్యం అంటే నగ్నంగా నిల్చుని వాగటం కాదు.
బ్రాహ్మణులు భారతీయులు కారు. మరి కమ్మ,రెడ్డి, నాయుడు, ఝాట్, చౌధురి వీళ్ళంతా భారతీయులేనా?
ఔన్లేండి, వారినేమన్నా అంటే చేయి నోటిదాకా వెళ్ళేందుకు అటు నోరుగానీ ఇటు చేయిగానీ ఉండదని మీకు ముందే తెలుసు.
ఆంధ్రజ్యోతి పత్రిక వారికి బ్లాగ్ముఖంగా నా ప్రశ్న
ఇలాంటివి మీరు ఎలా ప్రచురిస్తారూ?
మీ వద్ద చారిత్రాత్మక పరిశోధనా సంపుటాలు ఉన్నాయా? ఉంటే వాటిని ప్రచురించాలని కోరుతున్నాను
Dec 6, 2011
లాంగ్ డ్రైవ్స్ - నా అనుభవాలు
ఆల్బెనీలో ఉన్నప్పుడు ప్రతీ రెండో మూడో నెలలకోమారు జెర్సి వెళ్ళొచ్చేవాళ్ళం. అక్కడ్నుండి జెర్సి 135 మైళ్ళ దూరం. 135 మైళ్ళు రెండున్నర గంటలు లేక మూడు గంటలు పట్టేది. పెద్ద డ్రైవ్ చేసినట్టు ఉండేది కాదు. కానీ ఒకసారి మాత్రం సిన్మా కనిపించింది.
అది అగస్టు, 2007. ఆల్బెనీ నుండి షికాగో వెళ్దాం అని అనుకున్నాం. డ్రైవ్ చేయాలంటే కష్టమే కదా అని విమానావకాసాలు చూసాం. ఆల్బెనీ నుండి షికాగోకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ఐతే చాలా ఖరీదు. వేరే మార్గం? నెవార్క్ నుండిగానీ లేక జె.యఫ్.కె నుండిగానీ బుక్ చేస్కుంటే తగ్గుతుందని జె.యఫ్.కె నుండి చేసాను. సాయంత్రం ఏడుకి ఫ్లైట్. మధ్యానం బయల్దేరాం ఆల్బెనీ నుండి. I-87 మీద అలా న్యూయార్క్ వైపు వెళ్తే, జి.యస్.పి వస్తుంది. దానిమీద మరికొంత దూరం వెళ్తే I-95 వస్తుంది. దానిమీద కొంతవెళ్ళి జె.యఫ్.కె కి వెళ్ళాలి. I-95 దాకా బాగనే వెళ్ళాం. I-95 మీద చుక్కలు కనిపించాయి. మొత్తానికి జె.యఫ్.కె కివెళ్ళేప్పటికి ఆరు. ఏడుకి ఫ్లైట్. బ్యాగేజ్ గట్రా చెకిన్ చేసి కూర్చున్నాం. ఇంతలో ఎనౌన్స్మెంట్. ఫ్లైట్ బ్యాడ్ వెదర్ కారణంగా గంట డిలే అని. సరే అని ఏదో మింగి కూర్చున్నాం ముగ్గురం. అప్పటికి పిల్ల ఇంకా పుట్టలేదు. ఎనిమిదైంది. మళ్ళీ ఎనౌన్స్మెంట్. మరో గంట లేట్ అని. తొమ్మిదైంది. మరో గంట లేట్ అని చెప్పారు. అలా పదకుండైంది. ఇక లాభంలేదని వెళ్ళి అడిగితే థండర్‌స్ట్రాం వల్ల మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది అని చావుకబురు చల్లగా పదకుండింటికి చెప్పారు. సరే ఐతే మరి మా లగేజీ మాకిస్తే వెళ్ళిపోతాం అని చెప్తే...ఒక్కొకరి లగేజి దింపి ఇచ్చేప్పటికి పన్నెండున్నర. లగేజి తీస్కుని పార్కింగ దగ్గరకి వెళ్ళి కారు వెత్తుక్కుని బయట పడేప్పటికి ఒంటిగంట అయ్యింది తెల్లవారుఝామున. మా స్నేహితునికి కాల్ చేసా వాళ్ళింటికి వెళ్దాం అని. అతను ఫోన్ ఎత్తలేదు. పిల్లాడు కార్లో పడుకున్నాడు. తను కునకు తీయకుండా నాకు నిద్రరాకుండా ఉండేందుకు ఏదోకటి మాట్టాడుతోంది. ఒంటిగంటకి రోడ్డెక్కితే, మా I-87 పట్టుకునేందుకు చుక్కలు కనిపించాయి, ఒక రాంగ్ ఎక్జిట్ తీస్కోడంతో. అష్టకష్టాలు పడి మొత్తానికి I-87 పట్టుకున్నాం. రెండైంది అప్పటికి టయం తెల్లవారు ఝామున. ఒకవైపు తనకి నిద్ర వస్తున్నా ఆపుకుంటూ నాకు నిద్ర రాకుండా ఉంటంకోసం ఏదో మాట్లాడుతోంది. అట్టకాదని నిద్రపొమ్మని చెప్పి, ఓ సర్వీస్ ఏరియాలో ఆగి కాఫీ తీస్కుని ఒక తొక్కుడు తొక్కా పెడల్ని. బాలసుబ్రహ్మణ్యం పాటలు ఏదివిలో విరిసిన పారిజాతమో దగ్గరనుండి ఇద్దరు భామల కౌగిలిలో స్వామీ వరకు పాడుకుంటూ డ్రైవ్ చెసాను. అయ్యక కె అంటే కిషోర్ పాటలు పెట్టి కుమ్మా౨ను. ఇంటికి రెండు గంటల్లో చేరుకున్నాం. అంటే నాలుగింటికి దిగాం ఆల్బెనీలో.
నేర్చుకున్న నీతి - అంత కష్టపడాల్సిన పనిల్యా. ఎదోక హోటెల్లో ఆగవచ్చు. ఐతే, అది ఆగేంత డిస్టెన్సూ కాదు. ఆగకుండా వెళ్ళేంత ఇదీ కాదు. నీతి పెద్దగా ఏం లేదు. ఇఫ్ యూ కెన్ డూ ఇట్. డూ ఇట్. అంతే. మనో ధైర్యం కావాలి. అదొక పాఠం అనుకోవచ్చు, బట్ ఎట్ హై రిస్క్.
తర్వాతి లాంగెస్ట్ డ్రైవ్ - ఆల్బెనీ టు షికాగో.
౨౦౧౦ జనవరిలో పిల్లా జెల్లాలను భారతావనికి పంపించాను. కేన్సాసులో ఉద్యోగం దొరికింది. మార్చి మొదటివారంలో జాయనింగు. ఇల్లుగిల్లూ ఖాళీజేసి మార్చి రెండున రోడ్డెక్కా. చివరిసారిగా ఆల్బెనీలోని దేవాలయానికి వెళ్ళి దేవుడికి దండవెట్టుకుని పొద్దున పదిన్నరకి రోడ్డెక్కా. I-90 వెస్ట్. ఆల్ ది వే షికాగోకి తీస్కెళ్తుంది. ఈసారి కొంచెం తెలివిగా గార్మిన్ నువి కొని కారుకి తగిలించా. ఇంకోతేడా ఏంటంటే, కారు మారింది. ౨౦౦౯ ఆగస్టులో నా నిస్సాన్ ఆల్టిమాని ట్రేడ్-ఇన్ చేసి హాన్డా సిఆర్-వి ఈఎక్స్-ఎల్ తీస్కున్నా. వావ్!! వాటే డ్రైవ్. హాన్డా నన్ను ఎక్కడా నిరాశపరచలేదు. ఫోర్ వీల్ డ్రైవ్. అత్భుతంగా ఉంది. అలా అలా సాగిపోయింది ఐ నైంటి మీద. వెళ్తూ వెళ్తూ సాయంత్రానికి కొలంబస్ ఒహాయో దాటి టొలెడో దాకా వచ్చాను. పది అయ్యింది. రాత్రిళ్ళు అందునా మార్చిలో, కొంత సహనానికి పరీక్షే. ఓ ఎక్జిట్లో ఆపి, గాస్ కొట్టించుకుని, ఆ చలికి, నిద్ర రాకుండా ఉండేందుకు ఏంచేయ్యాలా పొద్దుణ్ణించి ఆగిన చోటల్లా కాఫీలు తాగీ తాగీ నోరంతా కంపైందిగా అనుకుంటూ లోనకి వెళ్ళి చూస్తే, ఏదో స్మూతీ కనిపించింది. ప్రయత్నిద్దాం అని తీస్కున్నా. ఒక్క సిప్పు, వళ్ళంతా కొత్త ఉత్సాహం ఉరకలేసింది, చలిలో చల్లటి జివ్వు అన్నమాట.
మొట్టమొదటి హెచ్చరిక -
మళ్ళీ రోడ్డెక్కి, తొక్కటం మొదలెట్టా. పోలీస్ బాబాయ్ లైటేసాడు. దీనెమ్మ జీవితం అనుకున్నా. వచ్చి లైటేసి లోనకి చూసాడు. ముందు పాసింజరు సీటులో నెత్వర్క్ కేబుల్స్ అవి ఇవి వెనక అంతా ఏవో సామాను టివి గట్రా లతో నిండిపోయి ఉన్నదిగా.
ఏట్రా మాయ్యా!! యాడికీ
షికాగో ఎల్తన్నా
ఏందియ్యన్నీ?
రిలొకేట్ అవుతున్నగా. ఎసన్షియల్స్ అట్టుకెల్తన్నా
నీ డ్రైవర్స్ ఇలాగివ్వు
ఇదిగో
పదినిమిషాలు పోయినాకొచ్చాడు.
అబ్బీ! డెభై లైను మీద ఎనభై ఒకటి ఎల్తన్నావ్. తప్పుకదూ?
పొద్దుననంగా బయల్దేరా బాబాయ్. గమనించలేదు. కావాలని వెళ్ళింది కాదులే
సరే! నీకింత వరకూ ఓక్క టిక్కెట్టు కూడా లేదు కాబట్టీ, ఇదిగో ఈ నోటెడ్ వార్నింగు. పుచ్చుకో
ఇవ్వు
దీన్ని ఏంజేస్తా?
ఏమో
ఏమో కాదు మాయ్యా!! ప్రిజ్జీకి అంటించుకొని రోజూ సూస్చా ఉండు. ఇంక పో!
అలా బయటపడి, మొత్తానికి షికాగో పన్నెండున్నరకి సేరుకున్నా. లాస్ట్ గంట బోరు కొట్టింది. కానీ!! విసుగు అనిపించలేదు.
850 మైళ్ళు. దాదాపు పదమూడు గంటలు, మధ్యలో నాల్గు బ్రేకులు.
షికాగో ఎళ్ళినాక మూడోరోజుకో కాన్సాసుకి చెరాను. షికాగో నుండి కేన్సాసుకి పలు దార్లు. ఒకటి, షికాగో - డిమొయిన్స్ - కేన్సాస్ I-80W తర్వాత I-35S ఎంది గంటల డ్రైవ్. రెండోది I-55S నుండి I-72W కొంత దూరం వెళ్ళినాక ఇది US 36 W లో కలుస్తుంది, ఆనక ఇది I-35S లో కలుస్తుంది. నా జిపియస్ రెండో దారెంబటి ఎళ్ళరా సిన్నా అన్నది. I-55S మీద కొంత ట్రాఫిక్ ఎక్కువున్నా, వెళ్ళేకొద్దీ తగ్గింది. బ్లూమింగుటన్ను నార్మల్ దాటినాక బాగా తగ్గిపోయింది. స్ప్రింగుఫీల్డు దగ్గరకొచ్చేప్పటికి కొంత పెరిగినా, I-72W కలిసేప్పటికి అసలు ట్రాఫిక్కు ఉండదు. ఇక హాన్నిబాల్ దగ్గర అనుకుంటా I-72W US 36 W విడిపోతుంది. ఇక తర్వాతంతా కంట్రీ సైడ్ ప్రయాణం I-35S దాకా. అస్సలు ట్రాఫిక్ ఉండదు. ఈగలు దోమలు తోలుకుంటూ ఉంటుంది ఈ మార్గం. ఆవేళ్టి నా ప్రయాణం ఎక్కడా తలనొప్పి అనిపించలా. సాఫీగా సాగింది. వింతగా అనిపించింది. ఈశాన్యానికీ మధ్య పశ్చిమానికి ఎంత తేడానో అనుకునేంత తేడా కనిపించింది. ఊర్ల పేర్లు విచిత్రంగా అనిపించింది. హానిబాల్, క్విన్చి, కామెరూన్, చిల్లికొతె ఇలా మిసోరీ రాష్ట్రంలోని ఊళ్ళ పేర్లు.
పోయినేడు ఈఏడు కలిపి దాదాపు ఆరుఏడు సార్లు వెళ్ళొచాను షికాగో.
మొన్న థాంగ్స్ విగివింగుకి కూడా వెళ్ళొచ్చాను.
ఐతే!! ఈసారి ఓ అనుభవం.
వెళ్ళేప్పుడు చిల్లకొతె దాటినాక అనుకుంటా. కాప్ ఆపా౨డు. అబ్బాయ్, అరవై ఐడు లైను మీద డెభై ఆరు ఎల్తన్నావ్. ఎందుకలాగా అన్నాడు. అయ్యా ఇంటెన్షన్ల్ కాదు. పేద్ద గమనించలేదు అన్నాను.
ప్రత్యేకించి ఈ కాలంలో, సంధ్యవేళ ఇంత స్పీడ్ మంచిది కాదు. ఇది జింకల మేటింగు సీజన్. అవి గుద్దుతాయ్ వచ్చి. వెళ్ళాల్సిన దానికన్నా పన్నెండు మైళ్ళు ఎక్కువ ఎల్తన్నాక్ కాబట్టి ఇదిగో టిక్కెట్టు అని నూటాపది డాలర్లకు టిక్కేటు సింపి ఇచ్చాడు. అయ్యా! నాకింతవరకూ ఏలాంటి చరిత్రా లేదు అన్నాను కన్సిడర్ చేస్తాడేమో అని. అహా!! తెల్లోడు, ఎదవ, పట్టించుకోలా.
ఇదిగో ఇప్పుడే చెక్కు పంపించి వస్తన్నా.
నేనిచ్చే సలహా -
కీప్ లెఫ్ట్, పాస్ రైట్. ముందరున్న వాటిని పాస్ చేస్కుంటా వెళ్తే బోర్ కొట్టదు. అంతేగాక అలసట ఉండదు.
క్రూజ్ పెట్టుకోద్దు. మజా ఉండదు.
పాస్ చెసేప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చు. కాప్ ఆపినా, పాస్ చేస్తున్నావు కాబట్టి ఎళ్ళినావని చెప్పుకోచ్చు

సోదరుడు వేణు శ్రీకాంత్ పుట్టిన్రోజు...
అబ్బాయ్ వేణూ
అందుకో అభినందనలు
పుట్టినరోజు శుభాభినందనలు
కలకాలం కళకళ్ళాడుతూ ఉండాలని కోరుకుంటూ
-భాస్కర్
ఆశ్చర్యం ఏవిటంటే
మా ఇద్దరి మూలాలూ ఒకటే. వారిదీ మాదీ ఒకే ఊరు పాలవాయి. మేవిద్దరం ఒకే ఏడు పుట్టాం [1983]. దాదాపు ఒకే సినిమాలు ఒకే హాల్లోజూస్సాం. శ్రీ వెంకటేశ్వర మహల్, గంగా మహల్, లక్ష్మి పిక్చర్ పాలెస్, సత్యనారాయణ థియేటర్. ఒకే రోడ్డుమీద నడిచాం. పిడ్రాళ్ళ గ్రాండు ట్రంకు రోడ్డు. ఒకే గుడి సుట్టూతా తిరిగినాం. గంగమ్మ గుడి.
నిన్ననే తెల్సిందేటంటే, మా ఇద్దరిదీ ఒకే బ్లడ్డు గ్రూపు
బి+

Dec 3, 2011
తొక్కలో విండోస్ (విస్తా)
మొన్నమధ్య ఏదో సమస్యొచ్చి, కొత్త హార్డ్ డ్రైవ్ వేసి విస్తా ఇన్స్టాల్ చేసాను. ఆరు నెలలు అయ్యిందనుకుందాం. ఈ కొత్త హార్డ్ డ్రైవ్ రెండు టెరాబైట్లు. రెండొందల జిబి పక్కన పెట్టా. 1.8 టెరాబైట్ మిగిలింది.
విండోస్ విస్తా వేసా అందులో. బాగనే ఉంది. హాం౨డీ డాం౨డీగా పని చేస్తున్నది. బాగనే ఉంది. ఇంకో పార్టీషన్ చేయాల్సొచ్చింది. సి డ్రైవ్ సైజు చూసి షాక్ అయ్యా. 1.47 TB Avaliable from 1.79 TB అంటుంది. హా?? అంటే దాదాపు మూడొందల డెబ్భై జిబి గయా????
ఎక్కడకి పోయిందీ?
కొన్ని డిస్క్ యుటిలిటీస్ వేసి చూసాను.
ఉదాహరణకి, యూనిక్సులో డియు అని ఒక కమాండు. విండోసులో కూడా థర్డ్ పార్టీ దొరుకుతుంది. అది వేసి చూస్తే, సి డ్రైవులో యూజ్డ్ డిస్క్ స్పేస్ కేవలం ఎనభైఒక్క జిబి మాత్రమే వాడినట్లు చూపుతున్నది.
ఈ ఓపెన్ సోర్స్ టూల్ ఉంది. విన్‌డిఐఆర్‌స్టాట్ అని. అది మొత్తం స్టాటిస్టిక్స్ చూపుతుంది. రూట్ నుండి ఏఏ డైరెక్టరీలు ఎంతెంత ఆక్యుపై చేసాయీ అని. డెభై+ జిబీ సి డ్రైవు అని చెప్పింది.
కానీ, సి డ్రైవ్ మీద రైటు క్లిక్కు కొట్టి ప్రాపర్టీస్ చూస్తే, 342 GB యూజ్డ్ స్పేస్ అని చూపుతున్నది.
విండోస్ ఎక్స్‌పి నుండి మై*క్రో*సాఫ్ట్ వాడు షాడోకాపీ అని ఓ కాన్సెప్టు తెచ్చాడు.
http://en.wikipedia.org/wiki/Shadow_Copy
ఏందయ్యా అంటే స్నాప్‌షాట్ అన్నమాట
Shadow Copy (Volume Snapshot Service or Volume Shadow Copy Service or VSS), is a technology included in Microsoft Windows that allows taking manual or automatic backup copies or snapshots of data, even if it has a lock, on a specific volume at a specific point in time over regular intervals. It is implemented as a Windows service called the Volume Shadow Copy service. A software VSS provider service is also included as part of Windows to be used by Windows applications. Shadow Copy technology requires the file system to be NTFS to be able to create and store shadow copies. Shadow Copies can be created on local and external (removable or network) volumes by any Windows component that uses this technology, such as when creating a scheduled Windows Backup or automatic System Restore point.
vssadmin list shadows అని కొడితే లిస్ట్ చూపెడుతుంది. నా లాప్ టాప్ లో కేవలం రెంటి లిస్ట్ చూపెడితే నా డేస్క్ టాపులో, అంటే పై గోల నడుస్తున్న బాక్సులో ముప్ఫైకి పైగా చూపుతున్నది. అవి ఏవన్నా స్పేస్ ఆక్యుపై చేస్తున్నయా?
దీనయ్య విండోస్. మా సోదరుని లాగా, నేనూ తొందర్లో మా౨క్ ఓయస్సుకి మారితే బెటరని ఘాట్టిగా నిర్ణయించాను

Dec 1, 2011
సూరిగాడి ఉత్తరం
మొన్నీమధ్య కార్లో కాన్సాసు పట్నాకి వెళ్తున్నప్పుడు సూరిగాడు ఎదో బెరికాడు ఓ చిన్న కాయితకం ముక్క మీద. ఎదో రంగులద్దుతున్నాళ్ళే అనుకున్నాం. పెద్దగా పట్టించుకోలేదు. ఇదొక తతంగం ప్రయాణాల్లో. ఎనకమాల ఇద్దర్నీ కట్టిపడేయాలంటే ఓ పది కాయితకం ముక్కలిచ్చి రంగులేస్కోండహే అంటే సప్పుడు సేకుండా రంగులేస్తారు ఇద్దరూ. ఇంతలో మనం చెరాల్సిన సోటికి సేరిపోతావన్నమాట.
ఆతర్వాత రోజో ఎప్పుడో ఈ కాయితకం బయటపడ్డది.
సారాంశం ఏవిటయ్యా అంటే
వీడి తరగతిలోనే ఇశాన్ అనే పిల్లాడు, వీడి సహవాసగాడు. తెలుగు పిల్లాడే. మధ్యానం బువ్వ తినేప్పుడూ ఆడేప్పుడూ వీళ్ళిద్దరూ మరొక తెల్లోడు ఏడ్రియన్ కల్సుంటారు. ఇశాన్ కి వీడేదో అబద్ధం చెప్పాట్ట.
ఒరె ఇశాన్
స్వారీ రా
నన్ను సెమించేయ్
నీకు అబద్ధం చెప్పా
ధన్యవాదాలు
సూర్యా
అని రాసుకున్నాడు ఆ కాయితకం ముక్కమీద, కార్లో ఎల్లెప్పుడు.
ఏట్రా అది అంటే ఏదో రగస్యం అన్నాడు. నేనూ వదిలేసా.
సూరిగాడు ఇలా కాయితకం మీద రా(వ్రా)యటం నాకు బాగా నచ్చింది. వాడికో తెల్లకాయితకాల పుస్తకం ఇచ్చాను. దినచర్య సంచిక అనుకోచ్చు, ఆంగ్లంలో చెప్పాలంటే జర్నల్. రోజూ ఏవేం చేస్సావో రాస్కోరా అని. ఇలా ఇప్పటినుండే రోజుకో వాక్యం కనక రా(వ్రా)య గల్గితే పెద్దైయ్యాక వాడూ ఓ రచయిత కాగల్డని నా ఆశ.

Subscribe to:
Posts (Atom)