Jun 30, 2010

మా పల్నాడు

దుప్పలు దుప్పలు,
దుప్పలు దుప్పులు
చిన్న చిన్న గుబురులు,
రేగుల పొదలు,
ముళ్ళకంచెలు,
రాళ్ళు బళ్ళూ,
అడవి మనుషులు,
కొండలు కోనలూ
ఎండిన దారులు,
గుట్టలు గుట్టలు
నాపరాళ్ళు
మండే ఎండలు
ఎండే గుండెలు
నాగులేటి నీళ్ళు
పారిపోయిన లేళ్ళు
వెంటాడే పోలీసోళ్ళు
ఎఱ్ఱని కొడవళ్ళు
అడ్డంగా కంకులు
లేచిన పిడికిళ్ళు
చిన్న చిన్న మిరగాయలు
అద్దరగొట్టే కారాలు
ఎక్కడచూసినా గోగులు
పసుప్పచ్చ గోగిపూలు
నీళ్ళదారుల్లో
నానబెట్టిన గోగికాడలు
నల్లరేగడ్లో తెల్ల బంగారం
రాళ్ళగుట్టల్లో జానకాయలు
ఇళ్ళచూరుల్లో జానకఱ్ఱలు
గడ్డివాముల్లో తాచుపాములు
కోడిపందాలు
పొటేళ్ళ పోరాటాలు
బయనీడు వాయిద్యాలు
డప్పుల సవ్వళ్ళు
అర్ధంలేని అభిమానాలు
వికారమైన పంతాలు
టిపినీ డబ్బాల్లోంచి పెలే బాంబులు
కోరుటుల సుట్టూ జీవితాలు
వెరసి పల్నాడు
మా పల్నాడు

2 comments:

 1. .
  అర్ధంలేని అభిమానాలు
  వికారమైన పంతాలు
  very nice

  అవును., జానకాయల రుచి నాకూ తెలుసునండి. కలేక్కాయలు కూడా ఉంటాయి కదా.. ఇంకా చాలా అడవి పళ్ళూ తినే వాళ్ళం చిన్నప్పుడు.

  ReplyDelete