Feb 21, 2010

ఏంటీ ఈ అపోహలు? ఎవరు నేర్పుతున్నారిలా?



ఎవరు నేర్పుతున్నారిలా? రాజకీయ స్వార్ధాల కోసం ఇంతలా దిగజారిపోతున్నారా రాజకీయ నాయకులు?

*ఆత్మ త్యాగాలు* అని ఒక అందమైన అర్ధంకాని పదాన్ని అమాయకప్రజలపై ఉసికొల్పి, వేడెక్కించి, ముందుకునెట్టి పబ్బంగడుపుకునే ఈ ఎదవ రాజకీయ నాయకులు, దీని గురించికూడా మాట్టాడితే ఎంతబాగుంటుందీ -



పోయిన ప్రతీ ప్రాణం,
తగలబెట్టే ప్రతీ బస్సు,
నిప్పట్టించే ప్రతీ వస్తువూ,
గడచిపోయిన ప్రతీ నిమిషం,
కూలగొట్టిన ప్రతీ ప్రభుత్వ కార్యాలయ గోడా
- ప్రతీదీ విలువైందే.

మన తెలివితేటల్నీ, ఆవేశాల్నీ, ఆందోళనల్నీ, ప్రాణాల్నీ, ఆలోచనల్నీ, కన్స్ట్రక్టివ్ ప్రగతి కోసం వాడాలని కోరుకుంటా

8 comments:

  1. చాలా మంచి మాట చెప్పారు. నా ఆవేదనా అదే...

    ReplyDelete
  2. ప్చ్...ఇవేం ఆత్మత్యాగాలో...చేస్తే యుద్ధం చెయ్యాలి గానీ.

    ReplyDelete
  3. very well said! To hell with both Telangana and Samaikyamdhra resolutions. LIfe is much more valuable.

    ReplyDelete
  4. మీ ప్రాణ త్యాగాలు వృధా కా" వని అందలాలెక్కిస్తున్నారు కూడా!

    "తెలంగాణా వస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఖాయం"...ఎందుకు? ఏమిటి? ఎలా?..ఎవరైనా వేర్పాటు వాదులు వివరిస్తే బాగుండు!

    ReplyDelete
  5. ఎవడిక్కావాలి బాచిబాబూ ఈ లెక్కలూ తొక్కలూ.ఇయన్నీ కప్పిపెట్టడానికే అట్టాంటి అమాయకుల్ని ఎగెయ్యడం, ఆ గోలల్లో అమాయకపు జనాల్లు కొట్టుకు సత్తంటే ఆ చితిలో సుట్టెలిగించుకుని ఆనందించే రకాల్నించి అంతకంటే ఎక్స్‌పెక్ట్ చెయ్యడం చాలా ఎక్కువే.

    ReplyDelete
  6. ఆ తెలంగాణా ఏదో ఇచ్చేసి, ఇవన్నిటికీ మంగళం పాడితే సరి. ఒక్కో పార్టీకీ రెండేసి ముఖ్యమంత్రి పదవులూ, హోం మంత్రి పదవులూ.. అలా ''అందరికీ పదవి'' పధకం వల్ల వీళ్ళందరూ బలి అవుతున్నారు.

    ఇక్కడ నాదో ప్రపోసల్ - శ్రీ కృష్ణ కమిటీ కి. --> సరే - రెండు రాష్ట్రాలయిపోదాం. ఇప్పుడు ఒక మంత్రులకిచ్చే జీతం డివైడెడ్ బై టూ చేసి, సగం సగం (లేదా తగినంత పెర్సెంటేజీ తీస్కుని అంటే 40%, 60%) చొప్పున ఇద్దాం. విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా చాలా మటుకూ విభజించబడుతుంది కాబట్టి అవినీతి కూడా తగ్గొచ్చు.

    ఇకనైనా మిగతా రాష్ట్రం మీద దృష్టి పెట్టండి అయ్యలారా. ఒకే చోట కోట్లు కుమ్మరించి హైదరాబాద్ ని మాత్రం అభివృద్ధి చేశారు. ఇపుడు తెలంగాణా వాళ్ళు తరిమి కొడితే, మధ్యతరగతి ఆంధ్రోల్లు తల దాచుకునేది, ఉపాధి వెతుకునేది ఎక్కడ ?

    ReplyDelete
  7. http://features.ibnlive.in.com/chat/view/346.html
    లోక్ సత్తా నేత జె.పి గారితో జనుల ఛాట్

    ReplyDelete
  8. ప్చ్ ...మనం చెప్తే వినేవారేవరండీ ...
    @ సుజాత గారు మంత్రులు జీతాలతో బ్రతుకీడుస్తారాండీ ....

    ReplyDelete