Jul 27, 2010

అన్నదాతా సుఖీభవ

ఇవ్వాళ్ళ చాలా తలనొప్పిగా ఉంది పొద్దుణ్ణుంచి. లేవటమే ఆలశ్యంగా లేచా. తల లాగిలాగిపెట్టింది. మా అన్నయ్య నాకో బహుమతి పంపాడు. అది మా అపార్టుమెంటు మేనేజరు వద్ద వదిలి వెళ్ళాడు తపాలా బంట్రోతు. పొద్దున పొద్దున్నే అదెత్తుకుని ఆపీస్కి చేరుకున్నా నిద్ర మొహంతో.
ఓవైపు తల లాగటం ఇంకోవైపు అన్న పంపిన గిప్టు.
పనికెళ్ళంగనే డబ్బా ఓపెన్ చేసి రీసెర్చీ మొదలెట్టా. ఇంతలో ఓ నాలుగు కాళ్ళు అదేనండీ కాల్స్. తల అటుఇటు తిప్పేప్పటికే పన్నెండున్నర. రొట్టెముక్కలు నోట్టోఏస్కుని సల్లబువ్వ అనగా మజ్జిగ అన్నం మింగి సల్లగా మంచీళ్ళు తాగి మనిలో పడ్యా.
ఇంతకీ అన్న పంపిన గిఫ్ట్ -
కేనన్ రెబల్ ఈ.ఓ.యస్ డిజిటల్ ఎస్.ఎల్.ఆర్; ౨౮-౩౦౦యంయం ఆ.ఫో లెన్స్.
ఇదిగో అ కెమెరా రాజం -


ఓ ఉదాహరణ పుటోబు -


తలనొప్పి ఎంతకీ తగ్యల. కాళ్ళీడ్చుకున్టా ఇంటికిజేరా. సల్లగా నిమ్మకాయ నీళ్ళు తాగి ఓ ఏడ్విల్ కుమ్మి కళ్ళూకాళ్ళూ ముడుసుకుని కూసన్త అట్టా ఎనక్కి వాలా.
ఆరున్నరకి భార్యాబిడ్లు నిద్రల్లేపారు.
ప్రెష్షుగా మొకం కడుక్కొచ్చేపాలికి, బువ్వ రెడీ తిన్ట్యావా అన్నారు భార్యాబిడ్లు. వలాగే అని కూకున్నా. తలనొప్పి ఓకొలిక్కి వచ్చిందాపాటికే.
అయ్యా -
కోసుగడ్డ + గాజర గడ్డ కలిపి ఇగురు సేసిన్ది. ఏడిఏడి అన్నం పైన ఇగురు. ఓ పీకుడు పీకిన్యాక అయ్యా, ప్రిజ్జీలోంచి ఓ పొట్లం తీసి, పళ్ళెమ్లో ఓ రొంత కుమ్మింది.
ఇదిగో ఆ పొట్లరాజం

అన్నా ఏంటో ఎరుకనా ఆ పొట్లరాజం - పండుమిరపకాయల కారం
వేడివేడి అన్నం, పొడిపొడిగా, దాంటోకి పండుమిరపకాయల కారం. ఏం చెప్పను బాసూ. నోట్లోనీళ్ళూ ఓ నాలుగు బక్కెట్లు ఊరి లోనికి ఎళ్ళిపోయినయి. తలనొప్పి గిలనొప్పి దానెక్క దేక్కున్టా పోయింది.
తిన్నాక, కళ్ళముందు ఓ నాలుగు రీళ్ళు గిర్రున తిరిగాయ్. ఆరోజుల్లో - ఓ ఎత్తుడు పండుమిరగాయలు, సరిపోను సిన్తమన్డు, మావిడల్లం, గళ్ళప్పు ఓ బొచ్చెలో ఏసి ఇస్తే, రుబ్బింగు వేయబడును కాడికెత్తుకెళ్ళి, లైన్లో నిల్చుని రిబ్బింగ్ ఏపించుకునిగానీ కదలకున్డా రుబ్బింగోడు ఎళ్ళమన్నా ఎళ్ళాకున్డా ఆణ్ణే ఉన్డి, ఇంటికెత్తుకెళ్ళినాక, ఏడి ఏడి తెల్లబువ్వలో ఎర్రటి పచ్చడి, పైన ఎన్నపూస. నాయనా ఇంక జీబితానికి ఏంగావాలే? ఈ మాత్రం సుఖానికి పేద పెద్ద ఉన్నోడూ లేనోడు అనే బేధం లేదు. తేడా అంతా తినే కంచంలోనే. పేదోడు అల్యూమినియం సిబ్బిరేకులో తిన్టే ఉన్నోడు ఎన్డి పళ్ళెంలో తింటాడు. అంతే తేడా.
పండు మిరపకాయలు కకోయటానిక్కూడా ఓ ఇధానం. కోతకొచ్చిన సేనుకి ముందు బాగా నీళ్ళు పెడతారు. మిరగాయకి నీళ్ళు పట్టి బాగా నవనవలాడుతున్నప్పుడు కోస్తారు.
సెప్పొచ్చేదేంటన్టే -
సెమటోడ్చి మనకి ఇట్టాంటి పంటల్ని అందించే రైతు - అన్నదాత - సుఖీభవ
పండుమిరగాయల్ని కమ్మని పచ్చళ్ళా పెట్టే అమ్మతల్లులు - అన్నదాతలు - సుఖీభవ

17 comments:

  1. నాన్నా (నీ బ్లాగు పేరు)
    ఇహ రెచ్చిపో!

    ReplyDelete
  2. me too!అన్నదాత - సుఖీభవ!

    ReplyDelete
  3. అన్నయ్యా
    ఫోటో బ్లాగ్ మొదలుపెట్టండి మీరు కూడా
    ఇక కుమ్మేయండి

    ReplyDelete
  4. ఏం చెప్పారండీ....అన్నదాతా సుఖీభవ!నైస్ కెమెరా!

    ReplyDelete
  5. //సెమటోడ్చి మనకి ఇట్టాంటి పంటల్ని అందించే రైతు - అన్నదాత - సుఖీభవ//
    nice post. me too- అన్నదాతా సుఖీభవ...!

    చాలా రోజుల తర్వాత.. పండుమిరప పచ్చడిని గుర్తు చేశారు. థ్యాంక్యూ భాస్కర్ గారు.

    ReplyDelete
  6. సార్, అసలే ఈమధ్య వంట వండి పెట్టే దిక్కులేక, ఇండియాలో లాగా పని అమ్మాయిలన్నా ఫుడ్డు పెట్టే దిక్కులేక అరా కొరా తింటూ డైటింగ్ చేస్తున్నాను. మీరు ఇలా పండు మిరపకాయ పొట్లాలు చూపించి కళ్ళళ్ళోకి నీళ్ళు తెప్పించడం భావ్యం కాదు :(

    ReplyDelete
  7. > తేడా అంతా తినే కంచంలోనే
    > పేదోడు అల్యూమినియం సిబ్బిరేకులో తిన్టే ఉన్నోడు ఎన్డి పళ్ళెంలో తింటాడు
    పేదోడు కళ్ళుమూసుని ఆహా/ఓహో అంటూ తింటాడు,
    ఉన్నాడు కళ్ళుమూసుకుని ఎసిడిటి మూలంగా అమ్మా/అయ్యా అంటూ తింటాడు

    ReplyDelete
  8. బెదరూ! సుఖీభవ అన్నారుగానీ యాడుంది సుఖం మాకు :(

    ReplyDelete
  9. అన్నగారూ, సునీత గారూ - ఇహ కుమ్మటమే
    హరే - అబ్బే నువ్వు నాబంలేదోయ్
    మనం హెప్పుడో పెడతాయ్
    http://nasitralu.blogspot.com/
    పరిమళం గారు - కుశలమా? కొత్త ఇల్లు ఎలా ఉందీ?
    గీతిక - నా బ్లాక్కి స్వాగతం
    శ్రావ్యా - ఎంజాయ్ :)
    శరత్ భాయ్ - హ్మ్!! ఏం పర్లేదు. షికాగోలో మాంచి దేశీకొట్టుకి వెళ్తే దొరుకుతుందిగా పచ్చడి
    పానీపురి - బాగా చెప్పావు
    విజయమోహన్ భాయ్ - హ్మ్!! సుఖం ఎక్కడా? నిజమే. రైతుని దోచుకుంటున్న వ్యవస్థని అడగాలి.

    ReplyDelete
  10. దాన్ని కారప్పచ్చడా, కొరివి కారం అనాలా అని మాకు మాకు పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి, తినే అవకాశం లేని వారిని ఏడిపిస్తూ, మనం లొట్టలు వేసుకుంటూ తిందాం.

    ReplyDelete
  11. తార - నా బ్లాక్కి స్వాగత్.
    శుద్ధ్ నాట్ భాషా - కొరివి కారం
    దేశవాళీ భాష - పండుమిరగాయల పచ్చడి

    ReplyDelete
  12. మరి కారప్పచ్చడి ఏ రకం బాష?

    ReplyDelete
  13. మేం ఎరగారప్పచ్చడి అంటాం. ఎరగారప్పచ్చడి+ముద్దపప్పు+నెయ్యి = సొర్గానికి బెత్తెడు

    ReplyDelete
  14. పేరు ఏదైనా కారప్పచ్చడి (కొరివి కారం, పండుమిరప.... , etc., etc) సూపరో సూపరు. చాల రోజుల తరవాత గుర్తు చేసారు. థేంక్సో థేంక్సు
    మీ టపా కూడా సూపరో సూపరు. :)

    ReplyDelete
  15. కొరివికారం అంటే చింతపండూ గట్రా వెయ్యకుండా కాసింత ఉప్పు మాత్రమే వేసి ఆ మట్టున రోట్లో కచ్చాపచ్చాగా నూరేస్తే అది కొరివికారం.

    నాకు ఇలాగే ఇష్టం. అబ్బ తల్చుకుంటేనే నొట్లో లాలాజలం తెలుగు గంగలా ప్రవహిస్తోంది.

    ReplyDelete
  16. గద్గది బాలు గారు కరెస్త్,
    అసలా కొరివికారం వేడి వేడి అన్నంతో కలిపి ఒక గుప్పెడు నెయ్యి వెసుకొని లాగిస్తే నా సామి రంగా..

    ReplyDelete