Jul 16, 2010

కుండీ వ్యవసాయం

అన్నగారు పలుగూ పారా చేతబుచ్చుకుని ఏరువాక కెళ్లొచ్చా అని ఓ టపా రాసారు.
http://kottapali.blogspot.com/2010/07/blog-post_15.html
అదే స్పూర్తితో.....
ఇది పుదీనా వృక్షం

మెంతికూర మడిచెక్క (కుండీ)

ఇది కొంచెం ట్రిక్కి. ఇందులో ముందు ఓ మామిడి టెంకె పెట్టా. ఏమీ కదలిక లేదను మా మేడాంగారు ధనియాలు కుమ్మేరు హిప్డు రెండూ వచ్చాయ్.

ఇక ఇదీ మా గోగిచెక్క

ఇక ఇది - ముందు కాకర గింజలు ఓ రెండు కుమ్మేరా మేడం. అవి రావులే అని తోటాకు అదే తోటకూర కుమ్మారు. రెండూ వచ్చాయ్.

10 comments:

  1. మీకు మీరే సాటి
    అభినందనలు

    ReplyDelete
  2. బావుందండీ మీ వ్యవసాయం. బోలెడంత పొలం పుట్టా ఉన్న మేం మాత్రం కర్వేపాకు తప్ప ఏమీ పండించలేకపోతున్నాం ( కోతుల బెడదండీ బాబూ )
    పుదీనా పక్కన ఉన్నది కలబంద మొక్కేకదండీ . ఇక్కడంతా ఆ మొక్కని ఇంటి చూరుకి కడుతున్నారు. మీరూ అందుకే పెంచారా

    ReplyDelete
  3. బావున్నై, చిన్నగా ఉన్నా కన్నుల పండువుగా.

    ReplyDelete
  4. అహహ నేను ఒప్పుకోను .. మెంతి కూర తప్పించి మిగిలినవన్నీ తీవ్రంగా ట్రై చేసి ఘోరంగా ఓడిపోయా :(

    ReplyDelete
  5. బావుందండీ మీ వ్యవసాయం. మీ బ్లాగులోనే కుండీలో మిరప మొక్క చూసినట్టు గుర్తు.
    నాకు మొక్కల పిచ్చి ఎక్కువే. ఒకప్పటి నా పెరటి వ్యవసాయం గుర్తొచ్చింది మీ మొక్కలు చూస్తోంటే. ఇలాగే నేనూ ఇంట్లో వేసేదాన్ని. ఫుల్లుటైం రైతు నైపోవాలనీ :) ఓ తోట, పొలం తీసుకున్నాం ఆ తరువాత నా ఇంట్లో వ్యవసాయం అటకెక్కింది. సిటీకి దగ్గర తరచూ వెళ్ళి ఓ.. తోటలో కృషి చేసేద్దాం అనుకున్నా గానీ తరువాతేం జరగలేదు. అక్కడో మేనేజర్ ని పెట్టెసి చేతులు దులుపుకున్నాం ఏవో కొన్ని వేయిస్తాడతను. అప్పుడప్పుడూ వారాంతాలు అలా వెళతాం. మార్పేంటంటే అక్కడినుండి రోజూ ఇంటికి కాయగూరలూ, పాలుపండ్లూ :(
    కానీ ఇలా కుండీల్లో పెరట్లో మనకళ్ళముందు మొక్కలు మొలకెత్తి పెద్దవుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది.


    http://www.padvalagriculture.com/

    ReplyDelete
  6. http://www.padvalagriculture.com/ ఇది చూడండి బావుంది.

    ReplyDelete
  7. రఘువీరునికి చెప్పి ప్రోత్సాహకాలు పంపే ఏర్పాట్లు చేస్తాం.

    ReplyDelete
  8. mee inti thota chaala bhagundi,subbarajugaaru mee brotheraa?

    ReplyDelete
  9. Chala bagundandi kani veetiki matti matrame vesara inka edina mandulu vadara

    ReplyDelete